Tuesday 9 July 2019

చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఊరించే సైగలతోనే ఏమంది తియ్యగా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
మర్యాదా కాదని కాదా పలికింది చల్లగా పలికింది మెల్లగా...
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు...
ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
మనకోసం... ఏ సందేశం ...అందించే ప్రేయసీ...
ఆనంద సీమలా ...అనురాగ డోలలా...
ఆనంద సీమలా... అనురాగ డోలలా...
కలకాలం ...తేలీసోలీ ...ఆడాలి హాయిగా...
అన్నాయి... తియ్యగా...
ఆ మబ్బు... తెరలే తొలగి... ఆగింది... చందమామ...
ప్రేమికుల ...హృదయము తెలిసి... పాడింది... చందమామ...
పాడింది... చందమామ...
ఆహా.హా.ఆ... ఆ... ఆ...
-3:38

No comments:

Post a Comment