Thursday 6 August 2015

. 1.రాముడు కాదు కృష్ణుడు (1983) 2. జీవితంలో వసంతం (1977) 3. బుద్ధిమంతుడు (1969) 4.దసరా బుల్లోడు (1971) 5. ఆలుమగలు (1977) 6. ఆరాధన (1976) 7. సత్యం (2003) 8. సి.ఐ.డి (1965) 9. అంతా మనమంచికే(1972) 10, అందమైన అనుభవం (1979)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ-సంగీత ప్రభ 

image not displayed 
 

చూశాక నిను చూశాక...చూశాక నిను చూశాక...ఆగలేక మనసాపుకోలేక రాశాను ఒక లేఖ

చిత్రం : రాముడు కాదు కృష్ణుడు (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల

సాకీ :

ఒక సంధ్యా సమయాన..దిక్కు తోచక
నే దిక్కులన్నీ చూచుచుండా...
ఉత్తర దిక్కున మెరిసెను ఒక తారక..
అది తారకో...మేనకో...నా అభిసారికో...

పల్లవి :

చూశాక నిను చూశాక...చూశాక నిను చూశాక
ఆగలేక మనసాపుకోలేక రాశాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా...అందించు శుభలేఖ...
చూశాక నిను చూశాక...

చరణం 1:

అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
అందమంతా ఏర్చి కూర్చి అక్షరాలుగ పేర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను
మనసులోనికి తొంగి చూసి భావమంతా కూర్చినాను
నీ కనులలో నా కనులు కలిపినాను
నీ అడుగులో నేనడుగు వేసినాను
ఈ ఉత్తరం నా జీవితం ...నీ సంతకం నా జాతకం

చూశాక నిను చూశాక...చూశాక నిను చూశాక
ఆగలేక మనసాపుకోలేక రాశాను ఒక లేఖ
అందుకో ఈ ప్రేమలేఖా...అందించు శుభలేఖ

చరణం 2 :

భావమంతా మార్చి మార్చి భారతంలా చదువుకున్నా
భావమంతా మార్చి మార్చి భారతంలా చదువుకున్నా
బరువు గుండెల రాత చూసి బాధనంతా పోల్చుకున్నా
బరువు గుండెల రాత చూసి బాధనంతా పోల్చుకున్నా
నీ చూపులో నా రూపు చూసినాను
నా గుండెలో నీ మూర్తి నిలిపినాను
ఈ మాటలే నా ఉత్తరం...ఈ పిలుపులే నా సంతకం...

చూశాక నిను చూశాక...చూశాక నిను చూశాక
ఆగలేక మనసాపుకోలేక... చూశాను నీ లేఖ
చదివాలే తీరాల దాక..పంపిస్తా శుభలేఖ...

చూశాక నిను చూశాక...ఆగలేక మనసాపుకోలేక..
రాశాను ఒక లేఖ...చూశాను ఆ లేఖ 


 

2. చక్రవర్తి గారి సంగీతం సింపుల్ గా ఒక చక్కని రిథమ్ తో సాగిపోతుంది, అలాగే వాణీజయరాం గారి స్వరం ఒక వింత అందాన్నిచ్చింది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ వినండి.
చిత్రం : జీవితంలో వసంతం (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, వాణీ జయరాం
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా... ప్రియతమా ఓ ఓ ఓ
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా... ప్రియతమా
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం ఓహోఓహో
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...
నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా... తేలి తేలి పోదామా
సోలి సోలిపోదామా... సోలి సోలిపోదామా
ప్రియతమా... ప్రియతమా
Jeevithamlo Vasantham - Nilagiri Challana Nee vodi vechhana
Ramakrishna,Chandrakala Balu,Vanijayaram song


తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
3.చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
చరణం 1:
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
చరణం 2:
జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ
చరణం 3:
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..
తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
https://www.youtube.com/watch?v=HPEBF7o0rDo
Thotaloki Rakura Song - Buddhimanthudu Movie Songs - ANR - Shoban Babu - Vijaya Nirmala
Thotaloki Rakura Song, Thotaloki Rakura Video Song From Buddhimanthudu Movie, Buddhimanthudu Movie T...


చేతిలో చెయ్యేసి చెప్పు బావ...చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని

చేతిలో చెయ్యేసి చెప్పు బావ

చరణం 1:

పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవని
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని

పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని

చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ

చరణం 2:

కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కల కాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి
మన కధ కల కాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి

మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి
ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలై పోవాలి

చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
https://www.youtube.com/watch?v=PKIZIuGbaLA
Dasara Bullodu Songs - Chetilo Cheyyesi Song - ANR, Vanisri, KV Mahadevan
Watch Dasara Bullodu Telugu movie songs, starring Nageswar Rao / Nageshwar Rao / ANR, Vanisri, Chand...
 Presenteed by sri krutha


చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే.. చెయ్యైన వెయ్యవేమి?.. ఓ బాబూదొర

4.చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే.. చెయ్యైన వెయ్యవేమి?.. ఓ బాబూదొర
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాబూదొర ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..

చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి?
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..

చరణం 1:

ముట్టుకుంటే ఉలికిపడతావ్ .. పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే..ఏ..ఏ.. ఉలికిపడతావ్... పట్టుకుంటే జారిపోతావ్..
నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి
అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి...
చిగురేసేమొగ్గేసే సొగసంత పుతపూసే.. చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాబూదొర
చెయ్యైన వెయ్యవేమి.. ఓ బాబూదొర ఉయ్యాలలూపవేమీ.. ఈ..ఈ..ఈ..

చరణం 2:

చేరుకుంటే ఊరుకుంటావ్.. వల్లకుంటే గిల్లుతుంటావ్...
చేరుకుంటే..ఈ..ఈ ఊరుకుంటావ్.. వల్లకుంటే...ఏ..ఈ గిల్లుతుంటావ్..
నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..
అది రాసుకుంటే చురుకైన హాయి..
చిగురేసే మొగ్గేసే సొగసంత పుతపూసే ఇవ్వాలని లేదా ఏమి?
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి?.. ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..

చరణం 3:

నిన్ను కట్టుకోవాలని మనసౌతాది...
చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది...
చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
గుబులెందుకుకింకా గారాల చిలకా..
ఎగిరెగిరి పోదాము నెలవంక దాక...

https://www.youtube.com/watch?v=taNRFpbnUFE
Aalu Magalu Movie Songs | Chigurese Moggese Song | ANR | Vanisri
Watch Aalu Magalu Telugu movie songs, starring ANR, Vanisri in lead roles. Directed by Tatineni Rama...
 శ్రీ కృతు గారు పంపినారు కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు సందర్భముగా


నా మది నిన్ను పిలిచింది
చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చరణం 1:

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చరణం 2:

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
Aaradhana Movie Songs - Na Madi Ninnu (Version 2) - N.T.R., Vanisri
Aaradhana Movie Songs - Na Madi Ninnu (Version 2) Watch more movies @ http://www.youtube.com/volgavi...

సుశీలా తూపురాణి గారు మామెఐల్కు పంపారు (3-08-2015) 
7.ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!
ఓ మగువా నీతో స్నేహం కోసం
ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్దం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా ||2||
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా ||ఓ మగువా||
చరణం : 1
ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్లైట్ వేళ నుంచి మూన్లైట్ వేళ్లేదాకా
ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్లన్నీ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు
నమ్మవుగాని కలవరమాయె
ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్ ||ఓ మగువా||
చరణం : 2
కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె...
నీ మాటలు లేక మోడైపోయె
మగువా... ఓ మగువా... ఓ మగువా... ||ఓ మగువా||
చిత్రం : సత్యం (2003)
సంగీతం : చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చక

బ్రహ్మ చర్యంలో "భీష్మా"చార్యులు ,
అణు శాస్త్రమ్ లో "గ్రీష్మ" చార్యులు ,
మానవత్వపు "సుష్మా" చార్యులు,
అబ్దుల్ "కలామ్" విశ్వా చార్యులు !!


నిను కలిసిన నిముసమున...నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే...

8.చిత్రం : సి.ఐ.డి (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం 1 :

ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే

తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం 2 :

చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే

గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...

https://www.youtube.com/watch?v=g6ASYRbxvGI
NENU KALISINA NIMISHAMUNA NINU TELISINA KSHANAMUNA.....CHITRAM:- C.I.D.1965.mp4
నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల.......చిత్రం :- సి.ఐ.డి.1965 పాట గురించి :-గాయకులూ :- ...


ఇదిగో మీకోసం ఆ పాత పాట..

9.అంతా మనమంచికే : నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
అంతా మనమంచికే(1972)
Cast :భానుమతి, Krishna
Music : Satyam(సత్యం)
Direction() : Bhanumati(భానుమతి)
Lyricist(సాహిత్యం) : దాశరధి

నేనే రాధనోయి..గోపాలా నేనే రాధ నోయి..
అందమైన ఈ బృందావని లో..నేనే రాధనోయి..!!నేనే!!

విరిసిన పున్నమి వెన్నెలలో...
చల్లని యమునా తీరములో...
నీ పెదవులపై వేణు గానమై...
పొంగి పోదురా... నేనే వేళా...!!నేనే!!

ఆడే పొన్నల నీడలలో...
నీ మృదు పదముల జాడలలో...
నేనే నీవై...నీవే నేనై...కృష్ణా...ఆ...ఆ...ఆ...
అనుసరింతురా నేనే వేళా..!!నేనే!!

https://www.youtube.com/watch?v=wIYTTo46yjA
nene radhanoyi
3 yrs sritha singing Nene Radhanoyi song from Anta mana manchike telugu old movie sung by Bhanumathi...

(pampinavaaru kallyan krishna kumar karanam  (కళ్యాణ కృష్ణ కుమార్ కరణం )


10. చిత్రం:అందమైన అనుభవం (1979)
సంగీతం:ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత:ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం:బాలు, సుశీల..

పల్లవి:
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..

నేనే నువ్వొయ్.. నువ్వే నేనోయ్..
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes you

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం 1:
ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది..

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా..హల్లో నేస్తం గుర్తున్నానా...

చరణం 2:
ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం..
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం..
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో..
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో..

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..

చరణం 3:
చైనా ఆట ..మలయా మాట.. హిందూ పాట.. ఒకటేను..
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్...

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా...
సాయారేమో ఇండియా...
సాయావాడ చైనా...

హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్...
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు..

https://www.youtube.com/watch?v=inJsMI8SNUQ

Andamaina Anubhavam Songs - Hello Nestam Bagunnava Song - Rajini Kanth & Kamal Haasan
For more content go to http://www.mangomobiletv.com/ Follow us on twitter at https://twitter.com/man...

No comments:

Post a Comment