Thursday 19 January 2017

బాబాయ్ అబ్బాయ్ (1985)


తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని

చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే.. గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ.. యమున అని
అదే అదే..నా జీవమని గానమని
మౌనమని... తెలుసా..ఆ..ఆ ఆ

చరణం 1:

శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా

ఆదుకునే వెచ్చని మమత..
ఆవిరయే చల్లని ఎడద
ఒకటే శృతి.. ఒకటే లయ.. ఒకటే స్వరమూ..

ఆ..ఆ..ఆ..ఆ...ఆ.ఆ..ఆ..
ఆ.....ఆ....ఆ....ఆ

ఉన్న రాగమొకటే... అదే.. అదే..ఏ..ఏ
అనురాగమని.. మౌన యోగమని
ప్రేమ దీపమని..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

చరణం 2:

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్యమాస సుమదళాల తేనె వాకలా

సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి..

సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే
శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే

ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ
అదే..అదే.. మమకారము
సృష్టికారణం.. బ్రహ్మకు జననం..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
 

1 comment: