Monday 21 September 2015

ప్రాంజలి ప్రభ - కీర్తనలు


ఓంశ్రీ  రాం   ఓం శ్రీ  రాం ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంకీర్తనా ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు   


శ్రీమహాలక్ష్మి (సంపద) యొక్క స్వరూప, స్వభావాలను తెలిపే సంకీర్తన ఇది. ధనం ఒకచోట నుండి మరొక చోటకు వెళ్ళడం గురించి చెప్తూ.. అన్యాపదేశం గా సత్వగుణ సంపన్నులను ఆ సిరి తల్లి వీడదు అని ప్రభోదిస్తూ.. చివరకు  ఆమె స్థానం శ్రీవేంకటేశ్వరుని ఇల్లాలిగా సుస్థిరం అని ముగిస్తాడు అన్నమయ్య.

రాగం: గుండక్రియ

పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోట దానుండ దదివో

చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము || రూకలై||

చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలె బచరించు పసిడీ || రూకలై||

చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిడీ || రూకలై||

(ఆధ్యా ||కీ||92వ రేకు – సంఖ్య 458)


పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని
దాకొని వున్నచోట దానుండ దదివో
అన్నముని కాలంలోనూ, అంతకు మునుపూ వాడుకలో ఉన్న ధనం యొక్క రూపాలను మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఆ కాలంలో ధనాన్ని, రూకలు, మాడలు, రువ్వలు అని పలు రకాలుగా  పిలిచే వారు.  ధనం తాను ఉన్నచోట ఉండదు చంచలమైనది అని చెప్తున్నాడు అన్నమయ్య. భావం యధాతధంగా కాకుండా ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి ఏ ఇంటిని విడిచి పెడుతుందో, ఏ ఇంట్లో స్థిరంగా ఉంటుందో మన పురాణాది వాఙ్మయం స్పష్టంగా తెలిపింది. మంచి అలవాట్లు, సద్గుణాలు, సౌమనస్య వాతావరణం, శుచీ శుభ్రత, సదాచారం కలిగిన ఇంట అమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో ఆ ఇంట సిరి తాండవిస్తుంది.  అయితే తల్లినీ, తండ్రినీ, గురువునీ అవమానించే చోట లక్ష్మి నిలవదు. ఏ ఇంట అతిథికి భోజనం పెట్టరో, ఆ చోట సిరి నిలవదు. అబద్ధాలాడేవారు, ఏదీ ఎవరకీ ఈయక ‘లేద’నే వారు, శీలంలేనివారు ఉన్న ఇంట సిరి ఉండదు. పరద్రవ్యాన్ని ఆశించేవారిని, అపహరించేవారిని శ్రీ మాత విడిచి పెడుతుంది. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారినీ, విశ్వాస ఘాతకుల్నీ, కృతఘ్నుల్నీ ఆ తల్లి దరిచేరదు. కలహాలు జరిగేచోట, చెడుమాటలు పలికేచోట, జూదాలాడేచోట, స్త్రీని బాధించేచోట, మనోబలంలేని చోట ఐశ్వర్యం క్రమంగా తొలగుతుంది. సంధ్యా సమయాల్లో నిద్రపోయే వారినీ, పగలు నిద్రించేవారినీ, దానం చేయనివారినీ విష్ణుపత్ని విడిచిపెడుతుందని అన్యాపదేశం గా చెప్పడం అన్నముని ఉద్దేశ్యం కావచ్చు.

చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు
వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు
వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు
ప్రకటించి కనకమే భ్రమయించీ జగము
ఒకరు రాజుగా జన్మిస్తారు, మరొకరు బంటుగా జీవిస్తారు కారణం ఏమిటి? అలాగే ఈరోజు రాజుగా ఉన్నవారు రేపు బంటుగా మారడం కూడా కద్దు. కాలం అనుకూలిస్తే బంటే రాజు అవుతాడు. అదే కాలం ఎదురు తిరిగితే, రాజు కాస్తా బంటు అవుతాడు. ఎంతటి మేథావులైనా, పండితులైనా, పరాక్రమవంతులైనా, కాలం అనుకూలించినంతవరకే వారి ప్రతిభ రాణిస్తుంది, వారి ప్రభావం కొనసాగుతుంది. కాలం ప్రతికూలిస్తే సన్మానాలకి బదులుగా అవమానాలు ఎదురవుతూ వుంటాయి. ఆనందానికి బదులుగా ఆవేదన దగ్గరవుతూ వుంటుంది.  అలా విధివంచితుడైన ‘నలమహారాజు’ వృత్తంతం మనకు తెలిసిందే! కనుక ధనం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు.
ఒకరికి చెందవలసిన కన్యలను అనగా ఒకరితో వివాహం జరుగవలసిన కన్యలను వేరొకరితో వివాహం జరిపించేటట్లు చేసేదీ ధనమే కదా! లోకంలో ఎన్ని వివాహాలు “కన్యాశుల్కం” ద్వారా గానీ “వరకట్నం” ద్వారా గానీ ఒకరితో నిశ్చయించిన వివాహాలు ధన లేమి వల్ల వేరొకరితో జరగడం లేదు? ఇదంతా ధనం యొక్క ప్రభావమే కదా! ప్రాచీన కాలంలో మాతృస్వామిక తెగల్లో కన్యాశుల్కం అనే సంప్రదాయం ఉండేది. అందులో పెళ్ళి కూతురు తల్లిదండ్రులకే పెళ్ళి కొడుకు తరఫు వారు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఆ తరువాత మాతృస్వామిక వ్యవస్థ అంతరించి, పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. ఆనాటిధర్మం ప్రకారం పురుషులు అహర్నిశలు కష్టపడి డబ్బు సమకూర్చేవారు, స్త్రీలు  ఇంటిపట్టున ఉండి సంసారాల్ని చక్కబెట్టుకునేవారు. పురుషుడు తన భార్యా పిల్లలను పోషించడానికి ఆర్ధిక పరిస్థితి సరిపోయేది కాదు. కనుకు ఆడపిల్లను ఇచ్చేవారు అల్లుడికి కొంత తమ శక్తి మేరకు ధనం ఇచ్చేవారు. ఇలా వరకట్న ఆచారం పుట్టింది. ఏ కాలం లోని ఏ ఆచారమైనా వివాహం అంటే డబ్బుతోనే ముడి పడి ఉండడం గమనార్హం.
ఒకచోటనున్న ధాన్యం మరొకచోట వేయించు అంటున్నాడు అంటే ఆనాటి ఫ్యూడల్ వ్యవస్త లో రైతులు తమ భూములలో ఎంతో కష్టపడి పండించిన పంటలను భూస్వాములు అప్పులకిందా వడ్డీల కిందా జమకట్టుకొని వారిని కష్టాల కడగండ్లకు గురి చేసే అనాచారాన్ని అన్నమయ్య గమనించే ఉంటాడు అని తెలుస్తోంది. ఇదంతా ధనం ఆడించే నాటకం లో ఓ భాగం మాత్రమే! ధనం చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతూ లేనిపోని భ్రమలను కల్పిస్తూ ఉంటుంది అనంటాడు అన్నమయ్య.
చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు
కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు
కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు
పందెమాడినటువలె బచరించు పసిడీ |
ఈ సొమ్ము కొందరికి తమ జాళెలు (సంచులు) నింపితే, మరికొందరికి పశువులు రూపంలో, ఆభరణాల రూపంలోనూ ప్రాప్తమౌతుంది. కొందరిని దాన ధర్మాలతో పుణ్యులుగా చేస్తే మరికొందరిని పిసినారులుగా పుట్టించి పాపం మూట గట్టుకునేట్టు చేస్తుంది. ఈ డబ్బు వల్ల ఆత్మీయులు, అన్నదమ్ముల మధ్య కొట్లాటలను సృష్టిస్తుంది. ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చి పెట్టి చివరకు విడాకుల వరకు తీసుకెళ్తున్నవిషయం అందరికీ ఎరికే! డబ్బు వల్ల చాలామ౦ది ఆత్మహత్యలు కూడా చేసుకు౦టున్నారు. కనుకనే అన్నమయ్య డబ్బు మీద ఆశ ఎప్పుడూ రానివ్వక౦డి, డబ్బుకు ఏ స్థానమివ్వాలో అదే స్థానమివ్వ౦డి. మీ స్నేహితులు, కుటు౦బ౦, మానసిక-శారీరక ఆరోగ్య౦ తర్వాతే డబ్బు. అలా ఉ౦టే డబ్బుకు ఎ౦త విలువ ఇవ్వాలో అ౦తే విలువ ఇస్తున్నట్లు. లేదంటే… భారతం లో మాదిరే ప్రవర్తిస్తుంది ఈ ధనం.  పందెంలో జయాపజయాలు దైవాధీనాలు. ధర్మజ్ఞులు ఓడిపోనూ వచ్చు, అధర్మ పరులు జయించనూ వచ్చు. పందెం లో సర్వమూ ఒడ్డి సతినీ, సామ్రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు పరిస్థితి మనకు తెలిసినదే కదా! అలా పందెం వేసుకున్న దానివలె అటూ ఇటూ పరుగులు పెట్టడం సంపద గుణం అని అంటున్నాడు.

చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు
తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు
తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు
నగుతా మాపాల నుండి నటియించు బసిడీ||

ధగధగ లాడుతూ పాతిపెట్టిన నిధిలాగా నిక్షేపంగా ఉంటుంది. తుదకు మోహింపజేసే శ్రీ వేంకటేశ్వరుని పత్నియై ఉంటూ తేల్చుకోలేని, విడదీయరాని మాయగా ఈ ధనం సర్వులకూ అన్ని దిక్కులకూ అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయువ్యం,  ఉత్తరం, ఈశాన్యం, భూమి మరియూ ఆకాశం అనే దశ దిశలకూ వ్యాపించి ఉంటుంది. ఇన్ని రకాలుగా మా వద్ద నవ్వులతో నటియించే తల్లి ఈ ధనలక్ష్మి అని చమత్కరిస్తున్నాడు అన్నమయ్య.
ఐతే డబ్బు వల్ల మానవులు పడే  అగచాట్లు అన్నీ..ఇన్నీ కావు. డబ్బు ఉన్నట్లైతే బంధువులు వల్లమాలిన అహం అని దూరం కావొచ్చు. కొందరు బలహీనమైన మానసిక స్ధితి ఉన్నవారు డబ్బు వల్ల చెడు అలవాట్లకు బానిసలు కావొచ్చు. మరి కొందరు డబ్బు ఎక్కడ దొంగలు దోచుకుపోతారో అని నిద్రకు దూరం కావొచ్చు. మరి కొందరికి డబ్బు కారణంగా, భార్యాబిడ్డల్లో మార్పు వచ్చి, వింతగా ప్రవర్తించవచ్చు. డబ్బు శత్రువుల్ని పెంచుతుంది. ఆత్మీయుల్ని దూరంచేస్తుంది. చివరికి హత్యలు కూడా చేయిస్తుంది.  సంపద ఎక్కువైతే మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు కదా! అందువల్ల మనిషి అవసరాలకు మించి సంపద చేకూరినా నష్టమే అనే హితవు ఈ కీర్తన ద్వారా తెలుసుకోవాలని సందేశమే కాక ధర్మస్వరూపులనూ, భగవంతుని నమ్ముకున్నవారినీ ఈ సంపద ఎల్లప్పుడూ వీడదని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు:
కన్నె = కన్య; ప్రకటించి = చాటించి, వెలయించి; భ్రమయించి = తిరుగు, పరిభ్రమించు; జాళెలు = డబ్బు సంచులు; సొమ్ములు = ధనము, జీవాలు, ఆభరణాలు; పచరించు = ప్రవర్తించు; నిక్షేపము = పాతిపెట్టబడిన ధనము, నిధి; తగిలి = మోహింపజేయు, లగ్నము జేయు; తెగని = విడదీయలేని; మాపాల = మా తరఫున, మా వద్ద.




ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - రామదాసుకీర్తనలు 
సర్వేజనాసుఖినోభావంతు 


మిత్రులు అందరికి శుభోదయం...
చక్కని త్యాగరాజ పంచరత్న కీర్తన.

జగదానంద కారక! జయ జానకీ ప్రాణ నాయక!
గగనాధిప! సత్కులజ! రాజరాజేశ్వర!
సుగుణాకర! సుజన(సేవ్య)
సేవ్య! భవ్య దాయక! సదా సకల||జగ||

చ|| అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా! నఘ!
జదధి సురసురభూ పయోధి వాసహరణ!
సుందరతర వదన! సుధామయవ
చో బృంద గోవిందసానంద! మా
పరాజ రాప్త శుభకరా! నేక ||జగ||

చ|| నిగమనీరజామృతజపోషక!
నిమిషవైరి వారిదసమీరణ!
ఖగ తురంగ! సత్కవి హృదాలయా!
అగణితవానరాధిప! సతాంఘ్రి

చ|| ఇంద్ర నీలమణి సన్ని భాపఘన!
చంద్ర సూర్య నయ నా ప్రమేయ వా
గీంద్ర జనక! సకలేశ! శుభ్ర నా
గేంద్ర శయన! శమనవైరి సన్నుత!||జగ||


చ|| పాద విజిత మౌని శాప! సవ పరి
పాల! వర మంత్ర గ్రహణ లోల!
పరమ శాంత! చిత్త జనకజాధిప
సరోజ భవ వరదా! ఖిల ||జగ||


చ|| సృష్టి స్థిత్యంత కార కామిత్ర!
కామిత ఫలదా! సమాన గాత్ర,! శ
చీపతి ను! తాబ్ధి మద హ! రానురా
గ రాగ రాజిత కథా సారహిత! ||జగ||

చ|| సజ్జన మానసాబ్ధి సుధాకర! కు
సుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణ! అవగుణా సురగణ
మదహరణ! సనాత! నాజనుత! ||జగ||

చ|| ఓంకార పంజక కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప! వాసవ రిపు జన కాంతక! క
లాధర కలాధారాప్త! ఘ్రుణాకర! శ
రణాగత జనపాలన! సుమనో ర ||జగ||

చ|| మణ! నిర్వికార! నిగమసారతర!
కరధృత శరజాలా! సురమ
దాపహర! ణావనీసుర సురావన
కనీన బిలజమౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజనుత! ||జగ||

చ|| అగణిత గుణ! కనక చేల!
సాల విదళ నారుణాభ సమాన చర!
ణాపార మహి! మాద్భుత! సుకవిజన
హృత్సదన! సురముని గణ విహిత! కల
శ నీరనిధిజా రమణ! పాప గజ
నృసింహ! వర త్యాగరాజాది సుత! ||జగ||

చ|| పురాణ పురుష! సృవరాత్మ జా! శ్రిత
పరాధీన! ఖరవిరాధ రావణ
విరావణ! అనఘ! పరాశర మనో
హర! వికృత త్యాగరాజ సన్నుత!||జగ|| 


Jagadananda Karaka -…
youtube.com
https://youtu.be/IUdls4HJ6Wo



భద్రాచల రామదాసు !
(ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా )
పంతువరాళి - రూపక
పల్లవి:
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ..
అను పల్లవి:
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?
కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ..
చరణము(లు):
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా
ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ..
శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ..


https://www.youtube.com/watch?v=MtAlHsSP5aY 

మరుగేలరా ఓ రాఘవా
రాగం: జయంతశ్రీ
తాళం: దేశాది
త్యాగరాజస్వామి కృతి

పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా!

అనుపల్లవి:
మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

చరణం:
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
 


అన్నమాచార్య కీర్తనలు
ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది
యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!!
ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది
యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమి( బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!!
యీ పాదమే కదా యిభరాజు దల(చినది
యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!!
యీ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!!
బ్రహ్మ కడిగిన –పాదము
బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!!
1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము
బలితలమోపిన పాదము
తల(కక గగనము దన్నిన పాదము
బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!!
2.కామిని పాపము గడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము
పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!!
3.పరమ యోగులకు( బరిపరి విధముల
పరమొస(గెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము



రచన: అన్నమాచార్య
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనమ్ ||
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనమ్ |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనమ్ ||
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనమ్ |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనమ్ ||
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనమ్ |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనమ్ ||
Ksheerabdhi Kanyakaku - Annamacharya Sankeertanalu
Lyrics: http://discovertelugu.blogspot.com/…/kadapa-people-annamach… Singer: http://discovertelugu.blogspot.com/2009/05/east-g
youtube.com
 


మహా రామ భక్తుడైనా త్యాగరాజ స్వామి కొన్ని కీర్తనలు శివుడు ఇలా ఇతర దేవతల మీద కూడా రచించారు. శివ కేశవులకు భేదం లేదని నిరూపించిన పరమ భక్తాగ్రేసరుడు శ్రీ త్యాగయ్య. భవ భయబాధాలణనచే శివ నామము యొక్క విశిష్టతను.. శివ భక్తులు ఎలా ఉండాలో తెలిపే అద్భుతమైన కీర్తన శ్రీ మంగళంపల్లి బాలమురళి వారి గళములో వినండి. ఇదే కీర్తన త్యాగయ్య చిత్రము కోసము.. శ్రీ చిత్తూరు నాగయ్య గారు అద్భుతముగా ఆలపించారు. వింటుంటే మనలను మనం మరచి పోవడం తథ్యం. ఓం నమశ్శివాయ .

శివశివ యనరాదా ఓరీ శివ
భవభయబాధల నణచుకోరాదా శివ..

కామాదుల దెగకోసి పర
భామల పరుల ధనముల రోసి
పామరత్వము నెడబాసి అతి
నీమముతో బిల్వార్చన జేసి శివ

సజ్జనగణముల గాంచి ఓరి
ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించి తన
హృజ్జలజమునను తా పూజించి శివ

ఆగమముల నుతియించి బహు
బాగులేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరి
త్యాగరాజ సన్నుతుడని యెంచి శివ..
Shiva Shiva Anarada I Dr M Balamuralikrishna
Shiva Shiva Anarada a Thyagaraya Kriti by Dr M Balamuralikrishna

వినతా సుత వాహనుడై
రాగం: హరికాంభోజి
తాళం: ఆది
త్యాగరాజ స్వామి కృతి

పల్లవి

వినతా సుత వాహనుడై
వెడలెను కాంచి వరదుడు

అనుపల్లవి

వనజాసనాది సురులు
సనకాది మునులు కొలువ

చరణం

నెర వైశాకోత్సవమున శతదిన
కరులుదయించిరో అన పశ్చిమ
గోపుర ద్వారమున చరాచరములకు
వర త్యాగరాజుకు వగ దెలుప


అన్నపూర్ణే విశాలాక్షీ
రాగం: సామ
ఆదితాళం
శ్యామశాస్త్రి కృతి

పల్లవి
అన్నపూర్ణే విశాలాక్షి రక్ష
అఖిల భువన సాక్షి కటాక్షి

ఆను పల్లవి
ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి
దురితాది నివారిణి
పన్నగాభరణ రాణి పురాణి పరమేశ్వరి
విశ్వేశ్వర భాస్వరి

చరణం
పయసాన్న పూరిత మాణిక్యపాత్ర
హేమదర్వీ విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే
కాంచనమయ భూషణాంబరధరే
థోయజాసనాది సేవిథపరే తుంబురు
నారదాది నుతవరె
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత
గురుగుహసాదరే

Annapoorne Visaalaakshi - M.L Vasantha Kumari
Annapoorne Visaalaakshi ( Saamaa Raagam) - Muthuswamy Dikshithar Meaning: (From T.K. Govinda Rao's b..

'ఆ రోజుల్లో మనిషికి ఉండేది ప్రీతీ ..... ఈ రోజుల్లో మనిషికుంది అవినీతి....
ఆ రోజుల్లో జనానికి ఉండేది రోషం.... ఈ రోజుల్లో మనం వేస్తున్నాం రోజుకో వేషం...
ఆ రోజుల్లో కనబడేది మానవులలో మంచితనం....
ఈ రోజుల్లో మనక్కావాలి పక్కవారి పతనం....
ఆ రోజుల్లో ఎటు చూసినా సేద్యం ....
ఈ రోజుల్లో ఏరులై పారుతుంది మద్యం...
ఆ రోజుల్లో పాలించేది కేవలం రాజు...ఈ రోజుల్లో ప్రతివాడికి పాలించాలనే మోజు..
ఆ రోజుల్లో ప్రేమకు ఉండేది పునాది.... ఈ రోజుల్లో సహనానికి చేస్తున్నాం సమాధి..
ఆ రోజుల్లో వాళ్లకున్నారు ఒక గాంధీ... ఈ రోజుల్లో అన్ని మంచి గుణాలతో ఎవరు ఉంది??
బాపూజీని పూజించడం కాదు...ఆయన మాటని,బాటని వంట పట్టించుకున్దాం..
"నేను సైతం" గాంధి జయంతిని స్మరించుకుంటూ...మీ వంశీ:) —'
ఆ రోజుల్లో మనిషికి ఉండేది ప్రీతీ ..... 
ఈ రోజుల్లో మనిషికుంది అవినీతి....
ఆ రోజుల్లో జనానికి ఉండేది రోషం.... 

ఈ రోజుల్లో మనం వేస్తున్నాం రోజుకో వేషం...
ఆ రోజుల్లో కనబడేది మానవులలో మంచితనం....
ఈ రోజుల్లో మనక్కావాలి పక్కవారి పతనం....
ఆ రోజుల్లో ఎటు చూసినా సేద్యం ....
ఈ రోజుల్లో ఏరులై పారుతుంది మద్యం...
ఆ రోజుల్లో పాలించేది కేవలం రాజు...

ఈ రోజుల్లో ప్రతివాడికి పాలించాలనే మోజు..
ఆ రోజుల్లో ప్రేమకు ఉండేది పునాది.... 

ఈ రోజుల్లో సహనానికి చేస్తున్నాం సమాధి..
ఆ రోజుల్లో వాళ్లకున్నారు ఒక గాంధీ... 

ఈ రోజుల్లో అన్ని మంచి గుణాలతో ఎవరు ఉంది??
బాపూజీని పూజించడం కాదు...

ఆయన మాటని,బాటని వంట పట్టించుకున్దాం..
"నేను సైతం" గాంధి జయంతిని స్మరించుకుంటూ...మీ వంశీ
 

వందె మాతరం వందె మాతరంవందె మాతరం వందె మాతరం



బాపూజీ జయంతి నేడు. ఈ బాపూజీ నివాళి_రజనికాంతరావు గీతం_చిత్తరంజన్ గళంలో వినండి. Music composition శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు.
https://soundcloud.com/tallurivrao/chittaranjan_anjalide-manavottama
Chittaranjan_AnjalidE ManavOttamA
soundcloud.com

Listen to Chittaranjan_AnjalidE ManavOttamA by TalluriVRao #np on #SoundCloud
 సహన రాగములో అద్భుతంగా రచించిన ఈ కీర్తన ఎంత బాగుంటుందో . ఎందుకో పేరు మోసిన కర్నాటక సంగీతజ్ఞులు కూడా ఈ కీర్తనలో కొన్ని చరణాలే ఆలపించారు . త్యాగరాజ స్వామి మధురభక్తి దానికి తగ్గ రాగము.. మొత్తం ఈ కీర్తనను అజరామరం చేసింది.

వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ

శ్రీ దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ

శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ భారమా రామ

వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ

ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ వాడను రామ

కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ

న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ

చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ

క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ

వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ


శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!
'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి
.
(- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే...
- సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే...
- కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద...
- రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే..
- అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...)

శ్రీరాములతో ఆహా ! పుట్టనైతిని రఘు రాములతో
అయ్యో ! పుట్టనైతిని శ్రీరాములతో పుట్టి సేవలు జేయనైతిని // పల్లవి //
దశరథ నందనుడై దాశరథి రాములు
వశముగ బాలురతో వరదుడై యాడంగ
వనజ నాభునకు నే భక్తుడనై
భయ భక్తి ప్రేమలతోడ శ్రీరామ రామ // ఆశ //
సకల సేవలు సలుపుచు మురియుచు
అకట ! నల్గురతో నాడు కొందును గద
అయోధ్యా నగరిలో గజమునెక్కి
అచ్యుతుడు వెడలి రాగాను // ఆశ //
నాట్యమాడుచు నను రక్షింపు మందును ;
విశ్వామిత్రుని వెంట పోగానే పోదును
జనకుడు హరికి జానకిని పెండ్లి సేయగా
వారిద్దరికి నెత్తి బియ్యము నేదెత్తును // ఆశ //
అమ్మకు హరికి నాకులు మడిచిత్తును ; , నరులార !
ఇతడే నారాయణుడని జాటుదును
; , మనలను రక్షించే, మాధవుడు వచ్చెనందును
; , మన గతి ముందు ఏమందును // ఆశ //
బలిముఖులకు గల బలము జూతుగద
శుభరాములతో సొంపు కందుగద
లక్ష్మణాగ్రజుడు సేనను రావించి
లక్ష్మి కొరకు కపులు లంక జుట్టగ
రక్షించు భద్రాద్రి రామదాసుడని
రణములో రావణుని ద్రుంతును
ఆ క్షణమున రఘువరుని అప్పుడే బిలుతును
మంగళ పతివ్రతను మాధవుకర్పించి మురియుదు // ఆశ //
Photos from Vinjamuri Venkata Apparao's post in మిథునం ( midhunam, mithunam )
శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.! 'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీత...

రామ రామ నీవారము కామా రామ సీతా
రామ రామ సాధుజన ప్రేమరార!
-త్యాగరాజ కీర్తన
https://youtu.be/pWg_uOMHdqc


07 Priya Sisters Namo Narayana Annamacharya Krithi

అన్నమాచార్య కీర్తన
వాడల వాడల వెంట వాడెవో- వాడెవో
నీడనుండి చీరలమ్మే నేత బేహారి

పంచ భూతముల నె డి - పలువన్నె నూలు
చంచలపు గంజి తోడ చరి చేసి
కొంచెపు కండెల నూలి గుణముల నేసి
మంచి మంచి చీర లమ్మే మారు బేహారి

మటు మాయ ముల దన మగువ పసిడి నీరు
చిటి పొటి యలుకల జిలికించ గా
కుటిలంపు జేతలు కుచ్చులు గా గట్టి
పట వాళి చీరలమ్మే బలు బేహారి

మచ్చిక జీవుల నేటి మైల సంతల లోన
వెచ్చపు కర్మ ధనము విలువ చేసి
పచ్చడాలు గా గుట్టి బలు వేంకట పతి
ఇచ్చ కొలదుల నమ్మే ఇంటి బేహారి



రాగం: బౌళి తాళం:
 ఆది కృతి:ఆన్నమాచార్య
 పల్లవి: శ్రీమన్ నారాయణా శ్రీమన్ నారాయణా శ్రీమన్ నారాయణా నీ శ్రీపాదమే శరణు చరణం

1: కమలాసతి ముఖకమల కమలహిత
కమలప్రియా కమలేక్షణా కమలాసనహిత
 గరుడగమన శ్రీ కమలనాభ
నీ పదకమలమే శరణు || చరణం2:
పరమ యోగిజన భాగధేయ
శ్రీ పరమపురుషా పరాత్పరా
 పరమాత్మా పరమాణురూప
 శ్రీ తిరువెంకటగిరిదేవ శరణు || 2 ||

 ------ కమలాసతి ముఖకమల కమలహిత
కమలప్రియా కమలేక్షణా కమలాసనహిత
గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు ||
 పై చరణంలో నాకు తెలిసి .. కమలము వంటి ముఖము గల
 శ్రీదేవిని తన నయనకమలాలతో చూస్తూ హితము(/ప్రియము) జేకూర్చే,
లక్ష్మీ వల్లభా!,బ్రహ్మదేవునకు హితము జేకూర్చే గరుత్మంతునిపై తిరిగే,శ్రీమంతుడా
(శుభము జేకూర్చేవాడ),(కమలము నాభి నుంచి జన్మించినందుకు కమలనాభుడైనాడా/లేక
కమలం వంటి నాభి కలవాడనా/లేక రెండూనా? I am not sure),ఓ పద్మనాభ!కమలాల వంటి
 నీ పాదాలే నాకు శరణు. పరమ యోగిజన భాగధేయ శ్రీ పరమపురుషా పరాత్పరా పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువెంకటగిరిదేవ శరణు || 2 ||
 పరమ యోగిజనులకు భాగ్యమైన పరమ పురుషా!
పరమాత్మా!పరత్పరా! అణురూపము నున్న
ఓ సర్వాంతర్యామీ!
ఏడు కొండలపైన వెలసిన
 శ్రీ వెంకటేశ్వరా  నీకు శరణు

హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీమన్నారాయణ
అన్నమాచార్యుల వారి సంకీర్తనా సుధ
నాకు బాగ నచ్చిన సంకీర్తన శ్రీమన్నరాయణ ..ఎందుకంటే నేను సరిగ్గా చెప్పలేనేమో.రాగ లక్షణం ఒక కారణం కావచ్చు.శుబ్బలక్ష్మి version మరియు నిత్య సంతోషిణి version రెండూ విన్నాను..కాని నాకు రాగం ఒకటే అయినా నిత్య సంతోషిణి version బాగ నచ్చింది.ఎందుకంటె ఆమె స్వరంలోని తియ్యదనం వల్ల కాబోలు.
రాగం: బౌళి
తాళం: ఆది
కృతి:ఆన్నమాచార్య
పల్లవి:
శ్రీమన్ నారాయణా శ్రీమన్ నారాయణా
శ్రీమన్ నారాయణా నీ శ్రీపాదమే శరణు
చరణం1:
కమలాసతి ముఖకమల కమలహిత
కమలప్రియా కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు ||
చరణం2:
పరమ యోగిజన భాగధేయ శ్రీ
పరమపురుషా పరాత్పరా
పరమాత్మా పరమాణురూప శ్రీ
తిరువెంకటగిరిదేవ శరణు || 2 ||
------
కమలాసతి ముఖకమల కమలహిత
కమలప్రియా కమలేక్షణా
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు ||
పై చరణంలో నాకు తెలిసి ..
కమలము వంటి ముఖము గల శ్రీదేవిని తన నయనకమలాలతో చూస్తూ హితము(/ప్రియము) జేకూర్చే,లక్ష్మీ వల్లభా!,బ్రహ్మదేవునకు హితము జేకూర్చే గరుత్మంతునిపై తిరిగే,శ్రీమంతుడా(శుభము జేకూర్చేవాడ),(కమలము నాభి నుంచి జన్మించినందుకు కమలనాభుడైనాడా/లేక కమలం వంటి నాభి కలవాడనా/లేక రెండూనా? I am not sure),ఓ పద్మనాభ!కమలాల వంటి నీ పాదాలే నాకు శరణు.
పరమ యోగిజన భాగధేయ శ్రీ
పరమపురుషా పరాత్పరా
పరమాత్మా పరమాణురూప శ్రీ
తిరువెంకటగిరిదేవ శరణు || 2 ||
పరమ యోగిజనులకు భాగ్యమైన పరమ పురుషా! పరమాత్మా!పరత్పరా! అణురూపము నున్న ఓ సర్వాంతర్యామీ!ఏడు కొండలపైన వెలసిన శ్రీ వెంకటేశ్వరా నీకు శరణు






మధుర నగరి సమీపపంలో ....By Vedavathi Prabhakar.
A beutiful song By Vedavathi Prabhkar All indi radio artist.devotiona love song by a Radha Who is wa..
   Like
   Comment
   Share


image not displayed


image not displayed

image not displayed

No comments:

Post a Comment