Wednesday 16 December 2015

01.

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు


మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా...నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా...
చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా
నడిచా నేనే నీడలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఅ...చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా..
మూగైపోయా నేనిలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
ఆఆఆఅ...
నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా
గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

Watch Manasa Vacha Song From Godavari Movie, Starring Sumanth, Kamalinee Mukherjee, Neetu…
youtube.com
LikeComm
మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా...ఏడేడు జన్మల దాకా ఆ నడకా
చిత్రం : ముక్కు పుడక
సంగీతం : JV.రాఘవులు
సాహిత్యం : సి.నా.రే
గానం : P. సుశీల

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరి వుంటే బతుకంతా ఏడడుగుల నడకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా

చల్లని నా రాజు కళ్ళలో వున్నాడు
కన్నీళ్ళు రాకుండా కాపలా వున్నాడు...
కలికి మనసులో...ఎన్ని ఆశలో...
కలికి మనసులో...ఎన్ని ఆశలో...
అది కాచుకుంది ప్రతి నిముషం రెప్ప వాల్చకా....

మూడు ముళ్ళ సాక్ష్యం నీవాడు మరచి పోలేడూ
తన నీడ చూసుకుని తానె ఉలికి పడతాడు...
దాగదు పాపం...ఆగదు పుణ్యం...
దాగదు పాపం...ఆగదు పుణ్యం...
ఈ బ్రతుకిలాగే వుండదు నీ నోము పండకా

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా
ఆ సిరితోనే నడిచేవు చివరి ఘడియ దాకా
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా
ఆ నడకా ఏడేడు జన్మల దాకా


ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా...దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా

చిత్రం : జీవితం (1950)
సంగీతం : ఆర్.సుదర్శనం
సాహిత్యం : తోలేటి
గానం : ఎస్.వరలక్ష్మి

ఓఓఓఓఓ...ఒహొహొఓఓఓఒహొ..లాలాలాల...
ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా
మా పల్లెసీమా పల్లెసీమా

ఆనందమౌగా పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ
మా పల్లెసీమాఆఆ.. పల్లెసీమా

రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ
నాట్యాలు చేయు మా పల్లెసీమలో...ఓఓ...
రంగు బంగారు పైరులు పొంగారు పంటలూ
నాట్యాలు చేయు మా పల్లెసీమలో పల్లెసీమలో
మామంచి తీరు మా ఊరు
మామంచి తీరు మా ఊరు
తీయని నీరు కోనేరు
తీయని నీరు కోనేరు

ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లె సీమా
మా పల్లెసీమా పల్లెసీమా

దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమా..ఆఆ...
దేశా దేశాలు పూజించు పల్లెసీమ
ఆశలే లేని సర్కారి పల్లెసీమా ఆఆ...
మాతోడ కూడి మా తోవ చేరి
మాతోడ కూడి మా తోవ చేరి
మన దేశానికి సేవ చేయాలి
మన దేశానికి సేవ చేయాలి

ఆనందమౌగా ఆనందమౌగా
పల్లెసీమా మా పల్లెసీమా
దాన ధర్మాలకిల్లు మా పల్లెసీమ
మా పల్లెసీమా..ఆ.. పల్లెసీమా

http://n3.filoops.com/telugu/Jeevitham%20%281950%29/04%20-%20Anandamougaa.mp3

రాయప్రోలు సుబ్బారావు గారి కవితలు చదివితే తప్పక దేశ భక్తి ప్రతి ఒక్కరికీ అలవడుతుంది.

అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వ
విద్యాలయములు స్థాపించునాడు,
ఓరుగల్లున రాజ వీర లాంఛనముగ
బలు శస్త్ర శాలలు నిలుపునాడు,
విద్యానగర రాజవీధుల గవితకు
పెండ్లి పందిళ్ళు గప్పించునాడు;
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
దిగ్జయ స్థంభ మెత్తించునాడు

ఆంద్ర సంతతికే మహితాభిమాన
దివ్య దీక్షా సుఖ స్పూర్తి తీవరించ్
నా మహావేశ మర్థించి యాంధ్రులార
చల్లుడాంధ్ర లోకమున నక్షతలు నేడు

తన గీతి యరవ జాతిని పాటకులనుగా
దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి,
తన పోటులు విరోధి తండంబులకు సహిం
పనివిగా మెరసిన తెనుగు కత్తి,
తన యందములు ప్రాంత జనుల కభిరుచివా
సన నేర్ప నలరిన తెనుగు రేఖ,
తన వేణికలు వసుంధరను సస్యశ్యామ
లను చేయ జెలగిన తెలుగు భూమి

అస్మదార్ధ్ర మనోవీథి నావహింప
జ్ఞప్తి కెలయించుచున్నాడ ; చావలేదు
చావలేదు, ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర
హృదయములు చీల్చి చదువుడో సదయులార!

కృష్ణా తరంగ పంక్తిన్ ద్రొక్కి త్రుల్లింత
నాంధ్ర నౌకలు నాట్యమాడు నాడు
ఇంటింట దేశ సాహిత్య దీపములతో
నాదర తేజస్సు రాపాడునాడు
సుకుమార శిల్ప వస్తు ప్రపంచమునందు
నాంధ్ర నైపుణి పంతమాడు నాడు
సమర సేనా వ్యూహ జయ పతాకల క్రింద
నాదర పౌరుషము చెండాడునాడు ,
చూచి సంతోషమున తలలూచి, గర్వ
మాచి , ఆంద్ర పుత్రీపుత్రు లందగలరు
శాంతి, నందాక లేదు విశ్రాంతి మనకు
కంకణ విసర్జనల కిది కాలమగునే
అమరావతీ పట్టణమున బౌద్ధులు_టి.సూర్యకుమారి
లలిత సంగీతం44

భక్త రామదాసు..!
.
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర
.
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర
.
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
.
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర
.
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
.
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
.
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
.
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర
.
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
.
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
.
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
.
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
.
కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
.
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర
.
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్ర
.
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్ర
.
అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
.
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర
.
భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
.
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర...


ఉన్నమాట విప్పి చెప్పుకుంటా...నిన్ను వీడి నే ఉండలేనంటా...

చిత్రం : రుక్మిణి (1997)
సంగీతం : విద్యాసాగర్
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,సుజాత

పల్లవి :

ఉన్నమాట విప్పి చెప్పుకుంటా
నిన్ను వీడి నే ఉండలేనంటా
చిన్నమాట విన్నవించుకుంటా
నీ జంట లేని జన్మమెందుకంటా
ఇద్దరూ ఏకమై ముద్దులే లోకమై
వేయ్యేల్లిలా ఉండాలని ముత్తైదువై దీవించనీ....ప్రేమా....

చరణం :

ఈ వరద గోదారి వారధిగ మారి..
చుపిందే చిన్నారి నావలపు దారి
ఒట్టు వేసి చెపుతున్నా...
నువ్వే నా వన్నెపూల వనమాలి..
చూడగానే పోల్చుకున్నా
నువ్వే నా గుండె కోరుకున్న మజిలీ
అందుకే అందుకో అన్నదీ తీగమల్లి...

చరణం :

నా వయసుకీనాడే తొలి వేకువంటా..
నీచెలిమి చిరువేడే యద తాకెనంటా
దాగివున్న ప్రేమ కళలు
ఇలా నిన్ను చూడగానే మేలుకొంది
కౌగిలింత లోన వాలే
ముహూర్తం చెయ్యి చాచి పిలిచింది
గంగ లా పొంగుతూ సంగమించ రమ్మంది...

http://n3.filoops.com/telugu/Rukmini%20%281997%29/Vunnamata.mp3

n3.filoops.com

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..కదలి రావేలనే నా అన్నులమిన్న

చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా

రాధమ్మ మనసు.. రాగాలు తెలుసు
అది తీపి కోపాల వయసూ..
ఆ ఆ ఆ....
కన్నయ్య వయసూ.. గారాలు తెలుసు
అది మాయ మర్మాల మనసూ
అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
ఆ.. అల్లరి ముద్దు హద్దులు వద్దు
ఇద్దరమంటె ముద్దుకు ముద్దు
పదహారువేల సవతులు వద్దు
ఆ ఆ.. పదహారు వేల సంకెళ్లు వద్దు

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో ఉన్నా.. ఆఁ.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న

రేపల్లె వాడలో గోపెమ్మ నీడలో వెన్నా.. అహ.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
ఈ రాసలీల.. నీ ప్రేమ గోల.. ఎవరైనా చూసేరీ వేళా..
ఆ..ఆ..ఆ..
ఈ మేనులోన.. నా ప్రేమ వీణ.. సరిగమలే వింటానీ వేళా..
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు
వేసవి చూపు.. వెన్నెల కాపు..
ఆశలు రేపు.. బాసలు ఆపు కలహాలు పెంచే కౌగిలి ముద్దు
ఈ కలహాలు పెంచే కవ్వింత ముద్దు

రేపల్లె వాడలో.. గోపెమ్మ నీడలో.. వెన్నా.. దోచుకున్నా..
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా అల్లరి కన్నా

ఆ పొన్న నీడలో.. ఈ కన్నె వాడలో.. ఉన్నా.. వేచి ఉన్నా..
కదలి రావేలనే నా అన్నులమిన్న
కదలి రావేలనే నా అన్నులమిన్న
ఆహాహహాహ లాల్లలలలాల్ల
ఆహాహహాహ లాల్లలలలాల్ల

https://www.youtube.com/watch?v=VV73Va5o-8w
Sommokadidhi Sokokadidhi Telugu Movie Songs | Aa Ponna Needalo | Kamal Hassan | Rojaramani
Kamal Hassan's Sommokadidhi Sokokadidhi Telugu Movie Songs Cast: Kamal Haasan, Jaya Sudha, Rojaraman...
 

08.ఏలేలో ఏలేలో ఏడుగుర్రాలెక్కీ సూరీడొచ్చాడే ఏలేలో నన్నే లేలెమ్మంటూ సూదీ గుచ్చాడే..

చిత్రం : త్రిపుర (2015)
సంగీతం : కామ్రన్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : ప్రణవి ఆచార్య

ఏలేలో.. ఏలేలో.. ఏడుగుర్రాలెక్కీ సూరీడొచ్చాడే
ఏలేలో.. ఏలేలో.. నన్నే లేలెమ్మంటూ సూదీ గుచ్చాడే
ఐనా ఇనా ఏమంత తొందర చెరిపాడే నిద్దుర
ఐనా ఇనా వదిలేనా నన్ను నా కలా..
కంటిపాపై వెలుగు జోలాలవింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా

గువ్వగొంతై మోగుతుందీ సుప్రభాతాల రాగం
పూలతోటై ఘుమ్మందీ పరిమళాలా పరాగం
చూస్తూ చూస్తూ తిరుగుతుంది చుట్టూ కోలాహలం
ఐనా ఐనా ఏ సందడి తెలియదే నా మాయ మనసుకి
ఐనా ఐనా ఏమైనా నాకు దేనికీ

కంటిపాపై వెలుగు జోలాలివింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా

రాములోరి జేగంటా రారమ్మంటోంది త్వరగా
పిల్లగాలి పల్లకీతో ఎదురు చూస్తూ ఉన్నదిగా
నే కన్ను తెరిచి చూడకుంటే ఊరె తెల్లారదుగా
ఐనా ఐనా నా లోకం నాదిగా నేనుంటా నేనుగా
ఐనా ఐనా నా ఇష్టం నాకు పండుగా

కంటిపాపై వెలుగు జోలాలి వింటా
చంటిపాపై కలలా ఒళ్ళో బజ్జుంటా

http://dl.doregama.cc/2015/Tripura/01%20-%20Yelelo%20Yelelo%20%5Bwww.DoReGaMa.Co%5D.mp3

dl.doregama.cc

09. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో తీగసాగెనెందుకో
నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పూవు పూవున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

చెలి నురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

పసిడి అంచు పైట జార
పయనించే మేఘ బాల
అరుణ కాంతి సోకగానే పరవశించేనే
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో

నారాయణరెడ్డి గారి తెలుగుదనంలోని పరిమళం ఈ పాటలో ఎంత బాగా మన హృదయాలకు అలదుకుంటుందో!! అమాయకుడైన ఒక యువ జమీందారు హృదయంలో వలపుల తలపులు విరిసే వేళ కవి ఈ భావఝరిని కురిపించారు. నాయకుని హృదయాన్ని ఎంతో అందంగా అవిష్కరించారు. 1964లో విడుదలైన పూజాఫలం చిత్రంలోనిది ఈ సినారె గారి రచన. సాలూరి వారి సంగీతం ఈ కావ్యకన్యకు అందమైన కోక కాగా ఘంటసాల గారి గానం ప్రాణం పోసింది.

https://www.youtube.com/watch?v=SDyvNMxVTv4
Ninna Leni Andamedo Song - Pooja Phalam Movie, Nageshwara Rao, Savithri, Jamuna, S Rajeswara Rao
Watch Ninna Leni Andamedo Song From Pooja Phalam Movie, starring Akkineni Nageswara Rao, Savitri, Ja...

 11. సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈ శుభసందర్భంగా ఈ శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం వినండి..

సుబ్రహ్మణ్యాష్టకం

హే స్వామినాథ! కరుణాకర! దీనబంధో!

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో!

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 1

దేవాధిదేవసుత! దేవగణాధినాథ!

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద!

దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 2

నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్‌!

భాగ్యప్రదాన పరిపూరితభక్తకామ!

శ్రుత్యాగమప్రణవ వాచ్య నిజస్వరూప!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 3

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల!

చాపాది శస్త్రపరిమండిత దివ్య పాణే!

శ్రీ కుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 4

దేవాధిదేవ! రథమండలమధ్యమేద్య!

దేవేంద్ర పీఠ నగరాధృత చాపహస్త!

శూరం నిహత్య అసురకోటిభి రీడ్యమాన!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 5

హారాదిరత్న నవయుక్త కిరీటహార!

కేయూర కుండల లసత్కవచాభిరామ!

హే వీర! తారక జయామర బృందవంద్య!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 6

పంచాక్షరాది మను మంత్రిత గాఙ్గతోయైః|

పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రైః|

పట్టాభిషిక్త! హరియుక్త! వరాసనస్థా!

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 7

శ్రీకార్తికేయ! కరుణామృత పూర్ణదృష్ట్యా!

కామాదిరోగ కలుషీకృత దృష్టచిత్తమ్‌!

సిక్త్వా తు మా మవ కళానిధి కాంతికాన్త్యా

వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌| 8

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం - యే పఠన్తి ద్విజోత్తమాః!

తే సర్వే ముక్తి మాయా న్తి - సుబ్రహ్మణ్యప్రసాదతః.

సుబ్రహ్మణ్యష్టక మిదం - ప్రాత రుత్థాయ యః పఠేత్‌|

కోటిజనమకృతం పాపం - తత్‌క్షణా దేవ నశ్యతి| 9

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం సంపూర్ణమ్

https://www.youtube.com/watch?v=EwuTpwhP05E

Subramanya Ashtakam - Sacred Chants
This will surely sooth your soul...listen and then let me know




సహధర్మచారి    

అడుగులు తడబడుతూ ప్రక్కన చేరి, అడుగులో అడుగేసి , ఏడడుగులు నాతో వేసి..తాళి కోసమే తలవంచి
తన్మయత్వంతో తలంబ్రాలు పోసి, పూల దండలు వేసి, పాదాల గోళ్ళు  త్రొక్కి పరవసంతో తొణికిసలాడే వెలుగును తన సొంతం చేసుకున్నది.   
నా..తలను పదిమందిలో పైనుంచి.. ఏడేడు జన్మల భంధం అంటూ  ఈ జన్మనుండే చిటికన వేలు బట్టి..అర్ధాంగి వై అగ్ని చుట్టు ప్రమాణంచేసి , నలుగురి దీవెనలు అందుకొని, అరుంధతి నక్షత్రం చూసి, బిందెలో ఉంగరాన్ని తీసి నేనే గొప్ప అని గర్వంగా తెలియ పరిచి, పెద్దలకు  పాదాబి వందనములు చేసి, తోబుట్టువులను వదిలేసి తోటి స్నేహితులను వదిలేసి మంగలకతోరణాల తోరణాల కళ్యాణ మండపంలో తల్లి తండ్రుల హితవాక్యాలు విని
" చూడు తల్లి ఏలోటు రనీయ కుండా, మా శక్తికి మించిన సంభంధమని మెఉ తలచి నీ ఇష్ట పరకార్ముగా పెళ్లి చేసినాము, నువ్వున్నచోటికే అన్నీ వచ్చి వాలవు, మంచి చెడు అర్ధం చేసుకొని మనమే అవ్వున్నచోటుకె మనం వెళ్లితీరాలి,  గమ్యం ఎపుడూ నీదగ్గరికి రాదు, 
మనమే ధర్మం, సత్యం , న్యాయం గల గమ్యాన్ని చేరాలి. 


చూడు తల్లి విజయసాధనకు, నీకు మనోధర్యమే నీకు ఆధారము, నీవు నమ్ము కున్న దేవుడే నీకు రక్ష,  అడ్డ దారులు పోకుండా, ఆదారిన నడిచేవారిని వరించె శక్తిని పొంది  
అడ్డొచ్చే ముళ్ళయినా ,రాళ్ళయినా, కన్నీళ్ళయినా కడవరకు నిలబడవు
సంకల్పం బలంతో ముందుకు నడవాలి. 

 



ఓర్పుతో సహనం వహించి ఎవరు ఎమన్నా నిగ్రహించుకొని తగిన సమాధానములు చెప్పి నలుగురిలో పుట్టినింటి మెట్టినింటి పేరు తెచ్చి పెట్టాలి. పుడమితల్లి గర్భంనుండి జన్మించిన గడ్డి పరక సైతం, గాలివానలోనైనా సగర్వంగానే నిలబడుతుంది. కరకు పాదాలక్రింద నలిగిపోతానని పుష్పానికి తెల్సినా కడవరకూ  పరిమలాలును అందిస్తున్నే ఉంటుంది 

గుడ్డు నుంచి బయటపడ్డ పక్షి పిల్ల సైతం, లేత రెక్కలిప్పి సుడిగాలి కెదురు నిలుస్తుంది. 

యోజనాల దూరాన్నిఆలవోకగా దాటేస్తుంది. సంకల్పం,విశ్వాసం తనకు రెక్క లైనవేళ తానే విజేతనని ప్రకటిస్తుంది!!

సానుకూల దృక్పధం అలవరుచుకో, ప్రకృతి నేర్పే పాఠాలెన్నో నేర్చుకో, నిరాశ కు అవకాసము ఇవ్వక కోర్కలలో మంచి చెడు గమనించి మంచికే అవకాసము ఇచ్చి  తీరుస్తూ ముందుకు సాగాలి.   
 

చూడు తల్లి ఎన్ని ఓడు  దుడుకులు వచ్చిన మనోధైర్యం తో బ్రతకటమే బ్రతుకుఅర్ధం 
వెన్నెలధారల్లొ తడవాలనుకున్నావు, చీకటి రాత్రులు ఎన్ని ఉన్న వెలుగు నీవెంట  ఉంటుంది అదే నీకు దారి చూపకలదు 
 

అలా నా భార్య నాజన్మతో జతగలిపి ఈజన్మంత జత నిలిచి నందానికి అర్దాంగివై, నా చిరునవ్వు కు ప్రమిదవు నీవై.., చీకటిని తరిమే వెలుగువై ..కష్ట నష్టాలలో కన్నీటికి నేస్తానివై సుఖ దు:ఖాలలో సుధారాశిపై...., ఆకలికి అమ్మవై నడిజామున కోమలివై, నా కోపానికి ఓపిక నీదై..కష్టపెట్టినా ఇష్టమే నంటు నీ కంటా తడి వచ్చినా ఇంటిగుట్టు ఇల్లంటు..నన్నునన్నుగా ఇన్నేల్లు నన్నంటి వెన్నంటి, సాదక బాదకలో సరి జోడువై..
పుట్టినింటి మరచి మెట్టినింట తన సర్వస్వమని తలచి,  తన భర్తే తనను స్వర్గంలో ఉంచి సుఖపెడతావని భావించితివి, నీవు ఆనందం పొందినది  ఎంతో నాకు తెలియదుగాని..చివరిగా నీకు నేనేమిచ్చుకోను చెలి ఈ భాహుభందాల మద్య కౌగిలితప్ప ?

No comments:

Post a Comment