Thursday 6 August 2015

1. బొబ్బిలి యుద్ధం (1964) 2. మల్లీశ్వరి (1951) 3. మిస్సమ్మ (1955) 4కలియుగ రావణాసురుడు (1980) 5. మూగమనసులు 6. బావ బావ పన్నీరు 7. విలన్ 2015 8. హై హై నాయకా(1988) 9. కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ 10. . ముక్కు పుడక

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రా0         ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -సంగీత ప్రభ 

నవ్వు నవ్వుతూ నలుగురిని బ్రతికించు - 
సంగీతముతొ అందరిని సంతోషపరుచు 



ఊయలలూగినదోయి మనసే...తీయని ఊహల తీవెలపైన

చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. భానుమతి

పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన .. ఊయలలూగినదోయీ...

చరణం 1:

వెన్నెల పూవులు విరిసే వేళా
సన్నని గాలులు సాగే వేళా
వలపులు ఏవో పలికెను నాలో ... ఆ...
తెలుపగ రానిది ఈ హాయి...

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

చరణం 2:

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై.. పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

https://www.youtube.com/watch?v=fyRIpJxYGBk

Bobbili Yuddham | Vooyalalooginadoyi Manase song
Listen to the melodious hit of P Bhanumathi," Vooyalalooginadoyi Manase" from the historical film Bo...


కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట...

చిత్రం : మల్లీశ్వరి (1951)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : భానుమతి

పల్లవి:

ఓ..ఓ..

కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట
కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట

మల్లీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా.. బంతులు కట్టి తెస్తారా...
పెళ్ళికి మీరు వస్తారా? పేరంటానికి వస్తారా?
చరణం 1:

పందిరి వేస్తాము.. ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద పెళ్ళివారికి విందులు చేస్తాము.. బాగా విందులు చేస్తాము
బాకా బాజా డోలూ సన్నాయ్ ..
బాకా బాజా డోలూ సన్నాయ్.. బాకా బాజా డోలూ సన్నాయ్
మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు... తప్పెట తాళాలెడతారు

కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట...

చరణం 2:

అందాలా మా బావగారికి గంధాలు పూసి
ఓ..గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము... కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసీ.. గంధం పూసీ... కుళ్ళేయేసి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము

ఓ..పల్లకి యెక్కి ...
పల్లకి యెక్కి కోతీ బావా పళ్ళికిలిస్తాడు
బావా పళ్ళికిలిస్తాడు...
మా కోతీ బావా పళ్ళికిలిస్తాడు..

కోతీ బావకు పెళ్ళంటా.. కోవెల తోట విడిదంటా.. కోవెలతోట విడిదంట..

https://www.youtube.com/watch?v=agO1MLwz_Mo
Malleeswari Movie Songs || Kothi Baavaku Pellanta || N.T. Rama Rao || Bhanumathi Ramakrishna
NTR and Bhanumathi's Malleeswari Telugu Movie Songs - Kothi Baavaku Pellanta Song with HD Quality St...


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే...మహలక్ష్మి సుందర వదనము గనరే...

చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : పి. లీల

పల్లవి:

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే

చరణం 1:

పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా

మల్లే మొల్లల తరులు సఖి జడను సవరించీ
ఎల్లా వేడుకలిపుడూ చేయించరమ్మా

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే

చరణం 2:

కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా

కులమెల్ల దీవించు కొమరూని గనుమంచు
ఎల్లా ముత్తైదువులు దీవించరమ్మా

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే

https://www.youtube.com/watch?v=aSmei4BQWgk
Missamma Movie || Sri Janaki Devi Video Song || NTR, ANR, SVR, Savitri, Jamuna
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...


బాపు గారి కలియుగ రావణాసురుడు చిత్రం నుంచి - ఎంతో అందమైన మెలోడీ . బాలు గారి స్వరం - కే.వి .మహదేవన్ గారి సంగీతం - సి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం - కళ్ళను అంత అందం గా వర్నిచారో మీరే చదువుతూ వినండి ..

ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త. పద్మభూషణ్ "జ్ఞానపీఠ" అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డిgariki హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

నవ్వీ నవ్వని కళ్ళు,
చుసినట్టేచూసి..తలుపులు మూసేసుకున్న కళ్ళు.
తొలిపొద్దులో తామర కళ్ళు,
మలిసందేలో కలువ కళ్ళు,
ఎటిపాయలో చేపకల్లు, తోటమలుపులో లేడి కళ్ళు
ఎన్నాళ్ళు చూసినా ఎన్నేళ్ళు చూసినా...
లోతులందని కళ్ళు..నా లోకమేలే కళ్ళు..
ఏమి చక్కని కళ్ళు...రామ చక్కని కళ్ళు.
సిగ్గును చీరగా కప్పుకుని..చిలిపిగా ఓరగా కప్పుకుని..
చిరు చిరు చూపులు..చుర చుర చూపులు..
కలియబోసి ముగ్గులేసి..
రారమ్మని..పోపొమ్మని..ఇపుదోద్దని..సరిలెమ్మని..
ఊరించే కళ్ళు..సరసాలకి సంఖం పూరించే కళ్ళు..
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు.
ఆవులించే కళ్ళు..ఆకలేసిన కళ్ళు..
రైక తొడిగిన కళ్ళు..పైట తొలగిన కళ్ళు..
కసిరి..వల విసిరి..వలపు కొసరి కొసరి..
మగతను ఎగదోసే కళ్ళు..మనసును నమిలేసే కళ్ళు..
ఆ కళ్ళే..నడివేసవి వడగళ్ళు...
ఆ కళ్ళే ..నా కలల పొదరిల్లు..
లోతులందని కళ్ళు..నా లోకమేలే కళ్ళు...
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు.

https://www.youtube.com/watch?v=VwfPdNDIMDc

Nallanallani kallu నల్లానల్లని కళ్ళు
Movie: Kaliyuga Ravanasurudu (1980) Music: KV Mahadevan Lyrics : C Narayana Reddy Singer: SP.Balasub...



గోదారి గట్టుంది…
పండు ముసలిగా ఉన్న గౌరి (జమున)నిక్లోజప్ లో చూపిస్తూ, కథని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళతారు మూగమనసులు చిత్రంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు. సరిగా అప్పుడే ఓ అద్భుతమైన పాట మొదలవుతుంది. అదే `గోదారి గట్టుంది…’
ఇదొక అరుదైన ప్రేమకథా చిత్రం. ఇందులో పూర్వజన్మల అనుబంధం ఎంత ఘాటుగా ఉంటుందో తెలియజెప్పే ప్రయత్నం జరిగింది. చావుపుట్టక అనేది శరీరానికే గానీ ఆత్మకు కావన్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని అల్లిన కథకు దృశ్యరూపమే మూగమనసులు.
గోదావరిమీద ఓ పడవపై ఓ పడుచుపిల్ల హుషారుగా పాడుతుంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో కూడా గోదావరి అందాలను కెమేరాలో చక్కగా బంధించారు పి.ఎల్ రాయ్. లాంగ్ షాట్ లో రాగాలాపన పూర్తికాగానే జమున పాదాలపై కెమెరా ఫోకస్ చేస్తూ పాటచిత్రీకరణ కొనసాగిస్తారు. ఘళ్లు ఘళ్లున మ్రోగే పాతతరం గజ్జలను వేసుకున్న గౌరి తన పాదాలను చెట్టుమానుకు మోటిస్తూ, వాటిని సుతారంగా ఆడిస్తూ ఉండగా షాట్ ఓకే అనేశారు దర్శకుడు.
ఇక అక్కడి నుంచి జమున ఈ పాటలో ఎంతో చలాకీగా నటించింది. అమాయకత్వం ఒకవైపు, చలాకీ తనం మరోవైపు, తన వ్యక్తిత్వం తెలిపే గడుసుతనం మరోవైపు….వెరసి గోదావరి పరవళ్లులా సాగుతుంది జమున నటన. దాశరధి రచనకు కెవీ మహాదేవన్ గారు చిరకాలం గుర్తుండిపోయే ట్యూన్ కట్టారు. సుశీల చాలా చలాకీగా పాడి పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా చూశారు.
పాట ఇది…
గోదారి గట్టుంది ,గట్టుమీద సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్
గోదారి గట్టుంది ,గట్టుమీద సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది
ఓ ఓ ఓ ఓ హోయ్
వగరు వగరుగ పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది
తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది ఈ ఈ
గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్
ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది
ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో ,ఇడమరిసే ఆ ఇది వుంది
గోదారి గట్టుంది ,గట్టుమీద సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్
పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ
గోదారి గట్టుంది ,గట్టుమీద సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది
గోదావరి గురించి చెప్పుకున్నప్పుడల్లా చటక్కున మదిలో మెదిలే పాట ఇది. ఈ సినిమాకూ గోదావరికీ ఎనలేని అనుబంధంఉంది. చిత్ర నిర్మాణంలో ఎక్కువ భాగం గోదావరి నది ఒడ్డునే చిత్రీకరణ చేశారు. జమున గురించి మనమిక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ సంఘటన చెప్పుకోవాలి. ముక్కుమీద కోపం , నీ ముఖానికే అందం – అన్న పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు జమున కాలికి గాయం అయింది. దర్శకులు విశ్రాంతి తీసుకోమన్నా , వద్దని కాలి కట్టుతోనే బాధను లెక్కచేయకుండా ఆ పాటను పూర్తి చేశారు


ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే...సంబరాల సాగే సందె మబ్బు రావే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే...
చిత్రం : బావ బావ పన్నీరు
సంగీతం : చక్రవర్తి
గీత రచయిత : సీతా రామ శాస్త్రి
నేపధ్యగానం : SP.బాల సుబ్రమణ్యం,చిత్ర

ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
సంబరాల సాగే సందె మబ్బు రావే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
గోరువంక రావే కోరుకున్నదీవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె
చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే

నవ వధువై చెలి వయ్యారి హొయలొలికి వరించాలి
కలయికతో ప్రియా సరాగం శుభకరమై ఫలించాలి
ఆ.. హరివిల్లుల ఆమనిలోన నిలువెల్లా నే అల్లుకుపోనా
నూరేళ్ళ బందీని కానా

ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
గోరువంక రావే కోరుకున్నదీవే

తొలి వలపే వరం సుతారం జత కడితే అదో తమకం
చెలి పలుకే శుభం సరాగం ముడిపడితే సుధా మధురం
సురపొన్నల పానుపు పైన సుఖ శాంతుల వెల్లువ కానా
నీలోన నేనుండిపోనా

గోరువంక రావే కోరుకున్నదీవే
వేగు చుక్క రావే పెళ్ళి చుక్క తేవె
చెక్కిళ్ళపై నీవే ముత్యాల ముగ్గేసి పోవే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
సంబరాల సాగే సందె మబ్బు రావే
సిందూరివై నీవే నా రాణి పారాణి కావే
ముద్దబంతి రావే ముద్దు తీర్చి పోవే
https://www.youtube.com/watch?v=MXORWug9Hq4
Muddha Banthi Raave Song - Bava Bava Panneeru Movie Songs - Naresh - Roopa Kala
Watch Muddha Banthi Raave Song from Bava Bava Panneeru Movie, starring Naresh, Srinivasa Rao Kota, B...

నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా...నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా

చిత్రం : విలన్ 2015
సంగీతం : విద్యాసాగర్
గానం : ఉన్నికృష్ణన్, సుజాత

నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా (2)
నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా

నే బిడియ పడితే నువు గిలివా చెక్కిలివా
నే విరహమైతే నువు రతివా కోరికవా
నే పాపనైతే నువు ఒడివా ఊయలవా
నే నిదురనైతే నువు కలవా కౌగిలివా
నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా
నా గుండె గుడిలో నువు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా

నే గగనమైతే వేసవివా వెన్నెలవా
నే నదిని ఐతే నువు అలవా అలజడివా
నే విందునైతే నువు రుచివా ఆకలివా
నే భాషనైతే నువు స్వరమా అక్షరమా
నే పాటనైతే నువు శృతివా పల్లవివా
నే.. నే.. నే తోటనైతే ఆమనివా కోయిలవా
నే జంటకొస్తే నువు రుషివా మదనుడివా
నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా
నిను నేను పిలవకుంటే నువు అలగవా అడగవా
నన్ను ప్రేమించమంటే తప్పా ఒప్పా

నీలోన ఉందీ నేనేకదా నేనేకదా
నాలోన ఉందీ నీవే కదా నీవే కదా
యదలోని వలపే ఎదురెదురు చూసి వాన లాగా ఒడిచేరెనే

https://www.youtube.com/watch?v=LJqOyC0E8gk
Naa Gunde Gudilo Song - Villian Movie Songs, Rajasekhar, Neha Dhupia, Tulip Joshi, KS Ravi Kumar
Watch Naa Gunde Gudilo Video Song from Villian Movie,


ఇది స-రి-గ-మ యెరుగని రాగం...ఇది భాషే లేని భావము...ప్రేమ గానము 

చిత్రం: హై హై నాయకా(1988) 
సంగీతం: సురేష్ చంద్ర 
సాహిత్యం: జొన్నవిత్తుల 
నేపథ్య గానం: బాలు ; జానకి 

ఇది స-రి-గ-మ యెరుగని రాగం 
ఇది భాషే లేని భావము 
ప్రేమ గానము 
ఇది యిదియని తెలియని భావం 
ఇది పలికే భాషే మౌనము 
ప్రేమ గానము 

మణిలాగ రమణిలాగ 
సుధచిందే వసుధనందే 
అరవిరిసే ఆశల ఆమని... 
అనురాగం తనువు వూగ 
లతలోని కలతదీర 
జతజేర రారా లాహిరి... 
కలహంసలా విరిధనువులా రావే వధువులా... 

గిలిగింత రగిలినంత 
రసగీతి సరసరీతి 
రవళించగ రారా మురళిలా... 
వనరాణి కవనవాణి 
కలవాణి కలలకేళి 
చెలి వెన్నెల విరిసే వేళలో 
నిను చేరగా తగు సమయమే రానీ శుభమని... 

Hai Hai Nayaka Songs - Idi Sarigamalu Erugani Raagam
A Typical classic comedy from the Creator of Comedy "Jandhyala". http://www.imdb.com/title/tt0249561.

ఏనాడు విడిపోని ముడి వేసెనే...నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని

ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

సా...గామ గమ గామ గమరీ..
సారి నిరి సారి నిసనీ..
సాదాదరీ.. రీగాగపా..

మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలమూ కలగానమై
నిలవాలి మన కోసము... ఈ మమత

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మధుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే
చేరింది మన జంటకు... ముచ్చటగ

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
https://www.youtube.com/watch?v=XAERSgpAD0k
YENADU VIDIPONI - SRI KANAKA MAHALAKSHMI RECORDING DANCE TROUPE
 
. ముక్కు పుడక

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా...... 

చిత్రం : ముక్కు పుడక 
సంగీతం : JV.రాఘవులు 
సాహిత్యం : సి.నా.రే 
గానం : P. సుశీల 

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా 
ఆ సిరి వుంటే బతుకంతా ఏడడుగుల నడకా 
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా 

చల్లని నా రాజు కళ్ళలో వున్నాడు 
కన్నీళ్ళు రాకుండా కాపలా వున్నాడు.../2/ 
కలికి మనసులో...ఎన్ని ఆశలో... 
కలికి మనసులో...ఎన్ని ఆశలో... 
అది కాచుకుంది ప్రతి నిముషం రెప్ప వాల్చకా....మగని 

మూడు ముళ్ళ సాక్ష్యం నీవాడు మరచి పోలేడూ 
తన నీడ చూసుకుని తానె ఉలికి పడతాడు.../2/ 
దాగదు పాపం...ఆగదు పుణ్యం... 
దాగదు పాపం...ఆగదు పుణ్యం... 
ఈ బ్రతుకిలాగే వుండదు నీ నోము పండకా 

మగని మనసూకే గురుతూ మగువ ముక్కు పుడకా 
ఆ సిరితోనే నడిచేవు చివరి ఘడియ దాకా 
ఏడేడు జన్మల దాకా ఆ నడకా ఏడేడు జన్మల దాకా 
ఆ నడకా ఏడేడు జన్మల దాకా 






















 












No comments:

Post a Comment