Saturday 25 November 2017

166. మాంగళ్య బలం


మాంగళ్య బలం

తిరుపతి వెంకటేశ్వరా! దొరా
నీవే దిక్కని నమ్మినామురా!
ఉన్నవాళ్ళు నీకోసం పుణ్యానికి వస్తారు
కడుపు చూపి యాచిస్తే కసరి తిట్టిపోస్తారు ~ తిరుపతి ~

నిట్ట రాళ్ళ దారి పోయి సిమెంట్ రోడ్డు వెలిసింది
కాలినడక మారిపోయి కార్ల వసతి కలిగింది
వచ్చే పోయే వారికెల్లా వనరు బాగా కుదిరింది
బిచ్చగాళ్ళ బొచ్చెలోన గచ్చకాయ పడింది ~ తిరుపతి ~

పొంగల్, పులిహోర, బూంది, అట్టు
చక్కెర పొంగల్,వడ, లడ్డు, బొబ్బట్టు
ఆరగించని నీ పేరున అర్పణ చేస్తుంటారు
ప్రసాదాలు వంతులేసి పంచుకొని తింటారు
నీకు, నాకు సున్నయేనయో -
నీవైన గాని నిగ్గదీసి అడగవేమయో ~ తిరుపతి ~

ఉన్నది చాలదనీ, హుండీలో డబ్బులేసి
వరములెన్నో కోరుకొంటారు
మేము-
జానెడు పొట్టకని బిచ్చం ఎత్తామని
ఉరిమిచూసి తరుముకొస్తారు
పోలీసుల పిలిపిస్తారు - వేనులోన
పొలిమేరల దాటిస్తారు ~ తిరుపతి ~

ఆపదలో మొక్కువారే అసలు భక్తులనుకోకు
ఆకలితో కొల్చు మమ్ము అన్యులమని యెంచకు
వేదాలకు తావులేక ఆదరమున చూసుకో
సర్వతముడవన్న బిరుదు సార్ధకము చేసుకో
దైవమన్న పేరు నిల్పుకో! - ఈ పేదవాళ్ళ
కడుపుమంట తీర్చి యేలుకో! ~ తిరుపతి ~

మాంగల్యబలం చిత్రంలోని యీ పాటను జమునారాణి గారు మాస్టర్ వేణు సంగీతసారధ్యంలో పాడగా, పద్మినీసిస్టర్స్ లో ఒకరైన రాగిణి అద్భుతంగా నర్తించారు.
Mangalya Balam Movie Songs - Thirupathi Venkateswara Song - Nageshwar Rao - Savithri - SV Ranga Rao
Mangalya Balam Movie Songs, Mangalya Balam Songs, Mangalya Balam Movie Video Songs, Thirupathi Venka...


No comments:

Post a Comment