Monday 19 October 2015

గౌరీ
కలెక్టర్ జానకి
అంగడిబొమ్మ
జీవితం
నాగమల్లి
జీవితంలో వసంతం
జీవన తీరాలు
కోరుకున్న మొగుడు


చిత్రం: గౌరి (1974)
సంగీతం: శ్రీ సత్యం
సాహిత్యం: శ్రీ దాశరథి
పాడినవారు: శ్రీ శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం..పల్లవి:

గల గల పారుతున్న గోదారిలా...
రెప రెప లాడుతున్న తెరచాపలా...
ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...
నీ జీవితం సాగనీ... హాయిగా... హే...

గల గల పారుతున్న గోదారిలా...

చరణం 1:
అందాల పందిరి వేసే ఈ తోటలూ
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులు... కడవలు మోసే కన్నెలు
బంగరు పంటల సీమలు... చూడరా.. హే..

గల గల పారుతున్న గోదారిలా...
రెప రెప లాడుతున్న తెరచాపలా...
ఈ చల్లని గాలిలా... ఆ పచ్చనీ పైరులా...
నీ జీవితం సాగనీ... హాయిగా... హే...

గల గల పారుతున్న గోదారిలా...

చరణం 2:
దేశానికాయువు పోసే ఈ పల్లెలు...
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే...
న్యాయం కోసం పోరుటే...
పేదల సేవలు చేయుటే... జీవితం... హే

గల గల పారుతున్న గోదారిలా...
https://www.youtube.com/watch?v=qVW_Wi_dfOQ
GalaGala Parutunna - GOWRI
Gala Gala Paarutunna From the movie GOWRI
Old is Gold.
Singers: P Suseela,Jamunarani
Lyrics: C Narayana Reddy
Music Director: V Kumar..

వలచిన మనసే అలయం అది ఒకే దేవునికే నిలయం.

వలచిన మనసే ఆలయం ! అది ఒకే దేవునికి నిలయం
ఆ దేవుని అలరించు దారులు రెండు ఒకటి అనురాగం ! ఒకటి ఆరాధనం

నీ వన్నది నీ వనుకున్నది - నే నన్నది ఇలలో వున్నది
నీ వన్నది నీ వనుకున్నది - నే నన్నది ఇలలో వున్నది
నీ మదిలో మెదిలే స్వప్నమది - స్వప్నంకాదు, సత్యమిది
మాయని జీవిత సత్యమిది

ఒక హృదయంలో నివసించేది - ఒకే ప్రేమికుడు కాదా !
ఒక హృదయంలో నివసించేది - ఒకే ప్రేమికుడు కాదా !
ఆ ప్రేమికుని మనసార చూసే - ఆ ప్రేమికుని మనసార చూసే - కన్నులు రెండు కాదా !
శ్రీనివాసుని ఎదపై నిలిచేది - శ్రీనివాసుని ఎదపై నిలిచేది - శ్రేలక్ష్మీయేకాదా!
అలివేలుమంగ దూరానవున్నా- అలివేలుమంగ దూరానవున్నా- ఆతని సతియేకాదా - ఆతని సతియేకాదా !!
నీ వన్నది నీ వనుకున్నది - నే నన్నది ఇలలో వున్నది - నీ వన్నది నీ వనుకున్నది

బ్రతుకుదారిలో నడిచేవారికి - గమ్యం ఒకటేకాదా
బ్రతుకుదారిలో నడిచేవారికి - గమ్యం ఒకటేకాదా
పదిలంగా ఆ గమ్యం చేర్చే - పదిలంగా ఆ గమ్యం చేర్చే - పాదాలు రెండు కాదా !
కృష్ణుని సేవలో .. కృష్ణుని సేవలో పరవశమొందిన- రుక్మిణి నా ఆదర్శం
అతని ధ్యానమున అన్నీ మరచిన- అతని ధ్యానమున అన్నీ మరచిన –
రాధయె నా ఆదర్శం - రాధయె నా ఆదర్శం !!!

https://www.youtube.com/watch?v=pP774k7z4S0
కలెక్టర్ జానకి--1972...collector janaki--1972 ..nee vannadi
collector janaki--1972 దర్శకత్వం: యస్.యస్. బాలన్ సంగీతం::V. కుమార్ గీత రచన::D.C.నారాయణ రెడ్డి తారాగణ...
అహో..అందాల రాశి..
ఓహో....అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..
అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..

చరణం : 1
నీ అంగ అంగం.. మన్మధుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..
నీ అంగ అంగం.. మన్మధుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..
నీ పైనే మొహం.. తుదిలేని దాహం..
నువ్వు రేపు తాపం.. వరమైన శాపం..
నీకే శిల్పి ఇచ్చాడో.. ఈ దివ్య రూపం
అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..

చరణం : 2
నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం... సంగీత శాస్త్రం..
నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం... సంగీత శాస్త్రం..
దివిలోని వాడు.. నిన్నంపినాడు..
భువిలోని వాడు.. చవి చూచినాడు..
అతడానాడే ఐనాడు నీ దాసుడు
అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..
https://www.youtube.com/watch?v=cbMHfudMhss
Aho andaalaraasi అహో ...అందాలరాశి
www.youtube.com

Movie: Angadi Bomma(1978) Lyricist: Acharya Athreya Music: Sathyam Singer: S.P.Balasubramanyam

   

   





   
   


ఇక్కడే కలుసుకొన్నాము
చిత్రం : జీవితం (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ

పల్లవి :

ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో.. ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో కలుసుకున్నాము


చరణం 1 :

నీలనీల గగనాల మేఘ తల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి

ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము


చరణం 2 :

నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం

ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో కలుసుకున్నాము

http://www.allbestsongs.com/
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన...నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన...

చిత్రం: జీవితంలో వసంతం (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం

పల్లవి:

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా...ప్రియతమా ఓ ఓ ఓ
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీ మది కోవెల అన్నది కోయిల

చరణం 1:

నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో....
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

చరణం 2:

ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో
ఇదే ఇదేలే జీవితం లలాలలా జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో...నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా...తేలి తేలి పోదామా
సోలి సోలిపోదామా

https://www.youtube.com/watch?v=JSaq1oQ4HQI
Jeevithamlo Vasantham - Nilagiri Challana Nee vodi vechhana
Ramakrishna,Chandrakala Balu,Vanijayaram song

ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను...ఎదుట రూపమే ఎదను దీపమై...

చిత్రం: జీవన తీరాలు (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఆ... ఆ.. ఆ... ఆ....
ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను
ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై...
నుదిటి తిలకమై మెరిసిన వేళా...
నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ

ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను

చరణం 1:

మూగవేదనకు రాగాలన్నీ.. ముద్దు మాటలని తెలుసు
రాగమేది నే ఆలపించినా.. యోగమిదేనని తెలుసు
మూగవేదనకు రాగాలన్నీ.. ముద్దు మాటలని తెలుసు
రాగమేది నే ఆలపించినా.. యోగమిదేనని తెలుసు

తెలిసి తెలిసి ఏ తీగ మీటినా.. తెల్లవారదా నా బ్రతుకు
తెలిసి తెలిసి ఏ తీగ మీటినా.. తెల్లవారదా నా బ్రతుకు
నీ చల్లని నవ్వుల వెన్నెలలే.. నా సిగను పువ్వులై విరిసిన వేళా...

నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ
ఏ రాగమనే పాడను... ఏ తీగనే మీటను

చరణం 2:

వయసు వసంతాలాడిన నాడు... మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు... ఎదలో కోయిల పలికింది
వయసు వసంతాలాడిన నాడు... మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు... ఎదలో కోయిల పలికింది

గతము తలచి నా గతికి వగచి నేనున్న వేళ నాకున్నావు..
గతము తలచి నా గతికి వగచి నేనున్న వేళ నాకున్నావు..
నీ చల్లని చూపుల పల్లవితో... నా బ్రతుకు పాటగా మారిన వేళా...

ఏ రాగమనే పాడను... ఏ తీగనే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై...
నుదిటి తిలకమై మెరిసిన వేళా...
నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ

https://www.youtube.com/watch?v=qdtG-rkyxZQ
Ye Ragamani padenu - Jeevana Teeralu - P.Susheela - Chakravarthy

చిలకమ్మ గోరింక సరసాలాడితే...నవ్వే యవ్వనం నాలో ఈ దినం...

చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 1:

పువ్వులలో పులకింతలలో చలిజింతలలో చెలరేగి
కౌగిలిలో కవ్వింతలలో చెలి చెంతలలో కొనసాగే

ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
ఆమని విందుకు రావా.. తేనెల ముద్దులు తేవా
తొలకరి వలపుల వేళలలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం

చరణం 2:

కోరికలో దరి చేరికలో అభిసారికనై జతకూడి
అల్లికలో మరుమల్లికలా విరిపల్లకినై కదలాడి

ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ప్రేమలత పెదవులలోనే.. తీయని పదవులు చూసే
ఎగసిన సొగసుల ఘుమఘుమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నాలో ఈ దినం

చరణం 3:

అల్లరిలో మన ఇద్దరిలో వయసావిరులై పెనవేసి
మల్లెలలో మది పల్లవిగా మన మల్లుకునే శృతి చేసే

ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
ఈ కథ కంచికి పోదూ.. కన్నది కలగా రాదూ
కలిసిన మనసుల సరిగమలో

చిలకమ్మ గోరింక సరసాలాడితే
నవ్వే యవ్వనం నీదే ఈ దినం
https://www.youtube.com/watch?v=jYvW2CXzGQE
Chilakamma Gorinka
Provided to YouTube by saregama Chilakamma Gorinka · Spbalasubrahmayam · Psusheela Koru Kunna Mogudu...

No comments:

Post a Comment