Friday 20 April 2018

ప్రాంజలి ప్రభ (అంతర్ జాలపత్రిక )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
సహాయకులు : కొందరు రచయతలు

తమరు,,,T T D ఈ నెంబరుకు ఫోన్ చేసి తమ అభ్యర్ధన వివరించగలరు,,,, 0877 - 2233333 0877-2277777 పై రెండు నెం॥ప్రధాన సంపాదకుడు,,,,,T T D Press మీ,,,,హరిఃఓం










Press 08772264560

 1. నేటి విద్యా వాణి 2. నేటి పద్యము 3. నేటి  భగవద్ గీత అంతర్గత సూక్తులు 4. నేటి కవిత 5. నేటి పాట  5. నేటి కధ 6 నేటి రాజకీయం . 7 నేటి కధ

నేటి  గీతం
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లప్రగడ  రామకృష్ణ

ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద
మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా 
అనురాగ బంధంతో బతకటం తప్పా
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద

కట్టుకున్న పందిరేమో కాలదన్నే
కన్నబిడ్డలలో  మమత ఎండిపోయే
ఇవ్వాలనుకున్నది ఇవ్వలేను
పొందాలనుకున్నది పొందలేను
పెదవి విప్పి ఎవ్వరికీ చెప్పలేను 
పోదు పొద్దు ఎదురు చూడటం  తప్పా
పరమాత్ముని పిలుపుకోసం చూడటం  తప్పా
 
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద
మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా 
అనురాగ బంధానికి కరుణతో బతకటం తప్పా
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద

కన్నబిడ్డలకోసం సముద్రాన్నే ఈదాను
ఎడారిలో దాహన్నందించి బ్రతికాను 
ఆశ మేర విధ్యనందించి పోషించాను 
రగిలి రగిలి నేను మిగిలి పోతున్నాను
ఈ ధరిత్రి ఇంకెన్నాళ్ళు భరించవలసి ఉండునో
అమ్మా వసుంధరా నన్నునీలో కలుపుకో మనటం తప్పా 
సుర్యు డొచ్చి నిద్రలేపి చంద్రుడొచ్చి నిద్ర పుచ్చే
ఎవ్వరికీ అవసరము లేని ఈ బతుకును చాలిస్తానని అనటం తప్పా
   
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద
మల్లె పువ్వులా రోజు పరిమళాలందించటం తప్పా 
అనురాగ బంధానికి కరుణతో బతకటం తప్పా
ఏమని చెప్పేది, మీకు ఎలా చెప్పేది 
ఈ మూగపోయిన గుండె భాద
--((*))--

No comments:

Post a Comment