Friday 3 January 2020


ఉండలేనంది నా కన్ను నిను కానక...వెన్నదొంగా మరి వేధించకు...శ్యామసుందర కృష్ణా కృష్ణా
2. చిత్రం : విశ్వరూపం
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : శంకర్-ఎహసాన్-లోయ్
గానం : శంకర్ మహదేవన్, కమల్‌హాసన్

సాకీ :
అధినవనీతా... అభినయరాజా..
గోకులబాలా కోటిప్రకాశా
విరహనరక శ్రీరక్షకమాలా
కమ్మని కలలను కదిపితె చాలా
కన్నియ కౌగిలి చేరగలేవా
ఊహల వాకిట ఉండకురా
కల వెన్నెల చిందు వరమ్మీరా
పూతన గర్వమణంచిన వాడా
పాపపు విరహము బలిగొనరారా
మనసుంటే మాయావీరా
రారా రారా (3)

పల్లవి :
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు॥
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా ॥॥
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తయినా మొరాలించవే
గుండె సడినాపి గుండె సడినాపి (2)
 

గమదనిసా నిదపమ గమ రిగరిస
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్నదొంగా మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
ధీం ధీం కిడతకధిన
నటన భావ శ్రుతిలయ గంగా
కిడ తక ధీం ధీం ధీన్నా
నిదురను నీకై త్యజించు
అనవరతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని నీ రాధే నేనని రారాదా


చరణం : 1
ఎవ్వేళ నువ్విలా రివ్వందువోయని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్లంత కళ్లుగా వేచానొక్కో యుగం
వె ల్లువల్లె రారా క్షణమాగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియా సుమం
ఓ... దొంగచాటు కౌగిలింతై... ఈ...
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవంచుల్లోన
కేరింతగా ఫలించు
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే
తన్మయి నేనై తరించాలిరా


చరణం : 2
వదిలిపోని వలపై పైయ్యదగ
హత్తుకోలేవా చెలిని చెలిని కన్నా
తుడిచేసి నా నిదుర విడిచి వెళ్లకంటున్నా
కలని కలని...
ఇక ఈ జన్మలోన నువ్వు కనిపించులోన
చెలి ప్రాణాలు పోతే ఎలా
అని కొరగాని ఆరాటమేలా ప్రియా
నువ్వె ఊపిరిగా జీవించనా
తకతకతకధిం తకతకధిం తకతకధిం
తకతకధిం
తకధిం తకధిం తోం తోం తకిటితోం
తకధిళాంగుతోం తోంకిటత
తక తరికట తక తరికట (2)॥

No comments:

Post a Comment