Thursday 6 August 2015

1. శుభలగ్నం -1994. 2. సిరివెన్నెల 1986. 3.. స్నేహితుడు 4.. మురారి 5. అగ్గి పిడుగు (1964) 6. లంకేశ్వరుడు (1989) 7. లక్ష్మీ కటాక్షం (1970) 8. రాముడు-భీముడు (1964) 9. మురళీకృష్ణ (1964)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ
మనోధైర్యానికి  సంగీతం మనసుకు ఊరట - ఆనందానికి ఇది ఒకబాట 
image not displayed
1.  చిలక ఏ తోడు లేక (Chilaka Ee Todu Leka - Subha Lagnam - 1994)

చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

గోరింక ఎదే చిలక లేదింక
గోరింక ఎదే చిలక లేదింక

బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే

కొండంత అండే నీకు లేదింక
కొండంత అండే నీకు లేదింక

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో
అనాధలా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే యింక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

://www.youtube.com/watch?v=LtS5c3vSAPY
Subhalagnam Movie || Chilaka Ye Thodu Leka Video Song || Jagapathi Babu, Aamani, Roja
► Subscribe us http://goo.gl/dM5GO7 ► 

  










  
2. ఆది భిక్షువు వాడినేది కోరేది (Siri Vennela - 1986)

ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది

://www.youtube.com/watch?v=RQRlVmDwlyo
Sirivennela Songs - Aadi Bhikshuvu - Benarji Suhasini, Mun Mun Sen
Sirivennela Songs - Aadi Bhikshuvu Watch more movies @ http://www.youtube.com/volgavideo http://www....
    
                                
3. Friendship day
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా..
చిన్న చిన్న నా కోరికలే..అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం..ఇదే వలపు గెలుపు..
శ్వాస తుది వరకూ..వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం(స్నేహితుడా)

చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్..
ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్..
మనసే..మధువోయ్..
పువ్వు కోసే భక్తుడల్లె..మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్..
సందెల్లో తోడువోయ్..
ఐదు వేళ్ళు తెరిచి..ఆవు వెన్న పూసి..
సేవలు సేయవలెగా..
ఇద్దరమొకటై..కన్నెరైతే..తుడిచేవేలందం..(స్నేహితుడా)
నిన్న మునిమపుల్లో..నిద్దరోవు నీ ఒళ్ళో..
గాలల్లే తేలిపోతానో..ఇలా డోలలూగేనో..
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో..
నిన్ను వలపించ..మనం..చెదిరి విలపించా..
(కురుల నొక్కుల్లో..నలుపే చుక్కల్లో)(2)
గర్వమణిచెనులే..నా గర్వమణిగెను లే..

శాంతించాలి పగలింటి పనికే(2)
నీ సొంతానికి తెచ్చేదింక..పడకే..
వాలే పొద్దూ..వలపే..
వుల్లెన్ చొక్కా ఆరబోసే వయసే..
నీటి చెమ్మ చెక్కలైన నాకు..వరసే..
ఉప్పు మూటే అమ్మైనా..
ఉన్నట్టుండి తేస్త..ఎత్తేసి విసిరేస్త..
కొంగుల్లో నిన్నే దాచేస్తా..
వాలాక పొద్దు..విడుదల చేసి..
వరమొకటడిగేస్తా..(స్నేహితుడా)
Snehituda Snehituda - Sakhi
Snehituda Snehituda - Sakhi



చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది ఓ మోమాటం..

4. చిత్రం : మురారి
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : KS.చిత్ర

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది ఓ మోమాటం..
నువ్వంటే మరి.. అదేదో ఇది.. అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి.. ఎలా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది ఓ మోమాటం..

వెంట తరుముతున్నావేంటీ ఎంత తప్పుకున్నా..
కంటికెదురు పడతావేంటీ ఎటు చూసినా..
చెంప గిల్లిపోతావేంటీ గాలి వేలితోనా..
అంత గొడవపెడతావేంటీ నిద్దరోతు ఉన్నా..
అసలు నీకు ఆ చొరవేంటీ తెలియకడుగుతున్నా..
ఒంటిగా ఉండనీవేంటీ ఒక్క నిముషమైనా..
ఇదేం అల్లరి.. భరించేదెలా.. అంటూ నిన్నెలా కసరనూ!
నువ్వేం చేసినా.. బావుంటుందని.. నిజం నీకెలా చెప్పనూ!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది ఓ మోమాటం..

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా..
ఏడిపించబుద్ధవుతుంది ఎట్టాగైనా..
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా..
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా..
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా..
లేని పోని ఉక్రోషం తో ఉడుకెత్తనా..
ఇదేం చూడకా.. మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా..
అదేంటో మరీ.. ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా.. అయ్యో రామా!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
తప్పమ్మా ఆగమ్మా.. అంటోంది ఓ మోమాటం..
నువ్వంటే మరి.. అదేదో ఇది.. అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి.. ఎలా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా..
ఐ లవ్ యు చెప్పేసేయ్.. అంటోంది ఓ ఆరాటం..
ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ..
ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ..

https://www.youtube.com/watch?v=Z2UTbdeE27g
Murari Movie || Cheppamma Cheppamma Full Video Song || Mahesh Babu, Sonali Bendre
Watch Murari Telugu Full Length Movie / Murari Telugu Movie Starring Super Star Mahesh Babu , Sonali...


5. చిత్రం : అగ్గి పిడుగు (1964)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, జానకి

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూగినవీ
ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినదీ
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు.......https://www.youtube.com/watch?t=17&v=vxMk05jz72A



జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ..వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....

6. చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : మనో, జానకి

పల్లవి :

జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం

ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..దొరికిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...

చరణం 1 :

ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీర కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీర వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ

చరణం 2 :

మంచల్లే కరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలీ
పూవుల్లో దాగున్న అందాలనీ మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..

https://www.youtube.com/watch?v=RzdyiAQPSxo
Jivvumani Kondagali Video Song | Lankeshwarudu Telugu Movie Songs | Chiranjeevi | Radha | Mohan Babu
Jivvumani Kondagali Song from Lankeswarudu Telugu Movie, starring Chiranjeevi / Megastar Chiranjeevi...


7. రా...వెన్నెల దొరా....కన్నియను చేరా...రా...కన్ను చెదర ...వేచితిని..రా రా...

చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

ఆహా...హ....అహ...హ...
అహ...హ.....ఓహో...ఓ...ఓ...
ఆహ....హ.....హా......

రా...వెన్నెల దొరా....కన్నియను చేరా
రా...కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ..ఆ

రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...
రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..

చరణం 1 :

ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..
ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..
ఉన్నానులేవే ...ప్రియతమా....ఆ..ఆ

నీ మగసిరి నగవులు...చాలునులే...
నీ సొగసరి నటనలు చాలునులే...నీ మనసైన తారను నే కానులే...

రా..వెన్నెల దొరా...వింత కనవేరా..
రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ..

చరణం 2 :

ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...
ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...
ఎద నిండిపోరా...చందమా....ఆ...ఆ..

నీ పగడపు పెదవుల...జిగి నేనే...
నీ చెదరని కౌగిలి ...బిగి నేనే...
నా ఎద నిండ నీవే నిలిచేవులే....

రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...
రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..

రా..వెన్నెల దొరా...వింత కనవేరా..
రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ..

https://www.youtube.com/watch?v=WzZmYfg4-y4

RAA VENNELA DORA KANNIYANU CHERAA RAA KANNU CHEDARA...CHITRAM:- LAKSHMI KATKSHAM.mp4
రా వెన్నెల దొరా కన్నియను చేర రా కను చెదర.....చిత్రం :- లక్ష్మీ కటాక్షం పాట గురించి :-గాయకులూ:- ఘంటసా...









అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది..ఏదో లాగు మనసు లాగుతున్నది

8. చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది

అదే అదే అదే......
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే.. వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే అదే అదే.. వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది

చరణం 1 :

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి

ఏమేమి ఉన్నవి.. ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవి.. ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి

అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది

చరణం 2 :

నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను

ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయెను

అదే.. అదే.. అదే...
నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే.. అదే.. అదే...వింత నేను తెలుసుకున్నది

https://www.youtube.com/watch?v=UWshH1Q2yGg
ADE ADE NAKU ANTHU TELIYAKUNNADI SONG IN RAMUDU - BHEMUDU
Ramudu - Bheemudu



ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను...నా వలపంతా నీదని.. నీదేనని.. ఊఁ అనూ

9. చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
నా వలపంతా నీదని.. నీదేనని.. ఊఁ అనూ

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
నా వెలుగంతా నీవని.. నీవేనని.. ఊఁ అనూ

చరణం 1:

కలకల నవ్వే కలువకన్నులు..
కలకల నవ్వే కలువకన్నులు..
వలపులు తెలుపుటకే కాదా
పక్కన నిలిచిన చక్కని రూపము
చక్కిలిగింతలకే కాదా
చక్కిలిగింతలకే కాదా

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను

చరణం 2:

పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
అహహా అహహా అహహా ఆ... ఆ... ఆ...
పచ్చని ఆశలపందిరి నీడల వెచ్చగ కాపురముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా..
ఆఁ...
ఆఁ... కమ్మని కలలే కందామా

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను

చరణం 3 :

మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
ఓ... ఓ... ఓ... ఓ...
మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే
ఊఁ...
ఊఁ... జీవితమంటే మనదేలే

ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
నా వలపంతా నీదని..
నా వెలుగంతా నీవని..
ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
ఊఁ అనూ... హహహహ

https://www.youtube.com/watch?v=1hTfC8UVinE
Murali Krishna Songs - Oo Anu - ANR - Jamuna
Watch ANR Jamuna's Murali Krishna Telugu Old Movie Song With HD Quality Music - Venu Lyricist - Athr...




1 comment: