Friday 11 December 2015

1.గుణ (1991) 2. కోరుకున్న మొగుడు (1982) 3.ప్రేమ మూర్తులు (1982)4.పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)5. dhanush swathi mohan 6.మంచిమనసుకు మంచి రోజులు (1958), 7.పూవులేరి తేవే 8.ప్రేమ యుద్ధం (1990) 9.ఖడ్గం (2002), 10.సొంతం (2003).,11. చంద్రముఖి (2005)


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు



కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే...

చిత్రం: గుణ (1991)
సంగీతం: ఇళయరాజా
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే

చరణం 1:

గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది

చరణం 2:

మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా

శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

https://www.youtube.com/watch?v=FmHhZjZ_EbA
Priyathama Neevachata [with lyrics] - Guna [1992] - ilayaraja.flv
Kammani Neepremani Lekhani [with lyrics] - Guna [1992] - .flv

చిలకమ్మ గోరింక సరసాలాడితే...నవ్వే యవ్వనం నాలో ఈ దినం...

చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 1:

పువ్వులలో పులకింతలలో చలిజింతలలో చెలరేగి
కౌగిలిలో కవ్వింతలలో చెలి చెంతలలో కొనసాగే

ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
తొలకరి వలపుల వేళలలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 2:

కోరికలో దరి చేరికలో అభిసారికనై జతకూడి
అల్లికలో మరుమల్లికలా విరిపల్లకినై కదలాడి

ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ఎగసిన సొగసుల ఘుమఘుమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చరణం 3:

అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై పెనవేసి
మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే

ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
కలిసిన మనసుల సరిగమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

https://www.youtube.com/watch?v=47bBdkro8sA
Chilakama Gorinka Video Song || Korukunna Mogudu Movie || Sobhan Babu,Lakshmi
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7...




తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు

చిత్రం : ప్రేమ మూర్తులు (1982)
సంగీతం : చక్రవర్తి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

లలలలలల... లలలలల... లలలలల...

తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు

తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు

చరణం 1:

ఉదయకాంతి నీ పెదవుల మెరిసి... తాంబూలంగా చూస్తుంటా
నీలి మబ్బు నీ నీలాల కురులకే... చుక్క మల్లెలే అందిస్తా

చిరుగాలులు నీ తాకిడిగా... సెలయేరులు నీ అలికిడిగా
నాలో నిన్నే చూసుకుంటూ... కాలం ఇట్టే గడిపేస్తా

కాలమంతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా

తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు

చరణం 2:

వేడి ఆశనై వేసవి గాలుల... వెచ్చని కబురులు పంపిస్తా
కలల నీడలే కౌగిళ్లనుకొని... కలవరింతగా కలిసొస్తా

నెలవంకలు నీ నవ్వులుగా... కలహంసలు నీ నడకలుగా
కావ్యాలెన్నో రాసుకుంటూ... కవినే నీకై వినిపిస్తా

కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా

తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు
ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు
తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు
అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు

https://www.youtube.com/watch?v=OEo4xSDD0Ug
Prema Murthulu Songs - Taraka Cheppadu - Lakshmi - Sobhan Babu
Sobhan Babu Lakshmi Radha's Prema Murthulu Telugu Movie Song Music : Chakravarthy Lyrics : Arudhra C...
 ఆహా బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా..

చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :

హెహె ఆహా హేహే
ఆహా బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఆహా బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

చరణం 1 :

ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
ఏటుగాడి వనుకున్నా వోరబ్బా కన్నెజింక చేత తిన్నావు దెబ్బ
కోపమొద్దూ తాపమొద్దూ ఉన్నమాటే ఉలకవద్దూ

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా.. ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా.. చెమ్కి తిన్నావు చిన్ని నాయనా

చరణం 2 :

సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
సరదాగా అన్నాను చిన్నోడా కలకాలం కావాలి నీ నీడ
కలుపుచేయీ కలుగుహాయీ పోరునష్టం పొందులాభం

బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా ఓహో
బోల్తా పడ్డావు బుజ్జి నాయనా చెమ్కి తిన్నావు చిన్ని నాయనా
ఏమిసిగ్గా ? కందెబుగ్గా తుళ్ళి పడకోయ్ మల్లెమొగ్గా

https://www.youtube.com/watch?v=fl4XgjtWvT0
Bolta Paddavu Bujjinayana - "Telugu Movie Full Video Songs" - Puttinillu Mettinillu(Sobhan Babu)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


6.శుభ సాయంత్రం ..మంచి పాట తో
ప: పూవులేరి తేవే చెలీ పోవలె కోవెలకు..
నీవలె సుకుమారములు-
నీవలెనే సుందరములూ
చ:తుమ్మెద కాలూననివి,దుమ్ము ధూళి అంటనివీ
కమ్మగా వలచేవీ రకరకమ్ముల వన్నెలవీ
"పూవులేరి తేవే చెలీ
చ:ఆలసించిన పూజ వేళా మించిపోయినా
ఆలయమ్మున మూసి నిను పాలింపడు దు ప్రభువు
"పూవులేరి తేవే చెలీ"
చ:మాలల్లుటేపుడే నవ మంజరులల్లెదేపుడే
ఇక పూలే పోయాలి తలంబ్రాలల్లె స్వామి పైన.
"పూవులేరి తేవే చెలీ"
రచన:దేవులపల్లి కృష్ణ శాస్త్రి
http://www.youtube.com/watch?v=-mSekdefOkU


poovuleri teve
Rachana Devulapali Krishna Sastri Singer: Subhadra Dronamraju Click here for all the songs: https://...
 
8.స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..

చిత్రం : ప్రేమ యుద్ధం (1990)
సంగీతం : హంసలేఖ
గీతరచయిత : వనమాలి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి:

స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...

స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...

చరణం 1:

దరువేసిందమ్మా.. కబురే కసిగా తెలిపీ.. తడిగా ఒడినే దులిపీ..
జడివానేం చేస్తుందీ జవరాలే తోడుంటే...

తడిపేసిందమ్మా.. తనువూ తనువూ కలిపీ.. తనతో సగమే చెరిపీ..
చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే....

ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో...
ఈ ఉరుములకే ఉలికి పడే వయసులతో...
కురిసిందీ వానా తొలిగా పరువానా...

స్వాతీ ముత్యపు జల్లులలో..శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే...
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

చరణం 2:

లా ల్లలల్లా.....లా ల్లలల్లా.....
మతిపోయిందమ్మా...
మనసు మనసు కలిసి.. కథలు కళలు తెలిసీ...
జలపాతం నీవైతే... అల గీతం నేనే లే...
కసిరేగిందమ్మా...
కలతో నిజమే కలిసీ ... దివిని భువినీ కలిపీ...
సిరి తారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే...

ఈ చిటపటకే శృతి కలిపే వలపులతో....
ఈ తపనలకే జత కలిసే తలపులతో...
కురిసిందీ వానా... తొలిగా పరువానా..

స్వాతీ ముత్యపు జల్లులలో.. శ్రావణ మేఘపు జావళిలో..
స్వాతీ ముత్యపు జల్లులలో.. శ్రావణ మేఘపు జావళిలో..
నిండే దోసిలి... పండే కౌగిలి.. నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే...
ఆ...ఆఆ...ఆఆ....ఆఆ అహా హా...ఓ ఓహోహొ...
https://www.youtube.com/watch?v=SKk_moKeFss
Prema Yuddam Movie - Swathi Muthyapu Jallulalo Song - Telugu Super Hit Song
Watch Nagarjuna's Prema Yuddam / Prema Yuddham Movie Swathi Muthyapu Jallulalo Song Starring : Nagar...



9.అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే...

చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: చిత్ర, రఖ్వీబ్

పల్లవి:

అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ యదలోన చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్కగాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలన.. ఆ..
తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా... అరె

చరణం 1:

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుము లోని మడత తన ముద్దుకై వేచి వున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తలవారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేల మీద మల్లెలన్ని తన నవ్వుల్లో కుమ్మరిస్తడే

చరణం 2:

పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తియ్యగవుతదే
తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసే మెరుపల్లే వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరి ఆగిపోతదే

https://www.youtube.com/watch?v=us4GCHKe55k
Khadgam Movie || Aha Allari Video Song || Ravi Teja , Srikanth, Sonali Bendre, Sangeetha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
 10. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక...అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
  సొంతం (20
చిత్రం: 03)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత:
నేపధ్య గానం: సుమంగళి

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది ||తెలుసునా||

చరణం 1

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకో
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక ||తెలుసునా||

చరణం 2

గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయింది
నిన్నదాక ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని ||తెలుసునా||
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

https://www.youtube.com/watch?v=gwx_5UV03x8


Sontham - Telugu Songs - Telusunaa - Aryan Rajesh - Namitha
Watch Aryan Rajesh Namitha's Sontham Telugu Movie Song With HD Quality Music - Devi Sri Prasad Lyric.
11.కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ...నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
గీతరచయిత: వెన్నెలకంటి
నేపధ్య గానం: సుజాత, యదు బాలకృష్ణ

పల్లవి:

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

చరణం 1:

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లెకాలం
మదిలోనే నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలికాలం
కలనైన తెలుపు కలకాలం
తొలిగిలి కాలం కౌగిలికాలం
మన కాలం ఇది ఆ ఆ ఆ ఆ

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల

చరణం 2:

కన్నెమోజులకు సన్నజాజులకు కరిగే ఝాముకాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం
తవితీరకుంది తడికాలం
క్షణమాగనంది ఒడికాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలికాలం
మరిసిరికాలం మగసిరికాలం మనకాలం పద
ఆ ఆ ఆ ఆ

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
https://www.youtube.com/watch?v=Re4Wc_F78Vg
Chandramukhi Songs | Kontakalam Video Song | Rajinikanth, Jyothika, Nayanatara | Sri Balaji Video
Watch & Enjoy Chandramukhi Telugu Movie Video Songs (720p) Starring Rajinikanth, Jyothika, Nayanatar...

No comments:

Post a Comment