Thursday 6 August 2015

1. డుండుండుం(2001) 2. విశ్వరూపం 3. శ్రీవారికి ప్రేమలేఖ 4. బాబాయ్ అబ్బాయ్ (1985) 5. గౌతమి (1987) 6. శిక్ష 7. డాక్టర్ ఆనంద్ (1966) 8. నాకూ పెళ్ళాం కావాలి 9. మాధవయ్య గారి మనవడు 10. సంకల్పం

ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ 
 https://lh3.googleusercontent.com/-R3ODl4SK97M/VcOH7OkESPI/AAAAAAAAD2s/QbsnC1GBmuQ/w506-h750/15%2B-%2B1
సర్వేజనా సుఖినోభవంతు

1. రహస్యముగా.. రహస్యముగా...పూత నవ్వులో పొంగులెందుకో..
చిత్రం : డుండుండుం(2001)
సంగీతం : కార్తీక్ రాజా
రచన : వేటూరి
గానం : టి.కె.కార్తీక్, స్వర్ణలత
రహస్యముగా.. రహస్యముగా
పూత నవ్వులో పొంగులెందుకో..
రహస్యముగా.. రహస్యముగా
పూత నవ్వులో పొంగులెందుకో..
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం
బరువేమో కొండశిఖరం..
చిలికి చిలికి నవ్వుతూ
చిక్కుతుంది నిండు పరువం
ఓ..హో..హో..ఓ..హో..హో..ఓ..హో..హో..

రహస్యముగా.. రహస్యముగా
పూత నవ్వులో పొంగులెందుకో..
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం
బరువేమో కొండశిఖరం..
చిలికి చిలికి నవ్వుతూ
చిక్కుతుంది నిండు పరువం
ఓ..హో..హో..ఓ.హో..హో..ఓ..హో..హో..

నేలనీరు గాలికే విద్యుల్లత కొట్టెనమ్మా
ఘాటు లేత ప్రణయమే ప్రపంచాలు దాటెనమ్మా
నిజమే నీవొచ్చి తాకితే..
నిజమే నీగాలి సోకితే.. మంచుల ముద్దగా నిలవనా
వెలుగై నీచూపు సోకితే నురగై నీలోన కరగనా..
చెలీ.. ఎదలాగే సొదలాగ చేసే గడబిడలెన్నో
ఓ..హో..హో..ఓ..హో..హో..ఓ..హో..హో..

అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..

దిరిదిరితాంతం ధిరిధిరితాం..
దిరిదిరితాంతం ధిరిధిరితాం..
దిరిదిరితాంతం ధిరిధిరితాం..
ఓ..ఓ..ఓ..ఓఓ...

తెల్లనైన పత్రమై ఈ హృదయం ఉందిలే
మెత్తనైన నీ వేళ్ళూ కన్నె ఎదనె అడిగినే
ఒకనాటివా కాదు వాంఛలు తెరచాటు కోరేటి ఆశలు
వలపై తలుపే తీయగా
మరునాడె అవి నా ఇంటిలో అధికారమై చలించెనూ
అదియో.. అది ఇదియో ఇది ఎదియో అదే నా అనురాగం..

రహస్యముగా.. రహస్యముగా
పూత నవ్వులో పొంగులెందుకో..
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం
బరువేమో కొండశిఖరం..
చిలికి చిలికి నవ్వుతూ
చిక్కుతుంది నిండు పరువం
ఓ..హో..హో..ఓ.హో..హో..ఓ..హో..హో..


Watch Rahasyamugaa Song From Dum Dum Dum Movie, starring Madhavan, Jyothika, Manivannan,...




తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని

4. చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే.. గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ.. యమున అని
అదే అదే..నా జీవమని గానమని
మౌనమని... తెలుసా..ఆ..ఆ ఆ

చరణం 1:

శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా

ఆదుకునే వెచ్చని మమత..
ఆవిరయే చల్లని ఎడద
ఒకటే శృతి.. ఒకటే లయ.. ఒకటే స్వరమూ..

ఆ..ఆ..ఆ..ఆ...ఆ.ఆ..ఆ..
ఆ.....ఆ....ఆ....ఆ

ఉన్న రాగమొకటే... అదే.. అదే..ఏ..ఏ
అనురాగమని.. మౌన యోగమని
ప్రేమ దీపమని..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

చరణం 2:

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్యమాస సుమదళాల తేనె వాకలా

సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి..

సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే
శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే

ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ
అదే..అదే.. మమకారము
సృష్టికారణం.. బ్రహ్మకు జననం..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..

https://www.youtube.com/watch?v=AcY7ofBcJIU
Babai Abbai Movie Songs || Telusa Neeku Telusa || Balakrishna || Anitha Reddy
Balakrishna - Anitha Reddy and Suthi Veerabhadra Rao's Babai Abbai Movie - Telusa Neeku Telusa Song

6. పాడుతూ వుంటానూ నీ తోడుగా వుంటానూ...
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ...

చిత్రం : శిక్ష
సంగీతం : చక్రవర్తి
గానం : P.సుశీల

పాడుతూ వుంటానూ నీ తోడుగా వుంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ వుంటానూ......

నాపాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు
అనురాగమే నీకు నా అర్చనై
నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు
అభిమానమే నాకు నీ అభయమై
నేను నీ సేవనై నీవు నా స్వామివై
ఈ ఇల్లు శివపార్వతుల వాసమై కైలాసమై విలసిల్లగా...
నే పాడుతూ వుంటానూ......

వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా
ఒక రీతినే మురియు ఆకాశమై
ఒక బాటనైనా ఎడబాటునైనా
ఒక ప్రీతినే చూపు అనుబంధమై
నేను నీ ఆత్మనై నీవు పరమాత్మవై
మన జంట సుఖదుఃఖ్ఖముల యోగమై ఒక యాగమై తరియించగా....

నే పాడుతూ వుంటానూ నీ తోడుగా వుంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ వుంటానూ......

http://n3.filoops.com/telugu/Siksha%20%281985%29/Paduthu%20Vuntanu.mp3



7. నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ...నీలమోహనా.. రారా.. రా రా రా...

చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా

జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా
రారా..రారా..

చరణం 1:

ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?

అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ
అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ

ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి?
హ హా హా..
హా హా..

నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా.. రారా.. రా రా రా...

చరణం 2:

ఆ... సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా...
సారెకు దాగెదవేమి..?

చరణం 3:

అటు... అటు... ఇటు... ఇటు...
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు

కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ?

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా?
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా?
పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా?

నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు

మువ్వల వేణువులు... మువ్వల వేణువులు

https://www.youtube.com/watch?v=W_i8IJtMsZA
Doctor Anand - Telugu Movie Superhit Songs - NTR, Anjali Devi, Kanchana
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


8. ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ....పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు...

చిత్రం : నాకూ పెళ్ళాం కావాలి
సంగీతం : వాసూరావు
సాహిత్యం : ఆత్రేయ
గానం : P.సుశీల

సా.......పా.....సా......
ఆ........ఆ........ఆ......

ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ....పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో.....ఓరగా ఎటు చూసినా ఒనుకొచ్చేనేందుకో
పిల్లకి పెళ్ళి చూపులూ పాఠం నేర్పని పరీక్షలూ

మనిషే ఎవరని తెలియని వాని....మనసున వున్నా రూపమేమిటో /2/
హంసల నడకల కోయిల పాటల సతి కావాలని కోరెనో ....
రంభా వూర్వశి మేనక మేని అందం కోసం వెతికేనో....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని / ఎవ్వరో/

ఆడది వెతికే అందం ఒకటే వంచన లేని మంచితనాన్నేని/2/
అప్పుడు మగడూ వామనుడైనా..హిమాలయంలా కనపడును
ఆకారంలో ఎలాగున్నా మన్మధుడల్లే వుంటాడూ....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని / ఎవ్వరో/

https://www.youtube.com/watch?v=kuwK4u62VTI
Naku Pellam Kavali Movie Songs - Evvaro Athanevvaro Song - Chandramohan - Rajendraprasad - Kalpana
Naku Pellam Kavali Movie Songs, Naku Pellam Kavali Songs, Naku Pellam Kavali Film Songs, Evvaro Atha...


9. నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం...ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం...

చిత్రం : మాధవయ్య గారి మనవడు
సంగీతం : విద్యా సాగర్
గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

పల్లవి :

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం - 2
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం
నీ పాట పాడి నే పల్లవైతి
నీ పదము తప్ప యే పదములు దొరకక - నీ చూపు

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం - 2
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి
నీ స్వరము తప్ప యే వరములు అడగక

చరణం :

పూతల్లో పురివిడిచిన పులకింత
చేతల్లో మునుపెరగని చమరింత
వులికి పడిన నీ నలక నడుములో
మెలిక పడితినే వీణాలో తీగానై
తగిలిందే తాళం రగిలిందే రాగం
చినుకల్లే నా ఒణుకేతీరా తాడికోరేటి తాపాలలో - నీ చూపు

చరణం :

ఓ కే లే ముద్దెరగని సాయంత్రం
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం
కధలు తెలిసెలే యదల కనులలో
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో - నేనేమో

http://www.dailymotion.com/video/x1bieyg_madhavayya-gaari-manavadu-songs-nee-choopu-suprabhatham-song-anr-sujatha_fun
Madhavayya Gaari Manavadu Songs - Nee Choopu Suprabhatham Song - ANR, Sujatha
Watch Madhavayya Gaari Manavadu Songs/ Madhavaiah Gari Manavadu Movie Songs/ Madhavayya Gari Manawad...
 
10.. అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ...
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా ...

చిత్రం : సంకల్పం
సంగీతం : కోటి
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం,K.S.చిత్ర

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ

ఉల్లిపూల నావగట్టి మల్లెపూల గొడుగుబట్టి ఉరేగాలంట వెన్నెల్లో
నారుమల్ల చీరగట్టి నల్ల మబ్బు కాటుకెట్టి ఊగేయాలంట ఊహల్లో
సూదంటు చూపులున్నవాడు నా వన్నెకాడు
లేలేత బుగ్గలిచ్చి అల్లరి ముద్దులు ఉబ్బిన క్షణమున

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

కూసింది కన్నెపిట్ట కసెక్కే కౌగిలి వలపున వాటంగా వలపివ్వని
ఊగింది మల్లెమొగ్గ సురుక్కు చూపులు తడిమిన వాకిట్లో విడిదిమ్మనీ
పెదవులలో చెలీ సఖీ స్వరాలు శ్రుతించనా
మధువులలో ప్రియా ప్రియా పదాలు లిఖించనా
రవికకు రాగాలు నేర్పించనా
మదనుడి మాన్యాలు రాసివ్వనా

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా

తుళ్ళింది లేత ముళ్ళు తపించే తుంటరి తుమ్మెద వెచ్చన్ని ఒడి చేరగా
కొట్టింది తేనె జల్లు వలేసే ఒంపున నడుమున వయ్యారి నిలదీయగా
అలసటలే తెలియని సుఖాల మదింపులో
బిడియములే ఎరుగని నరాల బిగింపులో
నడుముకి నాట్యాలు నేర్పించనా
పరువపు శంఖాలు పూరించనా
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ

అచ్చట్లో ముచ్చట్లమ్మా ముచ్చట్లో అచ్చట్లమ్మ
సందిట్లో చప్పట్లమ్మా ముంగిట్లో ముచ్చట్లమ్మా
గోదారికీ వరదొచ్చిందిలే కౌగిళ్ళకీ కబురందిందిలే
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...ఆ


Click here for more Latest Movie updates, Subscribe to our Youtube Channel: http://goo.gl/mDS9IQ Like...
youtube.com


image not displayed





No comments:

Post a Comment