Monday 10 August 2015

1. వీరాభిమన్యు (1965) 2. సువర్ణ సుందరి (1957) 3. నర్తనశాల 1963 4. డ్యుయెట్ (1991) 5. ప్రేమించుకుందాం.. రా (1997) 6. విజృంభణ (1986) 7. కల్పన

పిలువకురా అలుగకురా...నలుగురిలో నను ఓ రాజా..పలుచన సలుపకురా..

చిత్రం : సువర్ణ సుందరి (1957)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..

పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..

పిలివకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ

చరణం 1 :

మనసున తాళి మరువనులేర...
గళమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 2 :

ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..

కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....

పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

https://www.youtube.com/watch?v=ahLd6iiYabE
Suvarna Sundari Songs - Piluvakura - ANR,Anjali Devi
Suvarna Sundari Songs - Piluvakura Watch more movies @ http://www.youtube.com/volgavideo http://www....


నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా...వీరుల నీకు సరి.. లేరనీ 


చిత్రం: నర్తనశాల (1963) 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: జానకి 

పల్లవి: 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

చరణం 1: 

సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన 
సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి బలాన 

సాటి లేని వీరుండన్న యశమును గన్నా 
సాటి లేని వీరుండన్న యశమును గన్నా 

అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదు గొన్న విజయా 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

చరణం 2: 

నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే సుభద్రా 
నిను గనీ తల ఊచే ఉలూచీ కొనుమనీ చెయి సాచే సుభద్రా 

నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న 
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న 

అలరుల విలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

Narthanasala Songs - Naravara O Kuravara - NTR - Savithri
NTR Savithri S V Ranga Rao Sobhana Babu's Narthanasala Telugu Old Movie Song Music : Susarla Dakshin...





మేఘాలే తాకింది హైహైలెస్స...నవరాగంలో నవ్వింది నా మోనాలిసా...

చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ..
ఒళ్ళోవాలే అందాల అప్సరస

మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ..
అల్లేసింది నీ మీద నా ఆశ

చరణం 1:

తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ
తెలుగంత తీయంగ... నువ్వు పలికావే స్నేహంగా

చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా... తొలి వలపంటే తేలిసేలా
హా.. కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక

ఆ.. ఆ.. ఆ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

చరణం 2:

తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో.. గుర్తు చెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజం ఏదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో... రెండు కలిశాయి నీ చెంత

ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి

ఆ..ఆ..ఆ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ...
అల్లేసింది నీ మీద నా ఆశ..
మేఘాలే తాకింది హైహైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

https://www.youtube.com/watch?v=FSZ0qokCBeY

Meghaale Thakindhi Hai Hilessa |Preminchukundam raa|Venkatesh,Anjala Zaveri
Preminchukundam Raa is a Telugu film released in 1997.Directed by Jayanth C. Paranjee and produced b...




గెలుపు మాదే సుమా.. గెలుపు మాదే సుమా...గగనమే రగిలినా.... 


చిత్రం : విజృంభణ (1986) 
సంగీతం : సత్యం 
నేపధ్య గానం : బాలు, చిత్ర 

పల్లవి : 

గెలుపు మాదే సుమా.. గెలుపు మాదే సుమా 
గగనమే రగిలినా.... 
జీవితం ప్రతి పదం.. సమరమై సాగనీ... 
జీవితం ప్రతి పదం.. సమరమై సాగనీ... 
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా 
గగనమే రగిలినా.... 

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... 
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... 

చరణం 1 : 

చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం 
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం 
చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం 
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం 
పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా 
ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం 

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... 
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా 
గగనమే రగిలినా.... 
జీవితం.. జీవితం 
ప్రతి పదం.. ప్రతిపదం 
సమరమై సాగనీ... 
జీవితం.. జీవితం 
ప్రతి పదం.. ప్రతిపదం 
సమరమై సాగనీ... 
చరణం 2 : 

కమ్మని మనసులు కళకళలాడే కాపురం 
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం 
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం 
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం 
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా 
తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం... 

జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... 
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా 
గగనమే రగిలినా.... 
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... 


Vijrumbhana Movie Video Songs || Gelupemadesuma Song || Shoban Babu, Jayasudha
Enjoy & stay connected with us! ► Subscribe to YouTube Channel: http://tinyurl.com/mvfdl9j ► Circle ...

1 comment:

  1. గౌరవనీయులైన సంగీత ప్రియులకు ప్రాంజలి ప్రభ తరుఫున - సంగీత ప్రభ అనగా అనేక మంది రచయతలు, సంగీత
    దర్సకులు, గాయకులు మరియు అనేక మంది కృషి ఫలితముగా మన పాత సినమాల గీతాలను సేకరించి కొన్ని తెలుగులో టైపు చేసి మరియు యుట్యూబ్ కాసిట్ ఉంచి భాగమునకు 7 పాటలు చొప్పున పొందు పరిచాను. విని సంతోష పడగలరని చిన్న ప్రయత్నం చేస్తున్నాను, అందరికి ధన్యవాదములు

    L

    ReplyDelete