Wednesday 19 August 2015

1. ఒక చిన్నమాట(1997) 2. గాయం (1993) 3. దీపారాధన (1980) 4. అల్లరి బుల్లోడు (1978) 5. కథానాయకురాలు (1970)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ 


లోకా: సమస్తా : సుఖినోభవంతు



 ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే.. <3
<3 చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

ఆఆ..ఆఆ...ఆఆఆ...
లల్లలల్లలాలల లల్లలల్లలాలల

వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే
సుముహూర్త మొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
తాజా గులాబి కన్నా మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా తన తలపే నాకు మిన్న
ఓ... వేదాల ఘోష కన్నా చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే తన మనసే నాకు మిన్న
మోహం తొలి మోహం కను గీటుతున్న వేళ
రాగం అనురాగం ఎద పొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట
చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై
రవళించు రాగమేదో పలికిందీ క్షణాన నాలో
ఓ... నా కంటి పాప తానై తన కొంటె చూపు నేనై
ఆడేటి ఊసులన్నీ మెదిలాయీ క్షణాన నాలో
గాలి చిరుగాలి కబురైనా చేర్చలేవా
చెలిమి నిచ్చెలిమి ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన
చెప్పవయ్య చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట
చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట
ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే
సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా <3

చిత్రం : ఒక చిన్నమాట(1997)
సంగీతం : రమణి భరద్వాజ్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర

https://www.youtube.com/watch?v=-m0ow-65zH0
Oh Manasa Thondara Padake Song - Oka Chinna Maata Movie Songs - Jagapathi Babu, Indraja
Click here to watch Greeku Veerudu All Songs Trailer http://www.youtube.com/watch?v=wa8LS24YQhk Gour...



<3 అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల లలలలలలలా

నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లలలలలలలా

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లలలలలలలా <3

చిత్రం : గాయం (1993)
Rachana : sirivennela
Music : shree
Lyrics : Seetaraama sastry
Singer : chitra
నటీనటులు: జగపతి బాబు, రేవతి
https://www.youtube.com/watch?v=v7gPbY4W1IQ
Gaayam Songs - Alupannadi Unda - Revathi,Jagapathi Babu
is a 1993 Telugu movie directed by Ram Gopal Varma, which established Jagapathi Babu as a star. The ...

సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు..
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో

చిత్రం: దీపారాధన (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: దాసరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

సన్నగా.. సన సన్నగా...
సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో

చరణం 1:

కోరికమ్మ గుడిలో కోయిలమ్మ కూసిందో
జాజులమ్మ తోటలో గాజులమ్మ పిలిచిందో
జాజులు జాజులు చేరి గుసగుసమన్నాయి.. ల.. ల.. ల.. ల
గాజులు గాజులు చేరి గలగలమన్నాయి
అన్నాయి అమ్మాయి నీ నడుమే సన్నాయి
విన్నాయి అబ్బాయి ఈ నీ మాటల సన్నాయి

సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో
ఆ.. ఆహాహా... ఆహాహా.. ఆహహాహా

చరణం 2:

చుక్కలమ్మ వాకిట్లో జాబిలమ్మ పూచిందో
మబ్బులమ్మ పందిట్లో ఉరుములమ్మ ఉరిమిందో
మబ్బు మబ్బు కలిసి మంచం వేశాయి.. ఆహాహా..
చుక్క చుక్క కలిసి పక్కలు వేశాయి
వేశాయి అబ్బాయి ప్రేమకు పీటలు వేశాయి
వేశాయి అమ్మాయి పెళ్ళికి బాటలు వేశాయి

సన్నగా .. కను సన్నగా.. కనిపించే ఒక మెరుపు
సన్నగా.. సన సన్నగా..వినిపించే ఒక పిలుపు
ఆ పిలుపు మెరుపుదో.. ఆ మెరుపే పిలుపుదో
ఆ.. ఆహాహా... ఆహాహా..ఆహహాహా

https://www.youtube.com/watch?v=fpwYqMiBSrM&feature=youtu.be

sannaga sanasannaga.... Deepaaradhana
Good song of shoban babu and jayapradha



చుక్కల తోటలో ఎక్కడున్నావో...పక్కకు రావే మరుమల్లె పువ్వా...

చిత్రం: అల్లరి బుల్లోడు (1978)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లె పువ్వా

చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను

చరణం 1:

నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల
విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత
కొసరింది కోరిక అనురాగ గీతిక

నీ మూగ చూపులలో...చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో...సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి

చరణం 2:

ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో..
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో..
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో

ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆ.........
ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలి..నాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి

http://telugu4u.net/Downloads/data/mp3/320k/Chukkala%20Thotalo%20-%20Allari%20Bullodu%281978%29-www.Telugu4u.Net.mp3








1 comment:

  1. గౌరవనీయులైన సంగీత ప్రియులకు ప్రాంజలి ప్రభ తరుఫున - సంగీత ప్రభ అనగా అనేక మంది రచయతలు, సంగీత
    దర్సకులు, గాయకులు మరియు అనేక మంది కృషి ఫలితముగా మన పాత సినమాల గీతాలను సేకరించి కొన్ని తెలుగులో టైపు చేసి మరియు యుట్యూబ్ కాసిట్ ఉంచి భాగమునకు 11 పాటలు చొప్పున పొందు పరిచాను. విని సంతోష పడగలరని చిన్న ప్రయత్నం చేస్తున్నాను, అందరికి ధన్యవాదములు

    ReplyDelete