Thursday 19 April 2018

తెనాలి రామకృష్ణుడు

ఆత్మీయమిత్రులందరికిశుభోదయం

తెనాలి రామకృష్ణుడు

(క్రీ.శ.16వశతాబ్ది)

పాండురంగ మహాత్మ్యం

మొలక చీఁకటి జలజల రాల్పఁగా రాదె

నెఱులు మించిన వీరి కురులయందు

కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె

ముద్దు చూపెడి వీరి మోవులందు

పచ్చిబంగారు కుప్పలు చేయఁగా రాదె

గబ్బి మీఱిన వీరి గుబ్బలందు

పండు వెన్నెల తేటఁ బరిఢవింపఁగ రాదె

నగవు గుల్కెడి వీరి మొగములందు

నౌర!కరఁవాడి చూపుల యౌఘళంబు,

బాపురే! భూరి కటితటీ భారమహిమ

చాఁగు ! మదమందగమన లక్షణములనఁగ,

నేరుపుల మింతురప్పురి వారసతులు.

ఆ పురంలోని వారసతులు (వేశ్యలు)వాళ్ళ నొక్కు

లు తిరిగిన(నెఱులు మించిన)శిరోజాల్ని విదిలిస్తే చి

మ్మచీకటి జలజలా రాలుతుందిట. అంటే అంత నల్ల

ని కురులన్నమాట వాళ్ళవి. వాళ్ళ పెదవుల నుండి

అమృతాన్ని గిలకొట్టవచ్చట.అంటే వాళ్ళ పెదవుల

నుండి అమృతం చిప్పిల్లుతూ ఉంటుంది. మదించి,

నిక్కిన వారి వక్షోజాలనుండి బంగారం కుప్పలు కుప్ప

లుగా తీయవచ్చట.పండు వెన్నెల్లోని ప్రసన్నత నవ్వు

లొలికే వారి ముఖాలలో వెల్లివిరుస్తుందిట.ఇక మిక్కి

లి వాడియైన వారి చూపుల తీక్ష్ణత,పెద్దవైన పిరుదుల

భారంతో మదించిన ఏనుగులవలె మెల్లనైన వారి నడ

కల సంగతా ? భళీ! ఇక ప్రత్యేకించి చెప్పేపనేముంది?

వారవిద్యలలోని నేర్పరితనంలో ఎంతో అతిశయించి

న వారట - ఒకరిని మించిన వారు ఒకరట - ఆ పురం

లోని వేశ్యాకాంతలు.

వివరణ శ్రీ బాలాంత్రపు వేంకటరమణ గారు







తెనాలి రామకృష్ణకవి ప్రణీత "పాండురంగ మాహత్య్మము" నుండి 

బులుసు వేంకటరమణయ్య గారి టీక



 మంచుకొండపుత్రికయగు పార్వతియొక్క ముఖమను వికసించుచున్న పద్మముయొక్క పరిమళమును; అనుభవింపఁజాలియు; తనివితీరక;   మునుల హృదయములలోపలి పద్మముయొక్క పరిమళవిలాసపు మనోజ్ఞతను (మనోజ్ఞమైన మునుల హృదయకమల పరిమళముననుట) తెల్లతుమ్మెద (శివుడని భావము) తనయాకారముతో; ప్రకాశింపజేయును. 

తుమ్మెద యొక కీటకమును దెచ్చి తనగూటీలో నుంచి రొద చేయును. ఆ గూటి చుట్టును తిరుగుచుండును. కొంతకాలమునకా కీటకము కూడా భ్రమర మగునట; అట్లే ముని హృత్కమలములఁ జరించు శివుడు వారికందరికిని సారూప్యసిద్ధిని కలిగించునని భావము.  



27.కాటుకనెఱయంగఁ గన్నీరువరదలై, కుచకుంభయుగళ కుంకుమము దడియ 

విడివడి వెడలెడి వేఁడి నిట్టూర్పుల, లాలితధర కిసలయము గందఁ 

జెలువంబు నెఱిదప్పి చిన్నబోవుచునున్న, వదనారవిందంబు వాడు దోఁప 

మారుతాహతిఁ దూలు మహిత కల్పకవల్లి, వడువున మేన్వడా వడ వడంకఁ 



జిత్త మెరియంగఁ జెక్కిటఁ జెయ్యిచేర్చి, కౌతుకంబేరి పదతలాగ్రమున నేల 

వ్రాసికొనుచు మోమర నాంచి వగలఁ బొందె మవ్వంబుగందిన పువ్వుఁబోడి 



ఇంతకీ ఇంత అందంగా వగచిన పువ్వుబోడి ఎవరు?? 

ఇంకెవ్వరు మన పోతన్న గారి రుక్మిణీదేవి 

భాగవతం దశమస్కంధం నుండి



--((*))--


కృష్ణా జిల్లా లో మాలిక్ ఇబ్రహీం అనే తురుష్క ప్రభువు వుండేవాడు.అతను చాలా
సహృదయుడు తాను స్వయంగా తెలుగు నేర్చుకొని తన ఆస్థానం లో తెలుగు కవులను పోషించాడు.తెలుగు కవులు ఆయనను పొగుడుతూ చాలా పద్యాలే వ్రాశారు.తెలుగు వాళ్ళు ఆయనను మల్కిభరాముడు అని పిలుచుకునే వారు.
అది కాలక్రమేణా "ఇభరాముడు"గా మారింది.అద్దంకి గంగాధర కవి 'తపతీ సంవరణోపాఖ్యానం'ప్రబంధము వ్రాసి ఆయనకు అంకితం చేశాడు.అతని సామంతుడైన అమీన్ ఖాన్ అనే సర్దారు పొన్నగంటి తెలుగన్న చేత మొట్టమొదటి అచ్చ తెనుగు కావ్యం 'యయాతి చరిత్రము' ను వ్రాయించి అంకితం పొందినాడు.'వైజయంతీ విలాసము'వ్రాసిన సారంగుతమ్మయ గోలకొండ ప్రభువుల ఆశ్రయం లో విలసిల్లిన వాడే.మాలిక్ ఇబ్రహీం తన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు కవులను పోషించి,తెలుగు కవితాలతకు పందిళ్ళు వేయించినవాడు.ఆ రసిక ప్రభువు మహా దాత అర్థుల పాలిటి కల్పవృక్షం.తురుష్కుడైనా తెలుగు కవులను పోషించిన ఘనత మల్కిభరాముడిదే. ఈయనపై పద్యాలు శతాదికంగా వున్నాయి.
మచ్చుకు కొన్ని పద్యాలు..(ఈయన క్రీ.శ 1550 వాడు)ఇభరాముడు అని కూడా ముద్దుగాపిలుచుకునేవారు.
రాముడు దుక్కి ముచ్చు రఘురాముడు కోతుల రాజు రేణుకా
రాముడు పోటుబంటు పటురాగ సమంచితు డైన గోపికా
రాముడొక వెర్రి గొల్లడిక రాష్ట్రము లందు సమాను లేరయా
రాముల నెంచి చూడ నిభరామ మహీధవ భవ్య వైభవా
రాముడు దుక్కి ముచ్చు అంటే బలరాముడు.ఆయన ఆయుధం నాగలి కదా!ఆయన దున్నేవాడు.శ్రీరాముడు కోతుల రాజు ,రేణుకా రాముడు అంటే పరశురాముడు ఆయన ఎప్పుడూ యుద్ధాలే చేసేవాడు. గోపికా రాముడు కృష్ణుడు ఒక వెర్రి
గొల్లవాడు.ఇంక లోకములో రాములందరి లో మన మల్కిభరాముడే గొప్పవాడు.
రాజును రాజుగాడతడు రాహుముఖంబున జిక్కె దేవతా
రాజును రాజుగాడతడు రావణ సూతికి నోడె వాహినీ రాజును
రాజుగాడతడు రామ శరాహతి దూలె నాజిలో రాజన
రాజు మల్కిభరాముడే రాజు ధరాతలంబునన్
తా :-రేరాజు చంద్రుడు రాహువుకు చిక్కినాడు,దేవతా రాజైన ఇంద్రుడు రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయాడు.
సముద్రరాజు రాముని బాణానికి పడిపోయినాడు,యిక లోకములో మల్కిభరాముడే రాజన డానికి తగినవాడు.ఇలా ఆయనను పోగుడుకునే వారు
.కృష్ణా మండలం లో ఆయన పేరు మీద ఇభరామ పట్టణం
అని ఒక పట్టణానికి పేరు పెట్టారు.కాలక్రమేణా అది ఇబ్రహీం పట్టణం గా మారిందని చెప్తారు.
ఆయన మరణించిన తర్వాత ఒక కవి దుఖం తో కోపం తో వ్రాసిన పద్యం.
రార విధాత !యోరి వినరా తగురా తలకొట్లమారి ని
స్సారపు లోభి రాజులను జంపక మల్కిభరామ భూవరున్
చారు యశోధనున్ సుగుణి జంపితి వర్థులకేమి దిక్కురా
చేరిక నింత రాజులను సృజింపగ నీ తరమా వసుంధరన్
తా:--మల్కిభరాముడు దివంగతు డైనాడు.యాచకులను,కవులను ఆదుకునే నాథుడు లేడు.అందరూ లుభ్దాగ్రేసర చక్రవర్తులే ,ఒక కవికి గుండె మండి పోయింది.సృష్టి కర్తనే సవాలు చేస్తున్నాడు.ఓయీ బ్రహ్మయ్యా!యిటు రావయ్యా!ఒక మాట వినవయ్యా!నీవు తలకొట్ల మారివి.(బ్రహ్మకు అయిదు ముఖాలుం డేవట శివుని కోపానికి గురై ఒక శిరస్సు చేదింప బడినదట.అప్పటినుండీ చతుర్ముఖు డైనాడని పురాణ గాథ.
రసహీనులైన లోభిరాజులను జంపక యశో ధనుని,సుగుణ సంపన్నుని చంపినావు.ఇంక అర్థుల కేమి దిక్కు? ఇలాంటి దాన గుణాభిరాముడిని మళ్ళీ నీవు సృజింప గలవా?అని బ్రహ్మను ఎత్తి పొడుస్తున్నాడు.
ఇంతగా ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించి చరిత్ర పుటలలో నిలిచి పోయిన మల్కిభరాముడన బడే మాలిక్ ఇబ్రహీం ప్రభువు ధన్యుడు..
-----------------------శుభరాత్రి-----------------------------

---------------శుభోదయం---------సుభాషితాలు--------------------
సత్యమేవ ఈశ్వరో లోకే
సత్యధర్మ ప్రతిష్ఠితా
సత్యమూలాని సర్వాణీ
సత్యాన్నాస్తి పరమపదం (పరో ధర్మః)
భావము:--సత్యమే భగవంతుడు,సత్యమే ధర్మమును ప్రతిష్ఠించు చున్నది. సత్యమే
ప్రపంచానికి వెలుగు, సత్యాన్ని మించిన దారము లేదు,పరమపదము లేదు.
సత్యమే స్వర్గమునకు దారి.
స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదన మజ్ఞతాయా:
విశేషతః సర్వవిదాం సమాజే
విభూషణం మౌన మపండితానాం.
అజ్ఞానమును కప్పిపుచ్చుటకై తప్పక ఉపకరించునది, తమ చేతిలోనే వున్నది యగు నొక
ఉపాయము బ్రహ్మచే యేర్పరుపబడినది అది యేదనగా అన్ని విషయములు బాగుగా
తెలిసినవారున్న సమాజములో (సభలో) మాట్లాడకుండా మౌనము వహించుటయే
అపండితులకు అలంకారము. . (భర్తృహరి సుభాషితము)
దీపములేని యిల్లు నుపదేశము లేని జపంబు, మంజులా
లాపములేని కావ్యము. విలాసములేని వధూటి; విక్రమా
టోపములేని భూపతి; పటుత్వము లేని యురోజపాపాళి ; ప్ర
స్తాపము లేని మాటలు; వృత్తాలు సదాశివసద్గురుప్రభూ!
నేరిచి బుద్ధిమంతుడతి నీతి వివేకము దెల్పినం జెడం
గారణ మున్నవాని కది గైకొన గూడదు నిక్కమే, దురా
చారుడు రావణాసురు డసహ్యము నొందడె చేటుకాలముం
జేరువయైనవాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా!
భాస్కరా! దురాత్ముడగు రావణుడు తనకు బోగాలము సమీపించుట చేత తమ్ముడగు
విభీషణుడు చెప్పిన నీతిని తిరస్కరించెను. అట్లే లోకములో తనకు జేటుకాలము
సమీపించినప్పుడు బుద్ధిమంతులు చెప్పిన హితవచనములను విననిష్టపడడు.
దానము చేయనేరని యధార్మికుఁ సంపద యుండి యుండినన్
దానె పలాయనంబగుట తథ్యము బూరుగుమానుగాచినన్
దాని ఫలంబు లూరక వృథా పడిపోవవె యెండి గాలిచే
గానలలోన నేమిటికి గాక యభోజ్యము లౌట భాస్కరా!
భాస్కరా! బూరుగుచెట్టు ఫలించినప్పటికీ దాని ఫలములెవ్వరికీ వుపయోగపడక,యెండి
గాలిచే దూలగొట్టబడి యడవులలో వ్యర్థముగా రాలిపోవునటుల, ధర్మబుద్ధి లేనివానికి
సంపదలున్నప్పటికీ అవి ఎవ్వరికీ వుపయోగపడక వ్యర్థములై పోవును.


No comments:

Post a Comment