Monday 10 August 2015

1. కొదమ సింహం (1990) 2. చంటబ్బాయి (1986) 3. స్వర్ణ కమలం (1988) 4. క్రిమినల్ 5. ధనమా దైవమా 6. గోదావరి (2006) 7. మహామంత్రి తిమ్మరుసు (1962) 8. జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 9. శాంతినివాసం (1960)

ఓం  శ్రీ రామ్  ఓం శ్రీ రామ్   ఓం రి రామ్ 
పంజలి ప్రభ 
BLOG DO PROFESSOR-AHC/DIUB FÔSTER: PARTÍCULAS DE FELICIDADE.
సర్వేజనా సుఖినోభవంతు

  
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం 1:

గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో
సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో

వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే
కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే

ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో
చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో
ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగెనులే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం 2:

కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో
కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో

జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా
జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే

ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శృతిలో
వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో
కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా



https://www.youtube.com/watch?v=MPu58VTKD14
Kodama Simham Movie Songs || Allatappa Gongurammo || Chiranjeevi || Radha
Chiranjeevi, Radha and Sonam's Kodama Simham Telugu Movie - Allatappa Gongurammo Song with HD Qualit...

   Like
   Comment
   Share





నేను నీకై పుట్టినానని..నిన్ను పొందకా మట్టికానని...

చిత్రం: చంటబ్బాయి (1986)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే...ప్రేమ ....ఊపిరే ప్రేమ

చరణం 1:

నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు
నిన్ను తాకకా నిలవలేనీ..పంచ ప్రాణాలూ
కౌగిలింతలా గర్భగుడిలో... మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుప తరమా..
ప్రేమే...జీవన మధురిమా...

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో...
చేయి పట్టే మనసుతో...
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ

చరణం 2:

స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం...అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా

ప్రేమ మహిమ తెలియ తరమా..
ప్రేమే... జీవన మధురిమా

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ



https://www.youtube.com/watch?v=3AiTxv2FdqA
Chantabbai Movie || Nenu Neekai Puttinanani Video Song || Chiranjeevi,Suhasini
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...

   Like
   Comment
   Share





అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా...
అమృత గానమిది పెదవులదా... అమితానందపు ఎద సడిదా...

చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం

పల్లవి :
గురు బ్రహ్మః ... గురు విష్ణుః.. గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మః... ఆ.. ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మః... ఆ... ఆ
తస్మై శ్రీ గురవే నమ:

ఓం నమో నమో నమశ్శివాయ
మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ
అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?

అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?
సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా...
అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ

చరణం 1 :
మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై... ఆ.. ఆ...
వేణి విసురు వాయు వేగమై... ఆ... ఆ

అంగ భంగిమలు గంగ పొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల.. రస ఝరులు జాలువారేలా
జంగమమై జడమాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ...

చరణం 2 :
నయన తేజమే... నకారమై
మనో నిశ్చయం... మకారమై
శ్వాస చలనమే... శికారమై
వాంచితార్ధమే... వకారమై
యోచన సకలము... యకారమై

నాదం... నకారం...
మంత్రం... మకారం..
స్తోత్రం... శికారం...
వేదం... వకారం..
యజ్ఞం... యకారం...
భావమె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా... తాండవమాడే వేళా
ప్రాణ పంచమమె పంచాక్షరిగా.. పరమపధము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై .. పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా

అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?
అమృత గానమిది పెదవులదా?... అమితానందపు ఎద సడిదా?
అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ


Venkatesh Bhanupriya's Swarna Kamalam Telugu Movie Song Music : Ilayaraja Lyrics : Sirivennela Seetarama Sastry Comedy Videos http://www.youtube.com/navvulat...






తెలుసా మనసా ఇది ఏనాటి అనుబధమో..
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో..
తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలి చేరలేని ఒడిలో..
విరహపు జాడలేనాడు
వేడి కన్నేసి చూడలేని జత లో..
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది(తెలుసా)

ప్రతి క్షణం...నా కళ్ళలో నిలిచే నీ రూపం..
బ్రతుకులో.. అడుగడుగునా,నడిపె నీ స్నేహం..
ఊపిరే నీవుగా..ప్రాణమే నీదిగా..
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా..(తెలుసా)

DARLING..EVERY BREATH THAT I TAKE..
EVERY MOVE THAT I MAKE..
I WILL BE THERE WITH YOU..
WHAT WOULD I DO WITH OUT YOU..
I WANT TO LOVE YOU FOR EVER
AND EVER AND EVER..

ఎన్నడూ..తీరిపోని ఋణముగా ఉండిపో..
చెలిమితో..తీగ సాగే మల్లెగా అల్లుకో..
లోకమే..మారినా..కాలమే..ఆగినా..
మన ఈ గాధ మిగలాలి తుది లేని చరితగా.


Criminal Telugu Movie Songs, Starring Nagarjuna Akkineni, Manisha Koirala, Ramya Krishna, Directed by Mahesh Bhatt, Produced by K.S.Rama Rao and music by M.M...
youtube.com



నీ మది చల్లగా ---- ధనమా దైవమా

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...

ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...

జానకి సహనము రాముని సుగుణము
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము

నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...

https://www.youtube.com/watch?v=g5yIdBfjev0
nee madi challaga song - 3 in ntr danama divama
nee madi challaga song - 3 in ntr danama divama

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా ...నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా

చిత్రం: గోదావరి (2006)
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచయిత: వేటురి
నేపధ్య గానం: ఉన్నికృష్ణన్, చిత్ర

పల్లవి:

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం 1:

చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు

కన్నీరైనా గౌతమి కన్నా
తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం 2:

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా

గతమేదైనా స్వాగతమననా
నీ జతలోనే బ్రతుకనుకోనా రాముని కోసం సీతలా

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా
ఆ... ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా
మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

https://www.youtube.com/watch?v=ZKI_a1D_79U

Godavari Songs| Manasa Vacha Song
Watch and Enjoy Godavari Telugu Video Songs, Godavari Telugu Movie Songs Directed by Shekar Kammula


లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

చిత్రం : మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఎస్. వరలక్ష్మి

పల్లవి:

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా...
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం 1:

వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో
వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనో

అలకయేమో యని దరి రాకుండిన జాలిగ చూచే వేణు...
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా

చరణం 2:

నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో

మైమరచిన చెలి మాటే లేదని....
ఆ ..ఆ..ఆ ..ఆ ..ఆ..ఆ..ఆ
మైమరచిన చెలి మాటే లేదని.. ఓరగ చూచే వేణు...

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా
తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..
లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియను గా...
https://www.youtube.com/watch?v=WjU4XSoHBQM
leelakrishna ne leelalu ne theliyaga in mahamantri thimmarusu
Maha mantri thimmarasu




వెన్నెలలొని వికాసమె వెలిగించెద నీకనుల...
వెన్నెలలొని వికాసమె వెలిగించెద నీకనుల..
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈరేయి
వెన్నెలలొని వికాసమె వెలిగించెద నీకనుల.
..............................................................................

వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీకాలము..
కదలాడే సుందర వసంతమీకాలము...
చెలి జోలగపాడే వినోద రాగాలలో..చెలి జోలగపాడే వినోద రాగాలలో
తేలెడి కలల సుఖాలలో నిదురించుము ఈరేయి..నిదురించుము ఈరేయి
వెన్నెలలొని వికాసమె వెలిగించెద నీకనుల

.........................................................................................................................
బానుని వీడని ఛాయగ నీ భావములోనే తరింతునోయీ సఖా..
నీ భావములోనే తరింతునోయీ సఖా..
నీ సేవలలోనే తరింతునోయి సదా..నీ సేవలలోనే తరింతునోయి సదా
నీ ఎదలొనే వసింతులే నిదురించుము ఈ రేయి.. .నిదురించుము ఈ రేయి

.....................................................................................................................................
వెన్నెలలొని వికాసమె వెలిగించెద నీకనుల
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..నిదురించుము ఈ రేయ
...............................................................................................................................................

Like · Comment ·


No comments:

Post a Comment