Tuesday 9 January 2018

ఆనంద్

వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా

పిల్ల పాపల వాన బుల్లి పడవల వాన
చదువు బాధనె తీర్చి సెలవులిచ్చిన వాన
గాలి వాన కబడ్డి వేడి వేడి పకోడి
ఈడు జోడు డి డిడిడి తోడుండాలి ఓ లేడి
ఇంద్రధనస్సులొ తళుకుమనె ఎన్ని రంగులో
ఇంతి సొగసులె తడిసినవి నీటి కొంగులో
శ్రావణ మాసాల జలతరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నై

వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా

కోరి వచ్చినా ఈ వాన గోరు వెచ్చనై నాలోన
ముగ్గుల సిగ్గు ముసిరెస్తె ముద్దులాటిదె మురిపానా
మెరిసె మెరిసె అందాలు తడిసె తడిసె పరువాలు
గాలి వానలా పందిళ్ళు కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలొ ఉలికిపడె ఎవరి కన్నులో
చినుకు చాటునా చిటికెలతొ ఎదురు చూపులో
నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం

ఆనంద్ 

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా

వచ్చె వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చె గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నొ మాకున్నై
గుండెలోన దాచుకున్న గాధలెన్నొ మాకున్నై
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలి వానా లాలి పాడేస్తారా

No comments:

Post a Comment