Wednesday 5 August 2015

1. శుభలగ్నం (1994) 2. తెలుగందాలు, కాటుక కళ్ళు 3. aa naluguru 4. వయసు పిలిచింది (1978) 5. లంకేశ్వరుడు (1989) 6. "Ankusam" 7. స్వాతికిరణం (1992)

ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ 
ఆనందానికి పాటల సంగీతమ్ - ఆత్మా నందానికి ఆనంద  దాయకం    

1. చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం
అమ్మేశాక //చిలుకా//
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //
చిలుకా//
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే
అమావాస్యలో
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే
యింకా //చిలుకా//
చిత్రం : శుభలగ్నం (1994)
సంగీతం : S.V. కృష్ణా రెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 








తెలుగందాలు, కాటుక కళ్ళు, కన్నె వాకిళ్ళు, తిక్కన, పోతన, వంశధార, క్షేత్రయ, అమరావతి, గోదావరి, కృష్ణవేణి, శైలమల్లిక, భ్రమరదీపిక...ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది...

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
సగప గపప గసద రిసద
సగప గపప గసద రిసద
కాటుక కళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సగమపదప మగదపదపదప మగ
సగమపదరి సరిమగరిససని దమ

తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసేను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం నవ పద్మావతి పాదం
ఓ... రాగానికే అందం రస గీత గోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లిక
సూర్యకాంత వేళ రాగదీపిక
సగప గపప గసద రిసద
సగప గపప గసద రిసద
కాటుక కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సమ గమదమ సమగ రిసనిద
సమ గమదమ సమగ రిసనిద
పప సనిరి నిని రిసగ

క్షేత్రయలో జాణతనం వరదయ్యనులే వలపుతనం
అందని నీ ఆడతనం అమరావతిలో శిల్ప ధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మల గంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుడి ఆలయాన భ్రమర దీపిక
సగప గపప గసద రిసద
సగప గపప గసద రిసద
కాటుక కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా...ఆ... 



https://www.youtube.com/watch?v=_ZxtIPYNeas&feature=youtu.be





రామ రామ శ్రీ రమాపతే ఇయ్యరావయా మాకు సద్గతి
నీలకందరా హరోం హరా దారి చూపరా ఆదిశంకరా

ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం
యెద తలుపులు తెరిచేయాలి
అరమరికల తెర తీయాలి
తొలి వెలుగును ఆహ్వానించాలి.. హో
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్

ఇంకో రోజొచ్చిందండి మీకోసం నాకోసం
గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం

వెలుగు నింపే దీపమా శక్తిని మాకీయుమా
ప్రేమ సాగరమా ప్రేరణ మీయుమా

ఏ పాపం తెలియని ఈ పాపాలను చల్లగా చూడు దేవా
నవ్వులనే పువ్వులు చేద్దాం పువ్వులనే పున్నమి చేద్దాం అల్లరితో పల్లవి పాడేద్దాం
కన్నీళ్ళకు కళ్ళెం వేద్దాం కష్టాలకు సెలవిచ్చేద్దాం ఆనందం అస్వాదించేద్దాం
మనసు అందంగా ఉంటే అంతా అందంగానే కనిపిస్తుంది కదా

హో... అందాలే విరబూసింది ఈ లోకం మన లోకం
అందామా ఇంకో రోజుకు హుందాగా ఓ వెల్కమ్(welcome)

లేరుగా ఈ లోకంలో మీకంటే అతి మంచోళ్ళు
మంచిగా పైపై నటనలు చేసే వాళ్ళే పిచ్చోళ్ళు
అరె ఆ డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఓరయ్యో మనకొద్దురా
నరజాతిని పీడించే విద్రోహ పిచ్చి విధ్వంస పిచ్చి విద్వేష పిచ్చి ఈ కోటలో రద్దురా
పరమాత్మలు మీరేరా యారో
నవ్వండి నవ్వండి మాక్కూడా నేర్పండి

సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూరీడు
ఆ పక్కన భూమిని నిద్దర లేపాడు లేపాడు
ఈ మాపటి చీకటి చూసి భయపడడం ఇక మానేసి కల కందాం రేపటి ఉదయాన్ని
డోంట్ వర్రీ బి హ్యాపీ (Don't worry be happy)






ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం
ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం
ఈ యవ్వనం ఊయలూగునే
వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం
ఈ యవ్వనం ఊయలూగునే
భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం
పగలు రేయి చేసే హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం
ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే
చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం:ఇళయరాజా
రచన : ఆరుద్ర
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల







జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ..వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : మనో, జానకి

పల్లవి :
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం

ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..దొరికిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...

చరణం 1 :
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీర కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీర వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ

చరణం 2 :
మంచల్లే కరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలీ
పూవుల్లో దాగున్న అందాలనీ మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..



1 comment: