Tuesday 9 January 2018

బంగారు కుటుంబం (1994)








అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

తోడునీడ తోటలో తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్నా యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు విద్దు
పాల మీద మల్లెపూలు
పంచుకున్నా జీవితాలు ప్రేమలో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

బాటసారి యాత్రలో బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోల పాటలో
పుల్లమావిల్లు తీపి తేనె కన్నా
మల్లెపూలేమో ముళ్ళు పక్కలోన
కల్పవృక్షాన్ని నిన్ను కట్టుకున్నా
వంశవృక్షాన్ని నేను పెంచుకున్నా
జంటలైన పావురాలు
కలలుగన్న కాపురాల జోరులో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరంద

చిత్రం: బంగారు కుటుంబం (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగేశ్వరరావు , జయసుధ, దాసరి నారాయణరావు, విక్రమ్, హరీష్ , రంభ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కైకాల నాగేశ్వరరావు
విడుదల తేది: 1994

No comments:

Post a Comment