Wednesday 5 August 2015

1. chuttalunnaaru jagarta - 1980 2. నువ్వు నాకు నచ్చావ్ (2001) 3. Antaha puram 4. Anand 5. ఆర్య 2 (2009) 6. Sitara 7. అమరజీవి (1983) 8. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007) 9. కళ్యాణ మండపం 10. అసెంబ్లీ రౌడీ (1991) 11. kotta bangaarulokam 12. Vayari Godavari amma

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ-సంగీత ప్రభ 
మనోధైర్యానికి  సంగీతం మనసుకు ఊరట - ఆనందానికి ఇది ఒకబాట


 image not displayed
 
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా...

చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా
రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసే వెంబడించింది...నిమిషమాగకా...
మనసు వెంబడించిందీ..నిమిషమాగకా...

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా....రివ్వంటుంది కోరికా..ఆ..ఆ..

చరణం 1:

చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. వింతగా ఉన్నదా
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా...
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా

నిన్న కలగా ఉన్నది... నేడు నిజమౌతున్నది
నిన్న కలగా ఉన్నది.. నేడు నిజమౌతున్నది
అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా.....రివ్వంటుంది కోరికా...ఆ..ఆ..

చరణం 2:

కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది...
గుండెలో చూడకు గుబులుగా ఉన్నది

తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
తొలి చూపున దాచించి మలి చూపున తెలిసింది...
ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది...

ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
మనసు వెంబడించింది...నిమిషమాగకా...
మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...

రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా

హ..హా...ఆ..ఆ...
https://www.youtube.com/watch?v=pyDcAv8zsVQ

Chuttalunnaru Jagratha - Rekkalu Todigi
Nice song By Sridevi And Krishna

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..
వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి!
నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి!
చందమామ మనకందదని.. ముందుగానే అది తెలుసుకుని..
చేయి చాచి పిలవద్దు అని.. చంటిపాపలకు చెబుతామా!
లేని పోని కలలెందుకని.. మేలుకుంటే అవి రావు అని..
జన్మలోనే నిదరోకు అని.. కంటిపాపలకు చెబుతామా!
కలలన్నవి కలలని నమ్మనని.. అవి కలవని పిలవకు కలవమని..
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా!
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..
అందమైన హరివిల్లులతో.. వంతెనేసి చిరుజల్లులతో..
చుక్కలన్ని దిగి వస్తుంటే.. కరిగిపోని దూరం ఉందా!
అంతులేని తన అల్లరితో.. అలుపు లేని తన అలజడితో..
కెరటమెగిరి పడుతూ ఉంటే.. ఆకాశం తెగి పడుతుందా!
మనసుంటే మార్గం ఉంది కదా.. అనుకుంటే
అందనిదుంటుందా..
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా!
ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..
చిత్రం : నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం : కోటి
రచన : సిరివెన్నెల
గానం : కుమార్ సాను , చిత

http://m.youtube.com/watch?v=LJnv00w1HR0


అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం
మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా




Asalem Gurthukuradhu Video Song || Anthapuram Movie / Sai Kumar, Jagapathi Babu, Soundarya,...
youtube.com
Like


నిన్నేనా నేను చూస్తుంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వు ఒకడివ వందవా
ఇంతకి నువ్వెవరికీ అందవా
కొత్తగా లవ్లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుందే
ముందుగ మనసుకి తెలిసుండే ముందుకు నెడుతూ ఉంటుందే

తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుందే
నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పలో రేపు మరుస్తుందే
నిన్నేనా నేను ....................
తడవక నడిపే గొడుగనుకోనా
అడుగుల సడిలో పిడుగైనా
మగతనిపించే మగతనమున్నా మునివనిపించే బిగువేనా
ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లి పోతున్నావా
పువ్వులా నా సున్నితాన్ని కాపు కాస్తున్నావా
నాకేమవుతావో చెప్పవా ఇపుడైనా
చెప్పమని అడిగేం లాభంలే ఎప్పుడో పొందిన ఆన్సరులే
ఉత్తినే వేసే question లే ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టే నేరాలై కుదురుగా ఉంచని తొందరులే
తరిమినా అంతా నీవల్లే అంటూ నిలదీసే నిందల్లే
నిన్నేనా నేను......

బిత్తరపోయే బెదురొదిలించు కొత్తగా తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియము తెంచు అత్తరు సుడివై నను ముంచు
చెంప కుట్టే తేన పట్టై ముద్దులే తరమనీ
చెమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడగలేకున్నా
చెప్పమని అడిగేం....
.
Nuvvena Naa Nuvvena Song - Anand Movie | Raja | Kamalinee Mukherjee
Watch Nuvvena Naa Nuvvena Song From Anand Movie Anand is a Telugu movie, directed by Sekhar Kammula....

ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ…
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలేఎ నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే ఙ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే ఙ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ…
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లొ దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయిందా నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా
కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ… ఓఊ… ఓఒ…
చిత్రం : ఆర్య 2 (2009)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : వనమాలి
గానం : సాగర

http://m.youtube.com/watch?v=i76-_e23xr0





కు కు కు కు కు కు కు
కు కు కు కు కు కు కు కోకిల రావే(2)
రాణివాసము నీకు ఎందుకో..
రెక్క విప్పుకో చుక్కలందుకో..

రంగుల లోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో(2)
స్వరమై రావే విరి పొదల ఎదలకు

సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు దిరుజు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువ్వు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు(2)
Kukuku Kokila Raave - Sitara - Bhanupriya & Suman
Kukuku Kokila Raave - Sitara - Bhanupriya & Suman - Telugu Songs. Groove yourself to this amazing mu...


అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి...ఆడ ఉసురు తగలనీకు స్వామీ...

చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

సాకి :
శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన
ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజల కు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహములకు.. పరములకు నీదాననై..ధన్యనై..
జీవన వరాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవ దేవి. .

పల్లవి :

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి ?
స్వామీ... స్వామీ
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

చరణం 1 :

హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని .. నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడ దారి
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..

చరణం 2 :

నశ్వరమది..నాటక మిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దే...

చరణం 3 :

అలిగే నట శ్రీ రంగం.. తొలగే నట వైకుంటం
యాతన కేనా దేహం?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము
రంగా! రంగ... రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..

https://www.youtube.com/watch?v=9tPF2iPwK3I
Asura Sandhya Vela Song - Amarajeevi Movie Songs - ANR - Jayapradha - Sumalatha
Asura Sandhya Vela Song, Asura Sandhya Vela Video Song From Amarajeevi Movie, Amarajeevi Movie Asura...

పల్లవి :
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
చరణం : 1
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ..
సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందం అనిపించగా
దిగివచ్చినొ ఏవో దివి కానుక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో
దేవేరిగా గుండెల్లో కొలువుండగా
చరణం : 2
తన వయ్యారంతో ఈ చిన్నది లాంగిదోయ్ ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి
ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా...
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
రచన : సిరివెన్నెల
సంగీతం : యువన్శంకర్రాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

http://m.youtube.com/watch?v=UXMZ55C2MI4


పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే...వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి

చిత్రం : కళ్యాణ మండపం
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస

ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
ఒక కోవెలలో ఒకడే దేవుడు
ఒక హృదయములో ఒకడే ప్రియుడు
జీవననేత ప్రేమ విధాత జీవననేత ప్రేమ విధాత
అను గుడిగంట విను ప్రతిజంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే

తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
తీగా తీగా పెనగీ పెనగీ రాగధారగా సాగీ సాగీ
జీవనగంగా వాహిని కాదా , జీవనగంగా వాహిని కాదా
అను ప్రతిజంట – విను గుడిగంట

సరిగమ పదనిస నిదప మగరిస అని
పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే
వలచే మనసుకు బదులుగ బదులుగ
పిలిచే కనులకు ఎదురయి ఎదురయి
పలికే వారుంటే సరిగమ పదనిస నిదప మగరిస
అని పలికే వారుంటే హృదయము తెరిచే వారుంటే





నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
చిత్రం : కొత్తబంగారులోకం
సంగీతం : మిక్కీ J.మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్వేతా ప్రసాద్

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...

మొదటిసారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా...
వయసులోని పసితన్నాన్ని పలకరించిన ప్రణయమా...
మరీ కొత్తగా... మరో పుట్టుక...
అనే టట్టుగా ఇది నీ... మా...యే...న....

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...

పదము నాది పరుగు నీది రిథము వేయరా ప్రియతమా...
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా...
నువ్వే దారిగా... నేనె చేరగా...
ఎటూ చూడకా వెనువెంటే రానా...

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...


Nenani Neevani song from Kotha Bangaru Lokam. Starring Varun Sandesh, Swetha Basu Prasad,...






1 comment: