Sunday 9 August 2015

1. అభినందన (1988) 2. పూజ 3. S/O సత్యమూర్తి (2015) 4. జోడీ 5. ధర్మాత్ముడు (1983) 6. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976) 7. తేనెమనసులు 8. పాలు నీళ్ళు 9. గుండమ్మ కథ

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
గానం : వాణి జయరాం
సాహిత్యం : దాశరధి
సంగీతం : రాజన్ - నాగేంద్ర

పూజలు చేయ పూలు తెచ్చాను
పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా
ఈయరా దర్శనము రామా

పూజలు చేయ పూలు తెచ్చాను

తూరుపులోన తెల తెలవారే బంగారు వెలుగు
నింగిని చేరే
తొలి కిరణాలా............(2)
తొలి కిరణాలా హారతి వెలిగే
ఇంకా జాగేల స్వామి
ఈయరా దర్శనము రామా
పూజలు చేయ పూలు తెచ్చాను

దీవించేవో కోపించేవో
చెంతకు చేర్చి లాలించేవో
నీ పద సన్నిధి నా పాలిట పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ...
ఈయరా దర్శనము రామా.....

పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
ఈయరా దర్శనము రామా




పూజలు చేయ పూలు తెచ్చాను.
Poojalu Cheya Poolu Thechanu - Superhit Song - In Pooja Telugu Movie (HD)
Pooja - Telugu Movie (1975 old movie) Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscri...


చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో...

చిత్రం - S/O సత్యమూర్తి (2015)
సంగీతం – దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి
గానం – రఘు దీక్షిత్, సాఖి, సూరజ్ సంతోష్

రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ...
రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడూ...
యుద్ధం గెలిసేటోడు వీరుడు, శూరుడూ...
యుద్ధం ఇడిసేటోడే దేవుడూ...

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో...
చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో...
తీపితోపాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే...
కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటె బ్రతుకంటే...
అందుకో హత్తుకో ముందరున్న ఈక్షణాన్ని....
చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో...
చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో...

కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్... తీయగుంటే కడదాకా వదలవుగనక...
కష్టాలెందుకు బరువుగుంటాయ్... తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవుగనక...
ఎదురేలేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక...
చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటిగడపదాక...
పడ్డవాడే... కష్టపడ్డవాడే... పైకిలేచే ప్రతోడూ...
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు...

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో...
చల్ చలో చలో చలించుదారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో...

మడతే నలగని షర్ట్ లాగా అల్మరాలో పడివుంటే అర్ధంలేదు...
గీతే తగలని కాగితంలా ఒట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనేలేదు...
ప్లస్సుకాదూ... మైనస్సుకాదూ... అనుభవాలే ఏవైనా...
ఓర్చుకుంటూ... నేర్చుకుంటూ... సాగిపోరా నీదైన గెలుపుదారిలోన...

చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో...
చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో...

https://www.youtube.com/watch?v=8BKRkBZd88M
Chal Chalo Chalo Full Video Song - S/o Satyamurthy Video Songs - Allu Arjun, Samantha
Watch & Enjoy : Chal Chalo Chalo Full Video Song from S/o Satyamurthy Movie,Starring Allu Arjun, Sam...





నను ప్రేమించానను మాట...కలనైనా చెప్పెయ్ నేస్తం..కలకాలం.. బ్రతికేస్తా

చిత్రం : జోడీ
సంగీతం : AR.రెహ్మాన్
గానం : హరిహరన్
సాహిత్యం : వేటూరి

నను ప్రేమించానను మాట...
కలనైనా చెప్పెయ్ నేస్తం..కలకాలం.. బ్రతికేస్తా
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పూవుల యదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదె నా హృదయం..ఇక ఓపదే నా హృదయం
సత్యమసత్యము పక్కపక్కనే ..ఉంటయ్ పక్కపక్కనే
చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసు పక్కపక్కనే..చూసే కళ్లు ఒక్కటే
అయినా రెండూ వేరేలే
నను ప్రేమించానను మాట, కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా

రేయిని మలిచి...ఓ...రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో..
కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో...
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్లుగ మలచి,
మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.
మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో...
అయినా...మగువ, మనసుని శిలగా చేసినావే
వలచే... మగువ, మనసుని శిలగా చేసినావే...
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా

వయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపిందినీవేగా..
ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు..ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..
అయినా...చెలియ...మనసుకి మాత్రం దూరమైనావే
కరుణే.. లేక మనసుని మాత్రం వీడిపోయావే....
నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పెయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా

https://www.youtube.com/watch?v=7T005ctjWLM
Nanu Preminchanani Mata - Jodi | A. R. Rahman | Srinivas, Sujatha
Song: Nanu Preminchavani Mata Movie: Jodi (1999) Cast: Prashanth, Simran Singers: Srinivas, Sujatha ...



తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా...ఏ ఊరు ఏ వాడా చందమామా...

చిత్రం: ధర్మాత్ముడు (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్

పల్లవి:

తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చరణం 1:

రూపం చూస్తే దీపమని లోకం తెలియని పాపవని
ఎట్టా నీతో చెప్పేది చెప్పక ఎట్టా దాచేది
ఏమి చిత్రమే ఇదీ చందమామా
ఎంత చోద్యమే ఇదీ చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చరణం 2:

చేరే తీరం ఏదైనా పయనించేదీ ఒక పడవ
ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి
బదులు పలకవే నువ్వు చందమామా
పలకలేవులే నువ్వు చందమామా
తకధిమి తకధిమితో దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

http://www.nssrb.com/KRISHNAM%20RAJU/DHARMATHMUDU%20-%201983/Thaka%20Dhimi.mp3



చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపక
రాకోయీ అనుకోని అతిథి
వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనే లేదు
వేళ కాని వేళా .....
ఈ వేళ కాని వేళ ..... ఇంటికి
రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ .....

చరణం 1 :

సిగలో పూవులు ముడవాలంటే ..... సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే ..... నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు ..... పంచభక్ష్యముల చేయనే లేదు
వేళ కాని వేళా ..... ఈ వేళ కాని వేళ ..... విందుకు
రాకోయీ అనుకోని అతిథి... రాకోయీ .....

చరణం 2 :

ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
రమ్మనుటకు సాహసము చాలదు...
పొమ్మనుటా మరియాద కాదది...
వేళ కాని వేళా .....ఈ వేళ కాని వేళ ..... త్వరపడి
రాకోయీ అనుకోని అతిథి... కాకి చేత కబురైన పంపక
రాకోయీ అనుకోను అతిథి...
రాకోయీ .....

https://www.youtube.com/watch?v=HnacWDq1Zpo
Sri Rajeswari Vilas Coffee Club Movie | Rakoyi Anukoni Athidi Video Song | Krishna, Jayaprada
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

మమ్మయ్యా..మమ్మయ్యా...మనసంతేలేవయ్యా..మాయామాయమాయా...

చిత్రం : తేనెమనసులు
సంగీతం : బప్పీలహరి
గానం : పి.సుశీల
సాహిత్యం : వేటూరి

మమ్మయ్యా..మమ్మయ్యా...
మనసంతేలేవయ్యా..మాయామాయమాయా...
ఈ మనిషన్నవాడు మాయా..ఆ మమతన్నదొట్టి మాయా...
పై మెరుగు చూసి ప్రేమించు వాడు చేసేది పెద్ద మాయా....

ఈ నీతి బోధా నీకోసమేరా..నా ప్రేమ గాధా ఓ జాలి గాధా
ఈ మెడ తాళి బొట్టు మాయా..ఆ పెళ్ళి నాటి ఒట్టు మాయా
ఈ జీవితాలు ప్రేమాంకితాలు..అనుకుంటే పెద్ద మాయా...

మమ్మయ్యా..హో....మమ్మయ్యా..మమ్మయ్యా...
మనసంతేలేవయ్యా..మాయామాయమాయా...

ఆనాడు వాలే ఈ కొమ్మమీదా..ఆ కోయిలమ్మే పాడే కొత్తపాటా
ఆ తొలి జ్జ్ఞాపకాలు మిగిలే..ఈ నవనాటకాలు ముదిరే
ఆ పాట కధల సంగీత సుధలు...ఆ పాట మధురమాయే...

మమ్మయ్యా..హో....మమ్మయ్యా..మమ్మయ్యా...
మనసంతేలేవయ్యా..మాయామాయమాయా...

http://n3.filoops.com/telugu/Thene%20Manasulu%20%281987%29/Mammayya%20Mammayya.mp3



నేనే స్త్రీ మూర్తిని...నేనే స్త్రీ మూర్తిని...
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని...భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని...

చిత్రం : పాలు నీళ్ళు
సంగీతం : సత్యం
గానం : పి.సుశీల

నేనే నేనే నేనే స్త్రీ మూర్తిని...నేనే స్త్రీ మూర్తిని...
నేనే స్త్రీ మూర్తిని...నేనే స్త్రీ మూర్తిని...
భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని...భక్తికి ముక్తిని ముక్తికి రక్తిని
ఆదిశక్తిని ఆగమవర్తిని...
నేనే స్త్రీ మూర్తిని...

ప్రణయానికి నే ప్రాణశక్తిని
ప్రళయానికి నే మూలశక్తిని నిర్మూలశక్తిని
వినయానికినే విమల ధాత్రిని
విమల శీలా నిత్యాగ్నిహోత్రిని
కల్లోలిత సంసారాజలధిలో ఊళ్ళోలితమో జీవిత నౌకకు
ఉత్తర దిక్కున వెలిగే చుక్కని చుక్కానినీ...
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని..

కళకు అంకితం నేనైనా కళంకితను గానూ..
అబల అబల అని ఎవరన్నా బలహీనను నే గానూ..
పతికి అనురాగవల్లిని సుతుల మురిపాల తల్లిని
తరతరాల వరవరాల నల్లిన భారతీయ సంస్కృతిని
కవిరాయలేని కృతిని రవిచూడలేని ప్రకృతిని
నేనే స్త్రీ మూర్తిని..నేనే స్త్రీ మూర్తిని..

https://www.youtube.com/watch?v=CruyvEqzuhI
Paalu Neellu Movie Songs || Nene Sthree Murthini || Mohan Babu || Jayapradha || 02
Mohan Babu, Jayapradha's Paalu Neellu Movie Songs with HD Quality Paalu Neellu (1981) Cast: Mohan Ba...

1 comment: