Friday 19 July 2019



నేడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ జన్మదిన సందర్భంగా ....!

రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

#సినీ ప్రస్థానం
ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు.ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావుస్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితా సవరించు
కృష్ణార్జున యుద్ధం (2018), అంధగాడు (2017), నాన్నకు ప్రేమతో (2016), శ్రీమంతుడు (2015 సినిమా) (2015), దాగుడు మూతలు దండా కోర్ (2014), టామి (2015), డ్రీం (2012), ఓనమాలు (2012), అయ్యారే (2012), జులాయి మొగుడు (సినిమా) (2011), భలే మొగుడు భలే పెళ్ళామ్ (2011), బావ (సినిమా) (2010), బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
పెళ్ళాం పిచ్చోడు (2005), శ్రీరామచంద్రులు (2003), ఎర్ర మందారం, మాయలోడు
లేడీస్ టైలర్, ఆ ఒక్కటీ అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు, చాలెంజ్, ఆ నలుగురు
ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఖుషీ ఖుషీగా, హిట్లర్, కొబ్బరి బోండాం, సరదా సరాదాగా, శ్రీరామ చంద్రులు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, క్విక్ గన్ మురుగన్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం,అప్పుల అప్పారావు,ఏప్రిల్ 1 విడుదల,మాయలోడు,అత్తింట్లో అద్దెమొగుడు,ఆస్తులు అంతస్తులు,వాలు జడ తోలు బెల్టు,ముత్యమంత ముద్దు (1989),దొంగ కోళ్లు (1988)
ఉదయం (1987),కాష్మోరా (1986),పేకాట పాపారావు,భలే మొగుడు,చెవిలో పువ్వు (1990)
ప్రేమా జిందాబాద్,నవయుగం,తేనెటీగ (1991),
--((***))--

Tuesday 9 July 2019

చిత్రం : వారసత్వం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల
వీడియో రాణి రెడ్డి సమర్పణ.
ప్రేయసీ మనోహరి
వరించి చేరవే
ప్రేయసీ మనోహరి
తీయని మనొరథం
నా తీయని మనొరథం
ఫలింప చేయవే ఏ..
ప్రేయసీ మనోహరి
వరించి చేరవే
ప్రేయసీ మనోహరి
దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరు వేళ
దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరు వేళ
తారకా సుధాకర తపించసాగెనే ఏ..
హాయిగా మనోహర
వరించి చేరుమా
హాయిగా మనోహర
మురిసింది కలువకాంత
చెలుని చేయి సోకినంత
మురిసింది కలువకాంత
చెలుని చేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే ఏ..
హాయిగా మనోహర
వరించి చేరుమా
హాయిగా మనోహర
ఆఆహ్..ఆఅహహహ..
పెనవేసె మల్లె తీగె
మనసులోన మమత రేగె
పెనవేసె మల్లె తీగె
మనసులోన మమత రేగె
ఊహలో ఒయ్యారమూ
నా ఊహలో ఒయ్యారము
ఉయ్యాలలూగెనే
ప్రేయసీ మనోహరి
వరించి చేరవే
ప్రేయసీ మనోహరి


చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఊరించే సైగలతోనే ఏమంది తియ్యగా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
మర్యాదా కాదని కాదా పలికింది చల్లగా పలికింది మెల్లగా...
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు...
ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
మనకోసం... ఏ సందేశం ...అందించే ప్రేయసీ...
ఆనంద సీమలా ...అనురాగ డోలలా...
ఆనంద సీమలా... అనురాగ డోలలా...
కలకాలం ...తేలీసోలీ ...ఆడాలి హాయిగా...
అన్నాయి... తియ్యగా...
ఆ మబ్బు... తెరలే తొలగి... ఆగింది... చందమామ...
ప్రేమికుల ...హృదయము తెలిసి... పాడింది... చందమామ...
పాడింది... చందమామ...
ఆహా.హా.ఆ... ఆ... ఆ...
-3:38
చిత్రం : ఉయ్యాల జంపాల
రచన : ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
గానం : ఘంటసాల,సుశీల
కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది
గోదవరి వరదలాగ కోరిక చెలరేగింది || కొండ ||
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవసించి పాడింది || కొండ ||
మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది || కొండ ||
వెన్నెలలోనే వేడి ఏలనో
చిత్రం : పెళ్ళినాటి ప్రమాణాలు (1959)
సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల
పల్లవి:
వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో...
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి
చరణం 1:
మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
ఓ..ఓహొ..ఓ..ఓహొ...
మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే
వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి
చరణం 2:
రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా...
ఓహొ..ఓ..ఓహొ..ఓ..
రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా..
నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే
వెన్నెలలోనే హాయి ఏలనో...వెన్నెలలోనే విరహమేలనో..
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి
ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ...
నీవని నేనని తలచితిరా
చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నిజమిదే....ఋజువేదీ...
ఉహు..హు...ఆహా...హా...
నీవని నేనని తలచితిరా....
నీవే నేనని తెలిసితిరా ...
చరణం 1:
కలయగ జూచితి నీకొరకై నే...కలయగ జూచితి నీకొరకై నే...
కనుపాపలలో కనుగొన్నారా...కనుపాపలలో కనుగొన్నారా....
అవునో... కాదో... నే చూడనా...
నీవని నేనని తలచితినే...నీవే నేనని తెలిసితినే
చరణం 2:
కలవర పాటున కల అనుకొందూ..కలవర పాటున కల అనుకొందూ...
కాదనుకొందు కళా నీ ముందూ...కాదనుకొందు కళా నీముందూ...
కాదు సఖా కల నిజమేలే.....
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నీవే నేనని తెలిసితిరా ...
https://picosong.com/wNv8j ఆహ...ఆహ..హా...హా....ఉమ్మ్...ఉమ్మ్..ఉమ్మ్...
ఈరోజు (జూలై 9) ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ గారి జయంతి సందర్భంగా బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన రుద్రవీణ సినిమా నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన SPB పాడిన ఓ అందమైన పాట...
Movie : Rudraveena
Banner : Anjana Productions
Director : Balachander
Music : Ilayaraja
Cast : Chiranjeevi,Shobhana
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం!!2!!
గగనాల దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా!!తరలి రాద!!
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగంపదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద!!తరలి రాద!!
బ్రతుకున లేని శృతి కలదా యదసడిలోనే లయ లేదా !బ్రతుకున !
కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...
ప్రజాధనం కానీ కళావిలాసంఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందాపాడే ఏనే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళపెదవిని విడి పలకదు కద
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల
దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం


నటి రేవతి మేడం పుట్టిన రోజు సందర్భంగా ఆమె అద్భుతంగా నటించిన క్షత్రియుడు సినిమానుండి సన్న జాజి పడక...అనేపాట నాకు నచ్చిన పాట.మీకూ నచ్చుతుందనుకుంటాను.పాటలో ఆడియో రాక పోతె YouTube link ఇచ్చాను...click చేయండి ఆనందించండి.
చిత్రం : క్షత్రియ పుత్రుడు
రచన : వెన్నెలకంటి
గానం: ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
మనసులో ప్రేమే ఉంది
మరువనీ మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
కొండమల్లి పువ్వులన్నీ
గుండెల్లోనీ నవ్వులన్నీ
దండే కట్టి తోచుకున్నా నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చేరుకున్నా నీ దరికే
అండాదండా నీవేనని
పండుగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది ఇంకా మనసే
కొండపల్లి బొమ్మా ఇక పండు చెండు దోచేయ్యనా
దిండే పంచే వేళైనది రావే
దిండే పంచే వేళైనది రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
https://youtu.be/0XzhfHNTbEk
మాటవినకుందీ ఎందుకే