Monday 28 December 2015

01.అనురాగదేవత (1982),02. గుప్పెడు మనసు (1979), 03.శివ (1989),04. ఆరాధన (1962), 05. ఆరాధన (1962),06.ఎం.ఎల్.ఎ. (1957) ,07.దొంగరాముడు (1955),08.భాషా (1995),09. డ్యుయెట్ (1994) 10.మాయామశ్చీంద్ర (1975) ,11. అందమైన అనుభవం (1979)




 ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు




నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా..జాబిలి నవ్వున నువ్వేనా..
చిత్రం: గుప్పెడు మనసు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం 1:
నిన్నేనా.. అది నేనేనా కల గన్నానా.. కనుగొన్నానా
నిన్నేనా.. అది నేనేనా
కల గన్నానా.. కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా

నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం 2:
కళ్ళేనా .. హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
తుళ్ళీ తుళ్ళీ పడు వయసేనా నను తొందర వందర చేసేనా
తుళ్ళీ తుళ్ళీ పడు వయసేనా నను తొందర వందర చేసేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా

చరణం 3:
నువ్వైనా.. నీ నీడైనా
ఏ నాడైనా ... నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా ఏ నాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా

నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా నువ్వేనా
నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా


Beautiful song from guppeDu manasu (1979) Music - MSV Singer - SPB Lyrics - aatrEya

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి...
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :
నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి...
పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 1 :
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి
చరణం 2 :
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే

నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి


నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని....చిత్రం :-…

వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా...వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల

పల్లవి :
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి..

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
చరణం 1 :
వాడని పూవుల తావితో..కదలాడే సుందర వసంతమీ కాలము
కదలాడే సుందర వసంతమీ కాలము..
చెలి జోలగ పాడే వినోద రాగాలలో...
చెలి జోలగ పాడే వినోద రాగాలలో...
తేలెడి కల సుఖాలలో... నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈ రేయీ

వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
చరణం 2 :
భానుని వీడని చాయగా... నీ భావము లోనే చరింతునోయీ సఖ
నీ భావములోనే చరింతునోయీ సఖ
నీ సేవలలోనే తరింతునోయీ సదా...
నీ సేవలలోనే తరింతునోయీ సదా..
నీ ఎదలోనే వసింతులే... నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ

వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి... నిదురించుము ఈ రేయి


వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల.... చిత్రం :- ఆరాధన…

06. నీ ఆశ... అడియాశ...చెయిజారే మణిపూస...బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా
చిత్రం: ఎం.ఎల్.ఎ. (1957)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:
నీ ఆశ... అడియాశ...చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా

చరణం 1:
ఓ... తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు అతుకుటకూ లేరెవరు

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా

చరణం 2:
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
కన్నులలో గోదారి కాలువలే కట్టింది

నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా..


Watch the song,"Nee Aasa Adiyasa" sung by Ghantasala and S Janaki from the movie M.L.A. Cast: Kongara Jaggayya, Savitri, Gummadi Music: Pendyala Nageshwara R...


07అంద చందాల సొగసరి వాడు....విందు భోంచేయ వస్తాడు నేడు
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : సముద్రాల రాఘవాచార్య
గానం : జిక్కి

అంద చందాల సొగసరి వాడు....
అంద చందాల సొగసరి వాడు....
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపుల రేడు
వాడు నీకన్న శోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

నేటి పోటీల గడుసరి వాడు
మాట పాటించు మగసిరి వాడు
వాడు నీకన్న సిరిగల వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ(2)

అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామ ఓహో చందమామ.....


Watch ANR Savitri's Donga Ramudu Telugu Old Movie Song With HD Quality Music - Pendyala Nageswara Rao Lyricist - Samudrala


08. కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

చిత్రం : భాషా (1995)
సంగీతం : దేవా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : బాలు, చిత్ర

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నా ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నా కన్నుల చల్లని వెన్నెలలే
గంగై నా మది పొంగేనే దిగిరా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

రావే కలవాణీ నీవేలే అలివేణీ
మదినేలీ అలరించే మారాణీ ప్రేమల మాగాణీ
నీవే రాజువనీ వలచినదీ పూబోణీ
మదిలో అనురాగం విరబూయగ చేరే మహరాణీ
తరించేటి మోజే ఫలించాలి నేడూ
తాపాలు తీరే విలాసాలు చూడూ
ఇది కలరవమా తొలి కలవరమా

కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే

తోడై వచ్చాడే మది నాకే ఇచ్చాడే
నీడై నను కాచే మొనగాడే జతగా దొరికాడే
ముద్దుల మురళి వినీ ఎద పొన్నై పూచిందీ
పాటే విరితోటై సిరిపైటే స్వాగతమిచ్చిందీ
నామేని వీణా శృతి చేసుకోరా
తాపాలలోనా జత చేరుకోనా
ఏ విందుకనీ ఈ తొందరలు

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
కలల మహరాజు వలపు వలరాజు నేడు నిన్ను గెలిచే
కలిసి నీ మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే
నచ్చిన వాడే నీ ఆశే తీరగ వచ్చెనిలా
వెలిగేనమ్మా నీ కన్నుల చల్లని వెన్నెలలే
మోహంలో మది గంగై పొంగెనుగా నా జతనీవే..

కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే
కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే


కాలమే కమ్మగా సాగే గాలి పాటా...ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
చిత్రం : డ్యుయెట్ (1994)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా

మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...

కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా

మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...

ఎద పాడిన పాటా సిరి మల్లెల పాటా
ఇది మోజుల్లో వూహలు పాడిన పాటా
కాలేజీ పిల్లలు పాడే కన్నియ పాటా
కలలన్నీ నిజమైపోయే కమ్మనిపాటా
ఇది తేనెల పాటా విరి వానల పాటా
హరి విల్లుల్లో మనసే వూగే పాటా
తల్లి పాలల్లే రక్తంలో ఒదిగే పాటా
తెలుగింటి వెలుగై సాగే తియ్యని పాటా...

మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...

ఇక కాలం మొత్తం ఒక కవితై సాగే
కలలే రాగాలై సాగే లాహిరిలోనా
మా పల్లవులే పల్లకిగా పాటే సాగే
తలపుల వెల్లువలోనా నా మనసూగే
ఈ భూమే మనది విరి బాటే మనది
ఇక ఈతలపే హృదయం అంచులు దాటే
ఆకాశాలు దాటి ఆవేశాలే పొంగేనంటా
విజయాలే మనతో నేడు వచ్చేనంటా

మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...

కాలమే కమ్మగా సాగే గాలి పాటా...
ఎద సరాగమైనా స్వరాలలోన మోగే పాటా...
ఎక్కడా రాగం వుందో..
ఎక్కడ ఎక్కడ తాళం వుందో
అక్కడ మా హృదయంలోనా మోగే పాటా

మోగే పాటా మోగే పాటా అహ
తేటగీతీ తెమ్మెరలాగా సాగే పాటా...
మోగే పాటా మోగే పాటా ఇక
తెలుగే జిలుగై కమ్మగా యదను రేగే పాటా...


One more beautiful composition of A R RAHMAN


10. చిత్రం : మాయామశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
గానం : పి.సుశీల

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా..

చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా..

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..

నిను చూడగానే నా నెమ్మేను పొంగే..
నిను చేర అందాల కెమ్మోవి ఊరే..
చెమరించె కన్నూ నన్నేల రారా
అనురాగాల భోగాల లాలన శాయా

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..

మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే..
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా

మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా..
ఓ మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా.ఆఆఆ..
11. కాచుకొంటి కాచుకొంటి...కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ ...చుప్పనాతి రామచిలక

చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు
ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక


Watch Andamaina Anubhavam Full Movie / Andamaina Anubhavam Movie Starring with Kamal

No comments:

Post a Comment