Thursday 29 June 2017

పుణ్యవతి (1967)


pranjali prabha- old songs
మనసు పాడింది సన్నాయి పాట...కనులు ముకుళించగ... తనువు పులకించగా...
చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా

చరణం : 1
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా
నా అలివేణి తలవాల్చిరాగ

చరణం : 2
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా
నా వనరాజు ననుచేర రాగా

చరణం : 3
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో
హృదయాలు చవిచూడగా

మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా, తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా......చిత్రం :-…

No comments:

Post a Comment