Friday 27 November 2015

1.Jebudonga ,2.Gharshana, 3.Swathi Muthyam, 4.గోదావరి (2006), 5. హ్యాపీ డేస్ (2007), 6. మిస్సమ్మ (1955), 7.Sitara(1983) ,8.ఆనందభైరవి, 9.ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977), 10.ముత్యాల పల్లకి (1976),11.సత్య హరిశ్చంద్ర (1965)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ
(GIF) A snowy home in the woods

 సర్వేజనాసుఖినోభవంతు 

జేబుదొంగ చిత్రం కోసం చక్రవర్తి గారి స్వరరచనలో బాలూ సుశీలలు గానం చెసిన ఒక చక్కని యుగళ గీతం
చిత్రం : జేబు దొంగ (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల

నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో... మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో ..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా... నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో... మేఘాల తేరులో..ఓ..ఓ..

ఆ నింగికి నీలం నీవై...
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో..
రేపూ మాపుల సంధ్యలలో

ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా

మెల్లగ.. చల్లగ...
మెత్తగ.. మత్తుగ హత్తుకుపోయీ
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో.. మేఘాల తేరులో.. ఓఓఓ...

ఆ హిమగిరి శిఖరం నీవై ...
ఈ మమతల మంచును నేనై
ఆశలు కాచే వేసవిలో..
తీరని కోర్కెల తాపంలో

శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై

ఉరకల..పరుగులా ..
పరువములోనా.. ప్రణయములోనా...
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో... మేఘాల తేరులో..
ఆహాహా..ఆఅహహ..ఊహూహూ.హుహు..

https://youtu.be/p_ddTqG0N0M
Neelala Ningilo
Provided to YouTube by Sa Re Ga Ma Neelala Ningilo · S P Balasubramaniam · P Susheela Jebudonga ℗ Sa...


నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లె తొలకరి కవితల్లె
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

వుడికించే చిలకమ్మా నిన్నురించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాల భంధాలే నీకందించే
అచ్చట్లు ముచ్చట్లు తానాసించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే
వుండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు

ఈ వీణ మీటేది నీవేనంత
న తలపు నా వలపు నీదేనంట
పరువాల పరదాలే తీసే పూట
కలవాలి కరగాలి నీలోనంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకు నాకు ఈక్షణం కాని రాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనేలే ఏవేల సరసకు

https://www.youtube.com/watch?v=w--GTDdQQuQ

Ninnu Kori Video Song || Gharshana Movie || Karthik, Prabhu ,Nirosha, Amala
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా...
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా...
హ (హ) హ (హ) ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందమ్మా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ....

https://youtu.be/QAU2_MN_4so
Swathi Muthyam Movie || Suvvee Suvvee Video Song || Kamal Hassan, Radhika
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే

సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది వూరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

https://youtu.be/yWnhTwJeKbQ
Godavari Movie Songs - Uppongele Godavari Song
Uppongele Godavari Song. Watch Super Hit Songs from Godavari Movie. Starring Sumanth, Kamalini Mukha...

నీకోసం దిగిరానా... నేనెవరో మరిచానా
నీడల్లే కదిలానా... నీ వల్లే కరిగానా
నా కోసం నేన్లేనా... మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా... కాదన్నా వింటేనా!
పల్లవి :
అరెరే... అరెరే... మనసే... జారే...
అరెరే... అరెరే... వరసే... మారే...
ఇదివరకెపుడూ... లేదే
ఇది నా మనసే... కాదే
ఎవరేమన్నా... వినదే
తనదారేదో... తనదే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చరణం : 1
స్నేహమేరా... జీవితం అనుకున్నా
ఆజ్ మేరా... ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా... ముడిపడిపోతున్నా
ఇంక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల... చాల్లే నీ గోల...
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చరణం : 2
చిన్నినవ్వే... చైత్రమై పూస్తుంటే
చెంత చేరీ... చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో... తడిసిన మెరుపమ్మా
తె లుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా...
వరమా... హాయ్ రామా!
అరెరే... అరెరే... మనసే... జారే...
అరెరే... అరెరే... వరసే... మారే...
ఇదివరకెపుడూ... లేదే
ఇది నా మనసే... కాదే
ఎవరేమన్నా... వినదే
తనదారేదో... తనదే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చిత్రం : హ్యాపీ డేస్ (2007)
సంగీతం : మిక్కీ జె.మేయర్
రచన : వనమాలి
గానం : కార్తీక్

Watch Happy Days Movie Video Songs (1080p) Starring Varun Sandesh, Nikhil, Vamsi Krishna,…
చిత్రం :మిస్సమ్మ (1955)
రచయత : వెన్నల కంటి

సంగీతమ్ : సాలూరి రాజేశ్వరరావు 
పాడిన వారు: సుసీల 
ఏమిటో ఈ మాయా ... ఓ చల్లని రాజా 
వెన్నెల రాజా ./.. ఏమిటో ఈ మాయా... 
ఏమిటో ఈ మాయా ... ఓ చల్లని రాజా 
వెన్నెల రాజా ./.. ఏమిటో ఈ మాయా...

వినుటయె కానీ వెన్నెల మహిమలు ...

వినుటయె కానీ వెన్నెల మహిమలు ... 
అనుభవించి నే నెరుగనయా..
అనుభవించి నే నెరుగనయా..
నీలో వెలసిన కళలూ  కాంతులు ....
 నీలో వెలసిన కళలూ  కాంతులు ...
 లీలగ ఇపుడే కనిపించెనయా... 
 లీలగ ఇపుడే కనిపించెనయా..

కనుల కలికమిడి  నీ కిరణములే ... 
కనుల కలికమిడి  నీ కిరణములే ...
 మనసున వెన్నెల చేసెనయా 
మనసున వెన్నెల చేసెనయా 
చెలిమి కొరుచూ ఏవో పిలుపులు 
చెలిమి కొరుచూ ఏవో పిలుపులు 
నాలో నాకే విపించెనయా... 
నాలో నాకే విపించెనయా..
ఏమిటో ఈ మాయా ... ఓ చల్లని రాజా 
వెన్నెల రాజా ./.. ఏమిటో ఈ మాయా...


Movie Name : Sitara(1983)
Lyricist : Veturi Sundararamamurthy
Music Composer: Ilaya Raja
Singers : SP. Balu, Janakiజిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు
ఏమైనా ఓ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా

అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు
ఓ మైనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ
ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ
వినువీధి నీడల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు
నిలిపేనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురి సొగసుల
ఈ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
గుడికే చెరని దీపం
పదమటి సంధ్యరాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక ధిక్కుల
దాగిన నేనెలే ఆ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురి సొగసుల
ఈ మైనా మైనా..
Jilibili Palukulu HD Song - Sitara Movie | Bhanupriya | Suman | Vamsy | Ilaiyaraaja
Watch Jilibili Palukulu HD song from Sitara movie, Sitara Movie starring Suman, Bhanupriya, Subhalek...

పిలిచిన మురళికి వలచిన మువ్వకి యెదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి యెదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం

కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే
కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే
మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచె
యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే
హౄదయం లయమై పోయినది లయమే ప్రియమై జీవితమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం....
Ananda Bhairavi Songs -Pilichina Muraliki - Rajesh - Malavika
Watch Rajesh Malavika's Ananda Bhairavi Telugu Old Movie Song With HD Quality Music - G Ramesh Naidu...

వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు
చిత్రం: జే గంటలు (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు.. వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన.. నా స్వామికీ వందనాలు

ఊ..వందనాలు ..వందనాలు ..వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన ...నా దేవికీ వందనాలు...

ఊ..వందనాలు..వందనాలు.. వలపుల హరిచందనాలు

చరణం 1:

ఈ కన్నే కోపాలు.. వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు.. ఏ పోద్దు సగపాలు..
ఈ కంటి నీలాలు... ఆ కంట పోంగితే
సురగంగ నీరాల.. సరిగంగ తానాలు
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ...
ఈ ఒక్కరాతిరి తోలి రాతిరవ్వనీ...

కలలన్నీ కలయికలే ...కలుసుకొనే కౌగిలిలో...

వందనాలు..ఊ.. వందానాలు వలపుల హరిచందనాలు...
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి..
వందనాలు వందనాలు..వలపుల హరిచందనాలు

చరణం 2:

సంపెంగ పూలలో ..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో ..ఈ నోము నోచాను
ఏకాంత సేవకే.. ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో.. నీ చెంత చేరాను

నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా
ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే... వలపులనే వయసులలో
వందనాలు ..ఊ..వందనాలు వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన నా దేవికి వందనాలు...
వందనాలు వలపుల హరిచందనాలు..ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్
https://youtu.be/J7oAEsFqIWc
Jegantalu - వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు
balu, susheela hit song

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..

చరణం 1:
కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...

చరణం 2:
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....

ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...

Nice song of krishna and jayaprada
youtube.com

తెల్లావారక ముందే పల్లె లేచింది...తనవారినందరినీ తట్టీ లేపింది...

చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

చరణం 1:

వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి

తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

చరణం 2:

పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు

అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు

తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది

https://www.youtube.com/watch?v=E36eTEtMatE
Thellavarakamunde Palle Lechindi
Movie Muthyala Pallaki Music Sathyam Singer P suseela

నమో భూతనాధా... నమో దేవదేవా...నమో భక్తపాలా.. నమో దివ్యతేజా

చిత్రం : సత్య హరిశ్చంద్ర (1965)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, ఎస్. వరలక్ష్మి

పల్లవి :

హే చంద్రచూఢ! మదనాంతక! శూలపాణే!
స్థాణో గిరీశ! గిరిజేశ! మహేశ! శంభో!
హే పార్వతీ హృదయవల్లభ.. చంద్రమౌళే
భూతాధిపా.. ప్రమథనాథ.. గిరీశ చాప...
నమో భూతనాధా... నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా....

చరణం 1 :

భవా వేదసారా.. సదా నిర్వికారా
భవా వేదసారా.. సదా నిర్వికారా
జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా
నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా

చరణం 2 :

సదా సుప్రకాశా.. మహాపాపనాశా.... ఆ....
సదా సుప్రకాశా.. మహాపాపనాశా...
కాశీ విశ్వనాథా.. దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా
నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా...

https://www.youtube.com/watch?v=zShhRfkm7pI
namo buthanatha song in NTR satya harichandra
NTR's movie satya hairchandra


No comments:

Post a Comment