Thursday 26 November 2015

1.మట్టిలో మాణిక్యం (1971) ,2.విచిత్ర దాంపత్యం,3.భగత్ , 4.కళ్యాణ మండపం, 5. Abhinandana, 6.ఆరాధన (1987), 7.భలే దొంగలు (1976), 8.సీతామాలక్ష్మి (1978) , 9.పవిత్ర బంధం (1971)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- సంగీత ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు




ఎవరికోసం ఎవరికోసం...ఎంతకాలం ఎంతకాలం...

చిత్రం : విచిత్ర దాంపత్యం
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల
సంగీతం : అశ్వత్థామ

ఎవరికోసం ఎవరికోసం
ఎంతకాలం ఎంతకాలం
ఈ జాజి తీగ రోజు రోజు
పూలు పూసేదెవరికోసం ఎంతకాలం

వాడి పోయిన నిన్నలన్ని మరచిపోయి
చిగురు లేసే ఒక్క రేపుని తలచి మురిసి
ఆ రేపు నేడై నేడు నిన్నై
రూపు మాసి పోవు వరకు
ఎదురు తెన్నులు చూచుకుంటూ
ఎరుపు కన్నులు సోలిపోతూ
ఎవరి కోసం ఎంతకాలం

కట్టుకున్న పందిరేమో కాలదన్నే
పుట్టి పెరిగిన పాదులో మమతెండిపోయే
ఇవ్వ గలిగినదివ్వలేక పొంద దలచినదేదీ పొందక
పొద్దు పొద్దు మొగ్గలేస్తూ తెల్లవారి రాలిపోతూ
ఎవరికోసం ఎంత కాలం

ముళ్ళ కంచెలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును ఒంటరిగనే మోసినాను
రాగమన్నది గుండెలో రాజుతున్నది ఎందుకో
రగిలి రగిలి నేను నేనుగ మిగిలి పోవుటకా
మిగిలియున్న రోజులైనా వెలుగు చూచుటకా
ఎవరి కోసం ఎంత కాలం
ఎవరి కోసం ఎంత కాలం

https://www.youtube.com/watch?v=GPYPL5YfUJE

అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా..ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా...

చిత్రం : భగత్
సంగీతం : నవీన్ జ్యొతి
గానం : చిత్ర

అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా?
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనైనా రమ్మని పిలిచేవా?
నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?

గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగ రాగమేదొ ఆలకించవా
ఆలకించి నన్ను నీవు ఆదరించవా

చందమామ రాకుంటే కలువ నిలువ లేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా

https://www.youtube.com/watch?v=KdrMSo-T-28
అన్నీ నీవనుకున్నా...ఎవరున్నారు నీకన్నా

పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే...వలచే మనసుకు బదులుగ బదులుగ

చిత్రం : కళ్యాణ మండపం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమ విధాత జీవననేత ప్రేమ విధాత
అను గుడిగంట విను ప్రతిజంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
జీవనగంగా వాహిని కాదా , జీవనగంగా వాహిని కాదా
అను ప్రతిజంట – విను గుడిగంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
https://www.youtube.com/watch?v=J_a7wUd8sFM

Kalyana Mandapam Movie Songs || Sarigama Padanisa || Shoban Babu || Kanchana
Sobhan Babu - Kanchana - Anjali Devi`s Kalyana Mandapam Telugu Movie - Sarigama Padanisa Palike Varu..

వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే....

చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి నాగేంద్ర రావు
నేపధ్య గానం : జానకి, బాలమురళి కృష్ణ

పల్లవి :

వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి..
తనువు మనసు ఊగి తూగి.. ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

చరణం 1 :

రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా

తనువు మనసు ఊగి తూగి
తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే... ఆహా భలే హాయిలే
ఈ మహిమ నీదేనులే

చరణం 2 :

విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే

ఈ మహిమ నీదేనులే... ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే...

https://www.youtube.com/watch?v=oJdkRfYdxgU
Srikakula Andhra Mahavishnu Katha Songs - Vasantha Gaaliki - NTR - Jamuna
Watch NTR Jamuna's Srikakula Andhra Mahavishnu Katha Telugu Movie Old Song With HD Quality Music : P...


ఆత్రేయగారు ప్రతీ పదంలో భగ్న ప్రేమికుని పగిలిన హ్రుదయంలొ ఉండే భావుకతను పదాల రూపంలో ఆవిష్కరించగా బాలూ గారు తన స్వరంతో ఆ పదాలకు జీవం పోశారు...

ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు

కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా..

https://www.youtube.com/watch?v=HgFHocXPsJQ
Abhinandana Movie Songs | Edhuta Neeve Video Song | Karthik, Sobhana
Edhuta Neeve Video Song From “Abhinandana Movie” Starring Karthik Muthuraman, Shobana and Sarath Bab...


అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ
ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ
అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

m.youtube.com/watch?v=RNQwpVYNmhM
Telugu - Aradhana - Are emaindi - HD
Chiranjeevi :: CHIRU ALL TIME HITS & .::. Melodious Maestro .::. I L L A Y A R A J A .::.


చూశానే.. ఓలమ్మీ చూశానే
చిత్రం : భలే దొంగలు (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

చూశానే.. ఓలమ్మీ చూశానే..
వేశానే.. కన్ను వేశానే..
ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో...

చూశావా.. ఓరబ్బీ చూశావా..
వేశావా.. కన్ను వేశావా..
ఇన్నాళ్ళు నీకోసం దాచిన అందం నాలో
చూశావా.. ఓరబ్బీ చూశావా..
చూశానే.. ఓలమ్మీ చూశానే..

చరణం 1:

కసి గోలిపే నీ చూపుల తీరు.. ఊ ఊ ఊ... ఆహహా...
ఉసి గోలిపే నీ ఊపుల జోరు.. హహా...హహా
నీ కొంగైనా ఆ ఆ తగలక ముందే
నీ కొంగైనా తగలక ముందే
తేనేల వానలు కురిపించే నిను
చూశానే.. ఓలమ్మీ చూశానే..
వేశానే.. కన్ను వేశానే..

చరణం 2:

పెదవులు నీకై తడబడతుంటే.. ఏ ఏ ఏ.. హాయ్ హాయ్
కన్నులు నీకై కలగంటుంటే.. ఏ ఏ ఏ.. అరెరెరెరే
నీ కౌగిలిలో .. ఓ ఓ... చేరకముందే. ..
నీ కౌగిలో చేరకముందే
కరిగి కరిగి నే నీరౌతుంటే...
చూశావా.. ఓరబ్బీ చూశావా..
వేశావా.. కన్ను వేశావా...

చరణం 3:

కొంటె కోరికలు కొరికేస్తుంటే.. ఏ ఏ ఏ .. ఆహాహా
జంట కోసమై తరిమేస్తుంటే.. ఏ ఏ ఏ.. హా...
దూరాలన్నీ... ఈ ఈ... తొలిగే సమయం
దూరాలన్నీ తొలిగే సమయం
తొందరలోనే రాబోతుందని...
చూశావా.. ఓరబ్బీ చూశావా..
వేశావా.. కన్ను వేశావా..
ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో
చూశావా.. హహ చూశానే
వేశావా.. కన్ను వేశానే... ఏ... ఏ... ఏ..
https://youtu.be/RV8tuAZ89XM
Bhale Dongalu Songs - Chusane Olammi - Krishna Ghattamaneni, Manjula
Movie: Bhale Dongalu, Cast : Krishna, Manjula, Mohan Babu, Nagabhushanam, Padmanabham, Prabhakar Red...


ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను..

చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం

పల్లవి :

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే

ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...

చరణం 1 :

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..

ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు ...మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను...

చరణం 2 :

తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ

ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ..

ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...

చరణం 3 :

చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట

ఎందుకో ..ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు

గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే
ఎందుకో ..ఎందుకో...నా మీద అలిగాడు చెలికాడు...

కలలు చెదిరినా పాటే... కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను...

https://www.youtube.com/watch?v=EmoeBYIN2NQ
Seeta Malaxmi Movie Songs || Ye Pata Ne Padanu || Chandra Mohan || Rameshwari
Telugu Songs Ye Pata Ne Padanu song from Seetha Maalakshmi Telugu Movie Songs, Chandra Mohan and Tal...


పచ్చ బొట్టు చెరిగిపోదులే...నా రాజా..పడుచు జంట చెదరీపోదులే.... నా రాణీ..

చిత్రం: పవిత్ర బంధం (1971)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

పచ్చ బొట్టు చెరిగిపోదులే...నా రాజా..
పడుచు జంట చెదరీపోదులే.... నా రాజా..

పచ్చ బొట్టు చెరిగిపోదులే.. నా రాణీ..
పడుచు జంట చెదరీపోదులే ..నా రాణీ..

పచ్చ బొట్టు చెరిగిపోదులే...

చరణం 1:

పండిన చేలు ...పసుపు పచ్చా
పండిన చేలు... పసుపు పచ్చా
నా నిండు మమతలు.. మెండు సొగసులు.. లేత పచ్చా..ఆ..ఆ..

నీ మెడలో పతకం ...చిలక పచ్చా
మన మేలిమి గురుతీ... వలపుల పచ్చా

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
పడుచు జంట చెదరీపోదులే..నా రాణీ

పచ్చ బొట్టు చెరిగిపోదులే..నా రాజా

చరణం 2:

కలసిన కలయిక ...తలవని తలపు
మన కలసిన కలయిక ...తలవని తలపు
నీ చెలిమి విలువకే ...చేతి చలువకే...చిగిర్చే నా మనసు

తిరిగెను బ్రతుకే... కొత్త మలుపు..ఊ...
ఇది తీయని వాడని ...మన తొలి వలపు

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాజా
పడుచు జంట చెదరీపోదులే...నా రాణీ...

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..

చరణం 3:

నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు
నూరేళ్ళ వెలుగు... నుదుటి బొట్టు
అది నోచిన నోములు... పూచిన రోజున ...పెళ్ళి బొట్టు
కట్టేను నీచేయ్... తాళిబొట్టు
కట్టేను నీచేయ్... తాళి బొట్టు
అది కలకాల కాంతుల... కలిమి చెట్టు

పచ్చ బొట్టు చెరిగిపోదులే ..నా రాణీ
పడుచుజంట చెదరీపోదులే...నా రాజా

పచ్చ బొట్టు చెరిగిపోదులే...

https://www.youtube.com/watch?v=fSRRb7Psdhg
pavithra bhandam - pachha bottu cherigi podule
anr and vanisri

No comments:

Post a Comment