Friday 20 January 2017

మిస్టర్ నూకయ్య (2012)


చిత్రం: మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
గానం : ప్రియా హిమేష్ , రంజిత్
రచన : లక్ష్మీ భూపాల్

పల్లవి :

ఏ జన్మ బంధమో ఈ స్నేహం, ఏ దివ్య రూపమో నేస్తం !
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం, ఇన్నాళ్ళ కొచ్చెనా సాయం....!
నేనున్నా అంది నీచూపే నేనున్న ధ్యాస నీవైపే....
అవునన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం
ఏ జన్మ బంధమో ఈ స్నేహం ఏ దివ్య రూపమో నేస్తం !
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం ఇన్నాళ్లకొచ్చేనా సాయం...!

చరణం:

ఎంతెంత దూరం ఆనంద తీరం అనుకుంటూ తిరిగా ఇన్నాళ్ళు ,
గోరంత స్నేహం కొండంత తోడై కనిపించగానే కన్నీళ్లు....!
గుండెల్లో గాయాలు మాయమే నీరెండల్లో సెలయేటి స్నానమే
నిను కోరితే నీ ఒడి చేరితే మనసెగిరింది మేఘాల దారుల్లో

చరణం:

అపురూపమైన బంగారు నువ్వు అనుకోని కలవై కలిశావు
క్షణ కాలమైన విడలేను నిన్ను, కను రెప్ప లోనే ఉంటావు...!
స్నేహాన్ని దాటాను ప్రేమతో ఈ దేహాన్ని వదలాలి ప్రేమలో
నీ నీడగా నీ చెలికాడుగా ప్రేమిస్తాను నీకన్న నిన్నెంతో .......!

నేనున్నా అంది నీచూపే, నేనున్న ధ్యాస నీవైపే ....!
అవునన్నా ఎవరు కాదన్నా నువ్వేనా ప్రాణం ప్రాణం...!
ఏ జన్మ బంధమో ఈ స్నేహం, ఏ దివ్య రూపమో నేస్తం
ఎన్నాళ్ళ మౌనమో ఈ రాగం ఇన్నాళ్ళకొచ్చెనా సాయం........

https://www.youtube.com/watch?v=rqqlEuEmn1A
Ye Janma Bandhamo - Mr Nookayya Video songs - Manoj
Ye Janma Bandhamo - Mr Nookayya / Mr Nokia Video songs - Manoj

నారి నారి నడుమ మురారి


మనసులోని మర్మమును తెలుసుకో...నా మనసులోని మర్మమును తెలుసుకో...
చిత్రం: నారి నారి నడుమ మురారి
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:
మనసులోని మర్మమును తెలుసుకో...
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మాన రక్షకా.. మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో...
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మదన కీలగ.. మరిగిపోక..
నా మనసులోని మర్మమును తెలుసుకో

చరణం 1:
ఇనకులాబ్ధ.. నీవేకాని వేరెవరులేరు దిక్కెవరు లేరు
ఆనంద హృదయా.. మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన.. ఏకాంతకైనా
ఆ కాంక్ష తగున.. రాకేందు వదనా
మనసులోని మర్మమును తెలుసుకో

చరణం 2:
మునుపు ప్రేమగల దొరవై
సదా తనువునేలినది గొప్ప కాదయా
మదిని ప్రేమ కథ మొదలై
ఇలా అదుపుదాటినది ఆదుకోవయా
కనికరమ్ముతో ఈ వేళ...కనికరమ్ముతో ఈ వేళ..
నా కరముబట్టు..త్యాగరాజ వినుతా..

చరణం 3:
మరుల వెల్లువల వడినై ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా
మసక వెన్నెలలు ఎదురై ఇలా తెగువ కూడదని మందలించవా
కలత ఎందుకిక ఈ వేళా కలవరమ్ముతో ఈ వేళ..
నా కరము వణికే..ఆగాడాల వనితా..



Nari Nari Naduma Murari Songs - Manasu Loni Marmamulu Telusuko Movie: Nari Nari Naduma…

శ్రీ కృష్ణావతారం (1967)

నీ చరణ కమలాల నీడయే చాలు...ఎందుకోయీ స్వామి బృందావనాలు

చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టివి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, పి.లీల

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు

నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు

నును మోవి చివురుపై
నను మురళిగా మలచి పలికించరా..ఆఆ..
పలికించరా మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే
మధురానురాగాలు చిలికింతునే

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీ దళాలలో తొలివలపులందించి
తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా...ఆఆ..ఆఆఅ...
పూజింతునా స్వామి పులకింతునా
పూజలను గ్రహియించి పులకింతలందించి
పూజలను గ్రహియించి పులకింతలందించి
లోలోన రవళింతునే
లోలోన రవళింతునే
ఓ దేవి నీలోన నివసింతునే
ఓ దేవి నీలోన నివసింతునే

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందనవనాలు
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు

https://www.youtube.com/watch?v=5BX3dblHfrg

Thursday 19 January 2017

బాబాయ్ అబ్బాయ్ (1985)


తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని

చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే.. గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ.. యమున అని
అదే అదే..నా జీవమని గానమని
మౌనమని... తెలుసా..ఆ..ఆ ఆ

చరణం 1:

శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా

ఆదుకునే వెచ్చని మమత..
ఆవిరయే చల్లని ఎడద
ఒకటే శృతి.. ఒకటే లయ.. ఒకటే స్వరమూ..

ఆ..ఆ..ఆ..ఆ...ఆ.ఆ..ఆ..
ఆ.....ఆ....ఆ....ఆ

ఉన్న రాగమొకటే... అదే.. అదే..ఏ..ఏ
అనురాగమని.. మౌన యోగమని
ప్రేమ దీపమని..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

చరణం 2:

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్యమాస సుమదళాల తేనె వాకలా

సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి..

సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే
శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే

ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ
అదే..అదే.. మమకారము
సృష్టికారణం.. బ్రహ్మకు జననం..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
 

Monday 9 January 2017

పూజాఫలం (1964)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


పగలే వెన్నెలా జగమే ఊయల...కదలె వూహలకే కన్నులుంటే...

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే...
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 1:

నింగిలోన చందమామ తోంగి చూచే...
నీటిలోన కలువభామ పోంగి పూచే.....ఏ..ఏ..ఏ.
యీ అనురాగమే జీవనరాగమై...
యీ అనురాగమే జీవనరాగమై...
యెదలొ తేనేజల్లు కురిసిపోదా...ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 2:

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే...
మురళిపాట విన్ననాగు శిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా... ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 3:

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే....
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా

బ్రతుకే పున్నమిగా విరిసిపోదా.. ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా....

https://www.youtube.com/watch?v=kgWi5YgJ8Wg
PAGALE VENNELA JAGAME VUYALA....CHITRAM:-PUJA PHALAM.mp4
"ఓ నెలరాజా" SUBSCRIBERS కు సినీ సంగీత రసికులందరికి నమస్కారం ఓ నెలరాజా ఆదరించినట్లు గానే ఈ మేనేజర్ ద్.

ముకుంద (2014)

ఓం శ్రీ రామ్ -  శ్రీ మాత్రే నమ:

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా...గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా...

చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర, కోరస్

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా..
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేలా..
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ..
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

ఆఆ..ఆఆఅ..ఆఆఆ.ఆఆఆఆఅ...ఆఆ.ఆఆఆఆఆ.
...
ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ
నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే

లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా 
https://www.youtube.com/watch?v=SYrdw-nDx5c
Gopikamma Full Video Song - Mukunda Video Songs - Varun Tej, Pooja Hegde
Watch : Gopikamma Full Video Song - Mukunda Video Songs - Varun Tej, Pooja Hegde Subscribe - http://...

Monday 2 January 2017

తలంబ్రాలు (1986)


నిన్న నీవు నాకెంతో దూరం...నీవె నాకు ఈనాడు ప్రాణం ...

చిత్రం : తలంబ్రాలు (1986)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుశీల, బాలు

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...

నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. నీడలా నాతో ఉండిపో... హొ

గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం