Monday 10 August 2015

1. అంకుశం 2. స్వాతికిరణం (1992) 3. రక్తసంబంధం (1962) 4. బుద్ధిమంతుడు (1969) 5. G బృందావన కాలనీ (2004 6. ఆకలిరాజ్యం (1981) 7. వాగ్ధానము 8. లవకుశ 9. ముత్యాల పల్లకి (1976) 10. అంకురం

ఓం శ్రీ రామ్                ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రాం 
పంజలి ప్రభ
Vinjamuri Venkata Apparao's photo.
సర్వేజనాసుఖినోభావంతు





ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమలకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు ( ఇది )

కళ్యాణిదండాలు కౌగిలికి తెలుసు
పారాణి మిసమిసలు పాదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకు తెలుసు
చిగురుటాకులో చిలిపిమాటలో
పసిడి బుగ్గల పలకరింపుల పడుచుజంటకే తెలుసు ( ఇది )

ముంగిట ముగ్గులు తొలిపొద్దు కనకం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
వెన్నెలకి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలిచూపులు ఇల్లాలి అందం
జన్మజన్మలా పుణ్యఫలముగా జాలువారినా
జాజిపువ్వులె ఆలుమగల వొక అందం ( ఇది ) .


"Idi Cheragani Premaku" Video Song - "Ankusam" || Rajasekhar | Jeevitha



   Like
   Comment
   Share









బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే...కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే

చిత్రం : రక్తసంబంధం (1962)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : అనిసెట్టి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభకనగానే కనులార తనివితీరేనే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 1 :

ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే...
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 2 :

అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు పెరిగేనే..

ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం 3 :

మనసైన వాడు వరుడు.. నీ మదినేలుకొనెడు ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళ ళ ళ –హాయి
ఓ బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

https://www.youtube.com/watch?v=gHUVG-ecuFM
Rakta Sambandham Golden Hit Song || Bangaru Bomma Raveme Song || NTR || Savithri
Click here for more Latest Movie updates, Subscribe to our Youtube Channel: http://goo.gl/mDS9IQ Lik...
 



తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది

చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 1:

కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

చరణం 2:

జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది

తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ

చరణం 3:

రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..

తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ

https://www.youtube.com/watch?v=HPEBF7o0rDo
Thotaloki Rakura Song - Buddhimanthudu Movie Songs - ANR - Shoban Babu - Vijaya Nirmala
Thotaloki Rakura Song, Thotaloki Rakura Video Song From Buddhimanthudu Movie, Buddhimanthudu Movie T...
 


పల్లవి :
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇది అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే
ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు
తెలియవులే
హే... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
చరణం : 1
అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే
కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి
తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
చరణం : 2
లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే
వరియించులే
ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లె ముక్కలు
అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్ర్తీ ఆయలే
ఉప్పొనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే
ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు
తెలియవులే
ఏ... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం 7/
మారదులే
చిత్రం :
G బృందావన కాలనీ (2004)
రచన : శివగణేశ్, ఎ.ఎమ్.రత్నం
సంగీతం : యువన్శంకర్రాజా
గానం : కార్తీక 





తన్న తన్ననన తన్న తన్ననన తన్న
న ననన తనతన తన్నాన
ఓహో... కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్లలల్లలల లల్లలల్లలల లల్లల లల్లల లాలలాల లాలాలా
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
ఏమంటావ్... ఊఁ...
ఉహుఁ... సంగీతం
నన్నానా... ఉఁ... నువ్వైతే
రీసరి... సాహిత్యం ఊహుఁ... నేనౌతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
చరణం : 1
ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్
ననననాన... స్వరము నీవై...
తరనన తరరనన స్వరమున పదము నేనై ఓకే
తానే తానే తానా... గానం గీతం కాగా
తరనతన కవిని నేనై
తానా ననన తనా... నాలో కవిత నీవై
నాన నాననా లలలా తనన తరన
కావ్యమైనదీ తలపో పలుకో మనసో
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా
చరణం : 2
ఇప్పుడు చూద్దాం...
తనన తనన తన్న
ఉహూ... తనన తనన అన్నా
తాన తన్న తానం తరనా తన్న
తాన అన్న తాళం ఒకటే కదా
తనన తాన తాన నాన తాన అయ్య బాబోయ్
తనన తాన తాన నాన తాన ఉహ్...
పదము చేర్చి పాట కూర్చలేదా శ భాష్
దనిని దససా అన్నా నీదా అన్నా
స్వరమే రాగం కదా
నీవు నేనని అన్నా మనమే కాదా
నీవు నేనని అన్నా మనమే కాదా
కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని
కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని
ఆహాహా లలల్లా ఆహాహా...
చిత్రం : ఆకలిరాజ్యం (1981)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి 



http://m.youtube.com/watch?v=Gi45vU7M-Yo



ఈ పాట ఎప్పుడు విన్నా ప్రతి మనిషి తన అంతరంగాన్ని తడుముకునేటట్లు ఉంటుంది. చెట్టు ఎంత పెరిగినా మూలాలు నేలలోనే విస్తరించి ఉన్నట్లు మనిషి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత ధనం గదించినా వారిని వారి వారి మూలాలు నుండి ఎవరూ విడదీయలేరు అనడానికి ఈ పాట ఒక చక్కని ఉదాహరణ .

ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు ॥
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా ..
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్

ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు

పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధమూ
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధమూ …
గాయపడని హృదయాలని జ్ఞాపకాలే అతుకు
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు

కన్నుల నీరు చిందితే తేలికవునులే
కన్నుల నీరు చిందితే తేలికవునులే
తనకి తనవారికి ఎడబాటే లేదులే ఎడబాటే లేదులే .

ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు

ఈ పాట వీడియో లింక్ ఎక్కడ లభ్యం కాకపోవడం వల్ల జత పరచలేకపోయాను. ఇంతకూ ముందు ఈ చిత్రం చూసినవారు శబ్ద చిత్రాన్ని వింటూ పాట దృశ్యం ని గుర్తుతెచ్చుకుంటూ ఆస్వాదనలో 



మునిగి తేలండి - 








వాగ్ధానము(సినిమా పాట)
======================

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆఆఆఆఆఆఆఅ

------------------------------
--------------------

ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగెను మనకోసమే
ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగెను మనకోసమే

------------------------------
--------------------

నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకుందాము అందని ఆకాశమే
------------------------------
---------------------

ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
ఆ చందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా

------------------------------
-------------------------

మేఘాలలో వలపు రాగాలలో
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
------------------------------
---------------------

ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా
ఆఆఆఆఆఆఆఅ
ఈ పూల దారులు ఆ నీలి తారలు
తీయని స్వప్నాల తేలించగా

------------------------------
------------------

అందాలను తీపి బంధాలను
అల్లుకుందాము ..... డెందాలు పాలించగా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా

-----------------------------

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆఆఆఆఆఆఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
--------------------------------





రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా

నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
నెల మూడు వానలు కురిసేనురా
బంగారు పంటలు పండేనురా
కష్ట జీవుల వెతలు తీరేనురా
బీదా సాదా బ్రతుకు మారేనురా

రామన్న రాముడు కోదండ రాముడు
శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా
Like · Comment ·







1 comment:

  1. గౌరవనీయులైన సంగీత ప్రియులకు ప్రాంజలి ప్రభ తరుఫున - సంగీత ప్రభ అనగా అనేక మంది రచయతలు, సంగీత
    దర్సకులు, గాయకులు మరియు అనేక మంది కృషి ఫలితముగా మన పాత సినమాల గీతాలను సేకరించి కొన్ని తెలుగులో టైపు చేసి మరియు యుట్యూబ్ కాసిట్ ఉంచి భాగమునకు 10 పాటలు చొప్పున పొందు పరిచాను. విని సంతోష పడగలరని చిన్న ప్రయత్నం చేస్తున్నాను, అందరికి ధన్యవాదములు

    ReplyDelete