Sunday 6 December 2015

1.శుభప్రదం (2010) 2.అర్ధాంగి (1955) 3.నేనూ మనిషినే 4.చక్రపాణి 5.ఓ పాపాలాలి 6.ప్రియరాగాలు 7.మల్లెలతీరం 8.కనులు మూసినానీవాయే)(2014)9హార్ట్ ఎటాక్ (2014)10. బండరాముడు (1955)11.మాంగల్య బలం (1958)

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ-సంగీత ప్రభ 

The idea that magic is everywhere and can be witnessed in everything | #perspicacityparty #webelievein #magic:
సర్వేజనా సుఖినోభవంతు 
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది...ఏ మాట నీ మాటున దాగుందో

చిత్రం : శుభప్రదం (2010)
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : బాలు, ప్రణవి
సంగీతం : మణిశర్మ

మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ......
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో - 2
చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది
ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో

మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా
ఏ మాట నా మాటున దాగుందో - 2
చూపు చెబుతోందా నా చూపు చెబుతోందా
ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో

అదిగో నీ బిడియం నాకు చెబుతోంది
ఏమని ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో
ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది
ఏమని ఇంత ఆనందాన్ని పంచగ చేరిందో
ఇరువురి చెరలో పరువం చెబుతోంది
ఒకరినొకరం వద్దనుకోలేనంత ప్రేమ సొంతమయ్యిందని
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో

వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది
నేటి నుండి నేను ఒంటరి కాదంటూ
పలికే ప్రతి పలుకు బాషకి చెబుతోంది
శ్వాసచేప్పే ప్రేమబాషం వినమంటూ
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది
ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని
మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో ....
https://www.youtube.com/watch?v=92MNWuEV4og
Subhapradam - Mouname Chebuthundi - HD Video Song
Latest HD Video Songs from K. Viswanadh , Allari Naresh's Subhapradam
వద్దురా కన్నయ్యా...ఈ పొద్దు ఇలు వదిలి పోవద్దురా అయ్యా...

చిత్రం : అర్ధాంగి (1955)
రచన : ఆత్రేయ
సంగీతం : బి.నరసింహారావు-అశ్వత్థామ
గానం : జిక్కి

పల్లవి :

వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి పోవద్దురా అయ్యా...

చరణం :

పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ

చరణం :

పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పాలుగారే మోము గాలికే వాడేను
వద్దురా... వద్దురా కన్నయ్యా...

చరణం :

గొల్లపిల్లలు చాల అల్లరివారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న అన్నిటను నీదాన
వద్దురా... వద్దురా... వద్దురా... వద్దురా
కన్నయ్యా... కన్నయ్యా

https://www.youtube.com/watch?v=7coKjpQJkvA
Vaddura Kannayya - Ardhangi (1955) - Jikki
View my page on Facebook http://www.facebook.com/goldinindia పాట - వద్దురా కన్నయ్యా చిత్రం - అర్థాంగ...

చిత్రం: నేనూ మనిషినే
చూసెనులే నా కనులే చూడనివింత
గాయకులు: పి సుశీల,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
రచన: సి నారాయణరెడ్డి
సంగీత దర్శకులు: వేదా

చూసెనులే నా కనులే చూడనివింత చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ దొర ఎవడో కాచుకొంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని
చూసెనులే నా కనులే చూడనివింత చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ చూపులనే దాచుకొంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని

పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు కానరాని ముల్లు ఎదలోన నాటినాడు
పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు కానరాని ముల్లు ఎదలోన నాటినాడు
ముళ్ళులేని గులాబీలు ముద్దులొలుకునా ఉరుములేక మెఱుపులేక వాన కురియునా
చూసెనులే నా కనులే చూడనివింత చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ చూపులనే దాచుకొంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని

కలల మేడలోన నను ఖైదు చేసినాడు కాలు కదపకుండా ఒక కంచె వేసినాడు
కలల మేడలోన నను ఖైదు చేసినాడు కాలు కదపకుండా ఒక కంచె వేసినాడు
కలల కన్న మధురమైన కాంక్షలుండునా వలపులోన ఖైదుకన్న తలపులుండునా
చూసెనులే నా కనులే చూడనివింత చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ చూపులనే దాచుకొంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని

విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే కలలు ఎంత చురుకో నీ కంటి ఎఱుపు తెలిపే
విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే కలలు ఎంత చురుకో నీ కంటి ఎఱుపు తెలిపే
విరహ రాత్రి రేపోమాపో కరగకుండునా వేచియున్న వెలుగుపూలు విరియకుండునా . . .
చూసెనులే నా కనులే చూడని వింత చూడగనే ఝల్లుమనే నా మనసంత
దోచిన ఆ దొర ఎవడో కాచుకొంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని
లాలల....లాలల..... లాలల....లాలల.....
చిత్రం: నేనూ మనిషినే
చూసెనులే నా కనులే చూడనివింత
గాయకులు: పి సుశీల,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
రచన: సి నా...
చిత్రం : చక్రపాణి
సంగీతం : పాలువాయి భానుమతి రామకృష్ణ,
రచయత : రావూరి రంగయ్య
గానం : పాలువాయి భానుమతి రామకృష్ణ,
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా..../2/
వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా రావే నిదురా హాయిగా.../2/ మెల్ల/
పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా రావే నిదురా హాయిగా..../2/ మెల్ల/
కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురా హాయిగా.../2/
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....
ఇంత చక్కని జోలపాట మన తెలుగువాళ్ళకే స్వంతం.
ఇప్పుడ...
నీవేగా నా ప్రాణం అంట...నేడు నీ తోడే నా లోకం అంట...

చిత్రం : ఓ పాపాలాలి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఏసుదాస్,చిత్ర

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

https://www.youtube.com/watch?v=urS2mgrzEp8&feature=youtu.be
oo papa laali-neevega naa praanam[preethiranjith].mkv
oo papa laali[preethiranjith]

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో...ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో...

చిత్రం : ప్రియరాగాలు
సంగీతం : కీరవాణి
గానం : SP.బాల సుబ్రహ్మణ్యం.చిత్ర

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో

ఆ...ఆ..

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో
కోకిలమ్మను కూయమంటూ మల్లెవీణను మీటమంటూ
కల్యాణి రాగాల వర్ణాలలో

నీ పాటా తేట తేట తెనుగు పాట చల్లలమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల అనందకేళిలా
నీ పాటా గడుసుపిల్ల జారుపైట గండుమల్లె పూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలలా
చిరుమబ్బుల దుప్పటిలో ముసుగెత్తిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడి కూసే వేళదాక ఉండిపోతే మేలు అంటూ
గారాల బేరాలు కానిమ్మంటూ
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో

ఉయ్యాలా ఊపి చూడు సందెవేళా పిల్లగాలి శోభనాల
కొండ నుంచి కోన ఒడికి జారేటి వాగులా
జంపాల జామురాతిరైన వేళ జాజిపూల జవ్వనాల
జంటకోరి జాణ పాడే జావళీ పాటలా
గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా
రేపల్లెకి ఊపిరిగా రవళించిన వేణువు చందములా
హాయిరాగం తీయమంటూ మాయ చేసి వెళ్ళమంటూ
రాగాల తానాలు కానిమ్మంటూ
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో

https://www.youtube.com/watch?v=9K-nSA9T9JI&feature=youtu.be
rayabaram pampindevare - priyaragalu - m.m.keeravani
A wonderful song penned and composed by M M Keravani from the film Priyaragalu

మాటకందని పాటగా....మనమిద్దరమూ కలిశాముగా...

చిత్రం : మల్లెలతీరం
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

https://www.youtube.com/watch?v=t2xIwjBvL8o
Mallelatheeram Lo Siri Malle Puvvu Matakandani
Starring Sri Divya, Kranthi, Goerge, Rao Ramesh, etc. Directed By Rama Raju Written By Rama Raju Scr...
 
ఆపాలన్నా ఆగేనా...దాచాలన్న దాగేనా..తెలిసి తెలియని భావాన..

చిత్రం : కనులు మూసినానీవాయే
సంగీతం : చక్రి
గానం : సునీత,శ్రీనివాస్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఆకాశం నీకోసం..పంపిందమ్మ పల్లకి...
సావాసం..పూవాసం..చుపిందమ్మ పిల్లకి..
అదుపెందుకే పదముందుకే..
అటు ఇటు చూడకే పదములు ఆపకే

ఆపాలన్నా ఆగేనా?
దాచాలన్న దాగేనా..?
తెలిసి తెలియని భావాన..ఎగసే మనసెటు పోతున్నా..
నిదురించే యెద లేపే రాగాన....
నిను మీటే ప్రియభావం పిలిచేనా....
నీకోసం రాత్రంతా..చూస్తున్నా..
రా రాదా..మది చూపే మార్గాన..

ఆపాలన్నా ఆగేనా?
దాచాలన్న దాగేనా..?

ఎక్కడవున్నా ఏం చేస్తున్నా వదలవు క్షణమైనా
ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా నీ తలపుల్లోనా
కనిపెడుతున్నా నీలో కలిగే కంగారేదైనా
అక్కడ ఇక్కడ చుస్తావెందుకు నిలోనేవున్నా
ఎటు తప్పుకోను ఈ పైనా కనపడదే ఏ దారైనా
కనురెప్పల తలుపేస్తున్నా నీ కలనై కమ్ముకురానా
ఎందుకు నాలోనా ఏమి తొచనీ ఆలోచన నీకైకదా

నిన్నా మొన్నా నాలోనా
కలవరమింతగ కలిగేనా
చెబితే వినదే కాస్తైనా
మనసే నా చెయ్ జారేనా

చేతులు చాచి చేలిమందించే సాగరమైనేను
మబ్బులనుంచి నిను రప్పించి స్వాగాతమిస్తున్నా
అలజడి పెంచి అల్లుకువచ్చే పల్లవి చూస్తున్నా
ఎల్లలు పెంచి వేల్లువనై నే ఒళ్ళోకొస్తున్నా
జడివాన కాద చినుకైనా జత కూర్చే సుముహుర్తానా
సుడిగాలి వెంట పడిపోనా నను తరిమే ఊహల పైనా
నువ్వెటు పోతున్నా నీతో నీడగా నే సాగనా ఓ మైనా

అనుకున్నానా ఎపుడైనా
ఏదేదో ఐపోతున్నా
అనురాగం శ్రుతి చేసే సమయాన
మౌనంగా ఉంటుందా మది వీణా
ఒనన్నా కాదన్నా ఏమైనా
నావైపే నడిపించక మానేనా


https://www.youtube.com/watch?v=N9-QWDip2t0
aapalanna agena.wmv
Nice song with sirivennala lyrics and sunitha voice

సెలవనుకో మరి ఏడవకే మనసా...కలగనకే అది నిజమై పోదుకదా

చిత్రం : హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చైత్ర

సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నులోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం ఓ ఓ

సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా

అనుకున్న అనుకున్న నాతోటే వుంటావు అనుకున్న
నాలాగే నీకుడా నేనంటే ఇష్టం అనుకున్న
పిలిచానా రమ్మని కసిరాన పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేమ్లేదంటే

నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా

నువ్వంటే నాలాంటి ఇంకోనేనని అనుకున్న
ఇన్నాలి బ్రమలోనే ఆనందముగా బ్రతికానా
నచ్చిందే తడవుగా వేల్లోదే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఉహలని నా ఆశలని నరికేస్తున్నావు అని చిదిమేస్తే

నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
https://www.youtube.com/watch?v=C8zL_kbospE&app=desktop
Selavanuko Full Video Song- Heart Attack - Nithiin , Adah Sharma ,Puri Jagannadh
Watch Selavanuko full Video Song From Heart Attack .Starring Nithiin and Adah Sharma,Brahmanandam, A...

ఒకసారి ఆగుమా ఓ చందమామ...ఒకసారి ఆగుమా ఓ చందమామ...

చిత్రం : బండరాముడు
సంగీతం : కె.ప్రసాదరావు,సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

ఒకసారి ఆగుమా
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా

నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ
యెదలోన నీవైన సోధించుకొమ్మా

పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి
మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా

చిత్రం : బండరాముడు
సంగీతం : కె.ప్రసాదరావు,సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

ఒకసారి ఆగుమా
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా

నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ
యెదలోన నీవైన సోధించుకొమ్మా

పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి
మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా
https://www.youtube.com/watch?v=468RaWrx7rg
Banda Ramudu Movie Songs - Okasari Aaguma - NTR Savithri
Movie: Banda Ramudu Cast: NTR, Savithri, Rajanala, Relangi Release date: 6th Nov 1959 Music Director...




No comments:

Post a Comment