Wednesday 1 January 2020

బాల గోపాలుడు (1989)





ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా...ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత...

చిత్రం : బాల గోపాలుడు (1989)
సంగీతం : రాజ్ - కోటి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి :

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

చరణం 1 :

నీ చూపు పడ్డనాడే చుక్కలాడే
నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే
నీ గాలి సోకగానే సోకులాడె
నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే

ఈ తాకిడి ఒక తారంగము
ముద్దాడితే తొలి తాంబూలము
హత్తుకుంటే హాయి పుట్టసాగే
గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే

శృంగార వీధుల్లో ఊరేగుతుంటే అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే
ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే..హో.. వన్నె చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

చరణం 2 :

నీ కాటు పడ్డ బుగ్గ కందిపోయె
నీ చాటు అందమంతా చిందిపోయె
నీరెండ పడ్డ నీడ నిన్ను కోరె
నీ వెన్నపూస మీద గవ్వలాడె

ఈ చీమలే చలి నారింజలై
పండించినా తొలి గోరింటలై
మత్తుగాలి వీచే మాపటేలా
కొత్త ఊపుకొచ్చే రాసలీల

సయ్యాట తోటల్లో సంపెంగ పూసె.. నీ కంటి పాపల్లో జాబిల్లి కాసె
కళ్యాణాలే కల్లోకొస్తుంటే.. ఓ.. కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె

వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే

ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత

https://www.youtube.com/watch?v=tvXVWeZVq1Q

Bala Gopaludu Movie || Okate Thanuvantha Video Song || Balakrishna, Suhasini || Shalimarcinema
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

No comments:

Post a Comment