Saturday 25 November 2017

159 . అమరజీవి (1983)



అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

సాకి :
శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..

నీ పూజల కు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహములకు.. పరములకు నీదాననై..ధన్యనై..
జీవన వరాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవ దేవి. .

పల్లవి :
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి ?
స్వామీ... స్వామీ

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

చరణం 1 :
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని .. నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడ దారి

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..

చరణం 2 :
నశ్వరమది..నాటక మిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దే...

చరణం 3 :
అలిగే నట శ్రీ రంగం.. తొలగే నట వైకుంటం
యాతన కేనా దేహం?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము

రంగా! రంగ... రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..



Watch Amarajeevi Full Movie / Amarajeevi Movie Starring Akkineni Nageshwara Rao, Jayapradha,…
youtube.com

No comments:

Post a Comment