Sunday 4 October 2015

Pranjali prabha -Birthdays for the mnonth of 10/2015

ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
స్పెషల్ డేస్
 I actually want it to snow. Just not on a day that my loved ones...
సర్వే సజనాసుఖినోభవంతు 

ఉక్కు మనిషీ...

నీకు వేవేల వందనాలు... భారత దేశం ఈ రోజు ఇలా ఉంది అంటే మీ ముందు చూపు వల్లనే కదా మహా మనీషి. విభిన్న సంస్కృతులకూ భాషలకూ ఆలవాలమైన కొన్ని వందల సంస్థానాలని మీ చాకచక్యంతో ఒక్కటిగా కలపటం వల్లనే ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం వర్ధిల్లుతుంది.
బ్రిటీష్ ప్రభుత్వ పన్నులకి వ్యతిరేకంగా మీరు నడిపిన కిసాన్ ఉద్యమం మీకు సర్దార్ అన్న పేరు తెచ్చిందని ఎంతమందికి తెలుసు?

16 రాష్ట్రాల ప్రతినిధులలో 13 రాష్ట్రాల వారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్వతంత్ర భారత తొలి ప్రధానిగా మీ పేరు ప్రతిపాదించినా గాంధీగారి అదేశానుసారం మీ అంత మీరుగా ప్రధాన మంత్రి పదవికి పోటీ నుండి తప్పుకున్నారని చదివినప్పుడు అనిపించింది మీరు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని భారత జాతికి తీరని అన్యాయం చేసారనీ. ఆ నిర్ణయంతోనే ఈ దేశం వారసత్వ పాలనల్లో కొట్టుమిట్టాడుతుంది.

రాజ్యాంగం పౌరులకి కల్పించిన ప్రాధమిక హక్కుల కమిటీకి మీరే అధ్యక్షులన్న సంగతి ఎంత మంది యువతరానికి తెలుసు.? ఆనాటి పాలనా వ్యవస్థ I.C.S ని రద్దు చేసి మీరు ఏర్పరిచిన I.A.S & I.P.S వ్యవస్థని ఈనాటి బ్యూరోక్రాట్లు రాజకీయులూ కలగలిపి నాశనం చేస్తున్న తీరుకు మీరు బతికి ఉంటే ఎంత శోకించేవారో కదా అని అనిపిస్తూ ఉంది.

రజాకారుల దృకృత్యాలతో దారుణ చిత్రహింసలకి గురి అయిన హైదరాబాద్ సంస్థానపు ప్రజలకి నీ సైనిక చర్యతో విమోచన కల్పించి నిజంగా ఉక్కు మనిషి అన్న మీ పేరుని సార్ధకం చేసుకున్నారు.
మరణించిన 4 దశాబ్దాల తరువాత ‘భారత రత్న’ వైన వైనమే మాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభుత్వ బిరుదులలో కన్నా జాతి హృదయాలలో నిలచిపోయే నీ లాంటి వాళ్ళు ఎప్పటికీ మా గుండెల్లో ‘జాతి రత్నాలే’.

అవకాశ రాజకీయ వాదులకి ఇప్పుడు నీ పేరో వరంగా పరిణమిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అంటూ చేస్తున్న ప్రచారాల కన్నా ప్రపంచంలో అగ్రదేశం భారత దేశం అన్న ప్రచారమే మీ లాంటి స్వతంత్ర సమరయోధులకి ఉంటుందని మా నమ్మిక.


(ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన (31.10.1875) సందర్భంగా )

స్వాతంత్య సమర సర్దారు యితడు !


పల్లవి. స్వాతంత్య సమర సర్దారు యితడు,
నీతి, నియమాలకు నిలువెత్తు పేరితడు? ||స్వాతంత్య||

అనుపల్లవి. ఆశయ సిద్ధికై ఆత్మ త్యాగము చేయు,
దేశ భక్తుడైన ధీర పురుషుడు యితడు ? ||స్వాతంత్య||

1. ఉక్కు వంటి ధృడ నిశ్చయము కల్గిన,
చక్కని సాహస వీర సింగము యితడు,
యిక్కట్లు ఎన్ని అడ్డముగ వచ్చిన,
మొక్క పోక సాగు మహనీయు డితడు. ||స్వాతంత్య||

2. గుజరాతు ఘన మాత ముద్దు బిడ్డడు యితడు,
నిజమైన భారత జాతి రత్నము యితడు,
గజమంత ఘనమైన ఆత్మ సంయమముతో,
విజయ శంఖము వూదు వీర పురుషుడు యితడు. ||స్వాతంత్య||

3. ముక్కలై మూల్గెడి భారతా దేశమును ,
ఒక్కటిగ చేసిన ఘన వీరు డితడు,
లెక్క లేనన్ని త్యాగములు చేసిన,
చక్కని ధీరతకు సాదృశ్య మితడు. ||స్వాతంత్య||

4. చాక చక్యముతో సమస్యలు తీర్చి,
ఒక్క త్రాటిపై ప్రజల నడుపు నాయకు డితడు,
ఏకమై అందరు ఏనుగు బలముతో,
ప్రగతి పధమున సాగ బోధించె నితడు? ||స్వాతంత్య||

5. సాహాస చర్యలకు మారు పేరితడు ,
సహన, శాంతి, ప్రేమ కాముకుడు యితడు,
వహ్నిలా చెలరేగి శత్రువుల పరిమార్చు, సేనా
వాహినికి సర్దారు యితడు? ||స్వాతంత్య||


రమాకాంతరావు చాకలకొండ శనివారం, 31 అక్టోబర్ 2015
Visit: http://ramakantha.com / & http://lordbalajisongs.com/

17 అక్టోబర్ ప్రపంచ ట్రామా (గాయాల) దినోత్సవం (17 Oct World Trauma Day)

శరీరానికి కలిగే గాయాలను గ్రీకులొ ‘ట్రామా’ అంటారు. ప్రమాదాలవల్ల కలిగే గాయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దినం పలువురు గాయపడటమో, అంగవైకల్యం సంభవించడమో, మరణించడమో జరుగుతున్నది. ఈ పరిస్థితిపట్ల పౌరుల అవగాహన పెంపొందించి నివారణకై తీసుకోవలసిన జాగ్రత్తలగురించి తెల్యజేయడంకొసం ప్రతీ అక్టొబరు 17వ తేదీని “ప్రపంచ ట్రామా (గాయాల) దినోత్సవం”గా జరుపుతారు.
రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, పడిపోవడం, హింసాయుత చర్యలవంటివేవైనా గాయాలకు కారణం కావచ్చు. అత్యధికులు గాయాలకూ, అంగవైకల్యానికీ, మరణాలకూ గురౌతున్నది ఎక్కువగా రోడ్డుప్రమాదలవల్లనేనని ప్రపంచ ట్రామా సంస్థ నివేదించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 50లక్షలమంది పలురకాలుగా గాయాల బారినిపడ్తున్నారు. వారిలొ కేవలం భారతదేశం‌నుండే 20 లక్షలమంది ఉంటున్నారు. జాతీయ నేర గణనాల సంఖ్య ప్రకారం 2013 సం||లో దాదాపు 1లక్షా 37 వేల మంది గాయాలతో చనిపోయారు. గాయాలు, తద్వారా సంభవించే వ్యాధులు, అనారోగ్యం, వాటి ప్రభావంగా ఆ కుటుంబం ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంవంటివన్నీ ఆందోళన కల్గించే విషయాలు. ఇక క్షతగాత్రులు, మరణించినవారు యువకులైతే జాతీయ ఉత్పత్తితో పాటు ఆర్ధిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతుంది. పౌరులు, సమాజం, ప్రభుత్వం విడివిడిగానూ, సమిష్టిగానూ గాయాలు సంభవించే పరిస్థితులను నివారించడానికి కృషి చేయాలి.

గాయాలకు కారణభూతమైంది అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే కావడంతో పాదాచారులు, ద్వి, త్రి, మోటారు వాహనదారులు తీసుకోవలన జాగ్రత్తలుగురించి అవగాహన కల్పిస్తూ రోడ్ల నిర్మాణం, నిర్వహణలపై విధానాలు రూపకల్పన చేయాలి. రోగానికి చికిత్సకంటే రోగనివారణకు కృషిచేయడమే అత్యుత్తమ విధానం. ప్రతీపౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ప్రమాదాలు, గాయాల నివారణ సాధ్యమౌతుంది.

ప్రమాదాల నివారణకు చేయాల్సినవి.
రోడ్డునిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. వాహనాన్నినడుపేటప్పుడు ఎప్పటికప్పుడు హెచ్చరికలను, ట్రాఫిక్ సంజ్ఞలను పాటించాలి. ద్విచక్ర వాహనాలన్జు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలి. వాహనాలను నడిపేటప్పుడు చరవాణిలో మాట్లాడటం, హెచ్చుస్థాయిలో శబ్దాలనూ, సంగీతాన్ని వినడాన్ని మానుకోవాలి. ఎక్కువ దూరాలు, నిరంతర ప్రయాణాలు చెసేటప్పుడు మధ్యలో ఆగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లలను విద్యుత్ పరికరాలకు, అగ్ని మరియు పేలుడు పధార్ధాలకూ, మందులకూ పదునైన వస్తువులకూ దూరంగా ఉంచాలి. ప్రధమ చికిత్స పెట్టెను అన్నికాలాల్లోనూ వాహనం‌లో ఉంచుకోవాలి. మెట్లు, కిటికీలు, బాల్కనీలనుండి పడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణప్రమాద నివారణకు సంబంధించి ప్రాధమిక నైపుణ్యాలు కల్గిఉండటం ప్రతీ పౌరుడికి అవసరం. ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణంచేసేటప్పుడు పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం, మనమూ పాటించడం అవసరం.

అలాగే చేయగూడని పనులగురించి తెలుకుందాం: అలసిపోయినప్పుడు, నిద్రమత్తుగా ఉన్నప్పుడూ, మద్యం సేవించినప్పుడు వాహనాలు నడపకపోవడం ఉత్తమం. మనకెంత తొందరపని ఉన్నప్పటికీరోడ్డు ట్రాఫిక్ నిబంధనలనుల్లంఘించి వాహనాలు నడపడం మనతోపాటు ఇతర వాహనదారులకూ కూడా ప్రాణాంతకం. ప్రత్యేక నైపుణ్యముతో నడపవలసిన వాహనాలైన రోడ్డు రోలరు, ట్రాక్టర్, లారీలు, పేలుడు పదార్ధాలు రవాణాచేసే వాహనాలు సరదాకోసం నడపడంకూడా సరికాదు. తల, వెన్నుముకలకు గాయాలైన క్షతగాత్రుల తరలింపులో శిక్షణపొందిన వైద్యసిబ్బంది సహకారం తీసుకోవాలి. స్ఫృహకోల్పోయినవారికీ, అపస్మారక స్థితిలోనున్నవారికీ ద్రవపదార్ధాలు తాగించవద్దు.

పోలీసుకేసుతో సంబంధం‌లేకుండా ప్రమాదాల్లో గాయపడ్డవారికి వైద్యం అందించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇండో చైనా, ఇండో పాక్ యుధ్ధాలు జరిగిన గత అరవయ్యవ దశాబ్దిలో పౌరులకు, విద్యార్ధులకు, ఉద్యోగులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చేవారు. అటువంటి యుద్దాలప్పుడు వైమానిక లేదా బాంబులతో దాడిజరిగే సమయం (సాధారణంగా సంధ్యా, సూర్యొదయ సమయాలు), ప్రదేశాలను (పారిశ్రామిక ప్రాంతాలు, ప్రాజెక్టులు) అంచనా వేయడానికి అవకాశముండేది. ప్రస్తుతకాలం‌లో రైల్వే స్టేషన్లు, సినిమాహాళ్ళు, పరిశ్రమలు, ప్రధాన రహదారులతోపాటు అన్ని జనసమ్మర్ధప్రదేశాలూ యుధ్ధరంగాలే. ఈ పరిస్థితులకుతోడుగా ప్రధాన నగరాలు, రెండవ శ్రేణి పట్టణాలన్నింటికీ తీవ్రవాదుల దాడి పొంచిఉంది.

ప్రమాదగ్రస్తులకు మొదటిగంట కాలం సంజీవని వంటింది. ఈ కీలకసమయం‌లో అందించబడే పరిచర్యలతోనే ప్రాణాపాయం‌నుండి బయటపడ్తారు. విద్యార్ధులకు పాఠశాలస్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు, ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులకు, యువతకు సివిల్ డిఫెన్సులో శిక్షణ గరిపితే ఆపత్సమయాలలో బాధితులకు ఆసరా అందుతుంది. విధాన నిర్ణేతలు, ప్రణాలికావేత్తలు ఈ దిశగా ఆలోచించడం ప్రస్తుతకాలపు అవసరం.



 12 అక్టోబర్ ఐక్యరాజ్యసమితి స్పానిష్ భాషాదినోత్సవం (12 UN Spanish Language Day)
ఐక్యరాజ్యసమితి అధికారభాషలైన అరబ్బీ, చైనీస్, ఇంగ్లీష్, ఫెంచ్, రష్యన్ మరియు స్పానిష్‌లన్నింటికీ సమాన గౌరవం ఇవ్వడం కొరకు ఈ భాషలన్నింటినీ వాటి సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం ఆయా తేదీల్లో భాషాదినోత్సవాలను నిర్వహిస్తుంది.

స్పెయిన్ జాతీయ దినోత్సవమైన అక్టోబర్ 12 వతేదీని ఐక్యరాజ్యసమితి స్పానిష్ భాషాదినోత్సవంగా జరుపుకుంటారు. స్పెయిన్ జాతీయ దినోత్సవానికీ భారతదేశానికీగల అవినాభావసంబంధం ఆసక్తికరంగా ఉంటుంది.

మధ్యయుగాల్లోని భారతదేశపు సిరిసంపదలగురించి పాశ్చాత్యదేశాల్లో విపరీతమైన క్రేజీ ఉండేది. ఇక్కడి సుగంధద్రవ్యాలు, అతి నాజూకైన పట్టువస్త్రాలకు ఆదేశాల్లో చాలాగిరాకీ ఉండేది. ఆ కాలాల్లో పశ్చిమదేశాలను భారతదేశానికి అనుసంధానంచేసే మధ్యాసియా భూమార్గం టర్కీ తదితర ముస్లీంల ఆధీనం‌లోకి వెళ్లడంతో పాశ్చాత్యులు తమ వ్యాపారం కోసం మరో మార్గాన్ని వెదుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు సముద్రమార్గం అత్యంత దూరమైంది కావడంతో పశ్చిమంగా సముద్రమార్గాన్ని అన్వేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

ఆరగాన్‌కు చెందిన రెండవ ఫెర్డినాండ్, కాజిల్‌కు చెందిన మొదటి ఇసాబెలాలతో పాటు స్పెయిన్ దేశానికి చెందిన కొందరు వ్యాపారవేత్తల ఆర్ధిక సహకారంతో ఇటలీకి చెందిన క్రిష్టఫర్ కొలంబస్ నినా, పింటా, సాంట్రా మారియా అనే మూడు ఓడల్లో ఆగస్టు 3 (1492) వ తేదీన బయలుదేరి అక్టోబర్ 12వతేదీన వెస్ట్ ఇండీస్ చేరుకుని ఆభూభాగాన్నే భారతదేశంగా భావిస్తాడు. తదుపరి కాలం‌లో మరోమూడు యాత్రలుచేసి మరికొన్ని ప్రాంతాలను స్పెయిన్ రాణి ఖాతాలోకి తెస్తాడు. కొలంబస్ ప్రారంభించిన యాత్ర తూర్పు పశ్చిమ దేశాలమధ్య కొత్త అద్యాయానికి బాటలువేసింది.

క్రిష్టఫర్ కొలంబస్ అన్వేషణ విజయవంతం కావడం పలువురు ఉత్సాహవంతులైన నావికులు సముద్రయానం ప్రారంభించారు. పోర్చుగల్‌కు చెందిన వాస్కోడాగామా 1948 (మే 20 వ తేదీన) మనదేశపు పశ్చిమతీరమైన కాలికట్ చేరుకుంటాడు.
తమదేశం నూతన ప్రాంతాలపై ఆధిపత్యానికి నాందిపలికిన అక్టోబర్ 12 వ తేదీని స్పెయిన్ దేశస్తులు తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే తేదీన ఐక్యరాజ్యసమితిలో స్పెయిన్ భాషాదినోత్సవంగా జరుపుకుంటారు.

గీత రచయిత 'కొసరాజు !
(''పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' ).
.
జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా
తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి
..”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా
“రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”
అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు
ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.
''పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' అని స్వయంగా ప్రకటించుకున్న
జానపద గీతాల రారాజు గురించి ఎంతరాసినా తక్కువే. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా,
.
వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా,
.
.నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, ,
చెంగుచెంగునా గంతులు వే... .... యండి, ... సరదా సరదా సిగిరెట్టు, .... ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు...
ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మూడువేలకు పైగా గీతాలు రాసి 'కవిరత్న'గా, 'జానపద కవి సార్వభౌముడు'గా పండిత పామరుల మన్ననలు పొందినవారు కొసరాజు రాఘవయ్య చౌదరి.
.
కేవలం హాస్యప్రధానమైన పాటలే గాకుండా, విభిన్నమైన అంశాలపై మంచి పాటలు రాశారు కొసరాజు. ''గాఢాంధకా రమలముకున్నా భీతి చెందక ! నిరాశలోనే జీవితాన్ని కుంగదీయక'' అనే ఉత్తేజభరితమైన పాటలను రాశారు. ఉన్నవారు,
''లేనివారని బేధాలు తొలగిపో వాలనే భావంతో'' కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా; అని ప్రశ్నించారు. '
'తోడికోడళ్ళు'' చిత్రం కోసం ''ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది'' అంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటారు.
.
అభ్యుదయ భావాలతో, సామ్యవాద దృక్పధంతో సమాజంలోని అవినీతిని ఎండగడుతూ అధిక్షేప గీతాలు రచించిన కొసరాజు పౌరాణిక చిత్రాలకు సైతం రసోచిత గీతాన్ని రాశారు.
.
''మంచి మనసులు'' సినిమాకోసం ''మావా మావా మావా!ఏమే భామా భామా''అంటూ రాసిన పాట, సంగీతం సమకూర్చిన మహాదేవన్‌ గారిని స్వ రాల మామను చేసింది. ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు పరస్పరం కవ్వించుకునే గీతం ''వాలు వాలు చూపుల్తో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దించుతారు మీరుగాదా'' అనేవి, ఆ తర్వాత తెలుగునాట ప్రేమోక్తలయ్యాయి. ఘంటసాల, జమునారాణి పాడిన ఈ పాట వారికి కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది.
''దులపర బుల్లోడా! దుమ్ము దులపర బుల్లోడా'' పాట భానుమతిగారి నోట రసవంతంగా వినిపించేలా రాశారు.
మూగజీవుల పట్ల కారుణ్యభావాల్ని ప్రకటిస్తూ ''వినరా వినరా నరుడా; తెలుసుకోర పామరుడా;'' అనే పాటను గోమాత స్వగతంగా రాశారు. ''చెంగుచెంగున గంతులు వేయండి'' పాటకూడా ఈ భావంతో సాగేదే.
ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ''నవభారతం'' బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్‌, ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. తెనాలి క్లాసికల్‌ ఫిలిమ్‌ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.
''వ్రాసిన మాటలే వ్రాయుట కంటె, పాడిన పాటలే పాడుట కంటె, సరికొత్త రచనల సాగించినపుడె, కవి చమత్కారాన కథ రక్తికట్టు''- అంటూ నవ్యతకోసం పరితపించిన కొసరాజు తెలుగుభాష ఎంత కమ్మగా, కమనీయంగా ఉంటుందో తన రచనల్లో చూపారు. ''జాను దేశి కవిత నా నుడికారమ్ము, ఏ నిఘంటువులకు నెక్కకుండు, చిన్ననాటి నుండి జీర్ణించుకొన్నాను, పల్లెపదములన్న పరమ
ఆయన తెలుగువాడిగా పుట్టినందుకు అనేక సందర్భాల్లో ఎంతో గర్వించారు. ఎన్నో పద్యాలు రాశారు. ''రైతు జన విధేయ రాఘవయ్య'' మకుటంతో రాసిన శతకంలో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటారు. ''సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...' అంటూ వాపోయారాయన.
కాదేదీ కవితకు అనర్హమన్న రీతిలో చెట్టు, గట్టు, పుట్ట, అట్టు, సిగరెట్టు, పండుగలు, పేకాటలు, తాగుళ్ళు, ఇల్లరికపుటల్లుళ్ళ గురించి ఎన్నో పాటలు రాశారు. వినోదాన్ని విషాదాన్ని, భక్తిని, రక్తిని సమయోచితంగా తనకలం ద్వారా ఆవిష్కరించాడు. సామెతలు, పలుకుబళ్ళు, తెలుగునుడికారంతో గేయ సాహిత్యానికి వన్నె తెచ్చిన కొసరాజు 1984లో రఘుపతి వెంకయ్య అవార్డును, 1985లో కళాప్రపూర్ణ బిరుదును పొందారు.
అభ్యుదయకవిగా, ప్రజాకవిగా, రైతుపక్షపాతిగా ఆంధ్రసాహితీ మాగాణంలో తెలుగునుడికారపు పంటలు కొల్లలుగా పండించిన కొసరాజు బుద్దిమానుకోని పేకాటరాయుళ్ళ మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిందీపాట. ఇంకా ''భలే ఛాన్సులే... ఇల్లరికంలో ఉన్న మజా'' 'సరదా సరదా సిగరెట్టు'' 'ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా'', 'మంగమ్మా: నువ్వుఉతుకు తుంటే అందం'' అనే హాస్య గీతాలెన్నిం టినో తన కలం ద్వారా ఒలికించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ''కొండవీటి వైభవం' (ఖండకావ్యం), గండికోటయుద్ధం (ద్విపద కావ్యం), కొసరాజు విసుర్లు, సిన్మాడైరెక్టర్‌ అనే పుస్తకాలను రాసి సాహిత్య లోకానికి అందించారు. చివరిసారిగా సురేష్‌ ప్రొడక్షన్‌ వారి ''గురుబ్రహ్మ''చిత్రానికి 1986 అక్టోబర్‌ 27వ తేదీన ''వినరా, ఆంధ్రకు మారా'' అనే బుర్రకథను రాసి, అదేరోజు రాత్రి పది గంటలకు పరమపదించారు. ఆయన హేతువాది. ఏరువాక... ఏటినీరు ఉండేంతవరకు కొసరాజే రసరాజు.
ఈ యన చెప్పులు కూడా వేసుకొనేవారు కాదు. బెంగుళూరు లో మా ఇంటికి వచ్చేవారు .. మంచి మిత్రుడు .. మంచి భోజన ప్రియుడు .. 

అయన జ్ఞాపకాలు మధురాతి మధురాలు.


అస్తమించిన సినీ ప్ర‘పూర్ణు’డు (ప్రముఖ నిర్మాత ఏడిదనాగేశ్వరరావు కన్నుమూత)(04-10-2015)
ఏడిద నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినిమాయే కాదు, మొత్తంగా తెలుగు జాతే గర్వించదగ్గ గొప్ప చిత్రాలను నిర్మించిన ఓ శకం ముగిసినట్లయింది. కళాతపస్విగా కాశీనాథుని విశ్వనాథ్‌ పేరుపొందడంలో ఏడిద పాత్ర స్మరణీయం. విశ్వనాథ్‌ మేధస్సు నుంచి జాలువారిన ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి క్లాసిక్స్‌కు దన్నుగా నిలిచింది నాగేశ్వరరరావే. వాస్తవానికి ఏడిద నాగేశ్వరరావు అనే పేరు కంటే ఆయన నెలకొల్పిన నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌ అనే పేరే ఎక్కువ పాపులర్‌. అంతగా ఆ బేనర్‌ తెలుగువాళ్ల హృదయాల్లో చొచ్చుకుపోయింది. ఆ బేనర్‌పై ఆయన నిర్మించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం
తెలుగు చలనచిత్ర రంగానికి అణిముత్యాల లాంటి సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (81) నేడు (ఆదివారం) అనారోగ్యంతో నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏడిద మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
1934 ఏప్రిల్ 24న జన్మించిన నాగేశ్వరరావు పూర్ణోదయ ఆర్ట్స్‌ పతాకంపై సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వరకల్పన, ఆపద్భాంధవుడు వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ కాంబినేషన్ లోనే ఆరు సినిమాలు నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించారు. స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాల్లో చిరంజీవి హీరో కాగా సాగరసంగమం, స్వాతిముత్యం చిత్రాలలో కమల్ హీరోగా నటించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో స్వాతిముత్యం, సీతాకోకచిలుక, సితార, ఆపద్బాంధవుడు, సాగరసంగమం చిత్రాలు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్‌గా నంది అవార్డులను గెల్చుకున్నాయి. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నాయి
ఏడిద నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినిమాయే కాదు, మొత్తంగా తెలుగు జాతే గర్వించదగ్గ గొప్ప చిత్రాలను నిర్మించిన ఓ శకం ముగిసినట్లయింది. కళాతపస్విగా కాశీనాథుని విశ్వనాథ్‌ పేరుపొందడంలో ఏడిద పాత్ర స్మరణీయం. విశ్వనాథ్‌ మేధస్సు నుంచి జాలువారిన ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి క్లాసిక్స్‌కు దన్నుగా నిలిచింది నాగేశ్వరరరావే. వాస్తవానికి ఏడిద నాగేశ్వరరావు అనే పేరు కంటే ఆయన నెలకొల్పిన నిర్మాణ సంస్థ పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌ అనే పేరే ఎక్కువ పాపులర్‌. అంతగా ఆ బేనర్‌ తెలుగువాళ్ల హృదయాల్లో చొచ్చుకుపోయింది. ఆ బేనర్‌పై ఆయన నిర్మించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘సిరిసిరి మువ్వ’ (1976) సినిమా నుంచి ‘ఆపద్బాంధవుడు’ (1992) వరకూ విశ్వనాథ్‌తో నాగేశ్వరరావు అనుబంధం కొనసాగింది. చివరి సినిమా ఆర్థికంగా ఆశించిన రీతిలో ఆడకపోవడాన్ని మినహాయిస్తే, విషయపరంగా అన్ని సినిమాలూ ఉత్తమ చిత్రాలుగా పేరు పొందాయి. నిజానికి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలోనూ ఆయన పది పైసల వాటాదారు. యాభై ఏళ్లు పైబడిన జె.వి. సోమయాజులు కథానాయకుడిగా తీసిన ‘శంకరాభరణం’ చిత్రం ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆ సినిమా ఆయనకు ‘ఇంటర్నేషనల్‌ వీసా’ అయింది. భారతీరాజా డైరెక్షన్‌లో ఆయన నిర్మించిన ‘సీతాకోకచిలుక’ (81), వంశీ డైరెక్షన్‌లో తీసిన ‘సితార’ (83), ‘స్వరకల్పన’ (89) చిత్రాలు సైతం ఆయన ఉత్తమ కళాభిరుచికి నిదర్శనాలు. ఆ దర్శకుల కెరీర్‌లో ఆ సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కొమ్మినేని దర్శకత్వంలో ‘తాయారమ్మ బంగారయ్య’ (79) వంటి ఆరోగ్యవంతమైన హాస్యరస చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. షావుకారు జానకి, కైకాల సత్యనారాయణ టైటిల్‌ రోల్స్‌ చేసిన ఆ చిత్రంలో చిరంజీవి యువ కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత కాలంలో కమర్షియల్‌ స్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవికి కళాత్మక చిత్రాల్లో నాయకుడిగా నటించాలనే దాహాన్ని తీర్చింది నాగేశ్వరరావే. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ చిత్రాలను విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించారు. ‘రుద్రవీణ’ కాకుండా చిరంజీవిలోని అసలైన నటుణ్ణి వెలికి తీసినవి ఈ చిత్రాలే కావడం గమనార్హం. కమల్‌హాసన్‌ నట జీవితంలో ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ ఎంత గొప్ప పేరుతెచ్చుకున్నాయో తెలిసిందే. తన చిన్న కుమారుడు శ్రీరామ్‌ను హీరోగా పరిచయం చేయడానికి కూడా ఆయన ఓ సంగీత ప్రధాన కథనే ఎంచుకున్నారు. ఆ సినిమా ‘స్వరకల్పన’.
ఆయన చిత్రాల్లో పాటలు కూడా ఆయన కళాత్మక అభిరుచికి నిదర్శనాలు. ఆయన చిత్రాలు కేవలం తెలుగు నేలకే పరిమితం కాలేదు. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఉత్తమాభిరుచి ప్రేక్షకులనూ, విమర్శకులనూ అమితంగా ఆకట్టుకున్నాయి. నంది అవార్డులతో పాటు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయన పేరును విశ్వవ్యాప్తం చేశాయి. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్‌ నుంచి సినిమా వస్తున్నదంటే దానికి అవార్డులు ఖాయమని ముందే నిర్ణయానికొచ్చేవారు సినీ ప్రియులు. అదీ ఏడిద సాధించుకున్న ఘనత. ఒకప్పుడు విజయ, వాహిని సంస్థలు తెచ్చుకున్న పేరును అనంతర కాలంలో సాధించింది పూర్ణోదయా సంస్థే. ‘ఉన్న పరిస్థితిల్లో మనం ఇమడలేనప్పుడు మనం ఇమడగల పరిస్థితులను సృష్టించుకోవాలి. అయితే అది టైమ్‌ టేకింగ్‌ ప్రాసెస్‌. ఈ లోపు పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్‌మెంట్స్‌ వంటి బాధ్యతలు నిర్వరించాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను. ప్రస్తుతం మా పూర్ణోదయా స్టైల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌కు అనువైన, అనుగుణమైన కథలు, వ్యక్తుల అన్వేషణలో ఉన్నాం. ఎప్పుడు తీస్తానో తెలియదు కానీ మా పూర్ణోదయాలో తదుపరిసినిమా తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తీసింది తొమ్మిది సినిమాలే అయినా వాటితోనే తెలుగు చిత్రరంగం అందించిన గొప్ప నిర్మాతల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు.

వివాహం
డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా మేనమామ కూతురు జయలక్ష్మితో 1954 ఏప్రిల్‌ 24న వివాహం జరిగింది. ఆయన పుట్టినరోజు, పెళ్ళిరోజూ ఒకటే. ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ స్థాయిలో స్వర్ణకమలాన్ని అందుకున్నది కూడా అదే తేదీన.
నాటకాల రాయుడు
కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌ లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్‌ మెడల్‌ను కూడా అందుకున్నారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్‌మీడియట్‌ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్‌ క్లబ్‌’లో కొన్ని నాటకాలు ఆడారు. ఆత్రేయ రాసిన ‘విశ్వభారతి’, ‘పరివర్తన’, ‘ఓటు నీకు’ వంటి నాటకాల్లో నటించినందుకుగానూ బహుమతులు అందుకున్నారు. పిఠాపురం రాజాస్‌ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్‌లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ పరిచయమయ్యారు. వడ్డాది సూర్యనారాయణమూర్తితో కలిసి ఈ ఇద్దరూ కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి అనే నాటక సమాజాన్ని మొదలుపెట్టారు. 26 ఏళ్ళ వయసులో నాగేశ్వరరావు ‘కప్పలు’ నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకుగానూ ఆయనకు పరిషత్‌ పోటీలలో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. నిర్మాత కాక ముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. ‘రణభేరి’, ‘నేరము శిక్ష’, ‘బంగారుబాబు’, ‘మానవుడు దానవుడు’, చిననాటి స్నేహితులు’ తదితర చిత్రాల్లో నటించారు.
‘శంకరాభరణం’తో ఖండాతర ఖ్యాతి
సింగిల్‌ షెడ్యూల్లో 52 రోజుల్లో రూ.11 లక్షల వ్యయంతో ‘శంకరాభరణం’ను నిర్మించారు ఏడిద. జాతీయ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను తెచ్చుకున్న సినిమా. ఈ సినిమాను మలయాళంలోకి డబ్‌ చేశారు. అయితే పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు. ఎర్నాకులంలోని కవితా థియేటర్లో రెండేళ్ళు ఆడింది. అమెరికాలోనూ విడుదల చేశారు. 20 మంది యూనిట్‌ సభ్యులు అమెరికాలో 45రోజుల పాటు శంకరాభరణం నైట్స్‌ను నిర్వహించారు. తెలుగు సినిమాకు అమెరికాలో అంతగా బ్రహ్మరథం పట్టడం అదే ప్రథమం. జాతీయ స్థాయిలో స్వర్ణకమలం కూడా సాధించింది. ఈస్ట్‌ ఫ్రాన్స్‌లో సంగీత ప్రధాన చిత్రాలు మాత్రమే పాల్గొనే బెసన్‌కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ను తెరకెక్కించారు. అది జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకాన్ని, రాష్ట్ర స్థాయిలో బంగారు నందిని అందుకుంది. అలీకి ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘సాగర సంగమం’. బెంగుళూరులో 575రోజుల అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమా అది. నేటివిటీ మార్పులతో తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఒకేసారి విడుదలైన సినిమా ఇది. తమిళంలో ‘సలంగై ఒళి’ పేరుతోనూ మలయాళంలో ‘సాగరసంగమం’ అనే పేరుతోనే విడుదలైందీ సినిమా. ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. బాలసుబ్రమణ్యంకు బెస్ట్‌సింగర్‌గా జాతీయ అవార్డు వచ్చింది.



5 అక్టోబర్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం (5 Oct World Teachers DaY)

ఉపాధ్యాయ మిత్రులందరికీ “ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు”

“అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం
తత్పదం దర్శితం ఏన తస్మైత్ శ్రీ గురవేన మహః”

సకల చరాచర జగత్తులో వ్యాపించిన గురువుపాదాలను ప్రణమిల్లితే దేవుళ్ళందరినీ ప్రార్ధించినట్లేనని అనాదిగా భారతదేశ చరిత్ర, సంస్కృతి చెబుతున్నాయి.

"అన్ని మతాలూ, అందరు దేవుళ్ళు మౌఢ్యాన్ని బోధిస్తే, విచక్షణతో ఆలోచించమని గురువు మాత్రమే బోధించాడు” ఇది ఒక నాస్తికుడి భావన.

“మీ సమాజం ఒక్క సంవత్సరం బతకడానికి వరిపండించండి, దశాబ్దకాలం జీవించాడానికి పండ్లతోటలు పెంచండి, ఒక శతాబ్దకాలం విరాజిల్లడానికి విద్యనేర్పండి” చైనా సామెత.

దేవుణ్ణి సంశయించేవారు సైతం గురువు ప్రాధమ్యాన్ని అంగీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ తమతమ సంస్కృతీ సాంప్రదాయాలకనుగుణంగా ఉపాధ్యాయ దినొత్సవాన్ని జరుపుకుంటూ గురువులను గౌరవిస్తున్నాయి.

యునెస్కో, యునిసెఫ్, ఐయల్‌ఓ సం‌యుక్తంగా ప్రతీ అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

సమాజం శాంతియుతంగా మనుగడ సాగించడానికి విద్య, విద్యాబోధనకు ఉపాద్యాయుడు అవసరం. యునెస్కో విద్య మరియు ఉపాధ్యాయుడిపై చర్చించడానికి 1966 సం||లో అక్టోబర్ 5వ తేదీన సభ్యదేశాలతో సమావేశమై ‘ప్రపంచం‌లో శాంతి నెలకొల్పడానికి విద్యయే ఏకైక సాధనమనీ, సభ్యదేశాలన్నీ విద్యావ్యాప్తికి కృషిచేయాలనీ తీర్మానిస్తూ, ఉపాధ్యాయుడి హక్కులనూ, బాధ్యతలనూ నిర్వచించింది. సామాజికమార్పుకోసం, అభివృధ్ధికోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న గౌరవించడంకొరకు 1994లో ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని’ ప్రకటించింది. ఇందుకోసం 1966నాటి అక్టోబర్ 5 వతేదీని గుర్తించింది. అప్పటినుండి ప్రతీ సంవత్సరం ఒక్కొక్క ప్రస్తాపం లేదా నేపధ్యం(ధీం)తో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నది. “ స్థిరత్వ సాధనకోసం ఉపాధ్యాయుడి సాధికారత” అనే ప్రస్తాపంతో 2015 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది.

ప్రతీ గురువూ ఒక తత్త్వవేత్త, ఒక విశ్వసనీయ మిత్రుడు, ఒక మార్గదర్శకుడు. వీటన్నింటికి ఆచరణను మిళితం చేసి దేశానికి మార్గదర్శకత్వం చేసిన గురుదేవుళ్ళు డా| సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రత్యేకరాష్ట్రంతోనే తెలంగాణాలో అభివృధ్ది శాంతి సాధ్యమని దిశానిర్దేశం చేసిన ప్ర్రొ|| జయశంకర్, ప్రొ|| జనార్ధన రావులు ప్రాతః స్మరణీయులు.
ఆస్తిపాస్తులకన్నా అక్షరజ్ఞానం అవసరమని చెప్పిన మా అమ్మ శ్రీమతి రాజ్యలక్ష్మి, వ్యవహారజ్ఞానం లేనివాడు వట్టిపోయున పొదుగూ రెండూ సమానమేనంటూ లోకజ్ఞానాన్ని చెప్పిన మా బాపు (నాన్న) కీ|| శే|| నరసింహా రావు గారూ, అక్షరాభ్యాసం చేయించిన కీ|| శే|| కందాళై రత్నమాచార్య, నైతిక విలువలు నేర్పిన ముప్పిడొజు రామాచారి, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడుకు ప్రతిరూపమైన గురువు శ్ర్రీ డోలి రాజలింగం గార్లకు “ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ” సందర్భంగా పాదాభివందనం.

 4 అక్టొబర్ ప్రపంచ జంతు దినోత్సవము (4 Oct World Animal Day)
ప్రపంచవ్యాప్తంగా జంతువుల స్థాయిని, గౌరవాన్ని మెరుగుపరచడం ప్రపంచ జంతు దినోత్సవం యొక్క ముఖ్యొద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా జంతు సంక్షేమంకోసం కృషిచేస్తున్న వ్యక్తులనూ, సంస్థలనూ ఒకేవేదికపైకి చేర్చి జీవవైవిధ్యం‌లో భాగమై, మానవ మనుగడకు అనివార్యమైన జంతుసంపదను పరిరక్షించడం, వృధ్ధిచేయడం, జంతువులకూ సరియైన గౌరవాన్ని అందజేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
పలుకారణాలుగా అంతరించిపోతున్న జంతుసంపదవల్ల ఏర్పడుతున్న విషాదపరిణామాలను అనుభవిస్తున్నాం.
ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాశ్ మంధనిగారు వాట్సప్ ద్వారా జంతువుల పరిరక్షణకు సంబంధించి పంచుకున్న వీడియోను మనముఖపుస్తక మిత్రులకోసం.
ప్రొ|| జ్ఞాన ప్రకాశ్‌గారు హైద్రాబాద్ జయశంకర్ వెటర్నరీ విశ్వవిద్యాలయం‌లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఇంత చక్కని వీడియోను అందజేసినందుకు మనందరి తరఫున కృతజ్ఞతలు.
4 అక్టొబర్ ప్రపంచ జంతు దినోత్సవము (4 Oct World Animal Day)
ప్రపంచవ్యాప్తంగా జంతువుల స్థాయిని, గౌరవాన...

No comments:

Post a Comment