Sunday 29 November 2015

1ఆత్మగౌరవం (1966) ,2.పూల రంగడు (1967) ,3.మా ఇద్దరి కథ (1977), 4.భారతంలో ఒక అమ్మాయి, 5.జీవితంలో వసంతం (1977) , 6.అందమైన అనుభవం (1979), 7.అమరజీవి (1983) , 8.మొరటోడు (1977), 9.సిరివెన్నెల (1986)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
ప్రాంజలి  ప్రభ - సంగీత  ప్రభ 
Guzide
సర్వేజనా సుఖినోభవంతు 
అందెను నేడే అందని జాబిల్లి...నా అందాలన్నీ ఆతని వెన్నెలలే

చిత్రం: ఆత్మగౌరవం (1966)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి...

చరణం 1:

ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే...
చెలికాడే నాలో తలపులు రేపెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే

చరణం 2:

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే..
నెలరాజే నాతో సరసములాడెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే

చరణం 3:

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే..
వినువీధిని నామది విహరించెలే..
వలరాజే నాలో వలపులు చిలికెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

https://www.youtube.com/watch?v=eMfCd5ggVKY
ANDENU NEDE ANDANI JABILLI.....CHITRAM:-ATMAGOWRAVAM
అందెను నేడే అందని జాబిల్లి.... చిత్రం :- ఆత్మగౌరవం పాట గురించి :-గాయకులూ :-ఫూలపాక సుశీల( పి.సుశీల),-...

నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి

చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు...

చరణం 1:

తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....
ఆ ఆ ఆ ఆ.....
తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి...
చింతా చీకటి ఒకటై...చిన్నబోయే ఈ రేయి

నీవు రావు..
నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు..

చరణం 2:

ఆశలు మదిలో విరిసే... దోసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ..ఆలయాన చేరి చూడ...
స్వామికానరాడాయే..నా స్వామికానరాడాయె...

కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
కౌగిలిలో ఒదిగిపోయే... కలలుగనే వేళాయే
ఎదురుచూసి ఎదురుచూసి...
ఎదురుచూసి ఎదురుచూసి... కన్నుదోయి అలసిపోయె

నీవు రావు..
నీవు రావు నిదురరాదు...నిలిచిపోయే ఈ రేయి
నీవు రావు నిదురరాదు

https://www.youtube.com/watch?v=qPzGNqf1KYE
Poola Rangadu Neevu Raavu Nidura Raadu

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..మురళిని కాలేను.. పింఛమైనా కాను..

చిత్రం : మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 1:

వలచిన రాధమ్మనూ..ఊ..ఊ.... విరహాన దించావు..
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ...ఊ... మోసాన ముంచావూ...

నీవు నేర్చినదొకటే.... నిను వలపించుకోవటం..
నాకు తెలియినదొకటే... నా మనసు దాచుకోవటం..
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 2:

వెన్నైనా మన్నయినా...ఆ..ఆ..ఆ..ఆ.. ఒక్కటే అన్నావూ
దొంగవయినా గానీ...ఈ..ఈ..ఈ... దొరవయీ నిలిచావూ..
ఎంతా మరవాలన్నా... మనసును వీడిపోననంటావు..
ఎంతా కలవరించిన.. కంటికి కానరాకున్నావు..
ఏమని చెప్పాలీ నేనూ... ఎవరనీ చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ...ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ..
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

https://www.youtube.com/watch?v=fQ3KvHw4JXo
Maa idhhari kadha -Nallanayya yavarani adigaava nannu
jayapradha susheela hit song

భారతంలో ఒక అమ్మాయి..యుగయుగాలుగా తరతరాలుగా...జరిగే కధలే చెపుతోంది...

చిత్రం : భారతంలో ఒక అమ్మాయి
సంగీతం : S.రాజేశ్వరరావు
గానం : వాణీ జయరాం

పల్లవి :

భారతంలో మనభారతంలో ఈభారతంలో ఒక అమ్మాయి..
యుగయుగాలుగా తరతరాలుగా
జరిగే కధలే చెపుతోంది...
భారతంలో ఒక అమ్మాయి..

చరణం :

కీర్తి కోసమని నడిబజారులో సతినే అమ్మాడొకరాజు
ప్రజల మెప్పుకై పరమసాద్వినే అడవికి తరిమాడింకొకరాజు
తన వ్యసనానికి సొంతభార్యనే పందెంకాసాడొకరాజు
పెళ్ళి చేసుకొని పెళ్ళానివి నువుకాదన్నడింకొకరాజు

చరణం :

ధనదాహంతో భార్యలమార్చే దగాకోరులే ఈనాడు
పెనుకామంతో పడతులచెరిచే ఖుషీదారులే ఈనాడు
పదవికి పడతిని పాచికచేసే బడాచోరులే ఈనాడు
చేరదీసి శీలం బలికోరే దురాచారులే ఈనాడు

చరణం :

జగం మారినా యుగం మారినా
మారలేదు అమ్మాయి కధా
తీరలేదు అమ్మాయి వ్యధా
ఈ మారని తీరని కధలకు వ్యధలకు
అంతం లేనే లేదు
వాడిన వనితల మోడు బ్రతుకులకు
వసంతకాలం రానేరాదు
వసంతకాలం రానేరాదు

https://www.youtube.com/watch?v=zVf84AvlwHQ
Bharathamlo Oka Ammayi Telugu Video Songs - Murali Mohan,Chandramohan
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...



నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

చిత్రం: జీవితంలో వసంతం (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం

పల్లవి:

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా...ప్రియతమా ఓ ఓ ఓ
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీ మది కోవెల అన్నది కోయిల

చరణం 1:

నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో....
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

చరణం 2:

ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో
ఇదే ఇదేలే జీవితం లలాలలా జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో...నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా...తేలి తేలి పోదామా
సోలి సోలిపోదామా

https://www.youtube.com/watch?v=JSaq1oQ4HQI
Jeevithamlo Vasantham - Nilagiri Challana Nee vodi vechhana
Ramakrishna,Chandrakala Balu,Vanijayaram song

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీ సరి ఎవరమ్మ

చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం

పల్లవి:

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీ సరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

చరణం 1:

ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణమూ ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

చరణం 2:

ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

చరణం 3:

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము....

https://www.youtube.com/watch?v=gaZlqnNcBDM
Nuvve Nuvvamma Song - Andamaina Anubhavam Movie Songs - Kamal Hassan - Rajnikanth
Watch Andamaina Anubhavam Full Movie / Andamaina Anubhavam Movie Starring with Kamal Haasan, Rajinik...
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి...ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
సాకి :
శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన
ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజల కు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహములకు.. పరములకు నీదాననై..ధన్యనై..
జీవన వరాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవ దేవి. .
పల్లవి :
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి ?
స్వామీ... స్వామీ
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!
చరణం 1 :
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని .. నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడ దారి
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
చరణం 2 :
నశ్వరమది..నాటక మిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దే...
చరణం 3 :
అలిగే నట శ్రీ రంగం.. తొలగే నట వైకుంఠం
యాతన కేనా దేహం?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము
రంగా! రంగ... రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..

https://www.youtube.com/watch?v=9tPF2iPwK3I
Asura Sandhya Vela Song - Amarajeevi Movie Songs - ANR - Jayapradha - Sumalatha
Watch Amarajeevi Full Movie / Amarajeevi Movie Starring Akkineni Nageshwara Rao, Jayapradha, Pandhar...
హే కృష్ణా....ఆ...మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...హే కృష్ణా....ఆ...

చిత్రం : మొరటోడు (1977)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : వాణీ జయరాం

పల్లవి :

హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ..
కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...
హే కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...
ప్రతి సుమవనం బృందావనం....
ప్రతి సుమవనం బృందావనం...
ప్రతి మూగ మౌళీ.... మోహనమురళి
కృష్ణా....ఆ...
మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే...

చరణం 1 :

నీవు నేను వేరు కాదు...ఇద్దరు ఊరు వేరు కాదు
నీవు నేను వేరు కాదు... మన ఇద్దరి ఊరు వేరు కాదూ...ఉ...ఉ...

ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు...
ఆడేది పాడేది నేను కాదు...
నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు...
అందరి చూపు నా పైనా...మరి నా చూపేమో నీ పైనా...

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే....

చరణం 2 :

గోవులు కాస్తు నీవుంటావు...జీవిత సాగిస్తూ ఉంటావు
గోవులు కాస్తూ నీవుంటావు...నీ జీవిత సాగిస్తు ఉంటావు...ఊ...ఊ...

పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు
నీ కథలోనా నేనున్నాను...
నీ కథలోనా నేనున్నాను.....నా కథలోనా నీవున్నావు

కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే....

https://www.youtube.com/watch?v=iTxTrNWEsfQ
Hey krishna malli neve janmiste-moratodu
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidery of Rama N...



No comments:

Post a Comment