Wednesday 2 December 2015

1.మూడుముళ్ళు (1983),2.నాలుగు స్తంభాలాట (1982),3.రెండు జెళ్ళ సీత (1983) 4.మాపల్లెలో గోపాలుడు 5. దుర్గా దేవి స్తుతి 6. చండీరాణీ 7. డాక్టర్ చక్రవర్తి 8.వందేమాతరం (1985) 9. రాగదీపం (1982) 10.పదహారేళ్ళ వయసు (1978) 11. చిట్టి చెల్లెల్లు (1970)

ఓం శ్రీరాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
సర్వేజనాసుఖినోభవంతు

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో...మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

చిత్రం : మూడుముళ్ళు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

చరణం 1 :

లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా
లాలాలాల..లాలా...

అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా..
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో

అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా..
నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో

నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

చరణం 2 :

అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో..
ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో

అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో
విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో

నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి
మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...

https://www.youtube.com/watch?v=gvo4K1UVT2E
Nee Kosam Yavvanamantaa Moodu Mullu SP Balu, Susheela

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం...మగదొరలదీలోకం...

చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం: పి.సుశీల

పల్లవి :

దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం...
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం

చరణం : 1

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాలాట ఆడబ్రతుకు తెలుసుకో

చరణం : 2

వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే (2)
కన్నెగానే త ల్లిైవైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో

చరణం : 3

కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో (2)
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో

https://www.youtube.com/watch?v=8MeJ1ekqE8I
Nalugu Stambalata || Dorala Neeku Video Song || Naresh, Thulasi, Pradeep, Poornima
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై...

చిత్రం : రెండు జెళ్ళ సీత (1983)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

చరణం 1:

గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
గంగలాగ పొంగి వచ్చి.. యమునలాగ సంగమించి
కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం
కౌగిలిలో కాశీ క్షేత్రం.. శివశక్తుల తాండవ నృత్యం
నిలిచి.. వలపు పండించేది..
నిన్ను నన్ను బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

అనురాగానికి పరిమళమై.. ఆరాధనకి సుమగళమై..
వేదాశీస్సులు కురిపించేది..
వేయి ఉషస్సులు వెలిగించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

చరణం 2 :

ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్దుడి రూపం
ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం
ఒక ప్రేమ అమృత శిల్పం.. ఒక ప్రేమ బుద్ధుడి రూపం
ఒక ప్రేమ రామచరిత్రం.. ఒక ప్రేమ గాంధీ తత్వం

చితినైనా చిగురించేది.. మృతినైనా బ్రతికించేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
నేనున్నాని కోరేదీ..ఈ.. నీవే నేనని నీడయ్యేదీ..ఈ..
కమ్మగ చల్లగ కనిపించేది.. బ్రహ్మని సైతం కని పెంచేది.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..

మందారంలో ఘుమఘుమలై.. మకరందంలో మధురిమలై
మంత్రాక్షరమై దీవించేది.. మనమై మనదై జీవించేది
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..
ప్రేమ.. ప్రేమ ప్రేమ..

https://www.youtube.com/watch?v=TaGde6oNfO4
Rendu Jella Sita Songs - Mandaramlo - Naresh Purnima Pradeep
Movie: Rendu Jella Sita, Csat: Naresh, Purnima, Pradeep,Subhakar, Mahalakshmi, Pradeep, Allu Ramalin...
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ...నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని

చిత్రం: మాపల్లెలో గోపాలుడు
గానం: బాలు
సంగీతం: కె.వి. మహదేవన్

రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ

రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని
రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను
పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ

రాణీ రాణమ్మ రాణీ కన్నీళ్లు రానీయమ్మా
రాణీ రాణమ్మ రాణీ కన్నీళ్లు రానీయమ్మా
సహనం స్త్రీ కి కవచమని శాంతం అందుకు సాక్షమని
సహనం స్త్రీ కి కవచమని శాంతం అందుకు సాక్షమని
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ రాణీ కన్నీళ్లు రానీయమ్మా

గుండె రగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే
గుండె రగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని
ఏన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ
రాణి రాణమ్మ అనాటి నవ్వులు ఏవమ్మ

https://www.youtube.com/watch?v=B4sbK22ljws
Arjun 90's Super Hit Song Raani Ranemma Video Song || Mapallelo Gopaludu Movie
Watch Mapallelo Gopaludu Movie :: Raani Ranemma Video Song Staring : Arjun, Maruthirao Gollapudi, Po...

మానసిక ఒత్తిడినుంచి బయటపడాలంటే ఒకసారి ఈ స్తోత్రం వినండి..

దుర్గా దేవి స్తుతి

సర్వస్య బుద్ధి-రూపేణ జనస్య హృది సంస్థితె
స్వర్గాపవర్గదే దేవి నారయణి, నమోస్తుతే
కలకాష్టాదిరుపేణ పరిణామ-ప్రదాయిని
విస్వస్యొపరతౌ సక్త్యై నారాయణి నమో స్తుతే

సర్వ-మంగల-మాంగల్యె సివె సర్వార్థ-సాధికే
శరణ్యె త్ర్యంబకె గౌరి నారాయణి నమో స్తుతే
సృష్టి స్థితి-వినాసానాం శక్తి భూతే సనాతని
గుణాశ్రయె గుణమయె నారాయణి నమో స్తుతే

శరణాగత దీనార్త పరిత్రాణ-పరాయణే
సర్వస్వర్తి హరే దేవి నారాయణి నమో స్తుతే
హంసయుక్త విమానస్థె బ్రహ్మాండే రూప ధారిణి
కౌసంభహ్ క్సరికె దెవి నారాయణి నమో స్తుతే

త్రిశూల చంద్రాహి ధరే మహా వృషభవాహిని
మాహేశ్వరి స్వరూపేణ నారాయణి నమో స్తుతే
మయుర కుక్కుటా వృతె మహాశక్తి ధరే నగే
కౌమరి రూప సంస్థానె నారాయణి నమో స్తుతే

శంఖ చక్ర గదాసాంఘే గృహీత పరమాయుధే
ప్రసీద వైష్ణవి రూపే నారాయణి నమో స్తుతే
గృహితోగ్ర మహాచక్రే దన్ష్త్రొధర వసుంధరే
వరాహ రూపిణీ సివే నారాయణి నమో స్తుతే

నృసింహ రూపెణోగ్రేణ హఠ దైత్య కృతొద్యమె
త్రైలొక్యత్రాణ సహితే నారాయణి నమో స్తుతే
కిరీటిని మహవజ్రే సహస్ర నయనోజ్జ్వలె
వ్ర్త్ర-ప్రన-హరె చైంద్రి నరయని నమొ స్తుతే

శివ దూతి స్వరూపేణ హట దైత్య మహాబలే
ఘోర రూపె మహారవె నారాయణి నమో స్తుతే
దంష్ట్రాకరళవదనె శిరొమాలా విభూషనే
చాముండె ముండ మథనె నారాయణి నమో స్తుతే

లఖ్స్మి లజ్జె మహావిద్యె శ్రద్ధె పుష్టి స్వ్రధె ధ్రువె
మహారత్రి మహా విద్యే నారాయణి నమో స్తుతే
మేధే సరస్వతి వర్యె భూతి బాభ్రవి తామసి
నియతె త్వం ప్రసిదేసె నారయణి నమో స్తుతే
https://www.youtube.com/watch?v=4UlC7c7VUxA
Durga Devi Sthuti
www.youtube.com

This video is created by me as my salutations to goddess durga & as my Tribute to Sacred Chants ,to ...
ఛిత్రం: చండీరాణీ
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
రచన: సముద్రాల సీనియర్
గానం: భానుమతి/ఘంటసాల.

ఓ తారకా ఓ
ఓ జాబిలి ఓ
ఓ తారకా నవ్వులేలా ననుగనీ
అందాలు చిందెడి - చందమామ నీవనీ
ఓ జాబిలీ ఓ ఆ తారకా నవ్వునోయి నినుగనీ

వినువీధిలోని - తారాకుమారీ
కుమారీ దరి చేరనౌనా - ఈ చందమామా
చేరువే తారా రేరాజుకూ

ఓ తారకా నవ్వునోయీ నినుగని
మనోగాధ నీతో నివేదించలేనూ
నివేదించకున్నా జీవించలేనూ
నెరజాణవేలే - ఓ జాబిలీ

ఓ...ఆ తారకా నవ్వునోయీ నినూ గనీ
తొలీ చూపులోనీ సంకేతమేమో
చెలి నవ్వులోనీ - సంకేతమేమో
నీ నవ్వు వెన్నెలే - ఓ జాబిలీ
ఓ...ఆ తారకా నవ్వునోయీ నినూగని.
ఈ పాట వినండి.
ఛిత్రం: చండీరాణీ
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
రచన: సముద్రాల సీనియర్
...

చిత్రం: డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల,సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం: ఎస్.రాజేశ్వర్ రావు

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం

ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా …. 2
మమతలన్ని తమకు తామె.. మమతలన్ని తమకు తామె
అల్లుకొనెడి మాలిక . ఆఆ..ఆఆ..ఆఆఆ ||ఈ మౌనం||

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ అ...
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక ||ఈ మౌనం||

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక … 2
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే
అంత తీపి కలయిక.. ఆఆ..ఆఆ..ఆఆఆ ||ఈ మౌనం||
చిత్రం: డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల,సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం: ఎస్.రాజేశ్వర్ రావు

...

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా...

చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

చరణం 1 :

నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన

చరణం 2 :

వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ

https://www.youtube.com/watch?v=-v2_9awvB54
Aakasama Neevekkada - C Narayana Reddy Sahityam

కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు...

చిత్రం : రాగదీపం (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై...
నా కోసం విరిసిన కుసుమాలు

కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై...
నా సిగలో విరిసిన కుసుమాలు

చరణం 1:

ఎదలే..తుమ్మెదలై.. వినిపించే ఝంకారం
పెదవులు త్వరపడితే వలపుల శ్రీకారం

కనులే.. కౌగిలులై.. కలిసే సంసారం
పరువపు ఉరవడిలో.. మనసులు ముడిపడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు.. చెలికాయి జీవన దాహాలు

కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై...
నా సిగలో విరిసిన కుసుమాలు

చరణం 2:

కలలే..కలయికలై..చిగురించే శృంగారం
ప్రేమకు గుడి కడితే.. మన ఇల్లే ప్రాకారం

మనసే.. మందిరమై.. పలికే ఓంకారం
వలపుల తొలకరిలో.. తనువులు ఒకటౌతూ...
తొలిసారి పలికెను రాగాలు.. మనసార మధుర సరాగాలు

కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలు

https://www.youtube.com/watch?v=-XRxFmOFZhM
Raaga Deepam Songs - Kunkuma Poosina Aakaasamlo - ANR - Jayasudha - Lakshmi
Watch ANR Jayasudha Lakshmi's Raaga Deepam Telugu Movie Song With HD Quality Music : Chakravarthy Ly...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..

చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా.. లేత పచ్చ కోన సీమా ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..

చరణం 1:

శివగంగ తిరణాలలో.. నెలవంక తానాలు చేయాలా...
చిలకమ్మ పిడికిళ్ళతో.. గొరవంక గుడిగంట కొట్టాలా..
నువ్వు కంటి సైగ చెయ్యాలా... నే కొండ పిండి కొట్టాలా...
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా...

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..

చరణం 2:

గోదారి పరవళ్ళలో.. మా పైరు బంగారు పండాలా...
ఈ కుప్ప నూర్పిళ్ళతో.. మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా..
నీ మాట బాట కావాలా.. నా పాట ఊరు దాటాలా...
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ... అహహ అహహ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ... అహహ అహహ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... అహహ అహహ
లేత పచ్చ కోన సీమా ఎండల్లా... అహహహ అహహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

https://www.youtube.com/watch?v=vySqDXqH64k
Padaharella Vayasu Songs - Pantachelo - Sridevi - Chandra Mohan
Watch Chandra Mohan Sridevi's Padaharella Vayasu Telugu Movie Song With HD Quality Music - Chakravar...




No comments:

Post a Comment