Friday 4 December 2015

1.సిరి సంపదలు (1963) 2.కలిసివుంటే కలదు సుఖం 3.పూజాఫలం (1964) 4.నమ్మిన బంటు (1960), 5. అప్పుచేసి పప్పుకూడు 6.బందిపోటు దొంగలు (1968) 7.అగ్గి పిడుగు (1964) 8.గులేబకావళి కథ (1962) 9.కులదైవం (1960) 10.గుండమ్మ కథ (1962) 11.శ్రీ మదనమోహనాష్టకం

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
  "నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ భవనం,  హైదరాబాద్
సర్వేజనా సుఖినోభవంతు




అందేనా ఈ చేతుల కందేనా..ఆ..ఆ..చందమామ ఈ కనులకు విందేనా...ఆ..ఆ..

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

సుందర సురనందన వన మల్లి.... జాబిల్లి..

అందేనా ఈ చేతుల కందేనా...ఆ..
అందేనా ఈ చేతుల కందేనా..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా...ఆ..ఆ..
అందేనా ఈ చేతుల కందేనా...

చరణం 1:

ఆ మడుగున కనిపించి...నా మనసున నివశించి
అంతలోనే ఆకాశపు అంచుల విహరించె...ఏ...
చందమామ ఈ కనులకు విందేనా ..ఆ..ఆ..ఆ..

చరణం 2:

తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని....
నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని...
కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే...
కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా ....ఆ..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా....ఆ..ఆ..ఆ

https://www.youtube.com/watch?v=Ci1nRUkLd9o
Andhenaa Ee Chethula Song - Pooja Phalam Movie, Nageshwara Rao, Savithri, Jamuna, S Rajeswara Rao
Watch Andhenaa Ee Chethula Song From Pooja Phalam Movie, starring Akkineni Nageswara Rao, Savitri, J...


చెంగు చెంగునా గంతులు వేయండి...ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా...నోరులేని తువ్వాయిల్లారా

చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
రచన: కోసరాజు
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

చెంగు చెంగునా...
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా....
చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం: 1

రంగురంగుల మోపురాలతో.. రంకెలు వేసే రోజెపుడో
చెకచెకమంటూ అంగలువేసీ.. నేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి.. గోగాకింతా పెట్టే దెపుడో
ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓ.. ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
కూలిపోయినా సంసారానికి.. గోగాకింతా పెట్టే దెపుడో
ఆశలన్ని మీమీద బెట్టుకొని.. తిరిగే మా వెత లణగే దెపుడో

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం : 2

పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని గూర్చుని అలగరుగా..
పట్టుపరుపులను వేయించండని..పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న..మీరే మేలనిపిస్తారూ

చెంగు చెంగునా గంతులు వేయండి

చరణం : 3

పగలనకుండా రేయినకుండా..పరోపకారం చేస్తారూ
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం జూపిస్తారూ
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే..మానవజాతికి బ్రతుకే లేదు

చెంగు చెంగునా
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా గంతులు వేయండి

https://www.youtube.com/watch?v=KA5fCpeAuvk
Chengu Chenguna Gantulu Veyandi - Nammina Bantu
నమ్మిన బంటు మాయాబజార్ వచ్చిన రెండేళ్లకి... అంటే 1959 లో వచ్చిన మంచి సినిమా. ఈ సినిమా నెగిటివ్సే పోయా...
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...

చిత్రం : బందిపోటు దొంగలు (1968)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా...
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం 1:

ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..ఏ..ఏ..
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే..

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం 2:

వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము..
వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు.. కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే..

విన్నానులే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా..
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ..
విన్నానులే ప్రియా...

చరణం 3:

చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
ఆ..ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..
చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే... పరిణయమౌనులే...

విన్నానులే ప్రియా... కనుగొన్నానులే ప్రియా...
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ...ఏ...
విన్నానులే ప్రియా... ఆ...

https://www.youtube.com/watch?v=Ma9cY-qxzzc
Bandipotu Dongalu | Vinnanule Priya song
Listen to the romantic melody song,"Vinnanule Priya" sung by Ghantasala and P Susheela from the hit ...

Like
Comment
Share


ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ...ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ..

చిత్రం: జగదేకవీరుని కథ (1961)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ
ప్రేమగానము సోకగానే భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది

చరణం 1:

ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ.. ఆ .. ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ
మనసు నీవశమైనది...

ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ

చరణం 2:

కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ.. ఆ .. ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ
చాల కలవరమైనది...
ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ
https://www.youtube.com/watch?v=V1n4DYp7-YU
Ayinademo Ayinadi Song - Jagadeka Veeruni Katha Movie Songs - NTR - B Saroja Devi - Jayanthi
Watch Ayinademo Ayinadi Song From Jagadeka Veeruni Katha Movie, Starring N.T. Rama Rao, B. Saroja De...


ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది..ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

చిత్రం : అగ్గి పిడుగు (1964)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, జానకి

పల్లవి:

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

చరణం 1:

కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూరినవీ

ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

చరణం 2:

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు

ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు..

https://www.youtube.com/watch?v=LZLtUPSfbrA
Aggi Pidugu Songs - Yemo Yemo - N T R, Krishna Kumari
Aggi Pidugu Songs - Yemo Yemo Watch more movies @ http://www.youtube.com/volgavideo http://www.youtu...


కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...

చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

కలల అలలపై తేలెను... మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

చరణం 1:

జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని.. చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..
తడిసి తడియని కొంగున... ఒడలు దాచుకున్నందుకు..

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
విరిసీ విరియని పరువము... మరులు గొలుపుతున్నందుకు..
కలల అలల పై..

చరణం 2:

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని... జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..
అగుపించని ఆనందము... బిగికౌగిట కలదన్నది..

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై...
ఎగసి పోదునో చెలియా... నీవే ఇక నేనై...
కలల అలల పై..

https://www.youtube.com/watch?v=yGBYvp8BDhA
Kalala Alalapai Telenu Manasu Mallepoovai Song From Gulebakavali Katha Movie
Watch Kalala Alalapai Telenu Manasu Mallepoovai HD Video Song from Gulebakavali Katha Movie, Singer ...


పదపదవే వయ్యారి గాలిపటమా...పైన పక్షిలాగా ఎగిరిపోయి...పక్కచూపు చూసుకుంటూ

చిత్రం: కులదైవం (1960)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (జూ)
నేపధ్య గానం: ఘంటసాల, జమునారాణి

పల్లవి:

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటూ
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 1:

ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా

ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
నీ ప్రియుడున్న చోటుకై పోదువా
నీ తళుకంతా నీ కులుకంతా
అది ఎందుకో తెలుసును అంతా

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 2:

నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక...

ఆ... నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
కొని తెచ్చావేమో అంతేగాక..
రాజులెందరూడినా మోజులెంత మారినా
తెగిపోక నిలిచె నీ తోక

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

చరణం 3:

అహ..హ..అహ..హా..అహ..హా...
అహ..హ..అహ..హా
నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
మింట చుక్కల్తో నవ్వుకుందువేమో ...ఓ...

వగలాడివిలే జగదంతవులే
దిగిరాకుండా ఎటులుందువులే

పదపదవే వయ్యారి గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగా ఎగిరిపోయి...
పక్కచూపు చూసుకుంటూ...
తిరిగెదవే గాలిపటమా
పదపదవే వయ్యారి గాలిపటమా

https://www.youtube.com/watch?v=8KEifMUmh7U
Padha Padhave Vayyari
Provided to YouTube by Sa Re Ga Ma Padha Padhave Vayyari · Jamuna Rani · Ghantasala Kuladaivam Tlg ℗...


అలిగిన వేళనె చూడాలి.. గోకులకృష్ణుని అందాలు

చిత్రం: గుండమ్మ కథ (1962)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

అలిగిన వేళనె చూడాలి.. గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి..
రుసరుసలాడే చూపుల లోనే...
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 1:

అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ...
అల్లరిదేమని అడిగినందుకే...
అలిగిన వేళనె చూడాలి.. గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

చరణం 2:

మోహన మురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా
మోహన మురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద..
దృష్టి తగులునని జడిసి యశోద.. తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి..
రుసరుసలాడే చూపుల లోనే... ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
https://www.youtube.com/watch?v=VuJE2v02Cm8
Gundamma Katha | Aligina Velane Choodali Video Song | NTR, ANR, Savitri, Jamuna
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...



శ్రీ మదనమోహనాష్టకం

జయ శఙ్ఖగదాధర నీలకలేవర పీతవటాంబర దేహిపదం
జయ చన్దనచర్చిత కుణ్ణలమణ్ణిత కౌస్తుభశోభిత దేహిపదం //1//

జయ పఞ్కజలోచన మారవిమోహన పాపవిఖణ్ణన దేహి పదం
జయ వేణునినాదక రాసవిహారక పఙ్కిమ సున్దర దేహిపదం //2//

జయ ధీరధురంధర అద్భుతసున్దర దైవతసేవిత దేహిపదం
జయ విశ్వవిమోహన మానసమోహన సంస్థితకారణ దేహిపదం //3//

జయ భక్తజనాశ్రయ నిత్యసుఖాలయ అంతిమబాన్ధవ దేహిపదం
జయ దుర్దనశాసన కేలిపరాయణ కాళీయమర్దన దేహి పదం //4//

జయ నిత్యనిరామయ దీనదయామయ చిన్మయ మాధవ దేహిపదం
జయ పామరపావన ధర్మపరాయణ దానవసూదన దేహిపదం //5//

జయ వేదవిదాంవర గోపవధూప్రియ వృన్దావనధన దేహిపదం
జయ సత్య సనాతన దుర్గతిభఞ్జన సజ్జనరఞ్జన దేహిపదం //6//

జయ సేవకవత్సల కరుణాసాగర వాఞ్ఛితపూరక దేహిపదం
జయ పూతధరాతల దేవపరాత్పర సత్వగుణాకర దేహిపదం //7//

జయ గోకులభూషణ కంసనిషూదన సాత్వత జీవన దేహిపదం
జయ యోగపరాయణ సంసృతివరణ బ్రహ్మనిరఞ్జన దేహిపదం //8//

||ఇతి శ్రీ మదనమోహనాష్టకం సమ్పూర్ణం||
ఇదొకసారి వినాల్సిందే..మళ్ళీ వింటారు.
శ్రీ మదనమోహనాష్టకం

జయ శఙ్ఖగదాధర నీలకలేవర పీతవటాంబర దేహిపదం

No comments:

Post a Comment