Tuesday 11 August 2015

1.హ్యాపీ డేస్ (2007) 2.భూమి కోసం 3. శుభ సంకల్పం (1995) 4. భైరవద్వీపం (1994) 5. ఆహ్వానం (1996) 6. రాఘవేంద్ర (2003) 7. గురు (1980) 8. కిల్లర్ (1993)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 

సర్వేజనాసుఖినోభవంతు
నీకోసం దిగిరానా... నేనెవరో మరిచానా
నీడల్లే కదిలానా... నీ వల్లే కరిగానా
నా కోసం నేన్లేనా... మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా... కాదన్నా వింటేనా!
పల్లవి :
అరెరే... అరెరే... మనసే... జారే...
అరెరే... అరెరే... వరసే... మారే...
ఇదివరకెపుడూ... లేదే
ఇది నా మనసే... కాదే
ఎవరేమన్నా... వినదే
తనదారేదో... తనదే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చరణం : 1
స్నేహమేరా... జీవితం అనుకున్నా
ఆజ్ మేరా... ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా... ముడిపడిపోతున్నా
ఇంక సెకనుకెన్ని నిమిషాలో
అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల... చాల్లే నీ గోల...
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చరణం : 2
చిన్నినవ్వే... చైత్రమై పూస్తుంటే
చెంత చేరీ... చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో... తడిసిన మెరుపమ్మా
తె లుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా...
వరమా... హాయ్ రామా!
అరెరే... అరెరే... మనసే... జారే...
అరెరే... అరెరే... వరసే... మారే...
ఇదివరకెపుడూ... లేదే
ఇది నా మనసే... కాదే
ఎవరేమన్నా... వినదే
తనదారేదో... తనదే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
అంతా నీ మాయలోనే... రోజూ నీ నామస్మరణే
ప్రేమా ఈ వింతలన్ని నీ వల్లనే
చిత్రం : హ్యాపీ డేస్ (2007)
సంగీతం : మిక్కీ జె.మేయర్
రచన : వనమాలి
గానం : కార్తీక 





 



ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా

బడులే లేని పల్లెటూళ్ళలో
బడులే లేని పల్లెటూళ్ళలో
చదువే రాని పిల్లలకు
చదువు రాని చదువుల బడిలో
జీతాలు రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

చాలీ చాలని పూరి గుడిసెలో
చాలీ చాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలి అయిపోయిన పడతులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

కూలి డబ్బుతో లాటరీ టికెట్
లాటరీ టికెట్
కూలి డబ్బుతో లాటరీ టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరిచి
చెడే నిరాశా జీవులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా

సేద్యం లేని బీడు నేలలో
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
***
చిత్రం: భూమి కోసం
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల 


 

  
శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మా...ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా...

చిత్రం: శుభ సంకల్పం (1995)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: వేటూరి
గానం: చిత్ర

హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలీ .. కౌగిలినీ .. కరిగావంటే .. గంగమ్మా

నీ రూపేదమ్మా
నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా ..నీ రంగేదమ్మా
నడిసంద్రంలో నీ గడపేదమ్మా .. గంగమ్మా

నీలాల కన్నుల్లో సంద్రమే .. హైలెస్సో
నింగి నీలవంతా సంద్రమే .. హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే










ఎంత ఎంత వింత మోహమో...రతికాంతుని శృంగార మంత్రమో...

చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సంధ్య

చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా
జంట లేదనా...అహహ
ఇంత వేదనా..ఒహోహో
జంట లేదనా ఇంత వేదన
ఎంత చిన్నబోతివమ్మా(చందమామ)

ఓ మురిపాల మల్లికా
దరిజేరుకుంటినే పరువాల వల్లిక
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో

ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో
ప్రణయానుబంధమెంత చిత్రమో

విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో తరిమింది
తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక(ఎంత)

కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సిగలో జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేల ప్రియురాల మనిమేఖల 





 

https://www.youtube.com/watch?v=hW0yg_PBrbM
Yenta Yenta Vinta Mohamo Video Song || Bhairava Dweepam Movie || Balakrishna, Roja, Rambha
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7...





మనసా నా మనసా మాటాడమ్మా...ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా

చిత్రం : ఆహ్వానం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో..
ఇంత మౌనమా!
మనసా నా మనసా మాటాడమ్మా!

చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో..
విన్నా నీ అనురాగపు తేనె పాటని...
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో..
చూశా నీతో సాగే పూల బాటని...
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం..
నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం..
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ..!
మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా..
అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా!
తనువు మనసు ప్రాణం నీవైన రోజున..
నాదని వేరే ఏది మిగిలి లేదుగా!
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక..
ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ..!

మనసా.. నా మనసా.. మాటాడమ్మా!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో..
ఇంత మౌనమా!
మనసా.. నా మనసా..

https://www.youtube.com/watch?v=2J6559XZ4oI
Manasa Na Manasa Video Song || Aahwanam Movie || Srikanth, Ramya Krishna, Heera
Subscribe For More Full Movies: http://goo.gl/auvkPE Subscribe For More Video Songs: http://goo.gl/7...
 
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం...నువు నాకోసం ఇక సంతోషం...

చిత్రం : రాఘవేంద్ర (2003)
సంగీతం : మణిశర్మ
రచన : సుద్దాల అశోక్ తేజ
గానం : హరీష్ రాఘవేంద్ర , సుజాత

పల్లవి :

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే

చరణం : 1

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలగలేదా
అందరీ తీరుగా నేను తెలుగు కుర్రానిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోన
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో
కలవరింతలో ఉన్నావో
ఊహ నుండి బయటకు రావమ్మా

చరణం : 2

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చెరా
ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపే కలిపెరా
పూవంటి హృదయంలోన తేనంటిమనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే

https://www.youtube.com/watch?v=P9pdxGBuCV0
Prabhas Raghavendra Movie Songs - Nee styele Song - Anshu, Mani Sharma
Watch Raghavendra telugu Movie Scenes, Starring Prabhas, Swetha Agarwal, Anshu, Murali Mohan, Brahma...



పేరు చెప్పనా నీ రూపు చెప్పనా...నీ పేరే అనురాగం...

చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము
నీ నేస్తాము నా స్వర్గము
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా

చరణం 1:

పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలేలనే నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనే పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనకై భువి పై దివి నే దిగనీ

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పపపపపా పాపపపపా

చరణం 2:

నీవొక సెల నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపలా
విరి శరముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసుకే మెరుగులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులై
మనమే వెలుగు చీకటి జతలూ

పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
పపపపపా పాపపపపా

చరణం 3:

పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కొసరు కుందమూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందమూ పెన వేసుకుందమూ
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ...

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే అనురాగం
లాలలల లాలలల
లాలలల లాలలల
పపపపపా పాపపపపా

https://www.youtube.com/watch?v=xOrj8DS4_7Y
perucheppana.wmv
Ilaiyaraaja's Peru cheppana from the movie Guru(Telugu)

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా...ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా

చిత్రం: కిల్లర్ (1993)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

ఊఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ..
ఊఁహూఁహూఁ.. ఊఁ..
ఊఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ..
ఊఁహూఁహూఁ.. ఊఁ..

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ..
ఆ కథ ఎందుకులే..ఏ..

సింధూరపూ పూదోటలో.. చిన్నారి ఓ పాపా

చరణం 1:

తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ
విధి చదరంగంలో.. విష రణరంగంలో
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా

చరణం 2:

రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై..
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా

ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ..
ఆ కథ ఎందుకులే..ఏ..

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా

https://www.youtube.com/watch?v=PEvJ32XXQt8


Killer Movie ||..




ఈ పాటకు గాను శ్రీరంగం శ్రీనివాసరావు కు జాతీయ స్థాయిలో ఉత్తమ పాటల రచయిత అవార్డు లభించింది

తెలుగువీర లేవరా 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు ఘట్టమనేని కృష్ణ మరియు ఇతర నటులపై చిత్రీకరించారు.

తెలుగువీర లేవరా!

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా || తెలుగు ||

దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా||2||

నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా ||2||

నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా || తెలుగు ||

యెవడువాడు యెచటివాడు యిటువచ్చిన తెల్లవాడు

కండబలం కొండఫలం కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు

తగినశాస్తి చెయ్యరా తరిమితరిమి కొట్టరా

ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి

సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి

వందేమాతరం వందేమాతరం || తెలుగు ||

ఓ స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా - అల్లూరిసీతారామరాజా

అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా

మా నిదురించిన పౌరుషాన్ని రగిలించినవాడా

నిశ్ఛచయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం || తెలుగు ||




https://youtu.be/8oTbzver_c0
Alluri Seetharama Raju || Teluguveera Levara Video Song || Krishna, Vijaya Nirmala
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll..

 


No comments:

Post a Comment