Wednesday 30 December 2015

01. భక్త కన్నప్ప



కోకిల కోకిల కూ అన్నది...వేచిన ఆమని ఓ అన్నది

చిత్రం : పెళ్ళిచేసుకుందాం
సంగీతం : కోటి
సాహిత్యం : సాయి శ్రీహర్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర

పల్లవి :

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో

చరణం : 1

గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా

చరణం : 2

వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదట్టులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా

https://www.youtube.com/watch?v=lGDasN0O-E8&feature=youtu.be
Afternoon Delight | Pelli Chesukundam Songs | Kokila Kokila Song | Venkatesh | Soundarya
Watch Afternoon Delight, Pelli Chesukundam Songs, Kokila Kokila Song, starring Venkatesh, Soundarya....

నిన్నే చూసిన నాలో మొదటిసారే
తెలియనీ ఓమాటా నీకోసం నిదురలేచింది నిజమిది

చిత్రం : మీనాక్షి
సంగీతం : ప్రభు
సాహిత్యం : శ్రీ హర్ష
గానం : సందీప్, ఉష

పల్లవి :

నిన్నే చూసిన నాలో మొదటిసారే
తెలియనీ ఓమాటా నీకోసం నిదురలేచింది నిజమిది

అవును అవునని అన్నా కాదు అన్నా
మనసులో ఓ మాటా నీకోసం ఎదురు చూసింది నిజమిది

ఆ...ఆ...ఆ...ఆ...........................

చరణం :

ఎన్నో గానాలు దాగు వీణ పైనా
ఏవో రాగాలు నేను మీటు కోనా
నిన్నే ఏ వేళ ఏలు రాణి కానా
నన్నే ఈ వేళ నీకు రాసి ఈయనా
కంటి పాప అద్దమై నీ బొమ్మ చూపెనా
కంటి చూపు నన్నిలా నీవైపు లాగెనా
నాలో ఏనాడు లేని భావమేదో నేనాఎనా

చరణం :

వన్నె వయ్యారమంత చిందులేసే
నన్నే కన్నార్పనీక విందు చేసే
ఏదో గుర్తొచ్చి బుగ్గ కందిపోయే
ముద్దా మందారమల్లె తొందరాయే
నిన్ను తాకి వచ్చినా ఈ గాలి నాదిలే
నిన్ను సోకి విచ్చినా ఈ సోకు నాదిలే
ఏమో ఈ తీరు పేరు ఏమిటోలే ఆ ప్రేమలే

https://www.youtube.com/watch?v=_TrMPysmccc
Meenakshi Movie Songs | Ninne Choosina Video Song | Kamalini Mukherjee, Rajiv Kanagala
Ninne Choosina Song from Movie"Meenakshi"Starring Kamalini Mukherjee Rajiv Kanagala. Meenakshi Movie...

Movie() : (కోకిలమ్మ)
Music () : M S Viswanathan
Director() : K Balachander
Singer యస్.పి.బాలు
Lyricist : Acharya Atreya

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో ||2||
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా ||పల్లవించవా||

చరణం 1

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని ||2||
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||2|| ||పల్లవించవా||

చరణం 2

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన ||నీ ప్రేమకు||
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ||2||
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||2|| ||పల్లవించవా||
Kokilamma - Pallavinchava naa gonthulo.flv
One of the Great Song by SPB and It is Very rare Video

చిత్రం: శివుడు శివుడు శివుడు (1983)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి :
ఆకాశంలో తారా తారా ముద్దాడే.. పెళ్ళాడే అందాలతో.. బంధాలతో..ఓ
ఓ..ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో.. తాళాలతో..ఓ
హో..ఓఓఓ ఓఓఓ ఓఓఓ

చరణం 1 :
ఈ పూల గంధాలలోనా..ఏ జన్మ బంధాలు కురిసే..ఏ.. ఏ
ఆ జన్మ బంధాలతోనే ఈ జంట అందాలు తెలిసే..ఏ.. ఏ
వలచే వసంతాలలోనే..
మమతల పందిరి వేసుకుని మల్లెలలో తలదాచాలి
మనసులతో ముడి వేసుకుని.. బ్రతుకులతో మనువాడాలి
శృతి..లయ సరాగమై..కొనసాగాలి

ఆకాశంలో తారా తారా ముద్దాడే..పెళ్ళాడే అందాలతో..ఓ..
లల్లాలలా..ఆ..బంధాలతో....ఓఓఓ..హే..ఏ.. ఏ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ల..ల
లల్లాలలా..ఆ..తాళాలతో..ఓ..ఓఓఓఓఓ

చరణం 2 :
తెల్లారు ఉదయాలలోన..గోరంత పారాణి తీసి.. ఈ.. ఈ
ఆరాణి పాదాలలోనే.. పరువాల నిట్టూర్పు చూసి..ఈ... ఈ
ఈ తీపి కన్నీటిలోనే.. కరిగిన ఎదలను చూసుకుని
కలలకు ప్రాణం పోయాలి
తనువుల అల్లిక నేర్చుకుని..పెళ్ళికి పల్లకి తేవాలి
స్వరం..పదం..కళ్యాణమై..జత కావాలి
ఆకాశంలో తారా తారా ముద్దాడే..
పెళ్ళాడే అందాలతో లాలలలా.. బంధాలతో..లాలలలా..ఆ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ఓఓఓ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..తాళాలతో..ఓఓఓ..లలాలలా

Subscribe to Tollywood/Telugu No.1 YouTube Channel for non Stop entertainment Click here to subscribe -- http://goo.gl/31ISUI

చిత్రం: దత్త పుత్రుడు (1972)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
చక్కాని చిన్నవాడే.. చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే.. తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో..ఓ.. తెలుసా.. గారాల బావ తెలుసా

చక్కాని చిన్నవాడే.. చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే.. తొలకరి వానల్లే కురిశాడే

చరణం 1:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
అత్తకొడుకని విన్నానే.. అయిన వాడనుకున్నానే
ఓహో.. ఓహో..ఓ..ఓ..
ఓహో.. ఓహో..ఓ..ఓ..
వల్లమాలిన సిగ్గేసి.. తలుపు చాటున చూసానే
ఏమి అందం.. ఏమి చందం
ఏమి అందం ఏమి చందం.. గుండెల్లో రేగెను గుబగుబలేవో.. గుసగుసలేవో

చక్కాని చిన్నవాడే.. హహహా.. చుక్కల్లో చందురూడే.. హహహా..
మెరుపల్లే మెరిశాడే.. తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో..ఓ.. తెలుసా.. గారాల బావ తెలుసా

చరణం 2:
హ..హ..హ...హ..ఊఁహుహూహు..
ఆ..ఆ..ఆ...ఆ..ఆహహా..ఆ..
ఆ..ఆ..ఆ...ఆ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఆ..ఆ...ఆ...ఆ..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ఆహాహాహా.. ఆహాహాహా.. ఆహాహాహా..ఆ..హా..ఆ..హా
లల్లాలలా.. లల్లాలలా.. లల్లాలలా.. లాలలా..

మెల్లగా.. హాయ్
మెల మెల్లగా.. హాయ్.. హాయ్.. హాయ్.. హాయ్
మెల్లగా నను చూసాడే.. కళ్ళతో నవ్వేసాడే
మెత్తగా నను తాకాడే.. కొత్త కోరికలు లేపాడే
ఏమి వింత.. ఈ గిలిగింత
ఏమి వింత.. ఈ గిలిగింత.. రెపరెపలాడే నా ఒళ్ళంతా.. ఏదో పులకింత

చక్కాని చిన్నవాడే.. హహహా.. చుక్కల్లో చందురూడే.. హహహా..
మెరుపల్లే మెరిశాడే.. తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో..ఓ.. తెలుసా.. గారాల బావ తెలుసా

Watch ANR Vanisri's Datta Putrudu Telugu Movie Song With HD Quality Music : T Chalapathi Rao Lyrics : C Narayana Reddy Dasaradhi Kosaraju

నాకు చాలా చాలా ఇష్టమైన పాట
********************************

మాట చాలదా మనసు చాలదా
చిత్రం: అంతా మన మంచికే (1972)
సంగీతం: సత్యం
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
దిక్కులు వినగా.. చుక్కలు కనగా
ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా
పక్కన పలికే.. మక్కువ ఒలికే...
మాట చాలదా...
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
చరణం 1:
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ
తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ
గూటిలో ప్రియునితో గోరింక అనేదీ...
కన్నులలోనా..
ఊఁఊఁఊఁ..
నవ్వులలోనా..
ఉహూఁ..
కన్నులలోనా నవ్వులలోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
చరణం 2:
ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ
ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ
ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ
పదిలముగా నా..
ఊఁఊఁఊఁ..
హృదయములోనా..
ఉహూఁ..
పదిలముగా నా హృదయములోనా.. ఒదిగీ దాగే మధుర రహస్యం
ఊఁహుహూఁహుహూఁ..
మాట చాలదా..
ఉహుఁ..
మనసు చాలదా..
ఉహుఁ..
మాటలోని మనసులోని మమత తిలియదా..ఆ..
మాటలోని మనసులోని మమత తిలియదా..
ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..
ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..


కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా...ఆమని విరిసే తోటగా
లాలీ లాలో...జోలాలి లో..
లాలీ లాలో...జోలాలి లో..
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
మోసం తెలియని లోకం మనది
తియ్యగా సాగే రాగం మనది
ఎందుకు కలిపాడో..? బొమ్మలను నడిపే వాడెవడో
నేకు నాకు సరి జోడని కలలోనైనా విడరాదని..
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలీ లాలో...జోలాలి లో..
లాలీ లాలో...జోలాలి లో..
కారడవులలో కనిపించావు
నా మనసేమో కదిలించావు
గుడి లో పూజారై..నా హృదయం నీకై పరిచాను..
ఈ అనుబంధమే జన్మది
వుంటే చాలు నీ సన్నిధి
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలీ లాలో..జోలాలి లో..
లాలీ లాలో..జోలాలి లో..
లాలీ లాలో..జోలాలి లో..
లాలీ లాలో..జోలాలి లో..

Illayaraja is really Raja in melody Can't you agree

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన...కొండలరాయనికిక కోటి రాతురులు...
చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : పార్థసారధి (ఈపాటకు మాత్రమే)
సాహిత్యం : కె.విశ్వనాథ్
గానం : బాలు, సునీత

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా... ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్...
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే...ఏ.. ఆ మేను...
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

Srikanth Sivaji K Viswanath's Swarabhishekam Telugu Movie Song Music : Vidya Sagar Lyrics :…

 10. ఏమండో శ్రీమతి గారు 

 ఏమిటి శ్రీమతి గారు నేను స్నానం చేసి వచ్చే లోపే నా సెల్ నుండి తీసేస్తున్నవు, అలా చేయుట తప్పు కదూ, ఇతరుల సెళ్లులు చూడటం తప్పుకదా, మీరు మా వారే కదా అందు కనీ, అది నిజమే ఎవేమి డిలిట్ చేసావో కనీసం చెప్పు,  ఏమైనా ఆఫీస్ వి డిలిట్ చేసావనుకో, నాకు ప్రాబ్లం వస్తుంది, నాకెందుకు తెలియదండి నే నేమన్న చదువుకొని దాన్నా మీ భార్యనండి.

నేను వాడ్సప్ ఓపెన్ చేశా నాన్ వెజబుల్ జోక్స్ డిలిట్ చేశా, కొన్ని బొమ్మలు చూస్తే నావళ్లు కంపర మెక్కింది.

ఇంకా ఏమేమి తిసేసావు. నేను మిమ్మల్ని “వైరస్” లోకి తీసుకెల్లేవి తీసి వేసాను. ఇంకా పనికి రాని గాలి కబుర్లు డిలిట్ చేసాను. ఫేస్ బుక్ లోవచ్చే ప్రాంజలి ప్రభని తీయ లేదుకదా. నేనెందుకు తొలగిస్తానండి నాకేమన్న పిచ్చా,  రోజూ కొత్త కధలు, కవితలు, ఆద్యాత్మిక విషయాలు తెలుస్తున్నాయి కదా. నాకు కొంచం ధర్మం తెలుసండి అన్నది భార్య.

ఎం తెలుసు నీకు కొంచం చెప్పు,  చెపుతా వినండి “ మనిషి శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు భందు మిత్రులుగాని, కుటుంబ సబ్యులుగాని వెంట రారు,  మనము అనుసరించిన ధర్మం ఒక్కటే అన్నాడు ఒక మహాకవి “

అందుకే నేను మీతో అంటాను,  దేనినైనా వదలివేయవచ్చును గాని, కామానికి వసుడయ్యో,  భయానికి లోనయ్యో, లోభం వల్లనో, లేదా ఎదో బతుకుదెరువు కోసమో ధర్మాన్ని నిర్లక్షం చేయరాదు, ధర్మాచరణను విడువరాదు.

అంటే నా ప్రవర్తన ధర్మం గా ఉన్నదా లేద, ఉన్నారు కాబాట్టే మీతో కాపురం చేస్తున్నాను, నేను ధర్మం తప్పా ననుకో ఆమాటలు ఏ భర్త నోటి వెంట రాకూడదు, వచ్చాయనుకో స్త్రీ కాళికావతారం ఎత్తటమే. ఏమిటే ఇప్పుడు అంత కోపంగ ఉన్నావు. శాంతం,శాంతం.

అసలు ధర్మాన్ని ఎరుగని వారెవరో తెలుసా నీకు అని అడిగాడు భర్త

లోకంలో ధర్మం ఎరుగని వారు పది మంది ఉన్నారు. అలాంటి వారితో సాంగత్యమును ఎర్పరుచుకోకూడదు

1.       మాత్తేక్కినవాడు, 2. పొరపాటుపడువాడు, ౩. పిచ్చివాడు 4.అలసినవాడు  5. క్రోధం కలవాడు 6.ఆకలిగొన్నవాడు 7. తొందరపా టుగలవాడు, 8. అత్యాస కలవాడు 9. భయ పడివవాడు 10. కాముకుడు  వేరేనని విదుర నీతిలొ చెప్పారండి.

సెల్ ఎందుకు ఓపెన్ చేసావంటి చిన్న కధ చెప్పావు, అసలు నా పాస్ వర్డ్ నీకెట్లా తెలిసింది. భర్త గుణం తెలుసుకొనే భార్య కాపురం చేస్తుందండి  . ఆ .. ఆ .. సెల్ మోగుతున్నది మీ అమ్మ గారుచేసారేమో చూడు లేదు ఇది మీ అక్క గారు చేసారండి    

                                                                   --((*))--

11.సహకారం

మాజీ ప్రిన్సిపాల్ గారు బాగున్నారా, మీ శృతి కి 95% మార్కులు వచ్చాయి, కానీ ఇక్కడ మీకు సీటు రాక పోవచ్చు, ఉత్తర దక్షణాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి నమ్మకంగా పనిచేస్తున్న పాత లెక్చిరర్, ప్రిన్సుపాల్ రావటం సీటు లేదనటం జరిగింది.మనలానటి మధ్యతరగతి వారి చదవటం కష్టతరముగా మారుతున్నది. పద శృతి వెళ్దాం. 
       
నాన్న నీలో ఉన్నగుండే ధైర్యం ఎందుకు తగ్గింది, నా చదువు గురించి నీవు దిగులు చెందకు, నేను చదువును ఆపను,తల్లి తండ్రులారా మీరు ఏది చదవమంటే అది నేను చదువుతాను, అక్కల నలుగురికి పెళ్ళిళ్ళు చేసారు, నేను  మీకు భంధంలా ఉండ దలుచు కోలేదు,  నాకు తెలిసిన విద్యలలో  కంపూటర్ టైపింగ్, కుట్టు ఎంబ్రాయడరీ, నాకు తెలిసిన విద్యలద్వారా ఉద్యోగమూ చెస్తూ ప్రవేటుగా డిగరి చదువు తాను  నాన్న. నన్ను ఆసీర్వదించండి మీరిద్దరి ప్రోస్చాహముతో, ఒక దృడ సంకల్పము నకు వచ్చి, మనో ధైర్యముతో ముందుకు పొవాలని అనుకుంటున్నాను. ఒక్క మూడు సంవస్చరాలు దాకా పెళ్లి గురించి మాట్లాడకండి, నాకాళ్ళ మీద నేను నిలబడటానికి అవకశం ఇవ్వండి.

నేను ఆడపిల్లనే మొగవాళ్ళ, మ్రుగాల్లాంటి వాళ్ళు,  ఉన్న చోట బ్రతకటం కష్ట మంటావమ్మా, నన్ను ఒక మగవాడిగా పెంచారు, నేను బ్రతికి మిమ్మల్ని బ్రతికిన్చు కొనే శక్తి నాకివ్వండి. నాన్న నీ అను భవ మంత ఉచిత విద్యా భోధనకు ఉపయొగిన్చు, మనమే ఆర్ధికంగా వెనుకబడిన వారిని సేకరించి, వారికి తగిన ఉపాది కల్పించి మొగ వారి తో సమానముగా  అడవారు కూడా బ్రతుక గలరు అని నిరూపించాలి నాన్న. నీధైర్యమునకు మాలో యువరక్తం ప్రవహిస్తున్నదమ్మా నీకు మా పూర్తిసహకారమ్ మేము ఇస్తాము.                          
                                                         --((*))--
 12. తెల్ల కుక్కపిల్ల

ఏమిటి రామకృష్ణ  గారు ఈరోజు అన్నదానము చేస్తున్నారు, చెపుతాను రామారావుగారు కూర్చోండి   ఆరొజూ  
"ఏమిట్రా బాబు కుక్కపిల్ల అరుపు ఇంటిలో వినబడుతున్నది, అవునమ్మా నేనే తీసుకొనివచ్చా, పాపం చలికి వణుకుతున్నది, రగ్గు కప్పుకొని మరీ తీసుకొనివచ్చా, ఎక్కడతెచ్చావో  అక్కడ వదిలిరా, వాలమ్మ ఏడుస్తుంది, అవునమ్మ వాలమ్మ  కోసం చాలా సేపు వెతికాను ఎక్కడా కనబడలేదు అందుకే తెచ్చా, కాస్త అన్నం పెట్టు ఆకలేస్తున్నదేమో, ఇదిగో ఈ అన్నం పెట్టి ఎక్కడన్నా వదలేసిరా, లేదమ్మా నేనే పెంచుకుంటా, మీ నాన్న ఒప్పుకోడు, నీవే వప్పించ్చమ్మ.సరే దాన్ని జాగర్తగా చూసుకోవాలి, అట్లాగేనమ్మా .

తండ్రి రావటం, కుక్కపిల్ల చెప్పులు కొరకటం జరిగి పోయినాయి, కొడుకు గమనించి నాన్న ఈ పాత చెప్పులు బాగాలేదు అవి పారేస్తున్నాను కొత్తవి కొనుక్కో అన్నాడు, అవునండి కొత్తివి కొనుక్కోండి. ఏమిటే నీవు కూడా కొడుకును సమర్దిస్తావు.

నాన్న కుక్క అరుస్తున్నది, అవును ఉండు లైటు వేస్తా, ఎవరూ అటు పరుగేట్టేది అని గట్టిగా ఆరిచాడు, అప్పుడు దొంగలు పక్కింట్లో పడి దోచుకొని వెళ్లినట్లు గమనించారు. పక్కట్లోకి వెళ్లి ఓదార్చి, పరామర్శించి,పోలీస్ ఫోన్ చేసారు.

ఒక సారి కుక్కపిల్లను వెంట పెట్టుకొని విందుకు బయలు దేరారు, అందరూ చూస్తుండగా పాయసంలో మూతిపెట్టి  అరుస్తున్నది.  అక్కడున్నవారు కుక్కను కొట్ట పోయి గిన్నెను కొట్టారు, గిన్నేనుండి దొర్లిన పాయసంలో బల్లి కనిపించింది. అందరు కుక్క పిల్లను మెచ్చుకున్నారు.

కుక్కకు రకరకాల ఆటలు నేర్పారు,  పరిగెడుతూ గుంటలో పడింది, గుంటలో పాముతో పోరాడింది, పామును చంపివేసింది.

పాము విషముకుక్కకు ఎక్కకుండా డాక్టర్ సలహా ప్రకారము ఇంజక్షన్ చేయించారువారు. ఆ యింట్లో వారు కుక్కను భైరవునిగా భావించి పూజచేసి గారెలదండ వేసారు. కన్నా బిద్దలాగా చూస్తున్నారు.

అనుకోని విధముగా అందరూ కలసి ఊరికి పోవలసి వచ్చింది. కుక్క పిల్లను ప్రక్క ఇంటివారికి ఇచ్చి బయలు దేర బోయారు.  .
 ఆ ప్రక్క  యింట్లో ఉంచిన  కుక్క పిల్ల   ఒకటే ఏడుస్తూ పరుగెడుతూ మాకరుక్రిండ పడి  చని పోయింది. ఒక్కసారిగా మాబాబుకేవ్వుమని అరిచాడు, అపుడు చనిపోయిన కుక్క పిల్లను తీసుకువచ్చి మా తోటలో పాతిపెట్టాము.
అప్పుడే పిడుగు లాంటి వార్త ' మేము వెళ్ళే ట్రైన్ ను కొందరు దుండగులు పెట్రోల్ పోసి తగలేసినట్లు చాలా మంది సజీవ దహన మైనట్లు తెలిసింది.' మాప్రాణాల కోరకు  తన ప్రాణాన్ని అర్పించిన కుక్క పిల్ల చనిపోయిన రోజు అన్నదానము చేస్తున్నాము, అందుకే  మా యింట్లో కుక్క ఫొటోకు దండ వేశాము ఇది కధ "                   
                                

No comments:

Post a Comment