Friday 8 November 2019

బలమిత్రుల కధ

బలమిత్రుల కధ
మా ఇంట్లో ఈ విటుంటే ఎందుకో చెప్పలేని హాయ్

Music: Sathyam

Lyricist: C.Narayana Reddy

Singer: S.Janaki

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది

ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

పొద్దున్న చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే

పొద్దున్న చిలకను చూడందే ముద్దుముద్దుగ ముచ్చటలాడందే

చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల

హోయ్ ... గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయ్ ఒక జట్టుగ తిరుగుతాయ్

ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్

ఒక పలుకే పలుకుతాయ్ ఒక జట్టుగ తిరుగుతాయ్

ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్

రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా

రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా

చిలకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి

హోయ్ ... గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

--(())--

No comments:

Post a Comment