Saturday 19 August 2017

ముత్యమంత ముద్దు (1989)




ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ...పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
చిత్రం : ముత్యమంత ముద్దు (1989)
సంగీతం : హంసలేఖ
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ
పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ
మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ
వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట !
హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా ..
అందమైన పొడుపు కథలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా ..
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా

సత్యభామ అలకలన్ని పలకరింతలే ..
అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో ..
అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే ..
సరసమాడినా క్షమించలేనురా
వలచి వస్తినే వసంతమాడవే ..
సరసమాడినా క్షమించలేనురా

కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... !
హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
పూల బాణమేశా ఎదకంది ఉంటదీ

మాఘమాస వెన్నెలెంత వెచ్చనా ..
మంచి వాడివైతె నిన్ను మెచ్చనా
పంటకెదుగుతున్న పైరు పచ్చనా ..
పైట కొంగు జారకుండ నిలుచునా
సినీమాల కథలు వింటె చిత్తు కానులే ..
చాలించు నీ కథాకళీ

ఆడవారి మాటకు అర్థాలే వేరులే ..
అన్నాడు గ్రేటు పింగళీ
అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే

నుయ్యొ.. గొయ్యొ .. ఏదో అడ్డదారి చూసుకుంట ...!
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ !
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ



Rajendraprasad and Seetha's Muthyamantha Muddu Movie - Muthyamantha Muddu Premalekha Raasa…
youtube.com

నీ సంతోషమే నా సంతోషం



నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను

నీ గతం మరచిపో
నీ గమ్యం మార్చుకో
నీ తోడు నేనని తెలుసుకో
నీ రక్షణ నేనే ననుకో   

నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను

నీ వయసును భాదించకు
నీ వలపును దిగ మింగుకు
నీ కోర్కెను నొక్కి ఉంచకు
కాలాన్ని బట్టి ప్రయత్నిమ్చు మారుటకు

ప్రతిక్షణం నీ వెంట
నీ సంతోషమే నా సంతోషం
నా ప్రాణ0 నీకొరకు
నాపయనం నీ వెనుకకు 

నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను



శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికిి సౌభాగ్యవతికిదే జయమంగళం
చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం

ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం
కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం

కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం
సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం
కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం
 

నేను లోకల్



చిత్రం : నేను లోకల్   

 అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే.. సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతొ నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా.. ఈ నిమిషం

మాటల్నే.. మరిచే సంతోషం
పాటల్లే.. మారింది ప్రతీక్షణం

అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే.. సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతొ నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా.. ఈ నిమిషం

నింగిలో.. ఆ చుక్కలన్నీ
ఒకటిగా.. కలిపితే.. మన బొమ్మ కాదా
హో.. దారిలో.. ఈ పువ్వులన్నీ
జంటగా.. వేసినా.. మన అడుగులేగా
మబ్బుల్లో.. చినుకులు మనమంతా
మనమే.. చేరేటి.. చోటెదైన
అయిపోద పూదోటా

అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే.. సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతొ నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా.. ఈ నిమిషం

కళ్లతో.. ఓ చూపు ముద్దే
ఇవ్వడం.. నేర్పుతా.. నేర్చుకోవా
పెదవితో.. పెదవులకి ముద్దే
అడగడం.. తెలియనీ.. అలవాటు మార్చవా
కాటుకనే.. దిద్దే వేలౌతా
ఆ వేలే.. పట్టి.. ఏ వేళ
నీ వెంట అడుగేస్తా

అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే.. సమాధానం
అరెరె ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతొ నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా.. ఈ నిమిషం