Tuesday 5 October 2021

చిత్రం: శ్రీ పాండురంగ మహత్యం (1957)


ప్రాంజలి ప్రభ (1) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2013

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు...


చిత్రం : రాజ్ కుమార్ (1983)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు


చరణం 1:


చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది

ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి

తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే

తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

చరణం 2 :


సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం

సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం

గతమంటే నీవే కథకానిది నీవే

కలలన్ని నావే కలకాలం నీవే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం... మన జీవన పారాయణం...

లలలలల లలల... లలలలల లలల... లలలలల లలల


--((()))--


ప్రాంజలి ప్రభ (2) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

చక్రవర్తి గారి సంగీతం సింపుల్ గా ఒక చక్కని రిథమ్ తో సాగిపోతుంది, అలాగే వాణీజయరాం గారి స్వరం ఒక వింత అందాన్నిచ్చింది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ వినండి.

చిత్రం : జీవితంలో వసంతం (1977)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, వాణీ జయరాం


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన


నీ మది కోవెల అన్నది కోయిల

నీ జత నేనుంటే బ్రతుకే ఊయల


నీలాల మబ్బులలో...

తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

ప్రియతమా... ప్రియతమా ఓ ఓ ఓ


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీ మది కోవెల అన్నది కోయిల


నీ లేడి కన్నులలో మెరిసే తారకలు

నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు

నీ మాట వరసలలో వలపే వెల్లువగా

నీ పాట తోటలలో పిలుపే వేణువుగా

పులకించిన నా మదిలో పలికించిన రాగాలు

చెలరేగిన వయసులో తీయని అనురాగాలు

ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ

ఇదే ఇదేలే జీవితం అహహహహ


జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...

తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా

ప్రియతమా... ప్రియతమా


నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీ మది కోవెల అన్నది కోయిల

ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా

ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా

ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా

ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా

తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో

మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో

ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ

ఇదే ఇదేలే జీవితం ఓహోఓహో


జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...

నీలాల మబ్బులలో

తేలి తేలి పోదామా... తేలి తేలి పోదామా

సోలి సోలిపోదామా... సోలి సోలిపోదామా

ప్రియతమా... ప్రియతమా


((()))

  ప్రాంజలి ప్రభ (3) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

చిత్రం : రంగులరాట్నం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో...
కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1:

అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...
మనసారా నిను చూడలేనైతి స్వామీ...
కరుణించి ఒకసారి కనిపించవేమీ...

చరణం 2:

అందాల కన్నయ్య కనిపించగానే...
బృందావనమెల్ల పులకించిపొయే...
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3:

వలపుతో పెనవేయు పారిజాతమునై... ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... నీ చరణకమలాల నలిగి పోనీయవా...
ఆ..ఆ..ఆ..ఆ..

కనరాని దేవుడే కనిపించినాడే...
కనిపించి అంతలో కన్ను మరుగాయే ... కన్ను మరుగాయే..

((()))

  ప్రాంజలి ప్రభ (4) నాకు నచ్చిన అలనాటి ఆణిముత్యాలు, సేకరణ 2014

కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే...కోరినది దరిచేరినది ఆహా ఎదలు ఒకటాయే

చిత్రం : మోసగాళ్లకు మోసగాడు (1971)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల, బాలు

పల్లవి :

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

చరణం 1 :

పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు దాచుకున్ననాడే.. సుఖం.. సుఖం.. సుఖం
తోడుగా.. నీడగా.. సాగిపో

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

చరణం 2 :

రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే
రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే

ఊసులాడు వేళ బాస చేయు వేళ.. ఇదే.. ఇదే.. ఇదే
ఆడుకో... ఆశలే... తీర్చుకో

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
ఆహా...ఆహా.. హా... ఓహో... ఓహో...
తొలివలపే మధురసము.. మన బతుకే పరవశము

https://www.youtube.com/watch?v=vVTUrqQXV00
Mosagallaku Mosagadu || Korinadi Neraverinadi Video Song || Krishna ,Vijaya || Shalimarcinema
Mosagallaku Mosagadu was a 1971 first Indian, Telugu Cowboy film. Telugu Full MovieVideo Songs Stari...
)))(((

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా...
చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని...నిస రిమ పద నిద సా నిసని....శభాష్.....
సరి నిస దని పదమా......సరి నిస దని పదమా...మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల
నండూరి ఎంకిలానవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే
ఆత్రేయ పాటలాఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే
ఆత్రేయ పాటలా...ఉన్నాయి నా నీడగా
నీలో అల గోదారి ఎన్నెల
నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగాకృష్ణా ముకుందా మురారీ

((()))

 వచ్చెనంటా... తనువచ్చెనంటా...

చిత్రం : ఐ (మనోహరుడు) (2015)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : అనంత శ్రీరామ్
గానం : హరిచరణ్, శ్రేయాఘోషల్

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా
నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా 

(((())))






చిత్రం:  శ్రీ పాండురంగ మహత్యం (1957)

దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు

సంగీతం:  టి.వి. రాజు

గీతరచయిత:  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి:

    హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....

    జయ కృష్ణా... ముకుందా... మురారి

    జయ కృష్ణా... ముకుందా... మురారి


    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి


    దేవకి పంట... వసుదేవువెంట....

    దేవకి పంట... వసుదేవువెంటా...

    యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ

    వెలసితివంటా... నందుని ఇంటా

    వెలసితివంటా... నందుని ఇంటా


    వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ..

    కృష్ణా... ముకుందా... మురారి


చరణం 1: 


    నీ పలుగాకి పనులకు గోపెమ్మ...

    నీ పలుగాకి పనులకు గోపెమ్మ... కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..

    ఊపునబోయీ మాకులకూలిచి....

    ఊపునబోయీ మాకులకూలిచి... శాపాలు బాపితివంటా....ఆ...


    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి


    అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ... చూడమ్మా అని రామన్న తెలుపగా

    అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...

    చూపితివట నీ నోటను... బాపురే పదునాల్గు భువనభాండమ్ముల

    ఆ రూపము గనిన యశోదకు... తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..


    జయ కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ...

    కృష్ణా... ముకుందా... మురారి


చరణం 2:


    కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...

    కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ... కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ

    కంసాదిదానవ గర్వాపహారా...

    కంసాదిదానవ గర్వాపహారా... హింసా విదూరా.. పాపవిదారా...


    కృష్ణా... ముకుందా... మురారి

    జయ గోవింద బృందావిహారీ... ఈ..

    కృష్ణా... ముకుందా... మురారి


    కస్తూరి తిలకం... లలాట ఫలకే

    వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్

    కరతలే వేణుమ్... కరే కంకణమ్

    సర్వాంగే హరిచందనంచ కలయమ్

    కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...


    విజయతే... గోపాల చూడామణీ...

    విజయతే... గోపాల చూడామణీ...


చరణం 3:


    లలిత లలిత మురళీ స్వరాళీ...

    లలిత లలిత మురళీ స్వరాళీ... పులకిత వనపాళి... గోపాళీ..

    పులకిత వనపాళి...ఈ...

    విరళీకృత నవ రాసకేళి...

    విరళీకృత నవ రాసకేళి... వనమాలీ శిఖిపింఛమౌళీ

    వనమాలీ శిఖిపింఛమౌళీ....


    కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...

    కృష్ణా... ముకుందా... మురారి..

    జయ కృష్ణా... ముకుందా... మురారి..

    హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..



గో దావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా...

నిండారి తెలుగింటి అందాలే వెలిగించే.....నండూరి వారెంకిలా ఓ...


చిత్రం : సరిగమలు (1994)

సంగీతం : బాంబే రవి

రచన : వేటూరి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర


ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

ఓ..ఓ..ఓఓఓఓఓ....

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

నిండారి తెలుగింటి అందాలే వెలిగించే

నండూరి వారెంకిలా ఓ...


గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల

కిన్నెరసాని పాటలా ఓ...


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా


ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ


సిగ్గల్లే పండెనులే సాయంత్రము

బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..

సిగ్గల్లే పండెనులే సాయంత్రము

బుగ్గల్లో పండాలి తాంబూలము

ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము

నన్నల్లుకోమంది వయ్యారము

కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో

నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..


గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా


గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం

మువ్వమ్మ మురిసేటి మురళీపురం

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం

మువ్వమ్మ మురిసేటి మురళీపురం

కవ్వాలే కడవల్లో కదిలే క్షణం

కడలల్లే పొంగింది నా మానసం

పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో

నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..


గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల

కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా


కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

ఓ..ఓ..ఓఓఓఓఓ....

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో.. 


(((())))


No comments:

Post a Comment