Saturday 19 August 2017

నీ సంతోషమే నా సంతోషం



నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను

నీ గతం మరచిపో
నీ గమ్యం మార్చుకో
నీ తోడు నేనని తెలుసుకో
నీ రక్షణ నేనే ననుకో   

నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను

నీ వయసును భాదించకు
నీ వలపును దిగ మింగుకు
నీ కోర్కెను నొక్కి ఉంచకు
కాలాన్ని బట్టి ప్రయత్నిమ్చు మారుటకు

ప్రతిక్షణం నీ వెంట
నీ సంతోషమే నా సంతోషం
నా ప్రాణ0 నీకొరకు
నాపయనం నీ వెనుకకు 

నిన్ను నేను మరువలేను
నీతోపాటు నడవ లేను  
కానీ నాప్రశ్నకు బదులిస్తే
నిన్ను నేను ఉద్దరించగలను



శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికిి సౌభాగ్యవతికిదే జయమంగళం
చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం

ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం
కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం

కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం
సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం
కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం
 

No comments:

Post a Comment