Saturday 21 October 2017

22-10-2017


నిన్న కనిపించింది నన్ను మురిపించింది
చిత్రం : రాణీ రత్నప్రభ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి :
అహ.. హా.. ఆ.. అహ.. ఆ..
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది
నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 1:
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
ఆమె చిరునవ్వులోనే హాయున్నది
మనసు పులకించగా మధురభావాలు నాలోన కలిగించిందీ

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 2:
ఆ.. ఆ.. అ.. ఆ..
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మరచిపోలేను ఆ రూపు ఏనాటికి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి
మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి

తలచుకొనగానే ఎదో ఆనందము
తలచుకొనగానే ఎదో ఆనందము
వలపు జనియించగా ప్రణయగీతాలు నాచేత పాడించింది

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది

చరణం 3:
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
సోగ కనులారా చూసింది సొంపారగా
సోగ కనులారా చూసింది సొంపారగా
మూగ కోరికలు చిగిరించే ఇంపారగా
మూగ కోరికలు చిగిరించే ఇంపారగా

నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
నడచిపోయిందీ ఎంతో నాజూకుగా
విడచి మనజాలనూ... విరహ తాపాలు మోహాలు రగిలించింది..

నిన్న కనిపించింది నన్ను మురిపించింది
అందచందాల రాణి ఆ చిన్నది...
అందచందాల రాణి ఆ చిన్నది



Rani Rathna Prabha - Ninna Kanipinchindi...

https://youtu.be/X0nEJLEPddY?list=PLFBE498A261FCAE7D

1 comment: