Friday 30 October 2015

02.రెండు రెళ్ళు ఆరు (1985) , 03యముడికి మొగుడు (1988) ,04. మరణ మృదంగం (1988) ,05మనసారా (2010),06ఉయ్యాల జంపాల (1965) ,07కాళహస్తి మహత్మ్యం, 09భూకైలాస్ (1958), 09డాక్టర్ చక్రవర్తి, 10ఆత్మ బంధువు , 11 మంచి మనసులు

ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు 










కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి...కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

చిత్రం : మరణ మృదంగం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర

పల్లవి:

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం 1:

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం 2:

మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..

https://www.youtube.com/watch?v=eAaGcE7M1Qk
Marana Mrudangam Full Songs - Kottandi Tittandi Song - Chiranjeevi, Radha, Ilayaraja
Click here to watch Dalapathi Movie Full Songs - http://www.youtube.com/watch?v=YPc3UHKhk7U&list=PLB...







పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా..ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్‌చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : గీతామాధురి

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వు ఎవ్వరైనా పర్లేదు
ఓ... నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు
ఎందుకే దాగుడుమూతలు అర్థమే లేదు
మచ్చేదో ఉన్నాదనీ మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు
రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు
మసిలాగ ఉంటుందని
తిడతామా రాతిరిని తనలోనే కనలేమా
మెరిసేటి సొగసులనీ అందంగా లేను అనీ
నిన్నెవరూ చూడరని నువ్వెవరికి నచ్చవనీ
నీకెవ్వెరు చెప్పారు ఎంత మంచి మనసో నీది
దాని కన్న గొప్పది లేదు
అందగాళ్లు నాకెవ్వరూ ఇంత నచ్చలేదు
నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

హాఅ..ఆఆహహహాఅ..హా...
అంతలేసి కళ్లుండకున్నా నాకు పర్లేదు
కోరమీసం లేకున్నా గాని మరి పర్లేదు
పరదాలే ఎన్నాళ్లిలాఅని నిన్నే అడగమనీ
సరదాగా తరిమిందే మదినీపై మనసుపడి
మురిపించే ఊహలతోఒకచిత్రం గీసుకొని
అది నువ్వు కాదోననిసందేహం ప్రతిసారీ
చేరదీసి లాలించలేదునన్నిలా ప్రేమించలేదు
అందుకే ఇంకెవ్వరూ ఇంత నచ్చలేదు
ఎవరేమన్నా సరేనా చేయి నిన్నింక వదిలేదిలేదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా
ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు

https://www.youtube.com/watch?v=VkNRIbmchc0
Manasara Telugu Movie HD Video Song | Paravaledu Song | Sri Divya | Ravi Babu
Manasara Telugu Movie, Starring Vikram, Sri Divya, Bhanu Chander, George Vincent, Ramaraju, Ravi Pra...




మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా...నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా...

చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)

రచన: తోలేటి

గానం: ఘంటసాల

సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం

ఓమ్

ఓమ్ నమః శివాయా...

నవనీత హృదయా.

తమః ప్రకాశా..

తరుణేందు భూషా.

నమో శంకరా! దేవదేవా..

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా

మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ|

పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ|

మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా నీలకంధరా

మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త|

మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో|

నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ|

వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల|

మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా

నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా

ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున|

ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ|

దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి|

వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|
https://www.youtube.com/watch?v=5gATjEKv2w0
Kalahasti Mahatyam Superhit Songs - Telugu Movie Golden Hits
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...

   
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ...

చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
తగునా వరమీయా ఈ నీతి దూరునకు.. పరమా పాపునకూ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
స్నేహముమీరగ నీవేలగా ద్రోహము నే చేసితీ
పాపకర్ము దుర్మదాంధు నన్ను సేపక దయ చూపి నేలా...
హర... తగునా వరమీయా ఈ నీతి దూరునకు పరమా పాపునకూ

చరణం 1:

మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
మంగళదాయిని మాతపార్వతిని మతిమాలి మోహించితీ
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా
కన్నులనిండే శూలాన పొడిచీ కామముమాపుమా

తాళజాలను.. సలిపిన ఘనపాప.. సంతాప భరమీనిక
చాలును.. కడ తేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము
ఓనాటికి మతి వేరేగతి మరిలేదూ
ఈ నీచుని తల ఇందే తునకలు కానీయ్..
వేణియద వసివాడి
మాడి మసి మసి కానీ
పాపము బాపుమా నీదయ చూపుమా నీదయ చూపుమా...

చరణం 2:

చేకొనుమా దేవా శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా
శిరము చేకొనుమా దేవా..
శిరము చేకొనుమా దేవా ..
చేకొనుమా దేవా శిరము... చేకొను మహాదేవా

మాలికలో మణిగా నిలుపూ
కంఠమాలికలో మణిగా... నిలుపూ
నా పాప ఫరము తరుగు విరుగు
పాప ఫరము తరుగూ విరుగూ...
పాప ఫరము తరుగూ విరుగూ
చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా
https://www.youtube.com/watch?v=H3soyvaB8R4
Thagunaa Varameeya - "Telugu Movie Full Video Songs" - BhooKailas(NTR,ANR,Jamuna)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా...నేనే ...పరవశించి పాడనా

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా...
నేనే ...పరవశించి పాడనా
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 1:

నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే ఆ ఆ ఆ ఆ
నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే
నీకుగాక ఎవరికొరకు నీవు వింటే చాలు నాకు
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 2:

చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
ఆ పూవులన్ని మాటలై వినిపించు నీకు పాటలై
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా

చరణం 3:

ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా
https://www.youtube.com/watch?v=mW3hm68v0us
DrChakravarthi - padamani Nannadagavalenaa
ANR - Geetanjali - Shavukaru Janaki's Old Melodious Beautiful Song - Duets - Dance - Telugu -Teluguo...
 మంచి మనసులు
అహో ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజా!
ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
కనుచూపు కరువైన వారికైనా
కనుచూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు
ఒక చెంత శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలికించు నగరానికొచ్చాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
ఏకశిలరథముపై లోకేశు వడిలోన
ఓరచూపులదేవి ఊరేగి రాగా
రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి
సరిగమా పదనిసా స్వరములే పాడగా
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ
శిలలపై శిల్పాలు చెక్కినారు
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
రాజులె పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు మారినా గాడ్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టిపాల్జేసినా
ఆ... ఆ... ఆ... ఆ...
చెదరనీ కదలనీ శిల్పాల వలెనే
నీవు నా హృదయాన నిత్యమై సత్యమై
నిలిచివుందువు చెలీ
నిజము నా జాబిలీ


Manchi Manasulu Songs - Silalapai Silpalu Movie: Manchi Manasulu, Cast: Akkineni Nageswara Rao,…

No comments:

Post a Comment