Tuesday 24 November 2015

1. చందమామ (2007, 2.కాళహస్తి మహాత్మ్యం (1954) ,3.నాగుల చవితి (1956), 4: కల్పన (1977), 5.అనామిక (2014), 6.ఇష్టం , 7.అమర దీపం (1977), 8.అమరశిల్పి జక్కన (1964) , 9.గుడిగంటలు (1965), 10.ఆరాధన (1962)

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ  రాం
ప్రాంజలి ప్రభ - sangita ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు
పల్లవి :
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
పరుగులుగా... పరుగులుగా...
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
చరణం : 1
ఆ ఆ ఆ....
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతుంది ఇలా!
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
చరణం : 2
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ... ఆవిరవుతూ... అంతమవ్వాలనే!
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
పరుగులుగా... పరుగులుగా...
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
నాలో ఊహలకు... నాలో ఊసులకు... అడుగులు నేర్పావూ....
చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్
రచన : అనంత్ శ్రీరామ్
గానం : ఆశా భోంస్లే, కె.ఎం.రాధాకృష్ణన్

m.youtube.com/watch?v=vLBxgKsvtYo
Chandamama Movie Songs - Naalo Vusulaki - Navadeep Kajal Sivabalaji Sindhu menon - HD
Watch Latest Telugu Video Songs @ https://goo.gl/YkBWDm Movie: Chandamama, Cast: Navdeep, Siva Balaj...





ఎవ్వరితో చెప్పనూ.. ఎక్కడనీ వెతకనూ..మనసు ఏదనీ... నిను చేరె ఆశతో..

చిత్రం : అనామిక (2014)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి
గానం : సునీత

ఎవ్వరితో చెప్పనూ.. ఎక్కడనీ వెతకనూ..
మనసు ఏదనీ... నిను చేరె ఆశతో..
ఎదురీదే శ్వాసతో.. గాలిలో తిరుగుతూ..
ఉండనీ.... ఎవరితో.. చెప్పనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నిను మరువదే తలపు
వెను దిరగదే చూపు
కనపడనిదే రేపు
నమ్మడమెలా.. నువ్వు కలవేననీ
కంటపడవా.. ఉన్నాననీ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నను తరుముతూ సమయం
నిను తడుముతూ హృదయం
ఎటు నడపనూ పయనం
ఎంతవరకూ.. ఇలా కొనసాగనూ..
ఏ మలుపులో.. నిను చూడనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

https://www.youtube.com/watch?v=NXw_HFAABv4
Kshanam kshanam క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
www.youtube.com

క్షణం, క్షణం నా మౌనం Movie: Anaamika (2014) Lyricist: Sirivennela Sitarama Shastry Music: M.M.Keerav...

ఎవరైనా చూసారా...పరువే చెడదా పురుషోత్తమా...అరెరే అనరా ప్రియ నేస్తమా

చిత్రం : ఇష్టం
సంగీతం : DG.గోపీనాధ్
గానం : హరిహరన్.చిత్ర

ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
గారంగా కొసరే వేళ ... కారంగా కసిరే వేలా
గుండెల్లో జరిగే గోలా... మౌనంగా ఉంటే మేలా...
ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా

అప్పుడప్పుడీ ఉపవాసం ...తమ అలవాటా ...
కోరుకుంటె నా సహవాసం... ఏం పొరపాటా ...
ఒహో ఏమా రోషం ... వామ్మో సమరావేసం
కొరికేసే ఉక్రోషం...
కరిగించే సరసం కోసం ... అడిగేస్తే ఏమిటి దోషం
ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొగమాటం

ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా

లేనిపోని సైగలు చేసి నను లాగాలా..
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా... పై పై పరదాలేలా
తగువేలా నాతో తగువేలా
బిగువేలా ఇంకా బిడియాలా
గుట్టే దాచాలన్నా దాగేనా

ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా...
ఎవరైనా చూసారా
ఎర వేసే అల్లరి ఈల... పొరపాటే అయిపోవాలా
దరి దాటే వరదయ్యేలా... పరుగెడితే పడవా బాల
ఎవరైనా చూసారా
పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా
ఎవరైనా చూసారా

https://www.youtube.com/watch?v=V-oij8K9LZg
evaraina chusara song from the movie ishtam
Song: Evaraina chusara Movie: Ishtam Singers: KS Chitra, Hariharan copy rights reserved by original ...

నా జీవన సంధ్యా సమయంలో
చిత్రం : అమర దీపం (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల

పల్లవి :
ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...

నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే... అపురూపమై... అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది

ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...

చరణం 1 :

శిలకే కదలిక రాగా.. శిల్పమే కదలి ఆడింది

గరిస.. సదపమ గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా

కళకే కళగా విరిసి.. నా కల నిజమై పండింది
శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది

కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల.. మనసే ఎగసి పాడింది

నా జీవన సంధ్యా సమయంలో..
ఒక దేవత ఉదయించింది

చరణం 2 :

పొద్దుపొడుపులో అరుణిమలే.. చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమరిమలే.. చెలి పైట జిలుగులే సవరించే
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన...
ఆఆఆ..ఆఆ.... ఆఆఆఅ.... ఆ.... ఆఆ...
ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన.. వెదురు వేణువై పలికింది

నా జీవన సంధ్యా సమయంలో..
ఒక దేవత ఉదయించింది

చరణం 3 :

పలుకే పాడని పాట... చిరునవ్వు పూలకే పూత
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
నడకే నెమలికి ఆట.. లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా.. ఈ బ్రతుకే పరిమళించింది

నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది
ఆ రూపమే అపురూపమై.. అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది

https://youtu.be/uXb-K38GudY
Amara Deepam Movie Songs | Naa Jeevana Sandhya | Krishnamraju | Jayasudha
Krishnamraju and Jayasudha's Amara Deepam Movie - Naa Jeevana Sandhya Song with HD Quality Star Cast...

అందాల బొమ్మతో ఆటాడవా...పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా

చరణం 1:

కనులు చేపలై గంతులు వేసె..
మనసు తోటలో మల్లెలు పూసె..
దోసిట వలపుల పూవులు నింపీ..
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ..

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 2:

చల్ల గాలితో కబురంపితిని ...
చల్ల గాలితో కబురంపితిని...
చందమామలో వెదకితి నోయీ...
తార తారనూ అడిగితి నోయీ....
దాగెద వేలా? రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 3:

నల్లని మేఘము జల్లు కురియగా...
నల్లని మేఘము జల్లు కురియగా...
ఘల్లున ఆడే నీలినెమలినై....
నిను గని పరవశమందెద నోయీ...
కనికరించి ఇటు రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా...

https://www.youtube.com/watch?v=_dh2KsuFzAo
Amarasilpi Jakkanna | Andala Bommato song
Watch the melodious song,"Andala Bommato" sung by P Susheela from the film Amarasilpi Jakkanna. Cast...


నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా..

చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అ....ఆ..ఆ..ఆ..ఓ..ఓ..
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...

చరణం 1:

మబ్బుల పందిరి మనపై నిలిచే...ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే...ఏమని పిలిచే
వీడని జంటగ రమ్మనీ ...వసి వాడని పూలై పొమ్మనీ

నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...

చరణం 2:

తెలియరానిది ఈ గిలిగింత...ఏ గిలిగింత..
పలుకలేనిది ఈ పులకింత...ఏ పులకింత ...
కనుపించనిదా వింతా...అది కదలాడును మనసంతా

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

చరణం 3:

చల్లగ తాకే జ్వాలలు ఏవో ...ఏమో ఏవో...
అవేడిగ సోకే వెన్నెలలు ఏవో ...ఏమో ఏవో...
చిన్నది విరిసే చూపులు ...చెలి చిలికిన ముసి ముసి నవ్వులు

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

https://www.youtube.com/watch?v=hoUgohRDV_U
Gudigantalu movie song, Neeli kannula needalalona dora valapula daarulalona.......
sung by P Suseela & P B Sreenivas, music: Ghantasala.contains content from TV9.


ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ..ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
ఆహా . . .ఆ .. ఆ
ఓహో . . .హొ .. హో ..

చరణం 1:

ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం 2:

న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు

ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. హిందీలొ అర్థమూ షాదీ ఓహో...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం 3:

పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

ఆహా . . .

ఓహో . . .

https://www.youtube.com/watch?v=ffbZNS5Djy0
Aradhana Telugu Movie Songs | Englishlona Marriage Hindilo Artham Shadi | Girija | Relangi
ANR - Savitri and Girija's Aradhana Telugu Movie - Englishlona Marriage Hindilo Artham Shadi Song wi...


No comments:

Post a Comment