Thursday 13 August 2015

Pranjali Prabha - మహానటులు -రావు గోపాలరావు - పసుపులేటి కన్నాంబ !

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ 
 వడ్డాది ఉదయకుమార్'s photo.
సర్వేజనా సుఖినోభవంతు

18 ఆగస్టు నేతాజీకి నివాళులు (18 Aug Homage to Netaji Subhas Chandra Bose)
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే సహజసూత్రాన్ననుసరించి నాటి రెండవ ప్రపంచయుధ్ధం‌లొ బ్రిటిష్‌ నాయకత్వం‌లోని అలైడ్ కూటమికి వ్యతిరేకమైన ఆక్సిస్ కూటమిలో కీలకపాత్రవహించిన జపాన్‌తో నేతాజీ జతకట్టాడు. భారత్‌ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిపే పోరాటం‌లో స్టాలిన్‌ మద్దతుకోసం జపాన్‌నుండి రష్యాబయలుదేరాడు. ది 18 ఆగస్టు (1945)న మార్గమధ్యం‌లో జరిగినవిమాన ప్రమాదం‌లో గాయపడగా ఆయనను సమీపం‌లోని దవాఖానాలోచేర్చారు. తదుపరి కొద్దిసేపటికే మరణించాడు.
ఈ మరణం
అసహజమా?
అనుమాస్పదమా?
అపరిష్కృతమా?
ఆరు దశాబ్దాలు,
ఐదు పుష్కరాలు,
నాలుగు కమిటీలు-
ఐనప్పటికీ అనిర్ధారితంగానే మిగిలిపోయింది.
“దేశభక్తుల్లోకెల్లా దేశభక్తుడు నేతాజీ” సుభాషచంద్రబోస్ గురించి జాతిపిత నేతాజీ చెప్పినమాటలు. నేతాజీ మరణించినట్లుగా భావిస్తున్న దీ 18 ఆగస్టు (1945) ఈ రోజున ఆయనకు నివాళలర్పిస్తూ ఆయన మరణం గురించి అధ్యయనం చేసిన పలు నివేదికలలో ఏముందో సంక్షిప్తంగా తెలుసుకుందాం.
ఫిగ్స్ నివేదిక (1946)
నేతాజీ మరణంపై పలు పుకార్లు వెలువడుంటంతో మౌంట్ బాటన్ ఇంటలీజెన్స్ కు చెందిన జాన్ ఫిగ్స్ అనే అధికారిని 1945లో విచారణకు నియమించాడు. ఆయన సమర్పించిన నివేదికను ఇంతవరకు వెల్లడికాలేదు. అనధికారికంగా వెల్లడైన వివరాల ప్రకారం - ఆయన పలువురు వ్యక్తులను విచారించిన పిదప ‘ యస్ సి బోస్ 18 ఆగస్టు (1945) తేదీన కాలిన గాయాలతో తాయ్‌హాకూ మిలిటరీ వార్డులొ చేర్చాగా సాయంత్రం 5గం. నుండి 8 గం. మధ్యకాలంలో గుండెపోటుతో మరణించాడు. నేతాజీతోపాటు విమానం ప్రమాదం‌లో బయటపడ్డ జపాన్ లెఫ్టినెంట్ కల్నల్ నానోగాకి, సాకిలతో పాటు వైద్యంచేసిన డా|| యోషిమి, వార్డుబాయ్ – నేతాజీ దహన సంస్కారాలపిదప అతని అస్తికలు, చితాభస్మాన్ని టోక్యోకు తీసుకువచ్చిన మరో మిలిటరీ అధికారి లెఫ్టినెంట్ ఆయస్థిత మొదలైనవారి వాగ్మూలం ప్రకారం ఇదంతా నిజమేనని నిర్ధారించాల్సిఉంటుంది”.
షానవాజ్ కమిటీ (1956)
నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లో లెఫ్తినెంటుగా నియమించబడి, స్వాతంత్ర్యానంతరం ఐ యన్ ఏకు సంబంధించి పలుకేసులను ఎదుర్కొన్న ఆనాటి పార్లమెంటు సభ్యుడు షా నవాజ్ అధ్యక్షతన నియమించబడిన కమిటీలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఐసీయస్ అధికారి యస్ యన్ మిత్రాను సభ్యునిగా నియమించింది. ఇందులో నేతాజీ సోదరుడు సురేష చంద్రబోస్ కూడా సభ్యుడు. ఆ కమిటీ 1956లో ఏప్రిల్ నుండి జూలై వరకు ఈకమిటీ భారత్, జపాన్, ధాయీలాండ్, వియెత్నాం దేశాలకు చెందిన్ 67మంది ప్రత్యక్ష సాక్షులను విచారించింది. ఈ కమిటీకూడా నేతాజీ మరణాన్ని విమానప్రమాదంతోనే నిర్ధారించినా అతని సోదరుడు సురేషచంద్రబోస్ తిరస్కరించాడు.
సురేషచంద్రబోస్ నోట్ ప్రకారం “ సాక్షుల కధనాలు భిన్నంగానే కాకుండా పలుచోట్ల పరస్పర వైరుద్యంగా ఉన్నందువల్ల నేతాజీ విమాన ప్రమాదం‌లో మరణించలేదు. స్వాతంత్ర్యానంతరంకూడా అతను జీవించే ఉన్నాడు” అంటూ షా నవాజ్ కమిటీనివేదికను తిరస్కరించాడు. నాటిప్రధాని నెహ్రూతోపాటు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి బిమల్ చంద్రరాయ్ కూడా షానవాజ్ కధనాన్ని ధృవీకరించమని ఒత్తిడి తెచ్చినట్టు ఆయన రాశాడు.
ఖోస్లా కమిటీ (1970)
సురేష చంద్రబోస్ అభిప్రాయం ప్రకారం నేతాజీ బతికే ఉన్నాడనే ప్రచారం దేశవ్యాప్తంగా వెలువడటంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖోస్లాను ఏకసభ్యుడుగా నియమిస్తూ కమిటీని నియమించింది. ఆయన 1970 నుండి 1974 వరకు విచారణ జరిపి నివేదిక సమర్పింకాడు. పై రెండు కమిటీల నివేదికలోనిప్రధానాంశాలనే ఆయనకూడానిర్ధారించాడు.
ముఖర్జీ కమిటీ (2005)
నేతాజీ మరణంపై పలు అనుమానాలు, అపోహలుండటంతో వాజ్‌పేయీ ప్రభుత్వం 1999లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి యంకే ముఖర్జీ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2005లో సమర్పించిన నివేదిక ప్రకారం” నేతాజీ రష్యా ప్రయాణిస్తున్న విమాన ప్రమాదం‌లోనే మరణించాడని మౌఖిక సాక్ష్యాలు నిర్ధారిస్తున్నప్పటికీ, ఆ ప్రయాణం గురించి జపాన్ అధికారులతోపాటు ప్రయాణంలో తోడున్న నేతాజీ ముఖ్య అనుచరుడు హబీబుర్ రహ్మాన్‌కు మాత్రమే తెలుసనేది నమ్మశక్యం కాని విషయం. రెంకోజీ దేవాలయం‌లో ఉంచబడిన ఆస్తికలు,చితాభస్మం నేతాజీవని చెప్పబడున్నప్పటికీ అవి హృద్రోగంతో మరణించిన జపాన్ సైనికుడు ఇచిరో ఓకురాకు చెందినవి” అని పేర్కొన్నాడు.
నివేదికను పార్లమెంటుకు సమర్పించిన యూపీఏ ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే ఆనివేదికను తిరస్కరించింది.
సమాచార హక్కు దరఖాస్తులు:
సమాచార హక్కు కార్యకర్త సుభాశ్ అగర్వాల్ చేసిన దరఖాస్తులకు ప్రభుత్వమిచ్చిన సమాధానం:
“పొరుగు దేశాలతో దౌత్యపరమైన ఇబ్బందులు ఉన్నందువల్ల సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 (1) (ఎ) మరియు (2) ప్రకారం నేతాజీకి మరణానికి సంబంధించిన పత్రాలను వెల్లండించడం వీలు కాదు”
ఆమహానుభావుడి మరణం ఈ నాటికీ అనిర్దారితం.
మీ అభిప్రాయాలను కూడా పంచుకొండి.
పై కమిటీలు సేకరించిన ఛాయా చిత్రాలు. 1) జపాన్‌నుండి రష్యాకు బయలుదేరిన మార్గం 2) నేతాజీ ఎక్కినట్టు చెప్పబడుతున్న మిత్సుబిషి విమానం. 3) నేతాజీ మరణాన్ని ప్రచురించిన పత్రికలు 4) నేతాజీదిగా చెప్పబడుతున్న స్మారకం.
నేతాజీని కాబోయే భావినేతగా పేర్కొంటూ ఆంధ్రభూమి దినపత్రిక ప్రచురించిన వ్యాసాన్ని Durga Prasad Ch గారు పంపించారు. దాన్ని కూడా జతచేస్తున్నను.

మహానటులు
నటుడు నేడు రావు గోపాలరావు వర్ధంతి
రావు గోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992).
ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.
రావు గోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్ మోర్ లు ... వెండితెరపై సైతం ఆయన నటనావిన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పిపుట్టేలా చప్పట్లు కొట్టించాయి... ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయప్రవేశం చేసి ఆకట్టుకోవడం ఆయన శైలి... వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం పోసి మెప్పించారు రావు గోపాలరావు...
రావు గోపాలరావు అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికారు... అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమయింది... కొన్ని చిత్రాల్లో రావు గోపాలరావు గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించిన సందర్భాలూ ఉన్నాయి... బాపు-రమణ ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రావు గోపాలరావును నటింప చేశారు... రావు గోపాలరావు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన బాణీ పలికించారు... తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రావు గోపాలరావు నిజజీవితంలో ఎంతో సౌమ్యులు... రావు గోపాలరావు రాజ్యసభ సభ్యునిగానూ ఉన్నారు... ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు నటవారసునిగా రావు రమేశ్ ఈ తరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు... తెలుగు ప్రతినాయకుల్లో 'నటవిరాట్'గా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు... ఆయన స్థానం వేరెవ్వరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు...


పసుపులేటి కన్నాంబ !
.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.
ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల, తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ 1964 లో మే 7 వ తేదీన తుదిశ్వాస వదిలింది
‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా.....’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన ఆ మహానటి పనుపులేటి కన్నాంబ. ఆ సినిమా పేరు ‘చండిక’ (41), ఠీవి గురించి ఆ రోజుల్లో ఆ సినిమా చూసినవాళ్లు చెప్పుకునేవారు. అందులో కన్నాంబ ఇంకా కొన్ని పాటలు పాడారు. మరొక పాట : ఏమే ఓ కోకిలా - ఏమో పాడెదవు, ఎవరే నేర్పినది ఈ ఆట ఈ పాట.....‘ ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతూ పాడతారు. మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు - ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి జనం చెప్పుకునేవారు.
కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మింపజేశారామె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది. ఎక్కువగా క్యారెక్టర్స్‌ ధరించినా, కన్నాంబకు హీరోయిన్‌ గ్లామరే వుండేది. ఇప్పుడు ’టైటానిక్‌ చీరలు‘ అంటూ సినిమా పేర్లతో చీరలు వస్తున్నట్టు - అప్పుడు ’కాంచనమాల గాజులు - కన్నాంబ లోలాకులు‘ అంటూ ఆభరణాలు వచ్చేవి. కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.
ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి ఒక మిత్రుడు ఆయన్ని కలవాలని ఆ గదికి వెళ్లి ‘గుండె కలుక్కుమంది. ఆ వాతావరణం చూడలేక తిరిగి వచ్చేశాను’ అని చెప్పారు. ‘ఆ చిన్నగదిలో ఒక ట్రంకు పెట్టె, ఓ కుర్చీ మాత్రం ఉన్నాయి. ఎదురుగా కన్నాంబ ఫోటో, దండెం మీద తువ్వాలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఆయన కిందనే చాపమీద కూచుని, దినపత్రిక చదువుకుంటున్నారు’ అన్నారా మిత్రుడు.
కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.
(కృతజ్ఞతలు ... ప్రియ లక్ష్మి గారు ... మధురగీతాలు .)



ఎల్. ఆర్. ఈశ్వరి !
ఎల్. ఆర్. ఈశ్వరి నేపధ్య గాయని. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్
కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ".
ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు.
తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా
ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.

ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు.
ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.

ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.

ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది.సినిమాలు-పాటలు!
దొంగలున్నారు జాగ్రత్త (1958) (తొలి తెలుగు సినిమా)
జగన్నాటకం (1960)
అగ్గిపిడుగు (1964)
నవగ్రహ పూజామహిమ (1964) : నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా
పాండవ వనవాసం (1965) : మొగలి రేకుల సిగదానా (హేమమాలిని అభినయించిన పాట)
ప్రేమించి చూడు (1965)
శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
అగ్గిబరాట (1966)
ఉమ్మడి కుటుంబం (1967)
కంచుకోట (1967)
గోపాలుడు భూపాలుడు (1967)
శ్రీకృష్ణావతారం (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు
అమాయకుడు (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ
ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
పాలమనసులు (1968)
బంగారు గాజులు (1968) : జాజిరి జాజిరి జక్కల మావా
బందిపోటు దొంగలు (1968) : గండరగండా షోగ్గాడివంటా
బాగ్దాద్ గజదొంగ (1968)
గండికోట రహస్యం (1969)
నిండు హృదయాలు (1969)
బందిపోటు భీమన్న (1969)
కథానాయిక మొల్ల (1970) : నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట)
జన్మభూమి (1970)
లక్ష్మీ కటాక్షం (1970) : అందాల బొమ్మను నేను చెలికాడ
జగత్ జెంత్రీలు (1971)
జేమ్స్ బాండ్ 777 (1971)
బస్తీ బుల్ బుల్ (1971) : ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా
దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
నమ్మకద్రోహులు (1971) : ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది
బంగారుతల్లి (1971)
ప్రేమనగర్ (1971) : లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా
రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకో కోలా వేస్కో రమ్ము సోడా
పిల్లా-పిడుగు (1972)
బాలభారతము (1972) : బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా
భార్యాబిడ్డలు (1972) : ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ
మంచి రోజులొచ్చాయి (1972)
రైతుకుటుంబం (1972)
ఎర్రకోట వీరుడు (1973)
జీవన తరంగాలు (1973) : నందామయా గరుడ నందామయా
తాతా మనవడు (1973) : రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు
దేవుడు చేసిన మనుషులు (1973) : మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో
దేశోద్ధారకులు (1973)
ధనమా దైవమా (1973)
పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా
అల్లూరి సీతారామరాజు (1974)
నిజరూపాలు (1974)
నిప్పులాంటి మనిషి (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం
చిన్ననాటి కలలు (1975)
అంతులేని కథ (1976) : అరె ఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం
పాడిపంటలు (1976)
మన్మధ లీల (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్
దొంగల దోపిడీ (1978)
దొంగల వేట (1978)
మరో చరిత్ర (1978) : భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
సింహబలుడు (1978) : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్
అందమైన అనుభవం (1979) : ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు
చూసొద్దాం రండి (2000) (చివరిగా పాడిన సినిమా)

   Like
   
Sraju Nand

No comments:

Post a Comment