Wednesday 27 January 2016

01.ప్రేమించు పెళ్లాడు (1985) ,02.మేఘసందేశం (1982) ,03.mudda banti navulo04.Seetarama Kalyanam 05. ప్రజారాజ్యం (1983) 06. కోడెనాగు (1974) 07.ఏడంతస్తుల మేడ (1980) 08.రావణుడే రాముడైతే ( 1979)

ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ
 సర్వే సుఖినోభవంతు 

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...

చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

లాల...లాలా....లాలా..లా.లా..
ల..లా..లాలా...ల..లా..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 1:

విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..

తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 2:

గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

https://www.youtube.com/watch?v=fcTAl0sYHFw
PREMINCHU PELLADU, Ee Chaitra Veena







లా ల ల లా ల ల ల
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమె అవుతుంది అన్ని వేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు

లా ల ల లా ల ల ల
బంధమంటు ఎరుగని బాటసారికీ
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఆ ఆ ఆ ఆ
బంధమంటు ఎరుగని బాటసారికీ
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనె అంత మనసు ఉంచి
ఇంత చోటులోనె అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు

అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళి కూతురూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎదుటనైన పడలేని గడ్డి పూవునూ
గుడిలోనికి రమ్మంది ఈ దైవమా
మాటనోచుకొని ఒక పెదరాలినీ
మాటనోచుకొని ఒక పెదరాలినీ
ఈ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమె అవుతుంది అన్ని వేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
mudda banti navulo

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో
రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో .. 2
యెన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో…..
యెన్నెన్ని భావాలో … ||రాళ్ళళ్ళో ||

చూసాను యెన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచిన వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో .. 2
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో …
యెన్నెన్ని కౌగిళ్ళో.. .. ||రాళ్ళళ్ళో ||
Seetarama Kalyanam Movie Songs - Rallallo Isakallo Song - Balakrishna, Rajani
Watch the full songs of Seetarama Kalyanam. Starring Balakrishna and Rajani among others. Directed b...

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో...వయ్యారి చిందుల్లో..ఓ..ఓహో ఓహో ఓహో......

చిత్రం : ప్రజారాజ్యం (1983)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకధిమి తకధిమి తకఝణు

ఓ........ఓ...హో....
ఓ.....హో హో హో.....ఓ...

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ..ఓహో ఓహో ఓహో......

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ......

మువ్వా మువ్వా ముద్దాడంగ...ముద్దు ముద్దూ పెళ్ళాడంగ
అందాలన్నీ అల్లాడంగ...రావే..హో..హో..హో...
ఇదే అల్లరీ... ఈ..హో.. నాదే నా గిరీ...

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..ఓ......

చరణం 1:

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

దాచిన ఏహే..దాగని ఓహో..తీయని వలపులో
చక్కలిగిలిలో...కౌగిలి వలలో...ఇద్దరు కరగాలిలే

దక్కిన ఆహా..చిక్కని..ఓహో హో..తీరని కొలుపులో
ముద్దులముడిలో...మెత్తని ముడుపే...వెచ్చగ దొరకాలిలే

కన్ను కన్ను మాటాడంగ ...మాట మాట మనసివ్వంగ
మనసు మనసు మనువాడంగ... రావే..హే..హో..హ్హ..
అ.. మన పెళ్ళికీ..ఈ..హ్హో..మదే పల్లకీ..

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...
గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..ఓ...

చరణం 2:

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు
తకధిమి తకఝణు తకధిమి తకఝణు

వచ్చిన..హహహ..వయసులో..ఓహోహోహో..ఇచ్చిన మనసులే...
కలసిన జతలో...కమ్మని శృతిలో ...మల్లెలు పాడాలిలే

నచ్చిన..ఓహో..హో..సొగసులు..హే..తెచ్చిన వరసలే
వలపులు కడితే...వంతెన పడితే...పంటలు పండాలిలే

పాటే తీసి పైటేయంగ... పైటే నేను జారేయంగ ...
పైటే నువ్వై వాటేయంగ రారా..హో..హో...హో..
ఇదే ఆశగా..హోయ్..ఇదే బాసగా..అరెరే..

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..
హోయ్...గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో
వయ్యారి చిందుల్లో..వయ్యారి చిందుల్లో..హ్హ..
వయ్యారి చిందుల్లో....ఆ ఆ..వయ్యారి చిందుల్లో...
లలాలలాలలా..లలాలలాలలా..లలాలలాలలా

https://www.youtube.com/watch?v=45QH5RO9dgo
Gopaluduvate Gopemma Song || Praja Rajyam Movie || Krishna,Jayapradha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

సంగమం... సంగమం.... అనురాగ సంగమం... ఆనంద సంగమం

చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...

సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం 1 :

పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం ఆగి చూచు సంగమం..
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం.. ఆగి చూచు సంగమం

సంగమం... సంగమం....
అనురాగ సంగమం... ఆనంద సంగమం

చరణం 2 :

నింగి నేల.. నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం.. నిలిచిపోవు సంగమం
.
సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం 3 :

జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది.
జాతికన్న నీతి గొప్పది.. మతము కన్న మమత గొప్పది...
మమతలు.. మనసులు ఐక్యమైనవి...
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ... అద్దమన్నవీ...

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

https://www.youtube.com/watch?v=o7fUHw3mF10
Kodenagu Sangamam Sobhan Babu Lakshmi 1974
Movie Kodenagu Starring Shobhan Babu and Lakshmi Music Pendyala Director K S PrakashaRao Producer M ...


ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో..ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

చిత్రం : ఏడంతస్తుల మేడ (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : సుశీల, బాలు

పల్లవి :

అహ.. హా..హా..
అహహహ.. ఆ ఆ ఆ హా

ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో
ఆ.. ఆ.. ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..

ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

చరణం 1 :

అహ.. హా..హా..
అహహహ.. ఆ ఆ ఆ హా

వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడేను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు.. ఆ.. ఆ.. ఆ..
పల్లవి పాడేను నా మూగ మనసు

నీ పాట నా బాట కావాలని
ఆ నింగి ఈ నేల కలవాలని

చినుకులు వేశాయి ఒక ఒంతెన
చినుకులు వేశాయి ఒక ఒంతెన
కలిసిన హృదయాలకది దీవెనా
ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో
చరణం 2 :

తడిసిన తనువేదో కోరింది స్నేహం..
కలిగెను జడి వాన నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం..
ఆ.. హా..కలిగెను జడి వాన నాకు దాహం

నీ చెంత మేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలనీ

వలపులు చేశాయి వాగ్ధానము..హా.. ఆ.. ఆ
వలపులు చేశాయి వాగ్ధానము
మనకివి సిరులింక కలకాలము

ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..

ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

https://www.youtube.com/watch?v=trvfCbtQLGc
Yedanthasthula Meda Edi Meghasandesham
Film : Edanthasthula Meda Song : Idi Meghasandesham Starring : Akkineni Nageswar Rao(ANR) Sujatha Di...

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...

చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి:
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ..ఆ... ఆ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే... ఆ .. ఆ.. అందని... ఆ .. ఆ.. ఒకే ఒక అందానివో...

చరణం 1:

ఏ రాగమో.. తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యొగమో.. నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....
ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
నీ పాటలే పాడనీ..
రవివర్మకే... ఆ .. ఆ.. ఆ.. అందని... ఆ .. ఆ.. ఆ.. ఒకే ఒక అందానివో...

చరణం 2:

ఏ గగనమో కురులు జారి.. నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి.. కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
కదలాడనీ.. పాడనీ..

రవివర్మకే... అందని.. ఒకే ఒక అందానివో...
ఆ .. ఆ.. ఆ....
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే.. ఆ.. ఆ... అందని.. ఆ.. ఆ...
ఒకే ఒక అందానివో...

https://www.youtube.com/watch?v=iVVpDN_aNwo
Ravivarmake andani Video Song || Ravanude Ramudithe Movie || ANR,Jayachitra
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7...

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే...కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరధి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

చరణం 1:

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

చరణం 2:

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

చరణం 3:

రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

https://www.youtube.com/watch?v=nVaxuHn0huo
Madilo Veenalu Mroge - Aathmeeyulu




1 comment: