Monday 28 December 2015

08.త్యాగరాజయోగవైభవం, 09.బంగారు పాపాయి ,10. తాళ్ళపాక అన్నమాచార్య శృంగారసంకీర్తన 11. తుమ్మెద పదము


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రా0
సర్వేజనాసుఖినోభావంతు










ఆనందభైరవి - రూపక తాళము
ముత్తుస్వామి దీక్షితుల కీర్తన

పల్లవి:
త్యాగరాజయోగవైభవం
సదాశివం సదాశ్రయామి

అనుపల్లవి:
త్యాగరాజయోగవైభవం
అగరాజయోగవైభవం
రాజయోగవైభవం
యోగవైభవం
వైభవం
భవం
వం

చరణం:
నాగరాజవినుతపదం
నాదబిందుకళస్పదం
యోగిరాజవిదితపదం
యుగపద్భోగమోక్షప్రదం
యోగరూఢనామరూప విశ్వసృష్ట్యాదికరణం
యుగపరివృత్యబ్దమాస దినఘటికాద్యావరణం
శ్రీగురుగుహగురుం సచ్చిదానందభైరవీశం శివశక్త్యాది
సకలతత్వస్వరూప ప్రకాశం
శం ప్రకాశం స్వరూప ప్రకాశం
తత్వస్వరూప ప్రకాశం
సకలతత్వస్వరూప ప్రకాశం
శివశక్త్యాది సకలతత్వస్వరూప ప్రకాశం


బంగారు పాపాయి బహుమతులు పొందాలి.!
.
ఈ లలితగీతాన్ని రచించినవారు మంచాళ జగన్నాధరావు.
దీనికి సాలూరు రాజేశ్వరరావు స్వరరచన చేశారు. (రాగం: శుద్ధధన్యాసి తాళం: ఖండచాపు).
.
1945 లో రావు బాలసరస్వతీ దేవిగారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా జగన్నాధరావుగారు ఈ పాటా రచించి ఇచ్చారు.
ఆ తర్వత రావు బాలసరస్వతీ దేవి గానంచేయగా గ్రామఫోన్ రికార్దు విడుదల చేశారు. ఆ తరం వారిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాట.
.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు ||
పలు సీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి! ||
మా పాప పలికితే మధువులే కురియాలి!
పాపాయి పాడితే పాములే ఆడాలి!
ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప?
ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి,
పాపాయి చదవాలి మామంచి చదువు
పాపాయి చదవాలి మామంచి చదువు||
తెనుగుదేశము నాది, తెనుగు పాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి,
మా నోములపుడు మాబాగా ఫలియించాలి!||
https://www.youtube.com/watch?v=ZtMU9IfQjmE



https://www.youtube.com/watch?v=eKOg65R8Zrc

లలిత సంగీతం 4_పి శాంతకుమారి
ముజ్జగాలు మోయించగ మురళిని మ్రోయించరా కృష్ణా
 








1. కమలాంబికే ఆశ్రితకల్పలతికే చండికే
రాగం: తోడి, తాళం: రూపకం
ముత్తుస్వామి దీక్షితార్ కమలాంబ నవావరణ కృతి (ధ్యాన కృతి)

పల్లవి

కమలాంబికే ఆశ్రితకల్పలతికే చండికే
కమనీయారుణాంశుకే కరవిధృత శుకే మామవ

అనుపల్లవి

కమలాసనాది పూజిత కమలపతే బహువరదే
కమలాలయ తీర్థవైభవే శివే కరుణార్ణవే

చరణం

సకల లోకనాయికే సంగీతరసికే
సుకవిత్వ ప్రదాయికే సుందరి గతమాయికే
వికళేబరముక్తిదాననిపుణే అఘహరణే
వియదాది భూతకిరణే వినోదచరణే అరుణే
సకళేగురుగుహకరణే సదాశివాంతఃకరణే
అకచటతపాదివర్ణే అఖండైకరస పూర్ణే


తుమ్మెద పదము
శ్రీరాగం - ఏకతాళం

పల్లవి
తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక
నొల్లవుగా మమ్మునో తుమ్మెదా

చరణములు
1. తోరంపు రచనల తుమ్మెదా కడుఁ
దూరేవు గొందులే తుమ్మెదా

2. దూరిన నెఱుఁగవు తుమ్మెదా మమ్ము
నోరగఁ జూడకువోతుమ్మెదా

3. తొలుప్రాయపు మిండ తుమ్మెదా కడుఁ
దొలిచేవు చేఁగలే తుమ్మెదా

4. తొలుకరి మెఱుఁగవే తుమ్మెదా యింక
నులికేవు మముఁగని తుమ్మెదా

5. దొరవు వేంకటగిరి తుమ్మెదా మా
తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకె నీ చనవులు తుమ్మెదా యింక
నొరు లెఱింగిరి గదవో వోతుమ్మెదా

తాళ్ళపాక అన్నమాచార్య శృంగారసంకీర్తన

1 comment: