Friday 4 December 2015

general stories (birthdays) FOR THEMONTH OF DECEMBER

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - స్పెషల్ డేస్ 


సర్వేజనా సుఖినోభవంతు 
దీనిని టిక్ చేయండి మీరు చక్కగా వినవచ్చు

http://vocaroo.com/i/s0EhjksaT6eD



30 డిసెంబర్ (1943) అండమాన్‌లో తిరంగానెగురవేసిన నేతాజీ

భారత ప్రధాన భూభాగానికి సుమారు 700 కి మీ దూరం‌లో బంగాళాఖాతం మధ్యనగల అండమాన్, నికోబార్ ద్వీపాల సమూహం ఆగస్టు 15 (1947)కంటే పూర్వమే బ్రిటిష్ నుంది స్వేచ్చ పొంది జాతిపతాకం రెపరెపలాడుతూ ఎగిరిందనీ, భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి కీలకంగా నిలిచిందనే విషయం తగినంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రధాన ద్వీపాలైన అండమాని,నికోబార్‌లకు నేతాజీ సుభాష చంద్ర బోస్ షాహీద్, స్వరాజ్‌లు గా నామకరణం చేశాడనే విషయం కూడా చాలామందికి తెల్యదు.

రెండవ ప్రపంచ యుధ్ధం 1942లో ఉధృతంగా జరుగుతూంది. ఆక్సిస్ కూటమిలో భాగస్వామియైన జపాన్ ఆసియాలో యూరప్ వలసవాదుల ప్రాంతాలనన్నింటినీ దునిమేస్తూ అప్రతిహతంగా విజయపధం‌లో దూసుకుపోతున్నది. జపాన్ నౌకాదళాలు తూర్పు హిందూమహాసముద్రం‌లొని సింగాపూర్, బర్మా వంటి పలుప్రాంతాలను అదుపులోకి తీసుకున్నది. ఇక బ్రిటిష్ ఆధీనం‌లోని భారత భూభాగంపై దాడిచేయడమే తరువాయిగా మిగిలింది.

ఈ ఉద్విగ్న దశలో నేతాజీ తన ప్రఖ్యాత జర్మనీ- సింగపూర్ జలాంతర్గామి ప్రయాణాన్ని చేశాడు. సింగాపూర్‌లో అకుంఠిత దేశభక్తులతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పర్చడంతొపాటు ప్రవాస ‘ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని’ కూడా ప్రకటించాడు. భారతభూభాగంపై 1943లోనే జాతీయపతాకం ఎగురవేధ్ధామని అప్పుడే ప్రకటించాడు.

జపాన నౌకాదళం 23 మార్చ్ (1942)న అండమాన్ నికోబార్ ద్వీపాలను బ్రిటిష్ సైనికులనుండి ఎటువంటి ప్రతిఘటనలేకుండా స్వాధీనం చేసుకుంది. సెల్యూలర్ జైలులో ఖైదీలుగానున్న భారత సైనికులకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడానికి అవకాశమివ్వగా పలువురు చేరిపోయారు. రాజకీయ ఖైదీలు విడుదలయ్యారు. అక్కడి బ్రిటిష అధికారులు సైనికులను ఖైదీలుగా బర్మా పంపించారు.
ఈ ద్వీపసముదాయాన్ని జపాన్ తమాఅధీనం‌లోకి తీసుకోవడం రెండవ ప్రపంచ యుధ్ధం‌లో ప్రత్యేకించి ఆక్సిస్ శక్తులకు ఒక కీలక ఘట్టం. ప్రవాస భారత ప్రభుత్వాధికారులు నేతాజీ ఆక్సిస్ కూటమితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాలను తమ స్వాధీనం‌లోకి తెచ్చుకున్నారు. అండమాన్ నికోబార్ దీవులు ఆక్సిస్ కూటమి చేజిక్కించుకున్న మొదటి భారత భూభాగం. ఈప్రాంతాన్ని డిసెంబర్ 30 (1943) న సందర్శించిన నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్‌కు షాహీద్‌గానూ, నికోబార్‌కు స్వరాజ్ గానూ నామకరణం చేశారు. ఇండియ్యన్ నేషనల్ ఆర్మీ జనరల్ లోకనాధాన్ని గవర్నర్‌గా నియమించాడు. బ్రిటిష‌నుండి విముక్తమైన తొలి భూభాగంగా అండామాన్ నికోబార్ దీవులు చరిత్రకెక్కాయి.

దేశ ప్రజలకు తానిచ్చిన హామీ మ్మేరకు 1943 సం.లోనే జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు.

కానీ ఆగస్టు 18 1945 న నేతాజీ అనుమానాస్పద అదృశ్యం తర్వాత అక్టోబర్ (1945)లో బ్రిటిష్ తెరిగి ఆదీవులను అదుపులోకి తెచ్చుకున్నది. న్

దేశవిముక్తికోసం నేతాజీ కృషిని స్మరింఛుకొని ఈ సమాచారాన్ని మనమిత్రులతో పంచుకోవడం మనందరి కనీస బాధ్యత.

 28 డిసెంబర్ భారత జాతీయ వ్యవస్థాపనా దినోత్సవం ( 27 Dec Foundation of Indian National Congress)

బ్రిటిష పాలనకువ్యతిరేకంగ జాతిప్రజలకు ఒక వేదిక అవసరమని భావించిన సురెంద్రనాధ బెనర్జీ కలకత్తాలో సన్నహక ఏర్పాట్లుచేస్తున్న సమయం‌లో రిటైర్డ్ బ్రిటిష్ అధికారి అలన్ ఆక్టెవ్ హ్యుం బొంబాయిలోని గోకుల్‌దాస్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటుచేశాడు. భారతప్రజల్లో రెగులుతున్న వ్యతిరేకతను అదుపులోఉంచి ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య షాక్ అబ్జార్బర్ మాదిరిగా ఒక వ్యవస్థనేర్పాటుచేయాలనేది ఇంగ్లీషువారి ఆలోచన. దీనికి దేశం‌లోని అన్ని ప్రాంతాలనుండి 72 మంది ప్రతినిధులు హాజరైనారు. దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా, కాశీనాధ్ తెలంగ్, ఆనంద చార్లు, గోపాల్ గణెష్ ఆగర్కార్, సుభ్రమణ్య అయ్యర్ వంటి ప్రముఖులు హాజరుకాగా ఉమేశ్ చంద్ర బెనర్జీ అధ్యక్షతవహించాడు.

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో భారత జాతీయ కాంగ్రేసు ఆవిర్భావం ఒకమేలి మలుపు. కాంగ్రేస్ ఆవిర్భావానికి పూర్వం దేశం‌లోని పలు చోట్ల స్థానికంగానూ, ప్రాంతాలవారిగానూ పలు తిరుగుబాట్లు జరిగియాయి. కాంగ్రేస్‌పార్టీ ఆవిర్బావంతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యంపట్ల కొత్త ఆశలు, మరింత ప్రేరణ కలిగాయి. విద్యావంతులైన మధ్యతరగతివారు స్వేచ్చ, విప్లవం వంటి పాశ్చ్యాత్య భావాల స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యమంలో జతకలిశారు.

భారత జాతీయ కాంగ్రేస్ చరిత్రను ఆవిర్భావం‌నుండి స్వాతంత్ర్యసిథ్ధివరకు మూడుకాలాలుగా విభజిస్తారు. తొలిదశయైన రెండు దశాబ్దాల కాలం (1885-1905)లో ఎటువంటి స్పష్టత, గమ్యం, లక్ష్యం లేవు. కులీనులైన కొంతమంది విద్యావంతులు ఈ సంస్థకు నాయకత్వం వహించారు.

రెండవధశ (1905-1918) లో బహుముఖంగానూ, సమగ్రంగానూ భారతజనోధ్దారణ జరగాలనీ, స్వరాజ్యం, సొంత ప్రభుత్వం కావాలని భారతజాతీయ కాంగ్రేస్ దేశప్రజలకు పిలుపునిచ్చింది.

మూడవ దశ (1919-1947) ను “పూర్ణ స్వరాజ్” భావన పూర్తిగా ఆధిపత్యం వహించింది. మహాత్మాగాంధీ చైతన్యవంతమైన నాయకత్వం ‘అహింసావిధానాల’ తో బ్రిటిష ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టింది.

భారత జాతీయ కాంగ్రేస్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు:
దేశప్రజల్లో స్నేహభావాన్ని పెంపొందించడం
జాతి, కుల, మత, ప్రాంతాలకతీతంగా జాతెయ భావాన్ని ధృఢపర్చడం
ప్రజాసమస్యలను సేకరించి విజ్ణప్తులద్వారా ప్రభుత్వాలకు విన్నవించడం
ప్రజాభిప్రాయ సేకరణ
భారతీయుల్లో జాతీయ సమగ్రతా భావాన్ని రేకెత్తించడం, ప్రోదిచేయడం
తొలుత బ్రిటిష్‌పాలకులు భారత జాతీయ కాంగ్రేస్ పట్ల సుముఖంగానే ఉండేవారు. కొంతమంది బ్రిటిష్ అధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యేవారుకూడా. కాంగ్రేస్ జాతీయ భావాలకు వేదికవుతున్నదని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వైముఖ్యం‌నుండి శత్రువైఖరిని అవలంభించింది. కాంగ్రేస్‌ ఐకమత్యాన్ని దెబ్బతీయటంకోసం ముస్లిములను చేరదీస్తూ “విభజించి- పాలించు” విధానాన్ని అమలుచేసింది. వీరి కుతంత్రాలతో కాంగ్రేస్ సాధించాల్సిన స్థాయిలో శక్తివంతం కాలేకపోయింది.
గాంధీమహాత్ముడి రాకడ, తీవ్రవాద భావాలు, నేతాజీ ఎత్తుగడలవంటి పలు అంశాలతో జాతి స్వాతంత్రాన్ని సాధించింది. ఈ వ్యాసం కేవలం భారతజాతీయ కాంగ్రేస్ ఆవిర్భావ సమాచారానికి మాత్రమే పరిమితం. కాబట్టి ఇక్కడితోనే ముగింపు.
ఛాయాచిత్రాలు:
మొదటిది: సురేన్ద్రనాధ్ బెనర్జీ/ రెండవది: ఓఏ హ్యూం/ మూడవది: ఉమేష చంద్ర బెనర్జీ/ నాల్గవది: హాజరైన ప్రతినిధులు



22 డిసెంబర్ శారదామాత జయంతి (22 Dec Birth Anniversary of Sharada Matha)

శిష్యులచే మాతగా ఆరాధించబడే శారదాదేవి/ శారదామాత పూజ్య రామకృష్ణ పరమహంస గురుదేవుల ధర్మపత్ని. పశ్చిమ బెంగాల్‌లోని జర్యాంబంటి గ్రామం‌లో రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామల సుందరీదేవి దంపతులకు 1853 సం. జన్మించినది.
బాల్యం‌నుండే దైవభక్తి, భూతదయ మెండుగాగల శారదామాత తల్లికి కుటుంబపనులలోనూ, తండ్రీకి వ్యవసాయ పనుల్లోనూ తోడుగా ఉండేది. ఏ పాఠశాలకు వెళ్ళనప్పటికీ బెంగాలీలో అక్షరాస్యత సాధించింది. నాటి సాంప్రదాయాలప్రకారం ఆమెకు 6వఏటనే రామకృష్ణ గురుదేవులతో వివాహమైనప్పటికీ అతను భగవదాన్వేషణలో దక్షిణేశ్వర్ వెళ్లటంవల్ల ఆమె తలిదండ్రులతోనే ఉండిపోయింది.

కొద్దికాలా మాతను దక్షిణేశ్వరానికి తీసుకువెళ్ళిన రామకృష్ణగురుదేవులామెను ధర్మపత్నిగాకాకుండా విశ్వమాతగా భావించి శాస్త్రోక్తంగా కాళీమాతగాపూజించాడు. మఠం‌లొ చేరుతున్న శిశ్యులనామె తన సొంత బిడ్డలుగా ఆదరించింది. శైశవదశలోనున్న రామకృష్ణ మఠానికి ఆమె పెద్దదిక్కుగా నిలిచారు. ఆమెగురించి గాయత్రి స్పివాక్ ఇలా రాశారు “శారదామాత ఆశ్రమాన్ని చాకచక్యంగానూ, విజ్ఞతతోనూ నిర్వహించినప్పటికీ ఆమె తెరవెనుకనే ఉండేది. తాను పెద్దగా విద్యావంతురాలుకానప్పటికీ తూర్పు పశ్చిమ దేశాలకు చెందిన విద్యార్ధులందరూ ఒకేచోట విద్యనభ్యసించడంకోసం గంగానది ఒడ్డున పాఠశాలను ఏర్పరిచారు. ఆమె అందించిన సేవలకు సంస్మరణగా శ్రీ శారదామఠ్ మరియు శ్రీ రామకృష్ణ శారదా మిషన్‌ను స్థాపించి మహిళా సన్యాసినిలకు శిక్షణ గరుపుతున్నారు.

కనీసవసతుల లేమితో అతి చిన్నగానున్న ఆశ్రమం‌లో గురుదేవులను కలవడంకుడా గగనమయ్యేది. ఇక ఏకాంతమనే ప్రశ్నయేలేదు. వీటన్నింటినీ ఆమె మౌనంగా భరించి ఉన్నంతలో తృప్తితో శాంతి, సహనాలతో నానాటికీ పెరుగుతన్న శిశ్యబృమ్దానికి వసతులు కల్పిస్తూ, సేవలందిస్తూ ఉండేది.
గురుదేవులు 1886 సం. భగవంతునిలో లీనమైన పిదప మాత తన జన్మస్థలానికి చేరింది. అక్కడ కుటుంబ సభ్యుల నిర్లక్ష్యంతోపాటు కనీసావసరాలుకూడా కష్టమైన పరిస్థితుల్లో రామకృష్ణులవారి శిశ్యులామెను కలకత్త తీసుకువస్తారు. అక్కడామె ఆశ్రమం ప్రారంభించి భక్తులకు దీక్షనిస్తుంది. తనకు శిశ్యులుగా చేరినవారిని వివేకానందుడు శిక్షణకోసం మాతవద్దకు పంపెవారు. విశ్వమాతగా ఆమె కుల, మత, జాతి విచక్షణలేకుండా దీక్షనిస్తూ, దీవించేది. ఆమెకు తోడుగా గురుదేవుల శిశ్యులైన యోగానంద, అవసానదశలో స్వామి శారదానంద తోడుగానుండి సేవలందించారు. అనారోగ్యంతో క్షీణించినప్పటికీ శారదామాత వైద్యాన్ని తిరస్కరించింది. జూలై 6 1920 న కలకత్తలో తుదిశ్వాస వదిలారు.
ఆమె భర్తను అనుసరించడమనికాకుండా తానుకూడా భగవదాన్వేషణలో జీవితాన్ని కొనసాగించింది.
మాత సూక్తులు:

ధ్యానం‌లో మీ మనస్సును లగ్నంచేయండి, తొలినాళ్ళలో ఇబ్బందిగానున్నప్పటికీ తదుపరికాలాలలో ధ్యానాన్ని విస్మరించలేని స్థితిని చేరుకుంటారు. అంటే మీరు భగవంతుణ్ణి దర్శించే మార్గంపై చేరుకున్నారన్నమాట. భగవద్దర్శనం పొందడమే తరువాయి.

స్వచ్ఛతనూ మలినాన్ని విచక్షణతో గుర్తించగలిగేది మీ మెదడు మాత్రమే. మీలోని మలినాన్ని గుర్తించగలిగినప్పుడే మీరు ఇతరుల మలినం గురించి మాట్లాడె హక్కుంటుంది.
ఇతరుల తప్పులు వెదకటంద్వారా ప్రశాంతత పొందుతామనుకోవడం కేవలం భ్రమ. ముందుగా నీతప్పులను తెల్సుకొని వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇతరుల తప్పులను క్షమించడం ప్రారంభించు. ఈ చరాచర విశ్వమంతా నీదిగానే భావించు.

నీ గురువుపట్ల అచంచల విశ్వాసాన్ని ఆచరించినప్పుడే నీకీ జీవితమ్నుండి విముక్తి కల్గుతుంది.

జయంతి సందర్భంగా మాతకు సవినయ వందనాలు అర్పిద్దాం



బాపుగారి పుట్ట్టిన రోజు(15.12.15) సందర్భంగా -ఇంతకుముందు ఒక పత్రికలో ప్రచురించినది,మళ్ళీ మితృల కోసం మరోసారి -

బాపు గారిసినిమాల పై నా భావనల వ్యాసం by vasantasree.
బూరె బుగ్గల్ని సాగదీసి పసిపిల్లాడి నవ్వులా ముఖమంతా నవ్వే సత్తిరాజు లక్ష్మీ నారాయణ గారనబడే తెలుగు చిత్రకారుడైన బాపు. వారి గురించి నేనేదైనా రాయగలననీ రాస్తాననీ ఊహించలేదు గానీ- నా భావాలను ఇక్కడ పరుస్తున్నా.

తనవి వంకర గీతలని తనమీద తనే జోక్ వేసుకునే బాపు చేతిలో ఊపిరిపోసుకున్న అమ్మాయి-బాపు బొమ్మగా జగద్విదితమయ్యింది.తనకి కాబోయే భార్య బాపు బొమ్మల ఉండాలనే మార్క్ పొందింది.మనం వినే స్తోత్రాలలోని దేముళ్ళు ఇలా ఉంటారని చూపించిన బాపు గారి చిత్రాలు ఎప్పటికీ నిలిచి ఉండే కళాఖండాలు.ఒక్కో చిత్రానికీ ఒక్క్కో కవిత రాయొచ్చు. వారు తెలుగువారిగా జన్మించడం మనం చేసుకున్న సుకృతం.

ఒక ఆర్టిస్ట్ చేతిరాతని కంప్యూటర్ ఫాంట్ గా వాడడం అనేది ఒక్క బాపు గారిదే అరుదైన సన్మానం ,అవకాశం కూడా బాపుగారికే దక్కింది.
నేను బాగా చిన్నదాన్ని ముత్యాల ముగ్గు సినిమాని వైజాగ్ లో చూసాం , సినిమా ఏమీ అర్ధం కాలేదు కానీ కోతి మాత్రమే అట్రాక్షన్.పాటలు కంఠతా వచ్చేసాయి.
కాస్త పెద్ద అయాక సంపూర్ణ రామాయణం చూసా.శోభన్ బాబు రామునిగా బాగా నచ్చెసాడు. ఇంత హుందాగా ఉండాలన్నమాట అదీ పెద్దరికం అనిపించింది.ఇంక అప్పట్నించీ సినిమాలలో వెరైటీలూ,దర్శకత్వంలో దర్శకుల ప్రత్యెక శైలి గమనించడం మొదలెట్టా.ఈ అబ్సర్వేషన్ బాపుగారి నుండి మొదలయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

మా పెళ్లైన తర్వాత వచ్చింది పెళ్లి పుస్తకం, తర్వాత మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయాయి.
సుమారుగా . బాపుగారి శైలి చెప్పేంత గొప్పదాన్ని కాను కానీ ఒక సామాన్య గృహిణి దృష్టికోణం లో ఆలోచిస్తే- రామయణం స్పూర్తి అయన కధలు అని అందరికీ తెల్సినదే. ఎక్కడా స్త్రీ ఔన్నత్యాన్ని తగ్గించేలా ఉండవు స్త్రీ పాత్రలు. తెలుగుతనాన్ని,అందమైన గ్రామీణ వాతావరణాన్నీ ఎంచక్కా చూపించే కళాత్మకత బాపుగారిసొంతం.

సాక్షి-ఒక ప్రయోగం, గోదారి ఒడ్డున తీసిన కావ్యం,స్టూడియో లలో మగ్గే సినిమాని పల్లెల్లో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది.తన అన్ననుండి కదానాయకుణ్ని రక్షించడానికి పెళ్ళాడిన ధీర గా కనిపిస్తుంది నాయిక.
ప్రతీ నాయిక లోనూ నవరసాల పాళ్ళు కనిపించేలా ఉంటుంది కధ కూడా.

బుద్ధిమంతుడు- సాంఘిక ప్రయోజనం తో కూడిన భక్తి మంచిదని చెప్పిన సినిమా.
ముత్యాలముగ్గు-భార్యని అనుమానించిన భర్త,వారు పిలిస్తే తప్ప రానని మామగారితో చెప్తూ-మీతో నాకు ముగ్గురు పిల్లలనుకుంటానన్న బాధ తో కూడిన ఆప్యాయత స్త్రీ లోని పూర్ణత్వాన్ని ప్రతిబింబించే విధానం బాపుస్వంతం.

గోరంత దీపంలో అత్తగారి దాష్టీకాన్ని భర్త ప్రేమ లో భరిస్తూ,ఇంటికొచ్చి భర్త స్నేహాన్ని ఆసరాగా తీసుకుని,అతి చనువు తో ప్రవర్తిస్తున్న విలన్ కి,అతని స్నేహితులకీ బుద్ది చెప్పే ధీమణి కధానాయిక పాత్ర. భార్య డిగ్రీ చేసిందనే విషయం తర్వాత తెలుసుకున్న భర్త ఆమె నిదానాన్ని,నమ్రతకి ముగ్దుడౌతాడు.

సీతాకల్యాణం - సున్నితమైన రమణీ లలామ సీత ఇంతందంగా ఉంటుందానిపించే పాత్ర.రామాయణాన్ని చెప్పే తీరు బాపు గారి శైలి ప్రత్యేకం.

మంత్రిగారి వియ్యంకుడు- ఇదో పొలిటికల్ డ్రామా తో కూడిన హాస్యాన్ని చక్కగా కలగలిపిన కధ,బాపు-రమణల గారి మార్క్ సంభాషణలు.

పెళ్లి పుస్తకం-కుటుంబం కోసం వేరే ఊళ్ళల్లో అయిన ఉద్యోగాలు కొన్నాళ్లపాటు చెయ్యాలని నిర్ణయించుకున్న నాయికా,నాయికలు,పెళ్లికానివారికి మాత్రమే ఉద్యోగాలనడంతో ఆమెకి పెళ్లైందనీ,హీరో కి పెళ్లి కాలేదని చెప్పి,ఉద్యోగాలలో జాయినవడం, తర్వాత అధికారులకి నిజం చెప్పడం కధ. అయితే పట్నవాసం గురించి చెప్తూ-అడవిలో ఉప్పు దొరకదు అక్కడ అమ్మాలి,సముద్రపొడ్డున చింతపండు అమ్మాలి .పట్నాలలో రెండూ కలిపి పచ్చడి చేసి అమ్మమని,పెట్టుబడిగా తన .....తీసి ఇచ్చిందనే భావోద్వేగం,బాపు గారి దర్సకత్వ ప్రతిభ కళ్ళను చెమరుస్తుంది.

బంగారు పిచిక-సినిమాని మళ్ళీ పెళ్లి కొడుకుగా తీసారు కలర్ సినిమాలోచ్చాక.పాత సినిమాలో హీరోయిన్ విజయ నిర్మల అయితే-కొత్త సినిమాలో నరేష్ హీరో.
బాపుగారి సినిమాలలో వనభోజనాల కాన్సెప్ట్ అందరికీ నచ్చిన అంశం.'మడిసన్నాక కూసంత కళా పోసనుండాలి'.'మంచి,చెడ్డ రాశులు పోసినట్టు వేర్వేరుగా ఉండవు.అవసరంరాక చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోవచ్చు.అవకాశం వచ్చి-మంచి వాడు కూడా చెడ్డ వాడిగా తయారవచ్చు'.ఇలాటి జీవిత సత్యాలను క్లుప్తంగా చెప్పే విధానం బాపు సినిమాలలో చూస్తాం.

ఒక పెళ్లి పుస్తకం,రాధాగోపాళం ఉద్యోగిని అయిన మహిళ ఎంత చక్కగా తన పనినీ,ఇంటినీ సంభాళించు కుంటుందో,పతిని అతని తొందరపాటునీ సహనం తో తెలియజేసి సరిదిద్దుతుందో చక్కగా పాత్ర పరంగా చెప్పారు.

రాధాకళ్యాణం సినిమాలో నాయిక పాత్ర పెళ్లినా ప్రేమిస్తున్న పేద గాయకుని ద్వారా పెళ్లి గొప్పదనం,భారతీయ సంస్కృ తి సంప్రదాయం చెప్పిన తీరు అద్భుతం.
అందాలరాముడు సినిమా-డబ్బు పిచ్చి,హోదాగల పెద్దమనిషికి ఆకలి,అమ్మప్రేమ తెలియజెప్పిన లాంచీ ప్రయాణం ఒక ప్రయోగమే.గోదావరి అందాలనూ,వెన్నెల్లో గదారి అందాలను చూపిస్తూ అద్భుతమైన పాటల ద్రుశ్యకావ్యం అంటే అతిశయోక్తి కాదు.

రాంబంటు డబ్బుకంటే-మంచితనం,ఔన్నత్యం చెప్తూ తెలుగుతనంయో బాటూ ఆయుర్వేదం,మూలిక వైద్యం గురించి కూడాచెప్పే విధానం చక్కని హాస్య ధోరణి లో కొనసాగుతుంది.

వంశ వృక్షంలో భారతీయ ధర్మాన్ని చక్కగా విశ్లేషించే సంభాషణ,దర్సకత్వం ఆలోచింపజేస్తుంది.
ఆఖరి సినిమాగా తీసిన శ్రీరామరాజ్యం కూడా అతని దర్సకత్వ ప్రతిభ,సీతపాత్ర ఔన్నత్యం ప్రతిబింబించింది.

సినిమాని మధ్యలోనుంచి చూసినా డైలాగ్ డెలివరీని బట్టి పోల్చెంత విధంగా ఉంటాయి సంభాషణా విధానం.బాపు మార్క్ భంగిమలు-కధానాయిక కూర్చునే విధానం ఫోటో పోజ్ లా చిత్తరువై కూర్చోవడం,అందమైన శిల్పంలా వాలుజడ తో.ఇలాటి కొన్ని ప్రత్యెక శైలి బాపు స్వంతం.

రాధాగోపాళం లో వాలుజడ పాట ప్రేక్షకుల మనసు దోచింది.
బాపు గారు హిందీలో కూడా సినిమాలు తీసారు.ఆ వివరాలు ఇంకోసారి చూద్దాం.
బాపుగారి గురించి తలుచుకుంటుంటే ఇంకో పేరు గుర్తురాక మానదు. వారె శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారు.బంగారానికి తావి అబ్బినట్టి వారి స్నేహం.ఈ తరానికి తెలిసిన చెలిమి బంధo

ఎన్ని చెప్పుకున్నా తనివితీరని తీరదు. కానీ బాపు అంటే వెంటనే గుర్తొచ్చే రమణ గారు ముందే వెళ్ళిపోవడం ఆయనకి తీరని బాదే కాదు-,శ్రీ రామరాజ్యం లో లోటు బాగా అనిపించిందట.

చిన్నప్పటి సహపాఠీ కృష్ణ సుదాములు,కానీ చివరిదాకా కలిసున్న ఈ మిత్రుల మైత్రీ బంధం-మనందరికీ ఆదర్శం.స్నేహం అంటే ఒకర్నొకరు భరించడమే అని నవ్వుతూ చెప్పిన బాపు గారు.అన్ని సంవత్సరాల అనుబంధం ఎలా గడిపారో కూడా చెప్తే బాగుండేది.

రమణ గారు ముందెళ్ళి అన్నీ చూసి స్వర్గంలో ఎదురుచూస్తున్నారని మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు.బాపు గారు,అయన గీసిన బొమ్మల్లో,తీసిన సినిమాలలో వాళ్లిదర్నీ తలుచుకోమని మనల్ని వదిలి,వెళ్ళిపోయారు వారు.

తెలుగు సినిమా ప్రేక్షకులున్నంత కాలం బాపు రమణలు అజరామరం.మన మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వీరి స్నేహద్వయానికి శ్రద్ధాంజలి. _/\_
-వసంతశ్రీ .

 8 డిసెంబర్ బోధి దివస్ (8 Dec Bodhi Divas)

బౌధ్దులకు గౌతముడు జ్ఞానోదయం పొందిన రోజు అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజును వెసాక్/బోధి దినోత్సవంగా జ్జరుపుకుంటారు. బుధ్ధ గయాలోని బోధివృక్షం క్రింద గౌతముడు క్రీస్తు పూర్వం 596లో జ్ఞానోదయం పొందాడని వారు విశ్వసిస్తారు. బౌధ్ధులు ఎక్కడ నివసించినప్పటికీ అక్కడి సంస్కృతిని స్వీకరిస్తారు. తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే సమకాలీన, పరిసర సాంప్రదాయాలను గౌరవించడం బౌధ్ధమ్లోని ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగానున్న పలు బౌధ్ధ తెగలు ప్రధానంగా రెండు సాంప్రదాయాలను ఆచరిస్తాయి. 1) తెరవాద 2) జెన్.

తెరవాద బౌధ్ధసంప్రదాయాల ప్రకారం బుధ్ధునికి వైశాఖమాసం‌ పౌర్ణమి రోజున జ్ఞానోదయయ్యింది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ రోజును “అంతర్జాతీయ వెసాక్ దినోత్సవంగా” ప్రకటించింది.
జెన్ సాంప్రదాయాన్ననుసరించి బుధ్దుని జ్ఞానోదయం డిసెంబర్ 8వ తేదీన జరుగింది. ప్రపంచం ఏనాటికైనా బౌధ్ధ ధర్మాన్ని అనుసరింఛాల్సిందే కాబట్టి మనం ఈ రెండు ఉత్సవాలను నిర్వహించుకోవల్సిందే, తెల్సుకోవాల్సిందే.

గౌతముడు చిన్నప్పటినుండి కొత్త విషయాలు తెల్సుకోవాలనే ఉత్సుకత కలవాడు. ప్రపంఛాన్ని సందర్శించిన గౌతముడు పేదరికానికీ, వృధ్ధాప్యాన్నీ, అనారోగ్యం వల్ల కలిగే కష్టాలను చూసి చలించిపోయాడు. ప్రపంచబాధలకు పరిష్కారం తెలుసుకోవాలనే దిశగా తన 29వ ఏట నేపాల్‌లోని తన ఇంటినీ, రాజరిక సౌఖ్యాలనూ వదిలి సత్యాన్వేషణకై బయటికి వస్తాడు. సత్యాన్వేషణలో గౌతముడు ఆరుసంవత్సరాలకాలం ఆరుగురు గురువుల వద్ద శిష్యరికం చేసినప్పటికీ ఆయనకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఉపవాసదీక్ష స్వీకరించిన గౌతముడు వారంరోజులపాటు రావిచెట్టు కింద (బొధీ వృక్షం) ఏకాగ్రతతో ధ్యానం చేయగా జ్ఞానోదయమ్మైంది. అప్పడినుంది గౌతముణ్ణి బుధ్దుడుగా పిలిచారు. క్రైస్తవులకు క్రిస్మస్, ఎక్స్ మాస్ చెట్టు ఎంత ప్రాముఖ్యమైనవో బౌధ్దులకు వెసాక్/ బోధి దినోత్సవం, రావిచెట్టు అంతే ప్రాముఖ్యమైనవి.

బౌధ్ధానుయాయులు తమ ఇంటిలో తప్పకుండా రావిచెట్టును పెంచుకుంటారు. క్రమం తప్పకుందా పూజలు చెస్తారు. వెసాక్/ బోధి దినోత్సవం రోజున రాత్రీపగలూ దీపాలు వెలిగిస్తారు. రంగు రంగు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మూడు మెరిసే వస్తువులు లేదా నగలతో రావిచెట్టును అలంకరిస్తారు. ఈమూడు వస్తువులు బుధ్ధుడు ప్రవచించిన “ బుధ్ధి, ధర్మం, సంఘం” బోధి దినోత్సవం రోజున బియ్యం పాలు కలిపి వండిన అన్నాన్ని తింటారు. బౌధ్ధ ఇతిహాసాలననుసరించి గౌతముడు ధ్యానం విరమించిన తర్వాత సుజాత అనే మహీళ పాలతో వండిన అన్నన్ని తినిపించిందని చెబుతారు. ఉపవాస దీక్షలో కోల్పోయిన శక్తిని ఈ ఆహారం తిరిగి సమకూరుస్తుందని భావిస్తారు

బోధి కాకతాళీయమా? కారణభూతమా?

సంస్కృతం‌లో ‘అశ్వగంధి’ గానూ, తెలుగులో ‘రావిచెట్టు’ గానూ, ఆంగ్లం‌లొ పీపల్ ట్రీ గానూ పిలువబడే ఈ చెట్టు శాస్త్రీయనామం ‘ఫికస్ రెలిగియోసా’. ఇది ప్రాధమికంగా మర్రి వృక్షం జాతికి చెందినది. అత్యంత కొద్ది కాలాన్ని మినహాయిస్తే రావిచెట్టు అత్యధిక కాలం సతత హరిత వృక్షమే. మామూలుగా అన్ని చెట్లు పగలు ఆమ్లజనినీ, రాత్రి బొగ్గుపులుసు వాయువును విడుదల చేస్తే రావిచెట్టు తనలో ఇమిడిన శ్వాస వ్యవస్థ ద్వారా అన్నిపూటలూ ఆమ్లజనినే విడుదల చేస్తాయి. పలు శరీర రుగ్మతలకు రావిచెట్టు బెరడు, వేళ్ళు, అకులు, ఫలాలు, లేత కొమ్మలు దివ్యావౌషధమని భారతదేశపు ఆది వైద్య, శస్త్ర చికిత్సాచార్యులు చరకుడు, శుశ్రుతుడు పేర్కొన్నరు. నిరంతరం సమ శీతొగ్రతను, అమ్లజనినీ అందజేస్తుంది కాబట్టి వన్యప్రాణులకూ, క్రీమికీటకాలకూ, పక్షులకూ రావిచెట్టు అత్యంత ప్రీతిపాత్రమైనది.

ఇన్నిన్ని ప్రత్యేకతలలున్నందువల్లనే ఆసియా సంస్కృతిలో రావిచెట్టు అగ్రభాఅగాన నిలిచింది. ప్రతీదేవాలయం‌లో రావిచెట్టును పెంచడం ఒక సెంటిమెంటుగా మారింది. ఇంతటి విశిష్టతలుండటంవల్లనే గౌతముడు అశ్వగంది/ రావిచెట్టును తన తపస్సుకోసం ఎంచుకున్నాడు.

“బుధ్ధమ్ శరణం గచ్ఛామి/ ధర్మం శరణం గచ్ఛామి/ సంఘం శరనం గచ్ఛామి” గౌతముడి ప్రవచనాలను త్రికరణ శుధ్ధిగా అచరిస్తూ, గౌతముడికి ప్రీతిపాత్రమైన రావిచెట్టును ప్రతీఇంటా పెంచుకుందాం.

7 డిసెంబర్ అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ( 7 Dec International Civil Aviation Day)

అంతర్జాతీయ పౌర విమానసంస్థ (ICAO) ఏర్పడిన అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పౌరవిమానయాన దినోత్సవాన్ని 1994లో వ్యవస్థాపించారు. కెనడా ప్రభుత్వం చొరవతో పాటు ICAO అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్య సమితి 1996లొ అధికారికంగా అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవంగా నిర్వహించాలని పిలుప్పునిచ్చింది.

సామాజిక ఆర్ధిక అభివృధ్ధిలో భాగంగా పౌరవిమానయాన ఆవశ్యకతనూ, ప్రాముఖ్యతనూ సభ్యదేశాలన్నీ తమ పౌరులకి తెల్యజేయదంతోపాటు అంతర్జాతీయ పౌర విమానసంస్థ (ICAO) పౌరవిమానయానానికి సంబంధించి ప్రయాణీకులకు రక్షణ, భద్రత, సౌకర్యాల పెంపు, విమానయాన సేవా సంస్థల సమర్ధతను, క్రమత్వాన్ని పెంచుకోవాలనీ సూచించింది.

అంతర్జాతీయ పౌర విమానసంస్థ (ICAO) 2014 నుండి ప్రతీ 5 సంవత్సరాలకొకసారి (2014/2019/2024/2029/etc.) ప్రస్తాపాన్ని (ధీం‌ ) ప్రకటించి దాన్ని పూర్తి స్థాయి అమలుకు కృషి చేస్తుంది. ఈ అర్ధశతాబ్ది కోసం “ (విమానయానం‌లో) ఏ ఒక్క దేశం కూడా వెనుకబడి ఉండకుండా కృషి చేద్దాం” అని ప్రకటించింది

విమాన ప్రయాణాలు చేసేవారికీ, చేయబోయే వారికీ అంతర్జాతీయ విమానయాన దినోత్సవ శుభాకంక్షలు

5 డినెంబర్ ఆర్ధిక, సామాజిక అభివృధ్ధి స్వచ్చంద సేవకుల అంతర్జాతీయ దినోత్సవం (5 Dec International Volunteer Day for Economic and Social Development)

సహస్రాబ్ది లక్ష్యసాధనలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే క్రమం-లొ స్థానిక, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కృషిచేస్తున్న స్వచ్ఛంద సేవకులకు అంతర్జాతీయ సమాజం ధన్యవాదాలు తెల్యజేసే సందర్భమే “ ఆర్ధిక, సామాజిక అభివృధ్ధి స్వచ్చంద సేవకుల అంతర్జాతీయ దినోత్సవం. ఈదినోత్సవాన్ని 1986 నుండి ఐక్య రాజ్య సమితి సూచనల మేరకు సభ్యదేశాలన్నీ డిసెంబర్ 5 వ తేదీననిర్వహిస్తున్నాయి.

స్వచ్చంద సేవా భావనను పెంపొందిస్తూ కార్యకతర్తలను ప్రోత్సహించడం, కొత్తగా స్వచ్ఛంద కార్యకర్తలను ఆహ్వనించడం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం‌తో పనిచేసే కార్యకర్తల మధ్య సమన్వయ సహకారాలను పెంపొందించడం ఈ దినోత్సవ ధ్యేయం. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ, అంతర్జాల, సామాజిక మాధ్యమాల ద్వారానూ సేవలందించే వారికి కూడా ధన్యవాదాలు తెల్యజేస్తూ ప్రోత్సహించడం కుడా ఈ దినోత్సవం‌లో అంతర్భాగం.
మరింత మెరుగైన సమాజాన్ని ఆశిస్తూ, శ్వాసిస్తున్న స్వచ్చంద సేవకుల పట్ల ప్రజాబాహుళ్యం‌లో అవగాహన, సానుభూతిని పెంచడం, వారికి సహకరించాల్సిన అవశ్యకతను తెల్యజేయడం కూడా ఈ దినోత్సవ నిర్వహణ ఈ దినోత్సవ ఉద్దేశ్యం.

అంతర్జాతీయ స్థాయిలో ఆన్ లైన్ ద్వారా ఓటింగ్ జరిపి స్వచ్ఛందసేవా సంస్థను ఎంపికచేసి బహుమతిని ప్రకటిస్తారు.

స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని ఎలా నిర్వహించుకోవాలి!
ర్యాలీలు, పరుగులు, పరేడ్‌లు నిర్వహించడం
స్వచ్ఛంద సేవాశ్రమానికి వెళ్ళి కార్యకర్తలను అభినందించడం
అభినందన సమావేశం ఏర్పాటుచేయడం
మన పరిమితులనుబట్టి ఆర్ధిక సహాయాన్ని అందించడం
సామాజిక మాధ్యమాలద్వారా అభినందించడం, ధన్యవాదాలు తెల్పడం

పాఠ్శాల,కళాశాల విద్యార్ధులతో స్వచ్ఛంద సేవను చేయించడం
స్వచ్ఛంద సేవకుల వల్ల తమజీవితాల్లో జరిగిన మార్పును లాభోక్తులద్వారా ప్రకతింపజేయటం
ఇంకా

కుటుంబ ఉత్సవాలైన జన్మదినం, వివాహదినోత్సవం, వర్ధంతులరోజు స్వచ్చంద కార్యకతర్తగా సేవలందించడం
తమ జీవితం‌లో ఒకరోజును స్వచ్ఛందసేవకు వినియోగించడం

స్వచ్ఛంద సేవకులైన శ్రీ అమృత రామారావు మరియు స్వచ్చంద సెవకునితీరున సేవలందిస్తున్న వరంగల్ జిల్లా మెప్మా పీడీ కాజీపేట పురుషోత్తం గార్లను జత చేస్తున్నాను.

స్వచ్ఛంద సేవకులందరికీ జే జేలు



* three friends

Man has three friends on whose company he relies.  First wealth which goes with him only while good fortune lasts. Second his relatives they go only as far as the grave leave him there The third friend, his good deeds go with hi  beyond the grave.

ప్రాంజలి ప్రభ భగవద్ గీత

గ్రుడ్డి వాడైనా ఆరాటం తగ్గదు
కన్న కొడుకులపై ప్రేమ తగ్గదు
భీష్ముని యుద్ధం ఆగ కూడదు
కురుక్షేత్రం గురించి వివరించు సంజయ

అన్నబిడ్డలు ఏమి చేస్తున్నారు
కన్న బిడ్డలు ఏమి చేయ నున్నారు
జీవితాన్ని ధర్మ బద్దకంగా ఉంచమన్నారు
క్షేత్రే క్షేత్రే ధర్మం కురు కదా సంజయ

భీష్ముని పతనము ధర్మముగా జరిగినదా
పాండవు లధర్మవృత్తికి పోలేదు కదా
మీరు సందేహ నివృత్తి చేయాలి కదా
దృతరాష్ట్రునితో ధర్మ యుద్ధం అని చెప్పే సంజయ

రాజ్య కాంక్ష దుర్యోధనకు పెరిగే
గురువగు ద్రోణాచార్యుని సమీపించే
చూడుము మీ శిష్య ద్రుష్టద్యుమ్మునినే
జాలిచూపక యుద్ధం చేయు అని హెచ్చరించే
భావగర్భితముగా ఎదుర్కొనుచున్నాడని చెప్పే సంజయ


No comments:

Post a Comment