Monday 9 January 2017

పూజాఫలం (1964)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


పగలే వెన్నెలా జగమే ఊయల...కదలె వూహలకే కన్నులుంటే...

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే...
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 1:

నింగిలోన చందమామ తోంగి చూచే...
నీటిలోన కలువభామ పోంగి పూచే.....ఏ..ఏ..ఏ.
యీ అనురాగమే జీవనరాగమై...
యీ అనురాగమే జీవనరాగమై...
యెదలొ తేనేజల్లు కురిసిపోదా...ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 2:

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే...
మురళిపాట విన్ననాగు శిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా... ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 3:

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే....
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా

బ్రతుకే పున్నమిగా విరిసిపోదా.. ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా....

https://www.youtube.com/watch?v=kgWi5YgJ8Wg
PAGALE VENNELA JAGAME VUYALA....CHITRAM:-PUJA PHALAM.mp4
"ఓ నెలరాజా" SUBSCRIBERS కు సినీ సంగీత రసికులందరికి నమస్కారం ఓ నెలరాజా ఆదరించినట్లు గానే ఈ మేనేజర్ ద్.

1 comment: